ముష్టి పారేస్తామంటున్నారు.. అక్కర్లేదు! | we do not want megre compensation for lands, says lady farmer | Sakshi
Sakshi News home page

ముష్టి పారేస్తామంటున్నారు.. అక్కర్లేదు!

Nov 18 2014 7:25 PM | Updated on Sep 2 2017 4:41 PM

రాజధాని కోసం భూములు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరని తుళ్లూరు మండలానికి చెందిన మహిళా రైతు శ్యామసుందరి స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రైతులు కలవడం అనేది ముందుగా ఎరేంజ్ చేసిన ప్రోగ్రాం అని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలానికి చెందిన మహిళా రైతు శ్యామసుందరి మండిపడ్డారు. రాజధాని కోసం భూములు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరని ఆమె స్పష్టం చేశారు. రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కుని వెయ్యి గజాలు ముష్టి ఇచ్చినట్లు ఇస్తామంటున్నారని, అది తమకు అవసరం లేదని అన్నారు.

గ్రామాల నుంచి తమకు కావల్సిన వారినే ఎంపిక చేశారని, అందరికీ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని శ్యామసుందరి ఆగ్రహంవ్యక్తం చేశారు. ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే ఒప్పుకొనేది లేదన్నారు. ప్రభుత్వ భూములు ఉన్నచోటే రాజధాని నగరాన్ని నిర్మించుకోవాలని ఆమె చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement