అనారోగ్యంతో ఉన్నా అరెస్టు చేస్తారా? | roja arrested despite her ill health, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో ఉన్నా అరెస్టు చేస్తారా?

Published Sat, Dec 19 2015 11:00 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

అనారోగ్యంతో ఉన్నా అరెస్టు చేస్తారా? - Sakshi

అనారోగ్యంతో ఉన్నా అరెస్టు చేస్తారా?

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా 9 రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నారని.. ఇప్పుడు కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, అలాంటి మనిషిని అరెస్టు చేస్తారా అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రశ్నించారు. సభ వాయిదా పడి, తిరిగి సమావేశమైన తర్వాత ఆయన మాట్లడారు. గతంలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదని, రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, ఇది తప్పు సంప్రదాయమని స్పష్టం చేశారు. ఆయన ఏమన్నారంటే...

  • కరణం బలరాం వ్యవహారానికి, రోజా సస్పెన్షన్‌కు సంబంధం ఏంటి?
  • బలరాం విషయంలో నిబంధనలన్నీ పాటించారు. ఆయన నేరుగా స్పీకర్‌ను దూషించారు
  • పైగా దాన్ని ప్రివిలేజి కమిటీకి రిఫర్ చేశారు, ఆ సందర్భంగా జరిపిన విచారణకు ఆయన హాజరు కాలేదు
  • ఆ తర్వాత మాత్రమే ఆయనను సస్పెండ్ చేశారు
  • ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే ఒక్కరు వస్తుంటే పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలు తిట్టారు
  • రోజా సస్పెన్షన్‌ను ఉపసంహరించకపోతే మేమంతా సస్పెండ్ కావడానికి సిద్ధంగా ఉన్నాం
  • స్పీకర్ సమక్షంలోనే సభలోనే తిట్టినా పట్టించుకోరా
  • ఎథిక్స్, ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయకుండా ఎలా సస్పెండ్ చేస్తారు
  • ప్రతి రోజూ సభ జరగకుండా ఉండాలనే యనమల చూస్తున్నారు
  • ఎజెండాలో లేకపోయినా అంబేద్కర్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు
  • ఇప్పుడు కూడా రోజాను ఏడాది సస్పెండ్ చేసి, ఇక సభను నడవనివ్వకూడదని చేస్తున్నారు
  • మేం ఎటూ నిరసన వ్యక్తం చేస్తామని ఆయనకు తెలుసు
  • సెక్స్ రాకెట్ అంశాన్ని అసలు చర్చించనివ్వకుండా ఈ అంశాన్ని లేవనెత్తారు
  • సభలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మాది మాత్రమే
  • అలాంటిది ప్రతిపక్షానికి వాయిస్ ఇవ్వకుండా, సభ్యులను సస్పెండ్ చేసుకుంటూ పోతే ఇక సభ ఎలా జరుపుతారు?

అయితే రోజా సస్పెన్షన్ విషయంలో తమకు మరో ఆలోచన లేదని యనమల స్పష్టం చేశారు. సభను జరగనివ్వబోమని అనడం సరికాదని, తాను బిల్లులు ప్రవేశపెడతానని చెప్పారు. దాంతో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. అయితే, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా నిరసనల మధ్యే బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఇతర మంత్రులు పలు బిల్లులను ప్రవేశపెట్టారు. వాటన్నింటినీ మూజువాణీ ఓటుతో ఆమోదిస్తున్నట్లు సభ ప్రకటించింది. అనంతరం సభను స్పీకర్ కోడెల 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement