రియల్ రాజధాని లేక రియల్ ఎస్టేట్ రాజధానా?
రియల్ రాజధాని లేక రియల్ ఎస్టేట్ రాజధానా?
Published Thu, Sep 4 2014 10:23 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM
హైదరాబాద్: రియల్ రాజధాని నిర్మిస్తారా లేక రియల్ ఎస్టేట్ రాజధాని నిర్మిస్తారా అంటూ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి నిలదీశారు. నారా..నారాయణలిద్దరే రాజధానిని నిర్మిస్తారా అంటూ చంద్రబాబు, మంత్రి నారాయణను ప్రశ్నించారు.
రాజధాని ఏర్పాటుపై చర్చించేందుకు అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15 వరకు కొనసాగిస్తామని ఆయన సూచించారు. రాత్రికి రాత్రి ముహుర్తాలు పెట్టుకుని ప్రకటన చేయడమేమిటని ప్రభుత్వంపై చెవిరెడ్డి మండిపడ్డారు.
రాజధాని అంశంలో ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజధానిపై సమగ్ర చర్చ జరిగిన తర్వాతే సరియైన నిర్ణయం తీసుకుందామన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరించవద్దని, ఆరు కోట్ల మంది ప్రజలకు ప్రతినిధులైన ఎమ్మెల్యేలతో ఎందుకు ఈ ప్రభుత్వం చర్చించదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజస్వామ్యంలో ప్రతిపక్షానిదే ప్రధానపాత్ర అని చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు.
Advertisement