extra marital affairs
-
ఇకపై సహజీవనం నేరమే.. ఆరు నెలల జైలు శిక్ష
జకార్తా: సహజీవనం, వివాహేతర సంబంధాలు వంటి వాటిని ఇకపై నేరంగా పేర్కొంటూ శిక్షలు ఖరారు చేస్తూ ఇండోనేసియా ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. ఆ మేరకు నవంబర్‌లో తుదిరూపునిచ్చిన వివాదాస్పద నేర శిక్షాస్మృతి సవరణ బిల్లును మంగళవారం ఆ దేశ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. సవరించిన నేర శిక్షాస్మృతి ప్రకారం వివాహేతర సంబంధం నెరిపితే నేరంగా భావించి ఏడాది జైలు శిక్ష విధిస్తారు. సహజీవనం చేస్తే ఆరునెలల శిక్ష వేస్తారు. వేరొకరితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, సంతానం వీరిలో ఎవరైనా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తేనే ఆ వ్యక్తిపై కేసు నమోదు చేస్తారు. పర్యాటకంలో భాగంగా ఇండోనేసియాకు వచ్చే విదేశీయులకూ ఇదే చట్టం వర్తిస్తుంది. అబార్షన్, దైవ దూషణలను ఇకపై నేరంగా పరిగణిస్తారు. దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను విమర్శించడాన్ని నిషేధించారు. తనపై విమర్శలను నేరుగా దేశాధ్యక్షుడే ఫిర్యాదుచేస్తే నిందితులపై మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కమ్యూనిజాన్ని వ్యాప్తిచేస్తే నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కాగా, భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాసేలా కొన్ని నిబంధలను తెచ్చారని మానవహక్కుల కార్యకర్తలు ఆరోపణలు గుప్పించారు. ఇదీ చదవండి: ఆహార సంక్షోభం దిశగా బ్రిటన్ -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
కర్నూలు: వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్యతో పాటు హత్యకు పాల్పడిన మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ రవీంద్ర తెలిపారు. మహానందిలోని ఈశ్వర్‌నగర్ కాలనీకి చెందిన సంగటి రామును ఈ నెల 4న ముగ్గురు యువకులు కొట్టి, చొక్కాతో గొంతు బిగించి హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. సంగటి రాము భార్య మధురేణుక మహానందికి చెందిన బాబా ఫకృద్దీన్ అలియాస్ బాబుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. కొన్నాళ్లుగా భార్యాభర్తలు విడిపోయారు. అప్పటి నుంచి మధురేణుక నంద్యాలలోని బొమ్మలసత్రంలో నివాసం ఉంటోంది. వివాహేతర సంబంధానికి భర్త రాము అడ్డొస్తున్నాడని చంపించాలని పథకం రూపొందించారు. దీంతో బాబా ఫకృద్ధీన్, గిద్దలూరు మండలం దిగువమెట్టకు చెందిన మండ్ల వేణు, మహానందికి చెందిన ప్రేమ్కుమార్లు కలిసి రామును మద్యం సీసాలతో కొట్టి చొక్కాతో గొంతు బిగించి హతమార్చారు. మృతుడి తల్లి సంగటి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. వ్యవసాయ కళాశాల సమీపంలోని కాశినాయన ఆశ్రమం వద్ద సంచరిస్తున్న ముగ్గురితో పాటు మధురేణుకలను అరెస్ట్ చేశారు. డీఎస్పీ మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో వారిని అరెస్ట్ చేసినట్లు సీఐ రవీంద్ర తెలిపారు. -
వివాహేతర సంబంధం: బైకుపై ఒంటరిగా వస్తుంటే..
సాక్షి,గంట్యాడ(విజయనగరం): ప్రియుడితో కలిసి జీవించేందుకు అడ్డు వస్తున్నాడని తాళికట్టిన భర్తనే కడతేర్చింది ఓ కిరాతకురాలు. పథకం ప్రకారం హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని లక్కిడాం గ్రామానికి చెందిన సింగంపల్లి రాము (43) సోమవారం సాయంత్రం బైక్‌పై విజయనగరం ఆస్పత్రికి వెళ్లి మంగళవారం ఉదయం వరకు ఇంటికి చేరలేదు. ఉదయం 6 గంటల సమయంలో రాము తమ్ముడికి మీ అన్నయ్య కొటారుబిల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు వద్ద చనిపోయి ఉన్నాడని అటుగా వెళ్లిన వారు ఫోన్ చేసి చెప్పారు. దీంతో సంఘటన స్థలానికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చేరుకున్నారు. సంఘటన స్థలంలో మృతదేహాం ఒకచోట, బైక్ మరోచోట పడి ఉన్నాయి. ముందు రోడ్డు ప్రమాదం జరిగి రాము చనిపోయి ఉంటాడని భావించారు. అయితే మృతుని తలపై బలమైన గాయాలు ఉండడంతో మృతుని సోదరుడికి అనుమానం వచ్చి ఇది రోడ్డు ప్రమాదం కాదని, హత్య చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేయగా కోణంలో దర్యాప్తు చేపట్టారు. విజయనగరం నుంచి క్లూస్ టీం వచ్చి సంఘటన స్థలంలో వివరాలు సేకరించింది. వివాహేతర సంబంధమే కారణం మృతుడి రాము భార్యకు వివాహేతర సంబంధం ఉంది. ఇదే విషయంపై వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. భర్తను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని భావించిన రాము భార్య తులసి, ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. విజయనగరం ఆస్పత్రికి రాము వెళ్లిన విషయాన్ని ప్రియుడికి చెప్పింది. ఇద్దరు కలిసి కొఠారుబిల్లి గ్రామానికి వెళ్లే జంక్షన్ వద్ద మాటు వేశారు. విజయనగరంలో పనిముగించుకుని వస్తున్న భర్తను ప్రియుడితో కలిసి తులసి చంపించింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఉంటాడని నమ్మించేందుకు మృతదేహం ఒకచోట, బైక్ మరోచోట పడేసి వెళ్లిపోయారు. పోలీసుల విచారణలో హతురాలు నేరం అంగీకరించింది. హతుడు రాముకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: సేవ చేయాల్సి వస్తుందని.. గొంతునులిమి తండ్రిని హత్య చేసిన కొడుకు -
వివాహేతర సంబంధం అనుమానం.. భార్య ముఖాన్ని నేలకు బాది..
సాక్షి,వాంకిడి(అదిలాబాద్): అనుమానం పెనుభూతమై భర్త భార్యను హత్య చేసిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై దీకొండ రమేశ్ తెలి పిన వివరాలు.. మండలంలోని లక్ష్మీనగర్‌లో కొరగంటి పోశం, కమల (50) దంపతులు గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. భార్య కమల అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో వేధించేవాడు. పోశం తరచూ మద్యం తాగి వచ్చి చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో అతిగా మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. కోపాద్రిక్తుడైన పోశం కమల ముఖాన్ని నేలకు బాదడంతో సృహా తప్పింది. కుమారుడు స్వామి తన మేనమామ శంకర్‌కు సమాచారం అందించగా అత డు వచ్చి చూసేసరికి కమల రక్తపుమడుగులో ఉంది. మృతురాలి తమ్ముడు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
సాక్షి, కర్నూలు: ఏడడుగులు నడిచి నూరేళ్లు కలిసి కాపురం చేస్తానని బాస చేసిన భార్యే భర్తను కడతేర్చింది. వరుసకు కొడుకయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని క్షణికానందం పొందింది. తమకు అడ్డుగా ఉన్న భర్తను ఏడాదిన్నర క్రితమే అంతమొందించింది. ఇన్నాళ్లు తనకు ఏమీ తెలియదన్నట్టూ నాటకం ఆడింది. అయితే పోలీసులు ఎట్టకేలకు ఆమె నాటకానికి తెరదించారు. గురువారం నంద్యాల తాలుకా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ చిదానందరెడ్డి వివరాలు వెల్లడించారు. మహానంది మండలం తమ్మడపల్లె గ్రామానికి చెందిన డక్కా క్రిష్ణయ్య (40), జయలక్ష్మి (37)లకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. క్రిష్ణయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే తన అన్న కుమారుడు డక్కా చింతలయ్యతో జయలక్ష్మి చనువుగా ఉంటూ రాసలీలలు కొనసాగించేది. దీన్ని గమనించిన క్రిష్ణయ్య ఇద్దరిని మందలించాడు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పురాలేదు. పదే పదే మందలిస్తుండటంతో అడ్డుతొలగించుకోవాలని చూసింది. భర్తకు ఈత రాదని ఎక్కడైనా నీళ్లలో తోసి హత్య చేయమని చింతలయ్యకు సలహా ఇచ్చింది. చింతలయ్య నంద్యాలకు చెందిన వెంకట సాయి అలియాస్ కవ్వ, ఆర్ఎస్ గాజులపల్లికి చెందిన శివరాజ్, తన సమీప బంధువు సుధాకర్, తమ్మడపల్లె గ్రామానికి చెందిన ప్రతాప్‌లతో కలిసి హత్యకు ప్రణాళిక రచించాడు. 2020 సెప్టెంబర్ 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు నందిపల్లె గ్రామ శివారులోని పాలేరు వాగు వంతెనపై బైక్‌మీద వెళ్తున్న క్రిష్ణయ్యను చింతలయ్య ఆపాడు. ఇద్దరు కలిసి మాట్లాడుతుండగా మిగతా నిందితులు క్రిష్ణయ్య కాళ్లు, చేతులు పట్టుకొని నీటిలోకి విసిరేశారు. దీంతో అతను నీటిలో మునిగి ఊపిరాడక మృతిచెందాడు. అదే రోజు జయలక్ష్మి తన భర్త కనిపించటం లేదని మహానంది పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రెండు రోజుల తర్వాత నంద్యాల పట్టణ శివారులోని జమ్ములమ్మ గుడి సమీపంలోని పాలేరు వాగులో క్రిష్ణయ్య మృతదేహం లభ్యం కావటంతో తాలుకా పోలీసులు గుర్తించి భార్యకు తెలియజేశారు. క్రిష్ణయ్య మృతి చెందటానికి బలమైన కారణాలు అంతుచిక్కకపోవటంతో భార్య ఫిర్యాదు తీసుకొని విచారణ చేపట్టారు. అయితే జయలక్ష్మి, చింతలయ్య ప్రవర్తన పట్ల అనుమానం వచ్చిన మహానంది పోలీసులు నిఘా పెట్టారు. ఈక్రమంలో 15 రోజుల క్రితం చింతలయ్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. విచారణలో చింతలయ్య హత్య తానే చేయించానని ఒప్పుకున్నాడు. పోలీసులు చింతలయ్యను అదుపులోకి తీసుకున్నారని తెలియగానే జయలక్ష్మి కనిపించకుండా పరారైంది. నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ మురళీమోహన్, ఎస్ఐలు శ్రీనివాసులు, శేషయ్య, గంగయ్యయాదవ్, మల్లికార్జునులను అడిషనల్ ఎస్పీ చిదానందరెడ్డి అభినందించారు. నిందితులను అరెస్ట్ చూపుతున్న అడిషనల్ ఎస్పీ చిదానందరెడ్డి -
వివాహితతో పరిచయం .. చేనులోకి బలవంతంగా తీసుకెళ్లి..
