ఏపీ పారిశ్రామిక విధానానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రాజధానికి అమరావతి పేరును ఖరారు చేశారు. బుధవారం ఉదయం ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం.. మధ్యాహ్నం వరకు కొనసాగింది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి..
- ఇండస్ట్రియల్ పాలసీకి ఆమోదం
- ఏపీ రాజధానికి అమరావతి పేరు ఖరారు
- 10 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్
- వ్యవసాయం, బయోటెక్ రంగాలకు ప్రోత్సాహకాలు
- 99 ఏళ్ల పాటు భూములను లీజుకు ఇవ్వాలని నిర్ణయం
- 100 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే ప్రత్యేక రాయితీలు
- స్వచ్ఛ్, గ్రీన్ ఏపీలకు సహకరిస్తే ఐదేళ్ల పాటు వ్యాట్, జీఎస్పీ రీయింబర్స్ చేయాలని నిర్ణయం
- ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు