
సాక్షి, అనంతపురం : జిల్లాలోని కణేకల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం కనిపెంచిన తల్లిదండ్రులను కడతేర్చేందుకు సిద్ధపడ్డాడో కసాయి కొడుకు. తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పటించడంతో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.