roja suspension
-
రోజా లేఖను పరిగణనలోకి తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన నగరి శాసన సభ్యురాలు ఆర్.కె.రోజా ఇచ్చిన లేఖను పరిగణనలోకి తీసుకుని ఆమె సస్పెన్షన్ వ్యవహారాన్ని పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతికి సూచించింది. సంబంధిత పిటిషన్ గురువారం జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అమితావరాయ్ నేతృత్వంలోని ధర్మాసనం వద్దకు వచ్చింది. ఈనేపథ్యంలో పిటిషనర్ రోజా తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపిస్తూ... ‘రోజాపై విధించిన సస్పెన్షన్‌కు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్ 22, 2016న స్పీకర్‌కు రాసిన లేఖను ఈ న్యాయస్థానం ముందుంచాం. 2015 డిసెంబర్ 18వ తేదీన అసెంబ్లీలో జరిగిన సంఘటనకు సంబంధించిన వివరణను ఆ లేఖలో పొందుపరిచాం. మీ ఆదేశాల మేరకు స్పీకర్‌కు అందజేశాం. అయితే ఆ లేఖను పరిగణనలోకి తీసుకుని సభాపతి ఆ అంశాన్ని పరిష్కరించలేదు..’ అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే ఆ లేఖ సభాపతికి అందలేదని ప్రతివాది తరపు న్యాయవాది ప్రేరణాసింగ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం జోక్యం చేసుకుని సదరు లేఖను ఇప్పుడే ప్రతివాది తరపు న్యాయవాదికి ఇవ్వాలని సూచించగా లేఖ ప్రతిని ఇందిరా జైసింగ్ అందజేశారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం స్పందిస్తూ... ఎమ్మెల్యేపై సస్పెన్షన్ కాల వ్యవధి కూడా అయిపోయిందన్న విషయాన్ని ప్రస్తావించింది. సభాపతి ఈ లేఖను పరిగణనలోకి తీసుకుని సస్పెన్షన్ అంశాన్ని పరిష్కరించాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. -
నేడు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ
-
రేపు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ
అమరావతి: ఏపీ బడ్జెట్ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. గవర్నర్ ప్రసంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమాధానం ఇవ్వనున్నారు. బడ్జెట్‌పై చర్చ కొనసాగనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ కు సంబంధించి ప్రివిలేజ్ కమిటీ సమర్పించిన నివేదికపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రివిలేజ్ కమిటీ గురువారం శాసనసభలో నివేదికను సమర్పించింది. నిర్ణయం తీసుకునే విషయాన్ని స్పీకర్‌కు వదిలేసింది. -
స్పీకర్‌కు తెలియకుండా వీడియో లీకేజి ఎలా?
స్పీకర్‌కు తెలియకుండా, ఆయనకు సమాచారం లేకుండా అసెంబ్లీ వీడియో అసలు బయటకు ఎలా వచ్చిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అసెంబ్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తన సస్పెన్షన్ గురించి మంత్రి యనమల రామకృష్ణుడు ఇచ్చిన లీకులపై ప్రస్తావించారు. అసలు తానెందుకు క్షమాపణ చెప్పాలని.. తాను చేశానంటున్న వ్యాఖ్యల ఫుటేజిని స్పీకర్‌కు తెలియకుండా మీడియాకు లీక్ చేసిన కాల్వ శ్రీనివాసులుపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. దాన్ని పట్టించుకోకుండా ఆ లీకేజి వీడియోల ఆధారంగా తనపై చర్యలు ఎలా తీసుకుంటారని అడిగారు. అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దూషించినవారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని కూడా నిలదీశారు. గతంలో తాను మాట్లాడిన అంశాలన్నింటినీ అక్కడక్కడ కట్ చేసి, దాన్ని ఒక వీడియోగా తయారుచేసి విడుదల చేశారని ఆమె చెప్పారు. అలా కాకుండా పూర్తి వీడియోను విడుదల చేయాలని, అప్పుడు నిజానిజాలేంటో ప్రజలకు తెలుస్తాయని అన్నారు. అలాగైతే తాను రెండేళ్లు కాదు.. మూడేళ్లయినా సస్పెన్షన్‌కు సిద్ధమని తెలిపారు. తన పోరాటం అంతా మహిళల ఆత్మగౌరవం కోసమేనని అన్నారు. -
స్కాంలో ఎవరున్నారో క్లైమాక్స్‌లో తెలుస్తుంది
-
పూలింగ్ స్కాంలో ఎవరున్నారో క్లైమాక్స్‌లో తెలుస్తుంది
విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్ పేరుతో పెద్ద కుంభకోణం జరిగిందని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు విష్ణు కుమార్ రాజు అన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. కుంభకోణంలో ఎవరున్నారో క్లైమాక్స్‌లో తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం ఉదయం ఆయన మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. ఇక వైఎస్ఆర్సీపీ శాసనసభ్యురాలు రోజా సస్పెన్షన్‌ను మరింత కాలం పొడిగించడం సమంజసం కాదని, అలాంటి చర్యలకు తాము వ్యతిరేకమని చెప్పారు. ఇప్పటికే ఏడాది పాటు రోజాపై సస్సెన్షన్ విధించగా, దాన్ని మరింత కాలం పొడిగించాలని అధికార పక్షం యోచిస్తున్నట్లు మీడియాకు లీకులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కూడా విష్ణుకుమార్ రాజు స్పందించారు. -
చంద్రబాబూ మీకా అర్హత లేదు..
టీడీపీ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజం ♦ ఎన్టీఆర్ సిద్ధాంతాలకు సమాధి కట్టారు ♦ మీ కొడుకు ఎదగకుండా పోతాడని జూనియర్ ఎన్టీఆర్‌ను తరిమేశారు సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ఆవిర్భావ దినోత్సవాల్లో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాల్గొనడాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, పిల్లనిచ్చిన మామ అయిన ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి.. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనే హక్కు ఉందా? అని ఆమె ప్రశ్నించారు. రోజా మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘1982 మార్చి 29న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారు. తన సొంత రెక్కల కష్టంతో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే ఆయనకు ఏవిధంగా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారో అందరికీ తెలిసిందే..’ అని రోజా అన్నారు. ‘అధికారంలోకి వచ్చేందుకు ఎన్టీఆర్ పేరును, ఆయన కుటుంబసభ్యులను చంద్రబాబు వాడుకుంటారు. అధికారంలోకి వచ్చాక వదిలేస్తారు. పురందేశ్వరి, బాలకృష్ణ, హరికృష్ణను ఏవిధంగా వాడుకుని ఆ తర్వాత పక్కన పెట్టారో తెలిసిందే. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు, ఆశయాలకు చంద్రబాబు సమాధి కట్టారని రోజా విమర్శించారు. ఎవరైనా తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకుంటే తమ పదవులకు ముందే రాజీనామా చేసి రావాలని పార్టీ మొదటి మహానాడు (1982)లోనే ఎన్టీఆర్ తీర్మానం చేశారని రోజా తెలిపారు. ఇప్పుడదే పార్టీని నడుపుతూ సిగ్గులేకుండా, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకపోయినా సంతలో పశువులను కొన్నట్టు వారిని కొంటున్న చంద్రబాబుకు ఈరోజు టీడీపీ జెండా ఎగురవేసే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. కొడుకు కోసం జూ.ఎన్టీఆర్‌ను తరిమేశారు జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా ముందు తన కుమారుడు పప్పుసుద్దగా మిగిలిపోతాడని, ఎదగకుండా పోతాడనే భయంతో జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోంచి తరిమివేశారని, ఆయన సినిమాలు విడుదల కాకుండా చూస్తున్నారని రోజా విమర్శించారు. ఈరోజు ఉన్నది టీడీపీ కాదని, తెలుగు దొంగల పార్టీ అని ఆమె ఎద్దేవా చేశారు. నిన్నటివరకు ఎదురుచూసినా ప్రివిలేజ్ కమిటీ నుంచి పిలుపు రానందుకే సుప్రీంకోర్టుకు వచ్చానని రోజా తెలిపారు. సుప్రీంకోర్టులో రోజా పిటిషన్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను అసెంబ్లీకి హాజరయ్యేలా అవకాశం కల్పిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై.. డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను రద్దు చేయాలని ఆమె కోరారు. ఈ మేరకు మంగళవారం ఉదయం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. తాము స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తున్నామని, ఇందుకు అనుమతించాలని రోజా తరఫు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్.. ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. హైకోర్టు న్యాయమూర్తి తమకు అనుకూలంగా 22 పేజీలతో కూడిన ఉత్తర్వులు వెలువరించారని, ఏడాదిపాటు సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కూడా వ్యాఖ్యానించారని పిటిషన్లో వివరించారు. దీనిపై శుక్రవారం (ఏప్రిల్ 1న) విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. -
'జూనియర్ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారు'
ఎన్టీఆర్‌ను గానీ, ఆ పేరును గానీ ప్రజలు గుర్తుంచుకోవడం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు విడుదల కానివ్వకుండా, ఆడనివ్వకుండా ఇనుప పాదంతో తొక్కేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. హైకోర్టు డివిజన్ బెంచి ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసిన సందర్భంగా ఆమె కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల సమయంలో ప్రచారానికి వాడుకుని, ఆ తర్వాత టీడీపీలో కార్యకర్తగా కూడా ఉండనివ్వకుండా తరిమేశారని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా ముందు తన పప్పుసుద్ద కొడుకు లోకేశ్ ఎదగలేడన్న భయంతో.. ఎన్టీఆర్‌ను తొక్కేశారని విమర్శించారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలన్నింటికీ చంద్రబాబు తూట్లు పొడిచారని ఆమె అన్నారు. అలాంటి వాళ్లకు టీడీపీ జెండా ఎగరేసే హక్కుందా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ సమైక్యాంధ్రకు కట్టుబడి, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడితే, ఈయన మాత్రం కాంగ్రెస్‌తో జతకలిసి రాష్ట్రాన్ని విడదీశారని చెప్పారు. ఎన్టీఆర్ సంపూర్ణ మద్యనిషేధం విధిస్తే, చంద్రబాబు మాత్రం బెల్టుషాపులతో మద్యాన్ని పొంగిస్తూ ఆడపడుచుల జీవితాలు నాశనం చేస్తున్నారన్నారు. ఆయన సిద్ధాంతాలు, ఆశయాలకు సమాధి కట్టేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్ మీద బాబుకు ఎంత కక్ష ఉందో స్పష్టంగా తెలుస్తుందంటూ పలు విషయాలు వివరించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో మంచినీళ్లను చవగ్గా అందిస్తామన్నారని, కానీ అవి రాష్ట్రంలో నాలుగైదు చోట్ల కూడా లేవని చెప్పారు. అన్న క్యాంటీన్లు అంటూ ఆర్భాటంగా ప్రకటించి రెండేళ్లయినా.. ఇప్పటికీ ఒక్కటీ పెట్టలేదన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవ అని పేరు మార్చారని.. కానీ గత సంవత్సరం 350 కోట్లు, ఈ సంవత్సరం 450 కోట్ల బకాయిలతో ఆ పథకానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరుమీద ఉన్న పథకాలన్నింటినీ నిర్వీర్యం చేశారని, అదే తన పేరు మీద ఉన్న చంద్రన్న కానుకకకు మాత్రం అడ్డదిడ్డంగా నిధులిస్తూ అందులో అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. ఎన్టీఆర్‌ను ప్రజలు గుర్తుపెట్టుకోవడం బాబుకు ఇష్టంలేదని, ఆయన పేరు చూస్తేనే బాబుకు కక్ష అని చెప్పారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయాలను గుర్తించి ఇక ముందు కూడా ఈ చంద్రబాబు పార్టీలో కొనసాగుతారా.. లేదా ఆయన్ను తరిమేసి ఎన్టీఆర్ ఆశయాలను కాపాడతారో చూడాలని అన్నారు. ఇప్పుడున్నది తెలుగుదేశం పార్టీ కాదు.. తెలుగు దొంగల పార్టీ అని విమర్శించారు. ఈ గ్యాంగు తనను తొక్కేయాలని చూస్తోందన్నారు. చంద్రబాబు అడ్డదిడ్డంగా తన నాయకులను కాపాడుకోవడం కోసం కాల్‌మనీలో మహిళలు అన్యాయమైపోతున్నా పట్టించుకోవట్లేదని, ఇది 3 కోట్ల మహిళలకు సంబంధించిన విషయం కాబట్టి దీనిపై చర్చించాలని ప్రొటెస్ట్ చేశాం తప్ప ఎవరిమీదా తనకు వ్యక్తిగత ద్వేషం లేదని రోజా తెలిపారు. ఆరోజు అందరూ నిరసన వ్యక్తం చేస్తే.. ఒక్క తనమీద మాత్రమే చర్య తీసుకున్నారని గుర్తుచేశారు. తాను కామ సీఎం అనడం వల్ల సస్పెండ్ చేసినట్లు యనమల రామకృష్ణుడు చెప్పారని, కానీ నిజానికి ఐదు రోజుల పాటు పేపర్లన్నింటిలో ఇదే విషయం వచ్చిందని, దానిమీదే తాను వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు ఒత్తిడి చేశానని చెప్పారు. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా మహిళల సంక్షేమం కోసం కట్టుబడ్డానని, రిషితేశ్వరి, వనజాక్షి, అంగన్వాడీల విషయాన్ని లేవనెత్తాను కాబట్టి అణిచేస్తున్నారని అన్నారు. చివరకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా తనను అసెంబ్లీలోకి రానివ్వకుండా రాక్షసంగా అడ్డుకున్నారని చెప్పారు. తమకు నచ్చిన చానల్‌కే రికార్డింగ్ హక్కులు ఇచ్చి, తమకు నచ్చిన అంశాలనే ప్రసారం చేయిస్తున్నారంటే వాళ్ల దిగజారుడు రాజకీయాలు గమనించాలని అన్నారు. 18వ తేదీనాటి విషయం గురించి ఐదు రోజుల తర్వాత అనితను ఏడ్పించి విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారని ఆమె తెలిపారు .డివిజన్ బెంచి ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎస్ఎల్పీ దాఖలు చేస్తున్నానని, తీర్పు కాపీ అందడం ఆలస్యం కావడంతో ఇప్పటివరకు సుప్రీంకోర్టుకు రాలేకపోయానని అన్నారు. తనకు మరో అవకాశం ఇస్తున్నట్లు అసెంబ్లీలో చెప్పారే గానీ ఇంతవరకు ప్రివిలేజ్ కమిటీ నన్ను పిలిచిన పాపన పోలేదని ఆమె తెలిపారు. సోమవారం వరకు ఎదురుచూసినా ఆ కమిటీ నుంచి ఎలాంటి కాల్ రాలేదు కాబట్టి సుప్రీంకోర్టుకు వచ్చానని చెప్పారు. మహిళలను వ్యభిచార కూపం నుంచి బయటకు తీసుకురావడమే తన లక్ష్యమని ఆమె అన్నారు. -
రోజా మాత్రమే అభ్యంతరంగా మాట్లాడారా..?
