నిబంధనలు కాలరాసి రోజాను ఎలా సస్పెండ్ చేస్తారు
► అసెంబ్లీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటి ప్రశ్న
► 340 నిబంధన ప్రకారం సెషన్‌కు మాత్రమే సస్పెన్షన్ పరిమితం కావాలి
► మేం కూడా రేపు అలాగే చేస్తే ఇక ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టదు
► సభ నుంచి సస్పెండ్ చేస్తే కనీసం వైఎస్ఆర్సీఎల్పీలోకి కూడా రానివ్వరా
హైదరాబాద్:
మహిళా ఎమ్మెల్యే రోజాను నిబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు ఎలా సస్పెండ్ చేస్తారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. శనివారం నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఆయన సభలో మాట్లాడారు. 340 నిబంధనలో ఏముందో ఆయన చదివి వినిపించారు. ఒక సెషన్ కంటే ఎక్కువ కాలం సస్పెండ్ చేయకూడదని నిబంధనల్లో స్పష్టంగా ఉన్నా, దాన్ని ఉల్లంఘించి ఎలా సస్పెండ్ చేశారో అర్థం కాని విషయమని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..
- సభ మొత్తం నిబంధనలకు అనుగుణంగానే నడవాలని, ప్రచురిత పుస్తకంలోనే స్పష్టంగా ఉంది
- ఈ రోజు మాకు జరగచ్చు, రేపు మీకు జరగొచ్చు
- మనమే తప్పుడు సంప్రదాయాలు పాటిస్తే.. రేపు మేం కూడా ఇలాగే నిబంధనలు పక్కన పారేస్తే ఇక ఏమీ ఉండదు
- లేని అధికారాలు ఉపయోగించి ఎలా చేయగలరు
- ఎవరు మారినా రూల్స్ మాత్రం మారవు
- సభలో ఉన్న రూల్ పుస్తకంలో రూల్ ఉన్నా, లేని అధికారాన్ని వాడుకుంటూ మహిళా శాసన సభ్యురాలిని ఏడాది పాటు ఎలా సస్పెండ్ చేస్తారు?
- అన్న మాటల్లో ఎలాంటి దోషం లేకపోయినా ఆమెను సస్పెండ్ చేస్తున్నారు
- అచ్చెన్నాయుడి లాంటి వ్యక్తులు ఏమన్నారో, ఆ బోండా ఉమా అయితే పాతేస్తామని అన్నా తప్పులేదు
- సాక్షాత్తు చంద్రబాబు అంతు చూస్తా అని వేలు పైకెత్తి చూపించినా సస్పెండ్ చేయరు
- అచ్చెన్నాయుడు అన్న మాటలు చెప్పాలంటే బాధాకరంగా ఉంటోంది
- అన్నేసి మాటలన్నా కూడా ఆయననూ సస్పెండ్ చేయరు
- రోజా అన్న మాటలు ఏమాత్రం తప్పుకాదు
- నిరసన చెప్పడమే తప్పన్నట్లు ఏడాది పాటు సస్పెండ్ చేశారు.
- లేని అధికారంతో సస్పెండ్ చేయడం సరికాదు, దయ ఉంచి రివోక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం
- లేకపోతే మా శాసన సభ్యులందరినీ కూడా అలాగే సస్పెండ్ చేసుకోండి
- కాదంటే మాత్రం మేం నిరసన వ్యక్తం చేస్తాం.. సభను జరగనిచ్చేది లేదు
- స్పెసిఫిక్ రూల్.. రూల్ పుస్తకంలో లేనప్పుడు మాత్రమే రెసిడ్యువల్ పవర్స్ వాడచ్చు అని రూల్ పుస్తకంలో ఉంది
- దయ ఉంచి, మేం స్పీకర్‌కు వ్యతిరేకమన్న భావన తీసుకురావద్దు
- సెక్రటరీ సలహా వల్లో, మరేదైనా కారణంతోనో పొరపాటు జరిగి ఉండొచ్చు
- రేపు మేం వచ్చిన తర్వాత కూడా ఇదే మాదిరిగా సభ్యులను సస్పెండ్ చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యం విఫలమయ్యే ప్రమాదం ఉంది
- అలాంటి పరిస్థితి తీసుకురావద్దని కోరుతున్నాం
- రోజాను అసెంబ్లీ బయట ఆపారు. సభ నుంచి సస్పెండైతే సీఎల్పీ ఆఫీసులోకి కూడా రాకూడదా?
- ఆమె శాసనసభ్యురాలు కూడా కాకుండా పోయిందా?
- సభలోకి రాకూడదంటే సరే.. కానీ మా ఆఫీసులోకి కూడా రానివ్వకపోతే ఎలా
- అసెంబ్లీ గేటు బయట ఎలా ఆపుతారు.. ఇది కరెక్టు కాదు