అడ్రస్ లేకుండా పోయారు.. గుర్తుంచుకోండి | remember tamilnadu experience, says mla sridhar reddy | Sakshi
Sakshi News home page

అడ్రస్ లేకుండా పోయారు.. గుర్తుంచుకోండి

Published Sat, Dec 19 2015 10:03 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

అడ్రస్ లేకుండా పోయారు.. గుర్తుంచుకోండి - Sakshi

అడ్రస్ లేకుండా పోయారు.. గుర్తుంచుకోండి

అసెంబ్లీలో తమకున్న మందబలంతో ప్రతిపక్షం గొంతు నులిమేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు.

అసెంబ్లీలో తమకున్న మందబలంతో ప్రతిపక్షం గొంతు నులిమేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. గతంలో ఇంతకంటే పెద్దవే చూశామని, తమిళనాడులో జయలలితను అవమానిస్తే, ఆ తర్వాత ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారని గుర్తుచేశారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఆయనేమన్నారంటే..

  • రోజా పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అసమంజసం, అప్రజాస్వామికం
  • అసెంబ్లీ ఆవరణలోకి మాజీ ఎమ్మెల్యేలు కూడా రావచ్చు.
  • ఇటీవల ఓ టీడీపీ కార్పొరేషన్ చైర్మన్ మీడియా పాయింట్లో కూడా మాట్లాడారు
  • ముఖ్యమంత్రి నేరుగా మైకుల్లోనే అంతుతేలుస్తా అని మాట్లాడారు
  • అచ్చెన్నాయుడు, ఉమా, యనమల అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి నీచాతినీచంగా మాట్లాడారు
  • బోండా ఉమా అయితే అసెంబ్లీలోనే సమాధి కడతామన్నారు
  • బుచ్చయ్య చౌదరి అయితే రోజూ ఏం మాట్లాడతారో తెలియనిది కాదు
  • రోజాను సస్పెండ్ చేయాలంటే , ఆ నియమాలు సీఎంకు, మంత్రులకు వర్తించవా
  • మందబలంతో ప్రతిపక్షాన్ని గొంతు నులిమేస్తున్నారు
  • ప్రభుత్వం తమ దమననీతిని మానుకోవాలి
  • మమ్మల్నందరినీ మూడు నాలుగేళ్లు సస్పెండ్ చేసినా భయపడే ప్రశ్నే లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement