brutal attack
-
దుబాయి నుంచి వచ్చి.. భార్య ప్రియుడిపై.. పక్కా ప్లాన్‌తో రాత్రికి రాత్రే..
కరీంనగర్: భార్యతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని తెలుసుకున్న భర్త దుబాయి నుంచి వచ్చి యువకుడిని హత్య చేశాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలో సంచలనం సృష్టించింది. గ్రామస్తులు, చందుర్తి సీఐ కిరణ్‌కుమార్ తెలిపిన వివరాలు. మల్యాలకు చెందిన పడిగెల నరేశ్(27) అదే గ్రామానికి చెందిన వివాహిత(32)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన వివాహిత బావ కుమారుడు లక్ష్మణ్ దుబాయ్‌లో ఉంటున్న ఆమె భర్త మల్లేశంకు తెలిపాడు. ఈనెల 3వ తేదీన గల్ఫ్ నుంచి వచ్చిన మల్లేశం ఇంటికిరాకుండా ఎక్కడో తలదాచుకున్నాడు. నరేశ్‌ను చంపేందుకు అదును కోసం ఎదురుచూస్తున్నాడు. బుధవారం రాత్రి నరేశ్ సదరు వివాహిత ఇంట్లోకి వెళ్లడం గమనించిన బావ కొడుకు లక్ష్మణ్ ఆమె భర్త మల్లేశంకు సమాచారం అందించాడు. మల్లేశం మాస్కులు ధరించి బైక్‌పై ఇంటికి చేరుకుని.. భార్యతో ఇంట్లో ఉన్న యువకుడిపై కత్తితో దాడి చేశాడు. మంచం పై నుంచి కింద పడ్డ నరేశ్‌పై పదే..పదే కత్తితో దాడి చేయగా తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే హత్యకు పాల్పడ్డ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య విషయం తెలుసుకున్న చందుర్తి సీఐ కిరణ్‌కుమార, పలువురు ఎస్సైలు బుధవారం అర్ధరాత్రి ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. మల్లేశం కోసం పరిసర ప్రాంతాల్లో గాలించారు. హత్య జరిగేందుకు మరో నలుగురు సహకరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి సీఐ కిరణ్‌కుమార్ వివరించారు. సాయంత్రం విందు.. అర్ధరాత్రి హత్య.. పడిగెల నరేశ్‌కు అదే గ్రామానికి చెందిన వివాహితతో ఐదేళ్ల క్రితమే వివాహేతర సంబంధం ఏర్పడింది. అదే సమయంలో వివాహిత కుటుంబ సభ్యులకు, యువకుడి మధ్య గొడవలు జరుగడంతో నరేశ్ దుబాయి వెళ్లాడు. అక్కడే ఐదేళ్లపాటు ఉన్నాడు. గత ఆగస్టు 29న ఇంటికొచ్చిన నరేశ్ తిరిగి సదరు వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఇది గమనించిన వివాహిత భర్త అన్నలతోపాటు వారి కుమారుడు ఈ విషయాన్ని గల్ఫ్‌లో ఉంటున్న మల్లేశంకు తెలిపారు. ఈనెల 3న దుబాయి నుంచి ఇండియా వచ్చిన మల్లేశం బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. ముందస్తు పథకం ప్రకారం వివాహిత కుటుంబ సభ్యులు బుధవారం యువకుడి ఇంట్లోనే విందు చేసుకున్నారు. తర్వాత యథావిధిగా ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. బంధువుల ఇంట్లో తలదాచుకున్న మల్లేశంను అదే సమయంలో స్వగ్రామానికి పిలిపించుకున్నారు. ఇది తెలియని యువకుడు రాత్రి అందరూ పడుకున్న సమయంలో వివాహిత వద్దకు వెళ్లాడు. గమనించిన లక్ష్మణ్ తన చిన్నాన్న మల్లేశంకు ఫోన్ చేయడంతో బైక్‌పై వచ్చి యువకుడిపై దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. అనుమానితులను విచారిస్తున్న పోలీసులు.. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న మల్లేశం పరారీకాగా.. అనుమానం ఉన్న ముగ్గురితోపాటు వివాహితను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. హత్యకు సహకరించిన వారి వివరాలను కాల్‌డాటా ఆధారంగా సేకరిస్తున్నట్లు సమాచారం. వారం క్రితమే హత్యకు పథకం రచించినట్లు తెలిసింది. పోలీసుల లుక్ఔట్ నోటీసు.. యువకుని హత్యలో ప్రధాన నిందితునిగా భావిస్తున్న మల్లేశ దుబాయి నుంచి ఈనెల 3న ఇండియాకు వచ్చాడు. హత్య చేసేందుకు ముందుగానే తిరిగి దుబాయి వెళ్లేందుకు సిద్ధమై.. రాత్రి 11 గంటల ప్రాంతంలో హత్యచేసి ఎయిర్‌పోర్టుకు అదే రాత్రి వెళ్లిపోయాడన్న ప్రచారంతో పోలీసులు లుక్ఔట్ నోటీస్ జారీ చేసినట్లు తెలిసింది. -
జనంపై బాంబుల మోత
కీవ్/వాషింగ్టన్/మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం పాశవిక దాడులు కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ సైనిక దళాలతోపాటు సామాన్య ప్రజలను కూడా వదిలిపెట్టడం లేదు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న వారిపై క్షిపణుల మోత మోగిస్తోంది. రాజధాని కీవ్ శివార్లలోని కాలీనివ్కా, బ్రోవరీ పట్టణాలపై గురువారం క్షిపణులు ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు కార్యాలయం పేర్కొంది. కీవ్‌లో 16 అంతస్తుల ఓ అపార్ట్ మెంట్ భవనంపై రష్యా సైన్యం రాకెట్ దాడులు జరిపింది. ఒకరు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి అపార్ట్మెంట్ మొదటి అంతస్తు నుంచి 30 మందిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. మంటలను ఆర్పేశారు. ఖర్కీవ్ సమీపంలో ఉన్న మెరెఫా పట్టణంలో ఓ పాఠశాల, కమ్యూనిటీ కేంద్రంపై రష్యా దాడికి దిగింది. ఈ ఘటనలో 21 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. చెర్నీహివ్లోని ఓ హోటల్‌పై రష్యా బాంబులు ప్రయోగించడంతో ముగ్గురు పిల్లలతో సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మారియుపోల్ సిటీలో మహిళలు, చిన్నారులు ఆశ్రయం పొందుతున్న నెప్ట్యూన్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్‌పైనా రష్యా సైన్యం విరుచుకుపడింది. గగనతలం నుంచి క్షిపణి దాడులు జరిపింది. ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారన్నది ఇప్పటివరకు తెలియరాలేదు. పోర్ట్ సిటీ మారియుపోల్‌లో దాదాపు 1,000 మంది తలదాచుకున్న ఓ థియేటర్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. మూడంతస్తుల ఈ థియేటర్ చాలావరకు ధ్వంసమయ్యింది. ముఖద్వారం పూర్తిగా కుప్పకూలింది. ఎంతమంది చనిపోయారన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. కొందరు గురువారం క్షేమంగా బయటపడినట్లు ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యుడు, డొనెట్స్క్ మాజీ గవర్నర్ సెర్గీ టరూటా చెప్పారు. అయితే, థియేటర్‌పై దాడి అంటూ వస్తున్న వార్తలను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. థియేటర్‌పై తాము దాడి చేయలేదని వెల్లడించింది. మారియుపోల్‌లో ఎక్కడా దాడులు జరపలేదని పేర్కొంది. తిరిగి వస్తున్న శరణార్థులు! ఉక్రెయిన్ నుంచి పొరుగుదేశాలకు శరణార్థుల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 30 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు వలసబాట పట్టారు. ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. రైళ్ల రాక కోసం పడిగాపులు గాస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లిన వారిలో కొందరు అక్కడ ఉండలేక తిరిగి వస్తున్నట్లు ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్ గగనతలాన్ని నో–ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న ప్రతిపాదనకు మద్దతు తెలుపుతూ లిథువేనియా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇప్పటికే ఎస్తోనియా, స్లొవేనియా కూడా ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించాయి. ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి: జెలెన్స్కీ రష్యా దండయాత్ర నుంచి మాతృదేశాన్ని కాపాడుకొనేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రపంచ దేశాల సాయం అర్థిస్తున్నారు. బుధవారం అమెరికా పార్లమెంట్‌ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన గురువారం జర్మనీ చట్టసభ సభ్యులకు మొరపెట్టుకున్నారు. జర్మనీ ఫెడరల్ పార్లమెంట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తమ దేశానికి మరింత సాయం అందించాలని కోరారు. రష్యా రాక్షసకాండ సాగిస్తోందని, వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోతున్నారని, ఇప్పటివరకు 108 మంది చిన్నారులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాపై ఆంక్షలు విధించకుండా జర్మనీ ఎందుకు వెనుకాడుతోందో చెప్పాలన్నారు. మెలిటోపోల్ మేయర్ విడుదల తమ సైన్యం వారం రోజుల క్రితం అపహరించిన ఉక్రెయిన్‌లోని మెలిటోపోల్ నగర మేయర్ ఇవాన్ ఫెడోరోవ్‌ను రష్యా విడుదల చేసింది. ఇందుకు ప్రతిఫలంగా ఉక్రెయిన్ తమ నిర్బంధంలో ఉన్న 9 మంది రష్యా సైనికులకు స్వేచ్ఛ కల్పించింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయం అధికార ప్రతినిధి డారియా జరీవ్నా ధ్రువీకరించారు. ‘నాటో’లో ఉక్రెయిన్ భాగమే: కమల ట్వీట్ నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్(నాటో)లో ఉక్రెయిన్ కూడా సభ్య దేశమేనంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ చేసిన రెండు ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. నాటో కూటమిని రక్షించుకోవడంలో భాగంగా ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా అండగా నిలుస్తుందంటూ మొదట ఒక ట్వీట్ చేశారు. దీనిపై విమర్శలు రావడంతో తొలగించారు. గంట తర్వాత మరో ట్వీట్ చేశారు. ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని, నాటో సభ్యదేశాలను రక్షించుకుంటామని రెండో ట్వీట్లో పేర్కొన్నారు. నేడు బైడెన్, జిన్‌పింగ్ చర్చలు ఉక్రెయిన్‌లో రష్యా దాడులు, తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం చైనా అధినేత జిన్‌పింగ్‌తో చర్చించనున్నారని శ్వేతసౌధం తెలియజేసింది. అమెరికా–చైనా పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపైనా వారు చర్చిస్తారని పేర్కొంది. రష్యాకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని, ఆ దేశాన్ని ఏకాకిని చేయాలని అమెరికా, నాటో దేశాలు చైనాపై ఒత్తిడి పెంచుతున్నాయి. -
తల్లి, కుమార్తెలపై ఎమ్మెల్యే అనుచరుల దాడి.. ఇనుప రాడ్‌తో..
న్యూఢిల్లీ: దేశ రాజాధానిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆప్ ఎమ్మెల్యే అనుచరులు కొందరు తల్లికుమార్తెలపై కర్రలు, ఐరన్ రాడ్‌తో విచక్షణారహితంగా వారిపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వివరాలు.. ఈ సంఘటన నవంబర్ 19న, ఢిల్లీ, శాలిమార్ బాగ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు.. 38 ఏళ్ల మహిళ, ఆమె కుమార్తెపై ఇనుప రాడ్డు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. నిందితుల్లో మహిళలు కూడా ఉండటం గమనార్హం. ఇక తమను ఇంత దారుణంగా హింసించింది ఆప్ ఎమ్మెల్యే బందన కుమారి అనుచరులని.. అందుకే పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సదరు మహిళ వాపోయింది. (చదవండి: Cheena Kapoor: కొత్త దారి...కెమెరా చెప్పే కథలు) వీడియోలో ఉన్న దాని ప్రకారం మహిళ, ఆమె కుమార్తె కారు నుంచి దిగగానే.. కొందరు వ్యక్తులు వారి మీద విచక్షణారహితంగా దాడి చేశారు. వారిపై పిడిగుద్దులు కురిపించడమే కాక ఇనుప రాడ్డు, కర్రలతో చితకబాదారు. ఇంతలో మరికొందరు వ్యక్తులు కూడా అక్కడకు చేరుకుని.. మిగతావారితో కలిసి.. ఏమాత్రం జాలి, దయ లేకుండా వారిని చితకబాదారు. బాధితులు తమను కాపాడాల్సిందిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడ నుంచి పారరయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. మంగళవారం అనగా నవంబర్ 30న వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మహిళలపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆప్ ఎమ్మెల్యే బందన కుమారి మద్దతుదారులైన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు తమపై దాడి చేశారని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. (చదవండి: క్యాబ్ డ్రైవర్‌పై మహిళ వీరంగం.. నడి రోడ్డుపై చొక్కా పట్టుకొని) "నవంబర్ 19 రాత్రి, ఆప్ ఎమ్మెల్యే బందన కుమారికి తెలిసిన వ్యక్తులు నాతో పాటు నా కుమార్తెపై దాడి చేశారు. 2019లో ఎమ్మెల్యే భర్తపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసినందున ఈ దాడి జరిగింది. నేను ఎమ్మెల్యే చేసిన తప్పులను బయటపెట్టాను. వారిపై గతంలో కూడా అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి" అని ఆ మహిళ తెలిపింది. చదవండి: ఎంపీకే టోకరా.. రూ. 25 కోట్లకు కుచ్చుటోపి #WATCH | A group of persons beat up a woman with sticks in a residential colony in Shalimar Bagh area of Delhi on November 19 Based on the woman's complaint, Delhi Police has registered an FIR against unknown persons, it said. (CCTV footage of the incident) pic.twitter.com/YmZRtD7COu — ANI (@ANI) December 1, 2021 -
ఛీ చాలా సిగ్గుచేటు!... అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు!
కొంత మంది మూగ జీవాలను, చిన్న పిల్లలను దారుణంగా హింసిస్తూ చాలా పైశాచికంగా ప్రవర్తిస్తుంటారు. అంతేకాదు వాళ్లకు మతిస్థిమితం లేక అలా చేస్తున్నారో లేక వారి ప్రవృత్తే అలా ఉంటుందో అర్థంకాదు. ఏదిఏమైన ఇలాంటి ఘటనలు చూస్తే చాలా అసహ్యంగానూ, అమానుషంగానూ అనిపిస్తుంది. అచ్చం అలాంటి క్రూరమైన ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. (చదవండి: హే!..రెండు వారాల్లో పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్!!) అసలు విషయంలోకెళ్లితే....తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని కెట్టి అనే చిన్న పట్టణంలో ఒక వ్యక్తి గాయపడిన ఆవుని చాలా దారుణంగా హింసిస్తుంటాడు. పాపం ఆ ఆవు తనను రక్షించే నిమిత్తం ఆ వ్యక్తి పై దాడి చేసేందుకు ప్రయత్నించి ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో "ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ సుప్రియా సాహు ఆ నిందితులను అటవీశాఖ అరెస్ట్ చేసింది" అని క్యాప్షన్ పెట్టి మరీ రీట్వీట్ చేశారు. అంతేకాదు ఆమె ఆ ట్వీట్లో ఆ క్రూరమైన చర్యను ఖండిచేలా ఒక భయంకరమైన చట్టం ఒకటి ఉందని గుర్తుచేయడమే కాక తప్పకుండా తాము ఆ దిశగా చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు కూడా "ఛీ చాలా సిగ్గుచేటు, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఇంట్లో వాళ్లని ఒప్పించి మరీ కొన్నా స్కూటీ!.... ఏం లాభం నడిపేందుకు లేకుండాపోయింది) Unidentified man mercilessly beating what looks like an injured #indian Gaur at #nilgiri district #TamilNadu The gaur is seen struggling to walk & almost trips as it runs away in fear.. People heard yelling expletives at the attacker, ask him to show mercy#wildlife #TNGovt pic.twitter.com/AKTx2YXrVq — Sidharth.M.P (@sdhrthmp) November 30, 2021 -
అరాచకం.. స్కూటర్‌ను ఢీకొట్టాడని చితకబాదారు; వీడియో వైరల్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒక వాహనదారుడిని, అతని మిత్రుడిని నడిరోడ్డుపైనే చితకబాదిన వీడియో ఆలస్యంగా వెలుగుచూసింది. తమ స్కూటర్‌ను ఢీకొట్టాడని కోపంతో సదరు బండి యజమాని, అతని బంధువులు వారిని రోడ్డుపైనే అడ్డగించి కర్రలతో చితకబాదుతూ బీభత్సం సృష్టించారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఇక వీడియో ఆధారంగా చూసుకుంటే చేతిలో హెల్మెట్ పట్టుకొని ఉన్న వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఒక వ్యక్తి కర్రతో దాడి చేయగా.. మరో వ్యక్తి అతనిపై ముష్టి యుద్దానికి దిగాడు. ఎవరు చెప్పినా వినిపించుకోకుండా అతనిపై పంచుల వర్షం కురిపించాడు. వాహనదారుడి స్నేహితుడిని కూడా చితకబాదారు. అక్కడే ఉన్న మహిళ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆమెను పక్కకు తోసి మరి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ తర్వాత వారిద్దరిని పక్కన పడేసి వెళ్లిపోయారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ దాడిలో వాహనదారుడి తలకు గాయమవడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఆలస్యంగా వెలుగు చూడడంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికుల సమాచారం మేరకు గాయపడిన వ్యక్తి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదవండి: గదిలో మూత్రం పోశాడని తిట్టింది.. పగ పెంచుకుని ప్రాణ భయంతో నూతన జంట పరుగు.. వెంటాడి వేటాడి దారుణం दिल्ली के पालम इलाके की साद कॉलोनी में मामूली बात पर रोडरेज में लड़के की पिटाई,बाइक सवार पर रॉड से हमला pic.twitter.com/wHtX3A3pAm — Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) June 27, 2021 -
హంతకదాడులు
విద్యాబోధనలో, పరిశోధనల్లో ప్రపంచ ఖ్యాతి పొంది, దేశంలోని ఉన్నతశ్రేణి విద్యాసంస్థల జాబితాలో మూడో ర్యాంకుతోవున్న ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) ఆదివారం నెత్తురోడింది. ముసుగులు ధరించిన దుండగులు ఇనుపరాడ్లు, హాకీ స్టిక్‌లు, కర్రలు పట్టుకుని చీకటిచాటున దాదాపు రెండున్నర గంటలపాటు విశ్వవిద్యాలయం ఆవరణలో స్వైర విహారం చేసిన తీరు చూసి దేశం మొత్తం విస్తుపోయింది. వారి చేతుల్లో యాసిడ్ బాటిళ్లు కూడా ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారంటే ఆ గూండాలు ఎంతకు తెగించారో అర్థమవుతుంది. ఆఖరికి ఆడపిల్లల హాస్టల్లో సైతం వారి దౌర్జన్యం యధేచ్ఛగా కొనసాగింది. విద్యార్థినులు నిరాయు ధంగావున్నా, దుండగుల చేతుల్లో గాయాలపాలవుతున్నా అందరూ ఏకమై బిగ్గరగా అరుస్తూ ప్రతి ఘటించడానికి చేసిన ప్రయత్నాలు, వారిలో కొందరు వీడియో తీసిన తీరు ఆ పిల్లల మనోస్థైర్యానికి అద్దం పడతాయి. ఏడేళ్లక్రితం ఇదే ఢిల్లీలో నడుస్తున్న బస్సులో కొందరు దుండగులు నిర్భయపై పాశవికంగా దాడి చేసి, చెప్పనలవికాని హింసకు పాల్పడి, చివరకు ఆమె ప్రాణాలు తీశారు. ఆ సమయంలో ఆమె ఫలానా విధంగా చేసివుండాల్సిందని చెప్పినవారు మొదలుకొని ఆడపిల్ల రాత్రివేళ మరో వ్యక్తితో కలిసి ఎందుకెళ్లిందని ప్రశ్నించినవారి వరకూ అనేకులున్నారు. కానీ శాంతిభద్రతల యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉన్నచోట ఉన్నతశ్రేణి విద్యాసంస్థలోని ఆడపిల్లల హాస్టల్ సైతం గూండాల దౌర్జన్యానికి నిస్సహాయంగా తలవంచాల్సిందేనని ఆదివారంనాటి ఉదంతం రుజువు చేసింది. దాడి సమయంలో ఎంతమంది విద్యార్థినులు పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్‌కి ఫోన్ చేసివుంటారో ఊహకందని విషయ మేమీ కాదు. నిజానికి ఆ దుండగుల జాడను గుర్తించాక చాలా ముందే పోలీసు అధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశానని జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్ చెబుతున్నారు. ఫలానా పోలీస్ అధికారి తన వద్ద చదువుకుని వెళ్లాడని, అందువల్ల అతనికి సమాచారం అందించానని మరో అధ్యాపకుడు వెల్లడించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆపత్కాలంలో ఆదుకున్నవారు లేరు. విశ్వవిద్యాలయం పాలకవర్గం నుంచి అనుమతి లేనందువల్ల వెంటనే రాలేకపోయామని పోలీసులు ఇస్తున్న సంజాయిషీ సమర్థనీయం కాదు. విపత్కర పరిస్థితులున్నాయని చానెళ్లన్నీ చెబుతున్నా మౌనంగావుండటం దిగ్భ్రాంతికరం. ఆ దాడుల్లో ఎవరి ప్రాణాలైనా పోయివుంటే జవాబుదారీ ఎవరు? దేశ రాజధాని నగరంలోని ప్రఖ్యాత యూనివర్సిటీయే ఈ దుస్థితిలోవుంటే ప్రపంచ దేశాల దృష్టిలో మన ప్రతిష్ట మసకబారదా? దుండగులు తనను గుర్తించి మరీ తల బద్దలు కొట్టారని, చేయి విరగ్గొట్టారని అయిషీ ఘోష్ అంటున్నారు. విద్యార్థినీవిద్యార్థులు మాత్రమే కాదు...అధ్యాపకులు సైతం దుండగుల దౌర్జన్యాన్ని చవిచూడటం ఊహకందనిది. భిన్న విశ్వాసాలున్నవారు అక్కడ చదువుకుంటున్నా, ఆ విశ్వాసాల మధ్య నిత్యం ఘర్షణాత్మక వాతావరణం ఉంటున్నా అర్ధ శతాబ్ది దాటిన ఆ విశ్వవిద్యాలయం చరిత్రలో ఇంతవరకూ అధ్యాపకులపై భౌతికదాడి చేసిన ఉదంతం ఎప్పుడూ లేదు. తమపై దాడి చేసింది ఏబీవీపీకి చెందినవారేనని గాయపడినవారు చెబుతుంటే, తమ ప్రమేయం లేదని ఆ సంస్థ ఖండిస్తోంది. పైగా అయిషీ ఘోష్ దుండగులతో కలిసి లోనికి వస్తున్న దృశ్యమని చెబుతూ విశ్వవిద్యాలయం, పోలీసులు ఒక వీడియో విడుదల చేశారు. అందులో కనిపిస్తున్నామె వారు ఆరోపిస్తున్నట్టు నిజంగా అయిషీ ఘోష్ అయితే ఆమెతోసహా వామపక్ష విద్యార్థులంతా ఆ దుండగులకు ఎందుకు లక్ష్యంగా మారతారన్న ప్రశ్న తలెత్తుతుంది. మరోపక్క కొన్ని చానెళ్లు వీడియోల ఆధారంగా దుండగులకు ఏబీవీపీతో సంబంధాలున్నాయని ఆరోపిస్తున్నాయి. అంతే కాదు... ఒకపక్క ఈ దాడి సమాచారం అందుకుని మెయిన్ గేట్ వద్దకొచ్చిన మీడియా ప్రతినిధులను దుర్భాషలాడి, స్వరాజ్ అభియాన్ పార్టీ అధినేత యోగేంద్ర యాదవ్‌ను కిందకు తోసి దౌర్జన్యం చేసినవారు ఏ ప్రయోజనాన్ని ఆశించి ఆ పని చేశారన్నది కూడా తేలవలసివుంది. అసలు దౌర్జన్యం కొనసాగినంతసేపూ వీధి దీపాలు స్విచాఫ్ చేసిందెవరో కూడా తేలాలి. ఆ దీపాల వెలుతురుంటే దుండగులు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి రావడం, పోవడం అంత సులభమయ్యేది కాదు. రెండురోజులుగా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తతలున్నా, విద్యార్థి సంఘాల మధ్య అడపా దడపా ఘర్షణలు చోటు చేసుకున్నా విశ్వవిద్యాలయం బాధ్యులు తమకు సంబంధం లేనట్టు చోద్యం చూశారు. వాస్తవానికి గత రెండున్నర నెలలుగా విశ్వవిద్యాలయం ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఫీజులు, మెస్ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విశ్వవిద్యాయలం వైస్ చాన్సలర్ జగదీష్ కుమార్‌కూ, పాలకవర్గానికీ దీన్నిమించి పరిష్కరించ వలసిన సమస్య ఏం ఉంటుంది? ఇంతకు ముందు మాటెలావున్నా విశ్వవిద్యాలయంలో ఇంత పెద్ద ఘటన చోటుచేసుకున్న తర్వాతకూడా ఆయనగానీ, రెక్టార్గానీ, మరొకరుగానీ పత్తా లేకుండా పోవడంలోని ఆంతర్యమేమిటి? దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాల తరహాలోకాక, దీన్ని విభిన్నంగా తీర్చి దిద్దాలని దీన్ని స్థాపించడంలో ముఖ్యపాత్ర పోషించినవారు భావించారు. దానికి తగినట్టే గ్రామీణ ప్రాంతాలకు చెందిన అట్టడుగు వర్గాలనుంచి వచ్చిన మెరికల్లాంటివారెందరో ఇక్కడ ఉన్నత చదువులు చదువుకుని భిన్న రంగాలకు వన్నె తెస్తున్నారు. విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగిన సందర్భాలున్నా అవి హంతకదాడుల వరకూ వెళ్లకపోవడం, ఇక్కడివారు చదువుల్లో ఎప్పుడూ మేటిగా ఉండటం ఈ విశ్వవిద్యాలయం విశిష్టత. ఈ ఉన్నత సంప్రదాయం చెదిరిపోనీయకూడదు. ఆదివారంనాటి ఉదంతం ఒక కొత్త సంప్రదాయంగా మారకుండా, చేదు జ్ఞాపకంగా మాత్రమే మిగ లాలి. అది సాధ్యం కావాలంటే ఉన్నతస్థాయి విచారణ జరిపి, దుండగులు ఏ పార్టీకి, సంస్థకు చెందిన వారైనా కఠినంగా శిక్షించాలి. ఈ విశ్వవిద్యాలయం ప్రతిష్టను నిలబెట్టాలి. -
కామారెడ్డి జిల్లాలో దారుణం
-
ఆస్తి కోసం కొడుకు అఘాయిత్యం..!
సాక్షి, అనంతపురం : జిల్లాలోని కణేకల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం కనిపెంచిన తల్లిదండ్రులను కడతేర్చేందుకు సిద్ధపడ్డాడో కసాయి కొడుకు. తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పటించడంతో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫేస్బుక్ తంటా..యువకుడిపై పాశవిక దాడి!
మహబూబ్‌నగర్ క్రైం: పాతకక్ష్యలను మనసులో పెట్టుకుని కొందరు ఇద్దరు యువకులపై పాశవిక దాడికి పూనుకున్నారు. ఈ సంఘటన పట్టణంలో హల్చల్ సృష్టించింది. రూరల్ ఎస్ఐ భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పీర్లబాయికి చెందిన శ్యాంసుందర్ అతని స్నేహితుడు రోహిత్ మంగళవారం లైసెన్స్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మర్లుకు చెందిన చాణక్య అతని స్నేహితులు జగదీష్, పల్లె నరేష్, పల్లె దేవ, కృతిక్తోపాటు మరికొందరు కలిసి శ్యాంసుదర్, రోహిత్‌ను పట్టుకుని వారి కాలనీకి తీసుకుకెళ్లారు. దుస్తులు తొలగించి నగ్నంగా చేసి చేతులతో, కర్రలతో దాడిచేశారు. అంతటితో ఆగకుండా వీడియో చిత్రీకరించారు. బయటికి వచ్చిందిలా.. ఆగస్టు 25న చాణిక్య, వేపూర్‌గేరికి చెందిన బంటి ఫొటోలను గుర్తుతెలియని వ్యక్తులు ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. అయితే అందులో చాణక్య ఫొటోను ఎక్కువ మంది లైక్ కొట్టడంతో పాటు కామెంట్లు చేశారు. నాకంటే ఎక్కువ లైక్‌లు అతనికి వచ్చాయని బంటి తట్టుకోలేక చాణక్యను కొట్టాలని పతకం రచించాడు. అందులో భాగంగానే చాణక్య స్నేహితుడు శ్రీకాంత్‌చారిని వెంట పెట్టుకొని బంటి అతని స్నేహితులు దత్తు, శ్యామ్‌సుందర్, జగదీష్, శివ, సందీప్, శివసాయి, రోహిత్, విష్ణు, మధుచారి, నందివర్ధన్రెడ్డిలతో కలిసి ఆగస్టు 25న రాత్రి 9.30గంటలకు చాణక్య ఇంటికి వెళ్లారు. శ్రీకాంత్ చారితో అతనిని బయటకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేసి కొంత దూరం మాటల్లో పెట్టి తీసుకెళ్లారు. బంటికి సారీ చెప్పాలని అతని స్నేహితులు చాణక్యతో గొడవ పడ్డారు. వినకపోవడంతో ఇనుప రాడ్లు, కట్టెలతో చాణక్యపై దాడి చేశారు. బట్టలు తీసి నగ్నంగా చేసి కొట్టడంతో రక్తగాయాలయ్యాయి. ఈ విషయం బయటికి పొక్కలేదు. ప్రతికారం తీర్చుకోవాలని చాణక్య అదేపద్ధతిలో చాణక్య అతని స్నేహితులు కలిసి శ్యాంసుందర్, రోహిత్‌పై దాడి చేశారు. శ్యాంసుందర్ తల్లి యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను కాదని ప్రియుడు.. ఆపై మరొకరు..!
