పంటను బట్టి పరిహారం ఇవ్వండి: ఉపసంఘం
హైదరాబాద్: అన్ని పంటలకు ఒకే పరిహారం ఇవ్వాలనే నిర్ణయంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారనే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ల్యాండ్ పూలింగ్ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘ సమావేశంతో చంద్రబాబు చర్చించారు. రైతుల అభ్యంతరాలను చంద్రబాబు ముందుకు ఉంచారు.
పంటను బట్టి పరిహారం ఇవ్వాలనంటూ మంత్రులు ప్రతిపాదించారు. దేవాలయం భూములకు పరిహారం ఇవ్వాలని, పట్టాల్లేని భూములు సాగు చేస్తున్నవారికీ కొంత పరిహారం ఇవ్వాలని మంత్రులు సూచించారు. ఇళ్లు కోల్పోతున్న వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రతిపాదించారు.
శనివారం ఉదయం 9.15 నిమిషాలకు మరోసారి చంద్రబాబుతో మంత్రులు సమావేశం కానున్నారు. ల్యాండ్ పూలింగ్ పాలసీపై ప్రభుత్వం రేపు నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో 11 తేదిన గుంటూరు జిల్లా రైతులతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. ఆతర్వాత ల్యాండ్ విధానంలో మార్పులు, చేర్పులపై తుది నిర్ణయం తీసుకోనుంది.