
తీవ్ర గాయాలపాలైన కిరణ్, సురేష్
సాక్షి, తూర్పు గోదావరి : తెలుగు రాష్టాల్లో ఒక పక్క పరువు హత్యలతో అలజడి రేగుతుంటే ... మరో పక్క అక్రమ సంబంధాలతో పచ్చని కాపురాల్లో చిచ్చు రగులుతోంది. అన్యోన్యంగా ఉండాల్సిన భార్యభర్తలు అక్రమ సంబంధాలతో హత్యలకు గురౌతున్నారు. భర్త కు తెలియకుండా ప్రియుడితో ... ప్రియుడికి తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహారాష్ట్ర యువతి ఉదంతం గురువారం వెలుగుచూసింది.
జిల్లాలోని దేవీపట్నం మండలం కొత్తవీధి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అక్రమ సంబంధం నేపథ్యంలో పాతాళ నాగు అనే వ్యక్తి మడకం కిరణ్ (మహిళ) , బంధం సురేష్ లపై కత్తితో దాడి చేశాడు. వారిని హుటాహుటిన గోకవరం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం.. మడకం బాపన్న దొర కొన్నేళ్ల క్రితం మహారాష్ట్ర లో పని చేయడానికి వెళ్లాడు. అక్కడ కిరణ్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెను వివాహం చేసుకొన్న బాపన్న కొత్తవీధీ గ్రామానికి తీసుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో కిరణ్, పాతాళ నాగుల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే, కిరణ్.. సురేష్ అనే యువకుడితో సాన్నిహిత్యంగా ఉండడం గమనించిన నాగు కోపంతో రగిలి పోయాడు. మాటువేసి గత రాత్రి కత్తితో వారిపై దాడి చేశాడు. కాగా, ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment