పోడియం వద్ద ఎమ్మెల్యేల నిరసన
అసెంబ్లీ ప్రారంభం కాగానే నల్ల దుస్తులతో సభకు హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోజాను హైకోర్టు ఉత్తర్వులున్నా సభలోకి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాల సమయం చేపట్టడంతో.. 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేసుకుంటూ స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు.
ఈ గందరగోళం మధ్యనే స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. జీరో అవర్ తర్వాత ఆ అంశంపై మాట్లాడుకోవచ్చని, అంతవరకు సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని స్పీకర్ కోరారు. అయినా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మాత్రం తమకు న్యాయం చేయాలంటూ నినదిస్తూనే ఉన్నారు.