సాక్షి, కామారెడ్డి (నిజామాబాద్): వేర్వేరు సంఘటనల్లో జరిగిన ఇద్దరి మహిళల మిస్సింగ్ కేసులను ఛేదించినట్లు డీఎస్పీ సోమనాథం వెల్లడించారు. పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో బుధవారం ఆయన∙మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లి తాండాకు చెందిన అనిత గత నెల 17న అదృశ్యంకాగా మంగళవారం దేవునిపల్లిలో గల దేవివిహార్ సమీపంలోని కంది చేనులో మృతదేహం లభించింది. అదేవిధంగా కొన్ని రోజుల కిందట అదృశ్యమైన తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన స్వరూప మృతదేహం మాచారెడ్డి మండలం వాడి గ్రామ శివారులోని చెరుకు తోటలో లభ్యమైంది. వివాహేతర సంబంధంతోపాటు డబ్బుల విషయంలో గొడవపడి హత్య చేసినట్లు తెలిపారు. అనితను హత్యచేసిన ప్రకాష్, స్వరూపను హత్య చేసిన ఆమె మరిది రాజులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. అనిత కూలి పని నిమిత్తం రోజు కామారెడ్డికి వచ్చే క్రమంలో లింగంపేట మండలం పర్మళ్ల తండాకు చెందిన ప్రకాష్‌తో పరిచయం ఏర్పడటంతో ఆయనతో కలిసి పనికి వెళ్లేది. ఈ క్రమంలోనే గత నెల 17న ఆమెను సమీపంలోని చేనులోకి బలవంతంగా తీసుకెళ్లి వాంఛ తీర్చుకున్న తర్వాత డబ్బుల విషయమై గొడవపడి ప్రకాష్ గొంతు నులిమి ఆమెను హత్య చేశాడన్నారు. తాడ్వాయికి చెందిన కుంట స్వరూప కూలి పనికోసం కామారెడ్డికి వచ్చి వెళ్లేది. అక్టోబర్ 28న పనికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల ఒకటిన కుళ్లిపోయిన ఆమె మృతదేహాన్ని వాడి శివారు చెరుకుతోటలో వెలుగు చూసింది. ఆమె భర్త మృతి చెందడంతో మరిది అల్లురి రాజు ఆమెను లోబర్చుకొని గత నెల 28న కలుసుకున్నప్పుడు గొడవపడి హత్య చేశా డని వెల్లడించారు. ఈ కేసులను చేధించిన కామారెడ్డి రూరల్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, దేవునిపల్లి ఎస్ఐ రవికుమార్, మాచారెడ్డి ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిలను ఆయన అభినందించారు. చదవండి: భార్యతో గొడవ.. ‘కొడుకా’ అని నచ్చచెప్పేందుకు వెళ్తే.. -
ప్రియుడితోనే.. పిల్లల కిడ్నాప్
సాక్షి, పాలకోడేరు(పశ్చిమగోదావరి): ప్రియుడితో కలిసి జల్సా చేసేందుకు.. తన పిల్లలనే కిడ్నాప్ చేయించిన ఓ వివాహిత బాగోతం బట్టబయలయ్యింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర గ్రామంలో రాజేష్ అలియాస్ రామకృష్ణ అద్దెకు ఉంటూ తాపీ పని చేస్తుంటాడు. అదే వీధిలోని ఓ కుటుంబంతో చనువుగా ఉంటూ ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఈ వ్యవహారం ఆమె అత్తకు తెలిసిపోవడంతో అత్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు హత్యాయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో పరారయ్యాడు. ఘటన అనంతరం ప్రియుడితో వెళ్లి జల్సాగా జీవించాలనే ఆలోచనకు వచ్చిన వివాహిత.. తొమ్మిదో తరగతి చదువుతున్న తన ఇద్దరు కుమారులను మామయ్యతో వెళ్లండని నచ్చచెప్పి పంపించింది. రాజేష్ వారిని గురువారం రాజమండ్రికి తీసుకెళ్లి ఒక లాడ్జిలో మకాం పెట్టాడు. అనంతరం పిల్లల తల్లికి వాట్సాప్ ఫోన్ కాల్ చేసి కిడ్నాప్ డ్రామా ఆడాడు. రూ.15 లక్షలు ఇవ్వాలని, లేదంటే పిల్లల్ని చంపేస్తానని నానమ్మను బెదిరించాడు. దీంతో పిల్లల తండ్రి, నానమ్మ పాలకోడేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ సూచనల మేరకు నర్సాపురం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి, రూరల్ ఇన్చార్జి సీఐ కృష్ణకుమార్, ఎస్ఐ రామచంద్రరావు సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. మహిళను అదుపులోకి తీసుకుని రాజేష్‌కి ఫోన్ చేయించారు. పిల్లలు ఎలా ఉన్నారని, వాట్సాప్‌లో ఫొటో పంపించమని అడిగించారు. దీంతో అతను ఫొటో పంపించగా, సెల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు రాజమండ్రి సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో వారు లాడ్జిలో ఉన్న రాజేష్‌ని శుక్రవారం అదుపులోకి తీసుకుని, పిల్లలను తండ్రికి అప్పగించారు. కిడ్నాప్‌నకు సహకరించిన వివాహితను అదుపులోకి తీసుకున్నారు. 