
తమిళనాడు రాజధాని బెంగళూరు!
తమిళనాడు తన రాజధాని నగరాన్ని బెంగళూరుకు మార్చేసుకుందట. అలాగే సచివాలయాన్ని కూడా పరప్పన అగ్రహార అనే ప్రాంతానికి తరలించేసిందట.
తమిళనాడు రాజధాని ఏదంటే చిన్న పిల్లలు కూడా ఠక్కుమని 'చెన్నై' అని చెబుతారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదట. తమిళనాడు తన రాజధాని నగరాన్ని బెంగళూరుకు మార్చేసుకుందట. అలాగే సచివాలయాన్ని కూడా పరప్పన అగ్రహార అనే ప్రాంతానికి తరలించేసిందట. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ సంచలన విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు.
భారతదేశం అంతా ఒక్కటిగానే ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ అక్కర్లేదని కూడా వర్మ అన్నారు. విషయం ఏమిటంటే, మాజీ ముఖ్యమంత్రి జయలలిత పరప్పన అగ్రహార ప్రాంతంలోని జైల్లో ఉండటం, తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. అయితే.. అన్నాడీఎంకే లాంటి పార్టీలో ముఖ్యమంత్రి స్థానంలో ఎవరున్నా వెనక ఉండి పావులు కదిపేది మాత్రం 'అమ్మ' మాత్రమేనన్నది వర్మ వ్యాఖ్యల్లోని అంతరార్థం.
I luv it that capital of Tamilnadu now is Bangalore nd it's secretariat is in parappana agrahara...This the ultimate proof that India is one
— Ram Gopal Varma (@RGVzoomin) September 29, 2014