వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. నేడు, రేపు శాసన సభకు ఖచ్చితంగా హాజరుకావాలని అందులో పేర్కొంది.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. నేడు, రేపు శాసన సభకు ఖచ్చితంగా హాజరుకావాలని అందులో పేర్కొంది.
ద్రవ్య వినిమయ బిల్లులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్లో వైఎస్ఆర్ సీపీ పేర్కొంది. మరోపక్క, నేడు అసెంబ్లీలో పలు శాఖల పద్దులపై చర్చ కొనసాగనుంది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.