హైదరాబాద్: ఎమ్మెల్యే రోజాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష కట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఆమె సోమవారం హైదరాబాద్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మహిళ ఎమ్మెల్యేలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ...ఎమ్మెల్యే రోజాను ప్రభుత్వం వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్ మనీ, సెక్స్ రాకెట్ అంశాలు అసెంబ్లీలో చర్చకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం రోజాను సస్పెండ్ చేసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ మనీ కేసులో మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పాత్రను ప్రశ్నించినందుకే కక్షసాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. సభలో రోజా మాత్రమే అభ్యంతరంగా మాట్లాడారా? సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడలేదా? అసెంబ్లీలో అభ్యంతరకరంగా మాట్లాడిన మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలుండవా అని ఈశ్వరి ప్రశ్నించారు. ఎమ్మెల్యే నుంచి సంజాయిషీ తీసుకోకుండా సెక్షన్ 302(2) కింద మార్షల్స్‌తో బయటకు పంపించడం దారుణమన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోజా కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న వాటిని ప్రభుత్వం గౌరవించడం లేదని విమర్శించారు. సభలో అధికార పార్టీ సభ్యులు మాట్లాడిన మాటలను ప్రివిలేజ్ కమిటీ ఎందుకు పట్టించుకోవడంలేదని ఈశ్వరి ప్రశ్నించారు. -
రోజాపై ప్రభుత్వం మొండిగా ఉంది
విజయవాడ: రోజా విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి ప్రతిపక్షాన్ని అణగొదొక్కే ధోరణిలో ప్రవర్తిస్తోందని ఆయన అన్నారు. కోర్టు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే ప్రభుత్వ తీరును అర్ధం చేసుకోవచ్చని అన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యపై 28న ఛలో అసెంబ్లీకి పిలుపును ఇస్తామని చెప్పారు. -
జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండండి: చెవిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను సభలోకి ప్రవేశించకుండా అడ్డుకున్న అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్ మార్షల్ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన సహచర ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డితో కలసి మీడియా పాయింట్లో మాట్లాడారు. కోర్టు ఆదేశాన్ని సైతం లెక్కచేయకుండా.. రోజాను సభలోకి రానీయకపోవడం సమంజసం కాదన్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను అమలు చేయాల్సిన అవసరం లేదనుకోవడం, తమ తీర్పులే అంతిమమని భావించడం అహంకారమని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై తమ నిరసనను తెలిపేందుకు ప్రతిపక్ష నేత అసెంబ్లీలో రెండు నిమిషాలు మైక్ అడిగినా ఇవ్వలేదని ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విరుచుకుపడ్డారు. టీడీపీకి అధికార అహంకారం తలకెక్కిందని, ప్రజాస్వామ్యాన్ని అధికారపక్ష నేతలు ఖూనీ చేస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. మహిళా శాసనసభ్యుల పట్ల కూడా వారికి గౌరవం లేదని రోజా విషయంలో స్పష్టమైందన్నారు. వైఎస్ఆర్సీపీపైనా, రోజాపైనా వ్యక్తిగత కక్షతోనే ఆమెను సస్పెండ్ చేశారని ఆరోపించారు. -
చిప్పకూడు తినడానికి సిద్ధంగా ఉండాలి
అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్ మార్షల్ ఇద్దరూ త్వరలోనే జైలుకు వెళ్లి చిప్పకూడు తినేందుకు సిద్ధంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మీడియా పాయింట్లో సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినందుకు వాళ్లిద్దరికీ ఈ శిక్ష తప్పదని తెలిపారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు అమలుచేయాల్సిన అవసరం లేదని వీళ్లు అనుకుంటున్నారని, తమ తీర్పులే అంతిమం అని భావిస్తున్నారని మండిపడ్డారు. కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా వస్తే గౌరవిస్తారు, లేకపోతే లేదా అన్నారు. ప్రాథమిక హక్కులు, మౌలిక సూత్రాలకు భంగం కలగకుండా సభా వ్యవహారాలు జరిగినప్పుడే 212 అధికరణ పనిచేస్తుందని, అలా కాకుండా జరిగితే న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ముందే చెప్పారన్నారు. యూపీలో 1964లో ఇదే పరిస్థితి వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేను 7 రోజులు అరెస్టు చేస్తే లక్నో కోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని, డివిజన్ బెంచి కూడా సింగిల్ బెంచి తీర్పును సమర్థించిందని తెలిపారు. రాష్ట్రపతి న్యాయసలహా కోరితే సుప్రీంకోర్టు కూడా వ్యక్తి హక్కులకు భంగం కలిగించకూడదనే చెప్పిందని గుర్తు చేశారు. తమిళనాడు, కర్ణాటకలో కూడా స్పీకర్ల నిర్ణయాన్ని కోర్టులు తప్పుబట్టాయని తెలిపారు. కోర్టు తీర్పు ఇచ్చాక దాన్ని అమలుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని చెవిరెడ్డి భాస్కర రెడ్డి స్పష్టం చేశారు. మైకిస్తే తమ అభిప్రాయం చెప్పగలమని, ప్రతిపక్ష నాయకుడు లేచి అధ్యక్షా అంటుంటే ఐదుగురు టీడీపీ సభ్యులు మాట్లాడారు గానీ ఆయనకు అవకాశం ఇవ్వలేదని.. కనీసం చెవికెక్కించుకోడానికి అధికార పక్షం సిద్ధంగా లేకపోతే తాము ఏ విధంగా చెప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఇక తెలుగుదేశం ప్రభుత్వానికి అధికార అహంకారం తలకెక్కిందని మరో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. కనీసం మహిళా శాసనసభ్యులన్న గౌరవం కూడా వాళ్లకు లేదని మండిపడ్డారు. కేవలం రోజా మీద, వైఎస్ఆర్సీపీ మీద వ్యక్తిగత కక్ష పెంచుకున్న ఎమ్మెల్యేలు, సీఎం ఏడాదిపాటు ఆమెను నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారని, ఇది మొదటి తప్పు అని చెప్పారు. తాము ఎంతో గౌరవంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, హైకోర్టులో జాప్యం జరుగుతుంటే సుప్రీంకోర్టుకు వెళ్లామని.. సాక్షాత్తు సుప్రీం ధర్మాసనం ''ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, మేం ఆందోళన చెందుతున్నాం'' అని వ్యాఖ్యానించిందంటే వీళ్లు సిగ్గుతో తలదించుకోవాలని, ఇది రెండో తప్పని చెప్పారు. తర్వాత సుప్రీం ఆదేశాల మేరకు ఒక్కరోజులో విచారణ పూర్తిచేసిన హైకోర్టు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారని ఉత్తర్వులచ్చిందని, ఆ ఉత్తర్వులతో ఎమ్మెల్యే సభకు వస్తే, కోర్టు ఉత్తర్వులను కూడా అవమానించారని, ఇది న్యాయస్థానానికి జరిగిన అవమానమని చెప్పారు. ఇంతమంది ఎమ్మెల్యేలు కలిసి రాజ్యాంగాన్ని గౌరవించాలని, మహిళలను గౌరవించాలని కోరుతూ ధర్నా చేసినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని శివప్రసాదరెడ్డి మండిపడ్డారు. మూడు రోజుల క్రితం అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడుతూ న్యాయవ్యవస్థపై తమకు గౌరవం ఉందని, మాకు లేదని ఎద్దేవా చేశారని, సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా మీకు జ్ఞానోదయం కలగదా అని ఆయన ప్రశ్నించారు. కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లు మీరు సాధించిందేంటి అని నిలదీశారు. రోజా సంధించే ప్రశ్నలకు సమాధానంచెప్పలేక భయపడుతున్నారా అని అడిగారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపప్పటి నుంచి ఇదే అహంకారంతో వ్యవహరిస్తున్నారని, ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలుచేయాలన్న చిత్తశుద్ధి లేదని, వాళ్ల కార్యకర్తలు.. నాయకులను కాపాడుకోవడం, విచ్చలవిడిగా దోచుకోవడమే సరిపోతోందని ఆయన అన్నారు. -
పోడియం వద్ద ఎమ్మెల్యేల నిరసన
అసెంబ్లీ ప్రారంభం కాగానే నల్ల దుస్తులతో సభకు హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోజాను హైకోర్టు ఉత్తర్వులున్నా సభలోకి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాల సమయం చేపట్టడంతో.. 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేసుకుంటూ స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు. ఈ గందరగోళం మధ్యనే స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. జీరో అవర్ తర్వాత ఆ అంశంపై మాట్లాడుకోవచ్చని, అంతవరకు సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని స్పీకర్ కోరారు. అయినా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మాత్రం తమకు న్యాయం చేయాలంటూ నినదిస్తూనే ఉన్నారు. -
కోర్టు తీర్పుతో సభకు సంబంధం లేదు
శాసన సభవ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోకూడదు : బొండా ఉమ వ్యాఖ్య అసెంబ్లీ అధికారాలపై హైకోర్టు, సుప్రీంకోర్టులు సలహాలివ్వవు: ఎమ్మెల్యే అనిత హైదరాబాద్: కోర్టు ఇచ్చిన ఆర్డర్‌తో శాసనసభకు సంబంధం లేదని ప్రభుత్వ విప్ బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. శాసనసభా వ్యవహారాలు, హక్కులు చాలా పరిమితమైనవని చెప్పారు. శాసనసభ వ్యవహరాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా ఉందన్నారు. రోజా సస్పెన్షన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పునకు, వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడుతున్న దానికి పొంతన లేదన్నారు. రోజా సస్పెన్షన్ స్పీకర్ తీసుకున్న నిర్ణయం కాదని.. ఇది సభ తీసుకున్న నిర్ణయమని చెప్పారు. కోర్డు ఇచ్చిన ఆర్డర్‌ని పరిశీలించి సభ పవిత్రతను కాపాడతామని స్పష్టం చేశారు. శాసనసభ వ్యవస్థ, న్యాయ వ్యవస్థల మధ్య ఎవరి పరిధులు వాళ్లవని మరో ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే వి.అనిత ఆరోపించారు. అసెంబ్లీకి పూర్తి అధికారాలు ఉంటాయని, ఈ విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు సలహాలివ్వవని చెప్పారు. సభలో బలం ఉన్న వాళ్లదే రాజ్యమని ఆమె పేర్కొన్నారు. సభలో స్పీకర్, సీఎం, మంత్రులు, సభ్యులు ఎవర్నీ వదిలిపెట్టకుండా ఎమ్మెల్యే రోజా చేసిన అనుచిత వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ మరిచిపోయినా ప్రజలు మరిచిపోలేదన్నారు. తన విషయంలో చేసిన వ్యాఖ్యలకు రోజా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
'ఆయన అహంకారం వల్లే..'
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం బేషజాలకు పోకుండా రాష్ట్ర అసెంబ్లీ ప్రతిష్టను కాపాడాలని హితవు పలికారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అహంకార వైఖరి వల్లే ప్రతిపక్ష నేతలకు ఇలాంటి పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. అన్ని తనకు తెలుసునన్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు సలహాలు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. యనమల లాంటి మిడిమిడి జ్ఞానం ఉన్న వ్యక్తులను పట్టించుకోవద్దని సూచించారు. నేడు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతనైనా టీడీపీ ప్రభుత్వం కళ్లు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోటంరెడ్డి శ్రీదర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. -
నగరిలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు సంబరాలు
చిత్తూరు : ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నియోజకవర్గమంతటా నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి... మిఠాయిలు పంచుకున్నారు. రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రోజా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీకి రోజా హాజరు కావచ్చని హైకోర్టు తన ఉత్తర్వులలో పేర్కొంది. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోజాపై ఏపీ అసెంబ్లీ ఏడాది పాటు సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ప్రజాసమస్యల మీద పోరాటం కొనసాగిస్తా: రోజా
ప్రజాసమస్యల మీద తన పోరాటం కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పష్టం చేశారు. ఈ విజయం తనది మాత్రమే కాదని, తన నియోజకవర్గ ప్రజలందరిదీనని ఆమె అన్నారు. తన హక్కుల గురించి ఆలోచించిన హైకోర్టు, తాను అసెంబ్లీకి వెళ్లేవిధంగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు న్యాయస్థానాలు కలగజేసుకుని న్యాయం చేస్తాయన్న విషయం మరోసారి రుజువైందని, న్యాయ వ్యవస్థపై తన నమ్మకం రెట్టింపు అయిందని ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తనపై విధించిన ఏడాది సస్పెన్షన్ తీర్మానాన్ని కొట్టేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఆమె తమ న్యాయవాదులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇక ముందు కూడా తాను ప్రజల సమస్యల మీద గట్టిగానే ప్రభుత్వాన్ని నిలదీస్తానని రోజా చెప్పారు. తాను 1999లో రాజకీయాల్లోకి వచ్చానని, ఆరోజు నుంచి ఈరోజు వరకు పార్టీ ఏదైనా ప్రజాసమస్యల మీద పోరాడుతూనే ఉన్నానని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులతో కూడా పోరాటం చేస్తానని చెప్పారు. తన పోరాటం ఎప్పుడూ అంశాల వారీగానే ఉంటుందని తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన ఆర్డర్ కాపీ రాగానే అసెంబ్లీకి వెళ్తానని, జరిగిన అన్ని విషయాల మీద వివరణ ఇస్తానని ఆమె తెలిపారు. తాను తప్పు చేయనప్పుడు హాజరు కాకుండా తప్పించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. రాజ్యాంగం ఉల్లంఘించినవారికి సమాధానం తనకు చాలా సంతోషంగా ఉందని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారికి తగిన సమాధానం చెప్పినట్లయిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అన్నారు. అయితే కోర్టు ఇచ్చినవి మధ్యంతర ఉత్తర్వులు కాబట్టి ఈ విషయంలో ఇంతకంటే పెద్దగా చెప్పనని, ప్రజలకు రాజ్యాంగంపై విశ్వాసం ఉందని.. అది మరోసారి నిలబడిందని ఆమె అన్నారు. సరైన వేదికపై ఎమ్మెల్యేకున్న హక్కులను న్యాయస్థానం పునరుద్ధరించిందని, పౌరుల హక్కులను రాజ్యాంగమే కాపాడగలదని చెప్పారు. రోజా ఈరోజే అసెంబ్లీకి వెళ్లచ్చని, అసెంబ్లీ కార్యదర్శికి ఈమెయిల్ ద్వారా ఉత్తర్వులు వెళ్తున్నాయని ఆమె తెలిపారు. -
'ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు'
ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని వైఎస్ఆర్సీపీ మహిళా ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, గిడ్డి ఈశ్వరి ఈ అంశంపై మాట్లాడారు. వాళ్లు ఇప్పటికైనా కళ్లు తెరిస్తే మంచిదని.. రోజా అసెంబ్లీకి వచ్చి, ఎమ్మెల్యేగా తన బాధ్యతలు నిర్వర్తిస్తారని కల్పన అన్నారు. ప్రభుత్వంపై తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ సస్పెన్షన్లకు జడిసి నిమ్మకు నీరెత్తినట్లు ఉంటామని అనుకుంటారేమో, జడిసేది లేదని, పోరాడుతూనే ఉంటామని తెలిపారు. రోజా కూడా పోరాటాలను మరింత ముందుకు తీసుకెళ్తారని, అంతా కలిసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా చూస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన కుట్రపై న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయడమేనని గిడ్డి ఈశ్వరి అన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై చాలా చాలా సంతోషంగా ఉందన్నారు. చట్టసభల్లో మహిళలకు స్థానం కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా దారుణంగా రోజాను కేవలం అధికార పార్టీని నిలదీసినందుకు కక్షపూరితంగా సస్పెండ్ చేశారు. ఈ కుట్రపై న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతాయని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం తన హామీలు నెరవేర్చకపోగా, మహిళా ఎమ్మెల్యేపై లేనిపోని ఆరోపణలు చేసి సస్పెండ్ చేసింది.. చివరకు ధర్మమే గెలిచింది. టీడీపీ ఎమ్మెల్యే అనిత మాట్లాడుతున్న విషయాలు సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునేలా ఉన్నాయని విమర్శించారు. వైఎస్ఆర్ సీపీ నుంచి ఏ మహిళా ఎమ్మెల్యే ప్రశ్నించినా, అటునుంచి మంత్రులకు బదులు అనిత లేచి మాట్లాడతారని తెలిపారు. రోజా విషయంలో మేం గర్వపడుతున్నాం. ఆమెలాంటి ధైర్యవంతురాలు మా పార్టీలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని పార్టీకి చెందిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే రోజాకు హైకోర్టులో ఊరట
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు హైకోర్టులో ఊరట లభించింది. రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రోజా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం కూడా ఏర్పడింది. అసెంబ్లీకి రోజా హాజరు కావచ్చని హైకోర్టు తన ఉత్తర్వులలో పేర్కొంది. రోజా తరఫున సుప్రీంకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపంచారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోజాపై ఏపీ అసెంబ్లీ ఏడాది పాటు సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, తన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని, నిబంధనల ప్రకారం కేవలం ఒక సెషన్ వరకు మాత్రమే సస్పెన్షన్ విధించే అధికారం స్పీకర్‌కు ఉందని, అదికాదని ఏడాదిపాటు విధించడానికి అసెంబ్లీ నిబంధనల ప్రకారం కూడా అధికారం లేదని రోజా అన్నారు. ఈ అంశంపైనే ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, తొలుత దాన్ని విచారించడానికి కూడా హైకోర్టులో ఆమోదం లభించలేదు. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పింది. దాంతో హైకోర్టులో బుధవారం ఈ అంశంపై వాడివేడి వాదనలు జరిగాయి. వాదనల అనంతరం తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. గురువారం నాడు హైకోర్టు ధర్మాసనం ఈ అంశంపై తన మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. -
'4న ఏపీ ప్రివిలేజ్ కమిటీ మరోసారి భేటీ అయ్యే అవకాశం'
హైదరాబాద్: అసెంబ్లీ కమిటీ హాల్లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రివిలేజ్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్, ఇతర అంశాలపై చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన సమావేశమైన ఈ కమిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రు, వైఎస్సార్సీపీ ఎమ్యెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీసీ గోవిందరెడ్డి తదిదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై మండలి బుద్ధప్రసాద్‌కు ఇచ్చిన నివేదిక.. ప్రివిలేజ్ కమిటీకి అందిందనీ, నివేదిక కాపీలను మాకివ్వలేదని జ్యోతుల నెహ్రు అన్నారు. గతంలో ఇతర ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రివిలేజ్ నోటిసులనే పరిశీలించామన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన నోటీసులు.. ప్రివిలేజ్ కమిటీకి రావడం లేదని చైర్మన్‌ను అడిగామని చెప్పారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో మాట్లాడి అన్నిపార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల నోటీసులు.. ప్రివిలేజ్ కమిటీకి వచ్చేలా చేయాలని కోరామన్నారు. వచ్చే నెల 4న ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై ప్రివిలేజ్ కమిటీ మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉందని జ్యోతుల నెహ్రు వెల్లడించారు. -
'వైఎస్ఆర్సీపీపై బురద జల్లేందుకు ఆ నివేదిక..'