సాక్షి, తూర్పు గోదావరి : తెలుగు రాష్టాల్లో ఒక పక్క పరువు హత్యలతో అలజడి రేగుతుంటే ... మరో పక్క అక్రమ సంబంధాలతో పచ్చని కాపురాల్లో చిచ్చు రగులుతోంది. అన్యోన్యంగా ఉండాల్సిన భార్యభర్తలు అక్రమ సంబంధాలతో హత్యలకు గురౌతున్నారు. భర్త కు తెలియకుండా ప్రియుడితో ... ప్రియుడికి తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహారాష్ట్ర యువతి ఉదంతం గురువారం వెలుగుచూసింది. జిల్లాలోని దేవీపట్నం మండలం కొత్తవీధి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అక్రమ సంబంధం నేపథ్యంలో పాతాళ నాగు అనే వ్యక్తి మడకం కిరణ్ (మహిళ) , బంధం సురేష్ లపై కత్తితో దాడి చేశాడు. వారిని హుటాహుటిన గోకవరం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం.. మడకం బాపన్న దొర కొన్నేళ్ల క్రితం మహారాష్ట్ర లో పని చేయడానికి వెళ్లాడు. అక్కడ కిరణ్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెను వివాహం చేసుకొన్న బాపన్న కొత్తవీధీ గ్రామానికి తీసుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో కిరణ్, పాతాళ నాగుల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే, కిరణ్.. సురేష్ అనే యువకుడితో సాన్నిహిత్యంగా ఉండడం గమనించిన నాగు కోపంతో రగిలి పోయాడు. మాటువేసి గత రాత్రి కత్తితో వారిపై దాడి చేశాడు. కాగా, ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పట్టపగలే కత్తితో పొడిచి పరార్
హైదరాబాద్: ట్రాఫిక్‌లో వేగంగా ఎందుకెళుతున్నావ్ అన్నందుకు ఓ వ్యక్తి ఇద్దరిని కత్తితో పొడిచి పరారయ్యాడు. నగరంలో పట్టపగలు ఈ దారుణం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు సికింద్రాబాద్ మారేడుపల్లికి చెందిన శంకర్ (21), శ్రీనాథ్ (20) యాక్టివా (ఏపీ 29 ఏపీ6481)పై వెళుతున్నారు. సంగీత్ చౌరస్తా దాటిన తర్వాత హీరో హోండా ప్యాషన్‌పై వచ్చిన ఓ వ్యక్తి వేగంగా వీరి వాహనాన్ని రాసుకుంటూ వెళ్లాడు. దీంతో వీరి మధ్య గొడవ జరిగింది. తరువాత వారిద్దరూ ముందుకు వెళ్లగా మళ్లీ వచ్చిన ఆ వ్యక్తి.. తన దగ్గర ఉన్న కత్తితో శంకర్ మెడపై, శ్రీనాథ్ కడుపులో పొడిచి పరారయ్యాడు. పోలీసులు బాధితులను 108 సహాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. శంకర్ కోలుకోగా ఆస్పత్రి నుంచి పంపించి వేశారు. శ్రీనాథ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. -
మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై దాడి
-
అయ్యా! అది గేదె మాంసం
సాక్షి, న్యూఢిల్లీ : గో రక్షక దళాల పేరిట దేశ రాజధాని శివార్లో శుక్రవారం జరిగిన దాడి దేశవ్యాప్తంగా మరోసారి కలకలం రేపుతోంది. ఫరిదాబాద్‌లో ఓ ఆటో రిక్షాలో బీఫ్ తీసుకెళ్తున్న ఆరోపణతో ఇద్దరిని చితకబాది.. ఆపై వారిని కాపాడేందుకు వచ్చిన మరో ముగ్గురు కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారు. అజాద్ అనే వికలాంగుడు ఓ ఆటో రిక్షా నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం తన ఆటోలో గేదే మాంసంను ఓ దుకాణం వద్దకు తీసుకెళ్తున్నాడు. మార్గమధ్యలో కారులో వచ్చిన ఆరుగురు దుండగులు ఆటోని అడ్డగించారు. అజాద్‌తోపాటు ఆటోలో ఉన్న మరో బాలుడిని తమ వెంట సమీపంలోని బజ్రీ గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ గోమాంసం ఆరోపణలతో వారిపై దాడి చేశారు. అది గో మాంసం కాదని ఎంత మొత్తుకున్నా వారిని నిర్దాక్షిణ్యంగా చితకబాదారంట. విషయాన్ని అజాద్ ఫోన్లో తన కుటుంబ సభ్యులకు వివరించగా.. అక్కడికి రాగానే వారిపై కూడా దాడికి తెగపడ్డారు. అంతలో మరో 40 మంది వారికి జత కలిశారు. జై హనుమాన్, జై గో మాత చెప్పాలంటూ డిమాండ్ చేశారని.. తాను నిరాకరించటంతో పంది మాంసం తినిపిస్తామని బెదిరించారని గాయపడిన అజాద్ మీడియాకు తెలిపాడు. ఏం చేసినా తాను మాత్రం నినాదాలు చేయనని చెప్పటంతో 40 మంది కలిసి తమను దారుణంగా చితకబాదారంటూ... గాయాలు చూపించాడు. అతని మెడ, కాళ్లు, వీపు నిండా దెబ్బలే ఉన్నాయి. కాగా, ముందు బాధితులపై గోమాంసం అక్రమ రవాణా కేసు నమోదు చేసినప్పటికీ.. పరీక్షల్లో అది గేదే మాంసం అని తేలటంతో కేసు కొట్టివేసినట్లు పోలీసులు వెల్లడించారు. గోరక్షక దళాల పేరిట జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన సుప్రీంకోర్టు.. వాటి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన విషయం తెలిసిందే. మరో పక్క నిజమైన హిందువులు ఆవులను పూజిస్తారని.. కేవలం నేర చరిత్ర ఉన్న వారే ఇలాంటి దాడులకు తెగబడతారని గోరక్షక దళాలపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