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ అభినందించారు. -
వివాహేతర సంబంధాలు: 45 రోజులు.. 19 హత్యలు
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత వివాదాలు, ఆధిపత్య పోరు, పాత కక్షలు, ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలు... ఇలా కారణం ఏదైనా పర్యవసానం మాత్రం హత్యలే. నగరంలో ఇటీవల కాలంలో తరచూ మర్డర్ కేసులు వెలుగు చూస్తున్నాయి. గడచిన 45 రోజుల కాలంలో 19 హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఒక ఉదంతంలో మాత్రం బెంగళూరులో చంపేసిన చిన్నారిని తల్లి, ప్రియుడు నగరానికి తీసుకువచ్చి వదిలేశారు. మరో ఉదంతం జూలైలో చోటు చేసుకోగా... శుక్రవారం హత్యగా తేలింది. హత్య కేసులకు సంబంధించి ఈ కాలంలో 27 మంది కటకటాల్లోకి చేరారు. వీరిలో దారుణాలకు ఒడిగట్టిన వాళ్లు, వారికి సహకరించిన వాళ్లూ ఉన్నారు. దారుణాలకు కారణాలనేకం.. ఈ హత్యలు కేవలం ప్రత్యర్థులు, శత్రువుల మధ్య మాత్రమే జరగట్లేదు. అనేక కారణాల నేపథ్యంలో సొంత వాళ్లే కత్తి గడుతున్నారు. ప్రధానంగా ప్రేమ వ్యవహారాలను పెద్దలు వద్దనటం, వివాహేతర సంబంధాలకు భర్తలు అడ్డుగా మారడంతో పాటు ఆస్తి వివాదాలు, ఆర్థిక అంశాలు ఈ దారుణాలకు కారణమవుతున్నాయి. ఇటీవలి హత్యల్లో కొన్ని.. ►రూ.2 వేల రుణానికి సంబంధించిన వివాదం ఫరీర్ వాడలో సోను హత్యకు కారణమైంది. సహజీవనం చేస్తున్న డ్యాన్సర్ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో క్యాబ్ డ్రైవర్ అఫ్సర్ ఆమెను అంతం చేశాడు. చుట్టుపక్కల వారితో తనపై భర్త మురళీధర్‌రెడ్డి చెడుగా చెబుతున్నాడంటూ కుమారుడు చెప్పడంతో భర్తతో వాగ్వాదానికి దిగిన మౌనిక అతడిని చంపేసింది. ►మద్యానికి అలవాటుపడిన ఖదీర్ ఆ మత్తు కోసం, మత్తులో మొత్తం ముగ్గురిని బండరాళ్లతో మోది హత్య చేశాడు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంగా మొయినాబాద్‌కు చెందిన జోయాబేగం భర్త ఆదిల్‌ను మరో నలుగురితో కలిసి చంపింది. ఇలాంటి కారణం నేపథ్యంలోనే భర్త ముస్కాన్ పటేల్‌ను భార్య ఫిర్దోష్ బేగం ప్రియుడితో కలిసి హత్య చేసింది. పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేస్తున్న ప్రియురాలు నాగచైతన్యను ప్రియుడు కోటి రెడ్డి బలి తీసుకున్నాడు. తన ప్రేమకు అడ్డు వస్తోందనే కారణంతో చింతల్‌మెట్‌కు చెందిన నందిని తన ప్రియుడు రాంకుమార్‌తో కలిసి తల్లి యాదమ్మను చంపింది. గొడ్డలితో నరికి.. చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. ఇన్స్పెక్టర్ ఆర్.దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. జహనుమా ఫయీంబాగ్కు చెందిన రంజన్ అలీ కుమారుడు మహ్మద్ షోయబ్ అలియాస్ ఆరీఫ్ అలీ (32) సెల్ఫోన్లు విక్రయిస్తుంటాడు. శనివారం రాత్రి షోయబ్ ఇంటి ఎదుట ఫోన్ మాట్లాడుకుంటూ ఉండగా.. ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో షోయబ్ తలపై నరికి పరారయ్యారు. ఆస్తి, కుటుంబ తగాదాల కారణంగానే హత్య జరిగినట్లు ఫలక్‌నుమా పోలీసులు అనుమానిస్తున్నారు. -
పక్కా ప్లాన్.. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను..
సాక్షి, కొందుర్గు(రంగారెడ్డి): వివాహేతర సంబంధం మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపేసింది. మొదట అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు తమదైన శైలిలో విచారించి నిందితులిద్దరిని కటకటాల వెనక్కి పంపించారు. కొందుర్గు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పొదిలి మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన రూతమ్మ, వేణు దంపతులు. రూతమ్మకు గతంలో పొరుగు గ్రామానికి చెందిన శ్రీనుతో వివాహేతర సంబంధం ఉండేది. విషయం తెలుసుకున్న ఆమె భర్త వేణు భార్యాపిల్లలను తీసుకొని కొందుర్గుకు వలస వచ్చాడు. ఓ ఇల్లు అద్దెకు తీసుకొని స్థానికంగా కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న శ్రీనును ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం వేసిన రూతమ్మ తన ప్రియుడితో కలిసి గతనెల 29 రాత్రి వేణు గొంతు నులిమి చంపేసింది. ఈ విషయం బయటకు పొక్కకుండా తన భర్త అనారోగ్యంతో మృతిచెందిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో వేణు గొంతు నులిమి వేసినట్లుగా గాయాలు కనిపించాయి. గమనించిన కుటుంబసభ్యులు ఈనెల 1న కొందుర్గు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాద్‌నగర్ రూరల్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో కేసు విచారణ చేపట్టారు. పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. అనుమానంతో రూతమ్మను అదుపులోకి తీసుకొని విచారించగా తన ప్రియుడు శ్రీను కలిసి వేణును హత్యచేసినట్లుగా నేరం అంగీకరించింది. ఈమేరకు మంగళవారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
షాపులో పనిచేసే కుర్రాడితో చనువు.. మాట వినకపోవడంతో..
బెంగళూరు: భార్య వివాహేతర సంబంధాన్ని మానుకోకపోవడం వల్ల గొంతు కోసి హత్య చేశానని పోలీసులకు లొంగిపోయిన భర్త వాంగ్మూలమిచ్చాడు. వివరాలు.. హోసూరు ఎంజీ రోడ్డుకు చెందిన జ్యోతిష్ (28) బైక్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్నాడు. ఇతనికి బెంగళూరు వద్ద జిగణికి చెందిన వందన(25)తో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి 6 ఏళ్ల కొడుకు ఉన్నారు. వందన 21వ తేదీన భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. ఇటీవల తాను కరోనాకు గురైనప్పుడు షాపులో పనిచేసే సుగిల్ (25) అనే యువకునికి చేరువైందని, తాను గట్టిగా ప్రశ్నించడంతో పుట్టింటికి వెళ్లి అటునుంచి సుగిల్‌తో పరారైందని భర్త చెప్పాడు. 15వ తేదీన ఇంటికి తీసుకొచ్చానని, మళ్లీ గొడవలు జరగడంతో కత్తితో గొంతుకోసి చంపినట్లు తెలిపాడు. భర్తను జైలుకు తరలించారు. అప్పు కట్టమన్నందుకు హత్య దొడ్డబళ్లాపురం: బెంగళూరు ఉత్తర తాలూకా సోలదేనహళ్లి ఎమ్‌ఎస్‌పీపీ కాలనీలో రవికుమార్ (35) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. వివరాలు... హతుడు రవికుమార్ తన స్నేహితుడు మధుసూదన్‌కు ఏడాదిన్నర క్రితం రూ.లక్ష అప్పు ఇచ్చాడు. చెల్లించాలని అడగడంతో మధుసూదన్ సోమవారం రాత్రి ఎమ్‌ఎస్‌పీపీ కాలనీలో వాకింగ్ చేస్తున్న రవికుమార్‌ను మరో నలుగురితో కలిసి కత్తులతో పొడిచి హత్య చేశాడు. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. చదవండి: అలిగి మండపం ఎక్కనన్న వధువు.. కారణం తెలిసి నవ్వుకున్న నెటిజన్స్ -
యువకుడితో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్న భర్తని..
