రాజధాని ప్రకటన నేపథ్యంలో విజయవాడ - గుంటూరు మధ్య ప్రాంతంలో అనధికార లే అవుట్లు విస్తరిస్తున్నాయని వీజీటీఎం వుడా వైస్ ఛైర్మన్ ఉషాకుమారి తెలిపారు.
రాజధాని ప్రకటన నేపథ్యంలో విజయవాడ - గుంటూరు మధ్య ప్రాంతంలో అనధికార లే అవుట్లు విస్తరిస్తున్నాయని వీజీటీఎం వుడా వైస్ ఛైర్ పర్సన్ ఉషాకుమారి తెలిపారు. వీటిపై తాము త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. కృష్ణా జిల్లాలో కేవలం 469 లే అవుట్లకు మాత్రమే వుడా నుంచి అనుమతులు ఉన్నాయని ఆమె తెలిపారు.
ఈ నేపథ్యంలో భూముల ధరలు పెరుగుతాయని భావించి కొనుగోలు చేసే ముందు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఉషాకుమారి హెచ్చరించారు. పక్కాగా లే అవుట్లు, అనుమతులు ఉన్న భూములను మాత్రమే కొనుగోలు చేయాలని, అంతే తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారుల మాయలో మాత్రం పడొద్దని తెలిపారు.