రాజస్థాన్‌లో దారుణం..యువకుడి మృతి
జైపూర్: రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. ఆవులను తరలిస్తున్న ముస్లిం యువకులపై గో రక్షక దళ సభ్యులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో అయిదుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఓయువకుడు మరణించాడు. అల్వార్ జిల్లాలో శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఈ షాకింగ్ వీడియె ఇపుడు నెట్లో చక్కర్లుకొడుతోంది. స్థానిక పోలీస్అధికారి రమేష్ చాంద్ సినీశ్వర్ అందించిన వివరాల ప్రకారం జాతీయ రహదారి జుగువాస్ వద్ద నాలుగు వాహనాలను గోరక్షక దళ్ సభ్యులు అటకాయించారు. దాదాపు 15మంది ముస్లిం యువకులపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. వాహనాలను ధ్వంసం చేశారు. వీరి దాడిలో తీవ్రంగా గాయపడిన పెహ్లూ ఖాన్ అనేయువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. దీంతో నిందితులపై హత్య కేసుతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ కార్యకర్తలుగా స్థానిక పోలీసులు గుర్తించిన పోలీసులు వీరిపై కేసులు నమోదుచేశారు. అటు ఆవులను అక్రమంగా తరలిస్తున్న కేసులో ముస్లింయువకులపై కూడా కేసులు నమోదుచేశారు. -
నడిరోడ్డుపై దంపతులను చావ బాదారు
-
కరీంనగర్ జిల్లాలో ఖాకీ జూలుం
-
నెట్టేసినందుకు కత్తులతో దాడి
విడవలూరు (నెల్లూరు) : జాతర సందర్భంగా జరిగిన తోపులాటలో తమ వర్గానికి చెందిన వారిని నెట్టేశారనే నెపంతో.. ఒక వర్గం వారు మరో వర్గం వారిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గిరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా విడవలూరు మండల అలగానుపాడు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. అలగానుపాడు గ్రామంలో వారం రోజుల కిందట జరిగిన బంగారమ్మతల్లి జాతరలో రెండు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం తోపులాటకు దారితీసింది. దీంతో మనస్తాపం చెందిన ఒక వర్గానికి చెందిన 15 మంది వ్యక్తులు శనివారం మరో వర్గానికి చెందిన ఐదుగురు వ్యక్తులను చేపలు పడుతున్న సమయంలో కురస కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు కాగా.. ఇద్దరు యువకులు పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. -
పిలవని పెళ్లికి వెళ్లి... బీభత్సం సృష్టించారు
హైదరాబాద్ (గోల్కొండ) : ఆహ్వానం లేకుండా పెళ్లికి వచ్చి భోజనాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించినందుకు షాదీఖానాలో యువకులు బీభత్సం సృష్టించారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ దాడి గోల్కొండలో సంచలనం సృష్టించింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ లైన్స్‌కు చెందిన మహ్మద్ సిద్దిఖ్ కుమారుడు మహ్మద్ ఆమెర్ వివాహం గోల్కొండ జీన్సి బజార్‌కు చెందిన యువతితో శుక్రవారం రాత్రి గోల్కొండ బడా బజార్‌లోని మిర్జా గార్డెన్లో జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వధూవరుల కుటుంబాలు అప్పగింతల కార్యక్రమంలో పాల్గొనగా, డైనింగ్ హాల్లోకి వచ్చి 40 మంది యువకులు భోజనాలు చేస్తున్నారు. వీరిని చూసిన వరుడి తండ్రి మహ్మద్ సిద్దిఖ్ అక్కడకు వెళ్లి.. పిలవకుండానే వచ్చి భోజనాలు చేస్తున్నారంటూ ఆ యువకులను నిలదీశారు. దాంతో వారు తమ వెంట తెచ్చుకున్న తల్వార్లు, రాడ్లతో సిద్దిఖ్పై దాడి చేశారు. అతడి కేకలు విని బంధువులు డైనింగ్ హాల్లోకి వెళ్లారు. వారిపై కూడా యువకులు కత్తులు, రాడ్లతో దాడి చేసి అడ్డువచ్చిన వారిని అడ్డంగా నరికేస్తామంటూ.. ఎక్కడి వారు అక్కడే ఉండాలని దబాయించారు. గాయపడ్డవారు కింద పడిపోగా కొందరు యువకులు మహిళలపై కూడా దాడిచేశారు. సిద్దిఖ్ భార్య గౌసియా బేగాన్ని మెడపట్టి లాగి రాడ్లతో కొట్టి గాయపరిచారు. ఆమె మెడలోని ఆరు తులాల బంగారు ఆభరణాలను లాక్కున్నారు. షాదీఖానాలోని వస్తువులను కర్రలు, రాడ్లతో కొట్టి ధ్వంసం చేశారు. మహ్మద్ సిద్దిఖ్ కారు అద్దాలు పగలకొట్టారు. గంటపాటు విధ్వంసం సృష్టించి దుండగులు పారిపోయారు. రాత్రి రెండు గంటలకు మహ్మద్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డవారు గోల్కొండ ఖల్ఫాన్ తెగకు చెందిన వారని మహ్మద్ సిద్దిఖ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.