హైదరాబాద్: ప్రభుత్వం కావాలనే కొంతమంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గతేడాది డిసెంబర్ 22న శాసనసభ జీరో అవర్‌లో జరిగిన చర్చతోపాటు వీడియో ఫుటేజి లీకేజీ తదితర అంశాలపై ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన ప్రభుత్వం ఓ కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ శుక్రవారం సమావేశమైంది. కాగా ఈ కమిటీలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి (వైఎస్సార్సీపీ), తెనాలి శ్రావణ్‌కుమార్ (టీడీపీ), పి. విష్ణుకుమార్ రాజు(బీజేపీ) సభ్యులుగా ఉన్నారు. కమిటీ భేటీ అనంతరం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ సీపీపై బురదజల్లే ఎజెండాతో బుద్ధ ప్రసాద్ కమిటీ నివేదిక రూపొందించిందని అన్నారు. వీడియో లీకేజ్ అంశంపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేద్దామన్నా స్పందించలేదని చెప్పారు. మంత్రులు అధికార సభ్యులకు స్పీకర్ మైకు ఇచ్చి.. ప్రతిపక్ష నేతను దూషించే విధానాన్ని మానుకోవాలని నివేదికలో పొందుపరచాలని చెప్పినా వినలేదన్నారు. కమిటీ నివేదికను వ్యతిరేకిస్తూ డిసెంట్ నోటీసు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తప్పుడు వీడియోలను విడుదల చేస్తూ ప్రభుత్వం కొంతమందిపై కావాలనే బురద జల్లేందుకు ప్రయత్నిస్తుందని ఇదే విషయం కమిటీలో చెప్పానని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, బుచ్చయ్య చౌదరీ, బోండా ఉమ ఎంత దారుణంగా మాట్లాడినా పట్టించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని అన్నారు. ఫ్యాబ్రికేట్ చేసిన వీడియోలను విడుదల చేశారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. -
'ఏవిధంగా రోజాను సస్పెండ్ చేస్తారు?'
-
'ఏవిధంగా రోజాను సస్పెండ్ చేస్తారు?'
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి ఏవిధంగా ఏడాదిపాటు సస్పెండ్ చేస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ఇంత తీవ్రమైన చర్య ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని, ఏ నిబంధనల ప్రకారం సస్పెన్షన్ వేటు వేశారని నిలదీశారు. ఆదివారం తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ.. రోజా అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావును దూషిస్తూ వ్యాఖ్యలు చేయలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మాత్రమే విమర్శించారని చెప్పారు. రోజాపై ఉన్న సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో నిబంధనలు, సంప్రదాయాలు పాటించడంలేదని తమ్మినేని విమర్శించారు. శాసనసభ చరిత్రలో ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదని అన్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు తమ నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నారని, సభలో ప్రతిపక్షం అవసరం లేదా అని ప్రశ్నించారు. లోక్‌సభ, రాజ్యసభలో ఉన్న నిబంధనలే ఇక్కడా ఉన్నాయని చెప్పారు. గతంలో కరణం బలరాం నేరుగా స్పీకర్‌ను తిట్టారని, చంద్రబాబు గతంలో స్పీకర్‌ను రౌడీ స్పీకర్ అంటూ ముషారఫ్‌తో పోల్చారని చెప్పారు. -
రోజా సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం
-
అడ్రస్ లేకుండా పోయారు.. గుర్తుంచుకోండి
అసెంబ్లీలో తమకున్న మందబలంతో ప్రతిపక్షం గొంతు నులిమేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. గతంలో ఇంతకంటే పెద్దవే చూశామని, తమిళనాడులో జయలలితను అవమానిస్తే, ఆ తర్వాత ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారని గుర్తుచేశారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. రోజా పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అసమంజసం, అప్రజాస్వామికం అసెంబ్లీ ఆవరణలోకి మాజీ ఎమ్మెల్యేలు కూడా రావచ్చు. ఇటీవల ఓ టీడీపీ కార్పొరేషన్ చైర్మన్ మీడియా పాయింట్లో కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి నేరుగా మైకుల్లోనే అంతుతేలుస్తా అని మాట్లాడారు అచ్చెన్నాయుడు, ఉమా, యనమల అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి నీచాతినీచంగా మాట్లాడారు బోండా ఉమా అయితే అసెంబ్లీలోనే సమాధి కడతామన్నారు బుచ్చయ్య చౌదరి అయితే రోజూ ఏం మాట్లాడతారో తెలియనిది కాదు రోజాను సస్పెండ్ చేయాలంటే , ఆ నియమాలు సీఎంకు, మంత్రులకు వర్తించవా మందబలంతో ప్రతిపక్షాన్ని గొంతు నులిమేస్తున్నారు ప్రభుత్వం తమ దమననీతిని మానుకోవాలి మమ్మల్నందరినీ మూడు నాలుగేళ్లు సస్పెండ్ చేసినా భయపడే ప్రశ్నే లేదు -
అడ్రస్ లేకుండా పోయారు.. గుర్తుంచుకోండి
-
నిబంధనలు కాలరాసి రోజాను ఎలా సస్పెండ్ చేస్తారు
► అసెంబ్లీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటి ప్రశ్న ► 340 నిబంధన ప్రకారం సెషన్‌కు మాత్రమే సస్పెన్షన్ పరిమితం కావాలి ► మేం కూడా రేపు అలాగే చేస్తే ఇక ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టదు ► సభ నుంచి సస్పెండ్ చేస్తే కనీసం వైఎస్ఆర్సీఎల్పీలోకి కూడా రానివ్వరా హైదరాబాద్: మహిళా ఎమ్మెల్యే రోజాను నిబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు ఎలా సస్పెండ్ చేస్తారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. శనివారం నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఆయన సభలో మాట్లాడారు. 340 నిబంధనలో ఏముందో ఆయన చదివి వినిపించారు. ఒక సెషన్ కంటే ఎక్కువ కాలం సస్పెండ్ చేయకూడదని నిబంధనల్లో స్పష్టంగా ఉన్నా, దాన్ని ఉల్లంఘించి ఎలా సస్పెండ్ చేశారో అర్థం కాని విషయమని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే.. సభ మొత్తం నిబంధనలకు అనుగుణంగానే నడవాలని, ప్రచురిత పుస్తకంలోనే స్పష్టంగా ఉంది ఈ రోజు మాకు జరగచ్చు, రేపు మీకు జరగొచ్చు మనమే తప్పుడు సంప్రదాయాలు పాటిస్తే.. రేపు మేం కూడా ఇలాగే నిబంధనలు పక్కన పారేస్తే ఇక ఏమీ ఉండదు లేని అధికారాలు ఉపయోగించి ఎలా చేయగలరు ఎవరు మారినా రూల్స్ మాత్రం మారవు సభలో ఉన్న రూల్ పుస్తకంలో రూల్ ఉన్నా, లేని అధికారాన్ని వాడుకుంటూ మహిళా శాసన సభ్యురాలిని ఏడాది పాటు ఎలా సస్పెండ్ చేస్తారు? అన్న మాటల్లో ఎలాంటి దోషం లేకపోయినా ఆమెను సస్పెండ్ చేస్తున్నారు అచ్చెన్నాయుడి లాంటి వ్యక్తులు ఏమన్నారో, ఆ బోండా ఉమా అయితే పాతేస్తామని అన్నా తప్పులేదు సాక్షాత్తు చంద్రబాబు అంతు చూస్తా అని వేలు పైకెత్తి చూపించినా సస్పెండ్ చేయరు అచ్చెన్నాయుడు అన్న మాటలు చెప్పాలంటే బాధాకరంగా ఉంటోంది అన్నేసి మాటలన్నా కూడా ఆయననూ సస్పెండ్ చేయరు రోజా అన్న మాటలు ఏమాత్రం తప్పుకాదు నిరసన చెప్పడమే తప్పన్నట్లు ఏడాది పాటు సస్పెండ్ చేశారు. లేని అధికారంతో సస్పెండ్ చేయడం సరికాదు, దయ ఉంచి రివోక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే మా శాసన సభ్యులందరినీ కూడా అలాగే సస్పెండ్ చేసుకోండి కాదంటే మాత్రం మేం నిరసన వ్యక్తం చేస్తాం.. సభను జరగనిచ్చేది లేదు స్పెసిఫిక్ రూల్.. రూల్ పుస్తకంలో లేనప్పుడు మాత్రమే రెసిడ్యువల్ పవర్స్ వాడచ్చు అని రూల్ పుస్తకంలో ఉంది దయ ఉంచి, మేం స్పీకర్‌కు వ్యతిరేకమన్న భావన తీసుకురావద్దు సెక్రటరీ సలహా వల్లో, మరేదైనా కారణంతోనో పొరపాటు జరిగి ఉండొచ్చు రేపు మేం వచ్చిన తర్వాత కూడా ఇదే మాదిరిగా సభ్యులను సస్పెండ్ చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యం విఫలమయ్యే ప్రమాదం ఉంది అలాంటి పరిస్థితి తీసుకురావద్దని కోరుతున్నాం రోజాను అసెంబ్లీ బయట ఆపారు. సభ నుంచి సస్పెండైతే సీఎల్పీ ఆఫీసులోకి కూడా రాకూడదా? ఆమె శాసనసభ్యురాలు కూడా కాకుండా పోయిందా? సభలోకి రాకూడదంటే సరే.. కానీ మా ఆఫీసులోకి కూడా రానివ్వకపోతే ఎలా అసెంబ్లీ గేటు బయట ఎలా ఆపుతారు.. ఇది కరెక్టు కాదు