న్యూఢిల్లీ: నీట్ అవకతవకల ఆరోపణల్లో నిగ్గు తేల్చేందుకు అధికారులతో కమిటీని నియమించాలని రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ సుప్రీంకోర్టును కోరారు.
భవిష్యత్తులో నీట్‌ను మరింత మెరుగ్గా నిర్వహించే అంశంపై రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. నీట్‌ను నిర్వహించే ఎన్‌టీఏ వ్యవస్థలోనే అవినీతి నెలకొన్న పరిస్థితుల్లో ప్రధాని మోదీ మౌనంగా ఉండటం ఏమాత్రం మంచిదికాదన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నీట్‌లో అక్రమాలను ప్రముఖంగా ప్రస్తావించాలని సిబల్ అన్ని రాజకీయ పారీ్టలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment