కొంత మంది మూగ జీవాలను, చిన్న పిల్లలను దారుణంగా హింసిస్తూ చాలా పైశాచికంగా ప్రవర్తిస్తుంటారు. అంతేకాదు వాళ్లకు మతిస్థిమితం లేక అలా చేస్తున్నారో లేక వారి ప్రవృత్తే అలా ఉంటుందో అర్థంకాదు. ఏదిఏమైన ఇలాంటి ఘటనలు చూస్తే చాలా అసహ్యంగానూ, అమానుషంగానూ అనిపిస్తుంది. అచ్చం అలాంటి క్రూరమైన ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది.
(చదవండి: హే!..రెండు వారాల్లో పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్!!)
అసలు విషయంలోకెళ్లితే....తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని కెట్టి అనే చిన్న పట్టణంలో ఒక వ్యక్తి గాయపడిన ఆవుని చాలా దారుణంగా హింసిస్తుంటాడు. పాపం ఆ ఆవు తనను రక్షించే నిమిత్తం ఆ వ్యక్తి పై దాడి చేసేందుకు ప్రయత్నించి ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
దీంతో "ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ సుప్రియా సాహు ఆ నిందితులను అటవీశాఖ అరెస్ట్ చేసింది" అని క్యాప్షన్ పెట్టి మరీ రీట్వీట్ చేశారు. అంతేకాదు ఆమె ఆ ట్వీట్‌లో ఆ క్రూరమైన చర్యను ఖండిచేలా ఒక భయంకరమైన చట్టం ఒకటి ఉందని గుర్తుచేయడమే కాక తప్పకుండా తాము ఆ దిశగా చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు కూడా "ఛీ చాలా సిగ్గుచేటు, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు.
(చదవండి: ఇంట్లో వాళ్లని ఒప్పించి మరీ కొన్నా స్కూటీ!.... ఏం లాభం నడిపేందుకు లేకుండాపోయింది)
Unidentified man mercilessly beating what looks like an injured #indian Gaur at #nilgiri district #TamilNadu
— Sidharth.M.P (@sdhrthmp) November 30, 2021
The gaur is seen struggling to walk & almost trips as it runs away in fear..
People heard yelling expletives at the attacker, ask him to show mercy#wildlife #TNGovt pic.twitter.com/AKTx2YXrVq
Comments
Please login to add a commentAdd a comment