సాక్షి, హైదరాబాద్: అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో భర్తను చంపిన భార్యను, సహకరించిన ప్రియుడిని హబీబ్‌నగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మాన్గార్ బస్తీకి చెందిన ఉప్పాడే రోషన్(25)కు అదే బస్తీకి చెందిన లతకు పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడ, ఒక మగ సంతానం ఉన్నారు. రోషన్ ఓ హోటల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. లతకు స్థానికుడైన కాంబ్లే యువరాజ్ పరిచయం అయ్యారు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో లతకు యువరాజ్ దగ్గరయ్యారు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు తెలినప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. దీంతో రోజూ భార్య భర్తల మధ్య ఘర్షణ జరిగేది. తమ ప్రేమకు అడ్డువస్తున్నాడనే కారణంతో భర్త రోషన్‌ను ఎలాగైనా అంతమొందించాలని భార్య లత నిర్ణయించుకుంది. ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం మద్యం సేవించి ఇంటికి వచ్చిన రోషన్‌ను భార్య లత, ప్రియుడు కాంబ్లే యువరాజ్ కలిసి కత్తితో పొడిచి చంపారు. ఈ కేసులో ఇరువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా తామే హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారు. ఈ మేరకు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
వివాహేతర సంబంధం: నాలుగు కుటుంబాలకు నిలువనీడ లేకుండా చేసింది
సాక్షి,జయపురం: వివాహితతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే ఆరోపణపై ఓ యువకుని కుటుంబంతో పాటు వారి బంధువులపై గ్రామస్తులు దాడి చేశారు. అక్కడితో ఆగకుండా వారి ఇళ్లు, ఆస్తులు ధ్వంసం చేసి వారిని గ్రామం నుంచి బహిష్కరించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ అమానవీయ సంఘటన నవరంగపూర్ జిల్లా ఝోరిగాం సమితి అకడహిల్ గ్రామంలో చోటుచేసుకుంది. నాలుగు కుటుంబాలు గ్రామ బహిష్కరణ పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అకడహిల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామంలోని వేరే కులానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో మూడు నెలల కిందట మహిళ కుటుంబ సభ్యులు ఆ యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తాళ్లతో కట్టేసి దండించారు. అనంతరం ఓ ఇంట్లో బంధించారు. సమాచారం అందుకున్న ఉమ్మరకోట్ పోలీసులు గ్రామంలో విచారణ చేసేందుకు రాగా, వివాహితపై ఆ యువకుడు అత్యాచారం చేశాడని మహిళ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మహిళ బంధువులు అక్కడితో ఆగకుండా..యువకుని కుటుంబంతో పాటు వారి కులానికి చెందిన మరో మూడు కుటుంబాలపై దాడులకు పాల్పడ్డారు. ఇళ్లు ధ్వంసం చేశారు. వారందరినీ గ్రామం నుంచి తరిమేశారు. ప్రాణభయంతో వారంతా గ్రామం విడిచిపెట్టి సమీపంలోని బాగడియా గ్రామానికి వెళ్లి తలదాచుకుంటున్నారు. ఈ సంఘటనపై బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తి మాట్లాడుతూ..యువకుడు తప్పు చేసి ఉంటే అతిడిని శిక్షించాలి. కానీ ఆ కులస్తులందరినీ హింసించి గ్రామం నుంచి బహిష్కరించడం, వారి ఇళ్లు ధ్వంసం చేయడం, ఆస్తులు దోచుకోవడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సంఘటనపై ఉమ్మరకోట్ పోలీసు అధికారి నరేష్ కుమార్ ప్రధాన్‌ను సంప్రదించగా..యువకుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. గ్రామస్తులతో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
‘రాసలీలల’ కెమెరా తొలగింపు.. విచారణకు ఆదేశం
బ్రిటన్ మాజీ మంత్రి రాసలీలల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సీసీ కెమెరాను తొలగించిన ప్రభుత్వం.. అది అధికారిక కెమెరా కాదని ప్రకటించడం విశేషం. వ్యక్తిగత కార్యదర్శితో మాట్ హాంకాక్ ముద్దుల రసక్రీడ కొనసాగిస్తూ సీసీ కెమెరా కంటికి చిక్కడం.. ఆ ఫొటోలు టాబ్లాయిడ్లో ప్రముఖంగా ప్రచురితం కావడంతో ఆరోగ్య మంత్రి(కార్యదర్శి కూడా)గా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఇందుకు కారణమైన సీసీ కెమెరా అక్కడికి ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు కొత్త ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ వెల్లడించారు. లండన్: బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి కార్యాలయంలో దొరికిన సీసీ టీవీ కెమెరా.. రెగ్యులర్ ఆఫీస్ కెమెరా కాదని కొత్త ఆరోగ్య మంత్రి(కార్యదర్శి) సాజిద్ జావిద్ వెల్లడించాడు. అంతేకాదు ఈ ఘటన తర్వాత మిగతా ఎంపీల ఆఫీసుల్లోనూ సోదాలు నిర్వహించామని, ఇలాంటి కెమెరాలేవీ బయటపడలేదని తెలిపాడు. కాబట్టి, ఉద్దేశపూర్వకంగా మాట్ హాంకాక్ ఆఫీస్‌లో కెమెరాలు ఉంచినట్లు అనుమానం వ్యక్తం చేశాడాయన. ఇక ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తామని వెల్లడించిన ఆయన.. హాంకాక్ యవ్వారంపై మాట్లాడేందుకు మాత్రం నిరాకరించాడు. బోరిస్‌పై ప్రశ్నల వర్షం ఇక హాంకాక్ పట్ల ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రదర్శించిన ఉదాసీనతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి గురువారం ఈ ఫొటోలు పేపర్ ద్వారా బయటికి రాగా.. శుక్రవారం ఘటనకు సంబంధించి హాంకాక్ క్షమాపణలు చెప్పాడు. అయితే అతనిపై వేటు వేయకుండా కేవలం ఆ సారీతో సరిపెట్టుకుని.. ‘మ్యాటర్ క్లోజ్డ్’ అని ప్రకటించాడు బోరిస్. ఇది మరింత విమర్శలకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే హాంకాక్ బలవంతపు రాజీనామా, బోరిస్ అన్యమనస్కంగానే దానిని ఆమోదించడం జరిగిపోయాయి. అయితే ఈ విమర్శలపై ప్రధాని బోరిస్ తాజాగా స్పందించాడు. మహమ్మారి విజృంభణ టైంలో ఆరోగ్య మంత్రి మార్పును అంత త్వరగా చేయడం సబబు కాదనే ఉద్దేశంతో.. కాస్త ఆలస్యం జరిగినట్లు బోరిస్ వివరణ ఇచ్చాడు. ఈ వ్యవహారంలో మరిన్ని అనుమానాలు ఉన్నాయి. హాంకాక్ మెయిల్స్ పాలసీని బబ్రేక్ చేశాడని, నిధుల అవకతవకలకు పాల్పడ్డాడని, వ్యక్తిగత ఉద్దేశాలకు కార్యాలయాన్ని వాడుకున్నాడని.. ఇలా ఆరోపణలెన్నో ఉన్నాయి. ఈ తరుణంలో వీటిపై దర్యాప్తునకు ఆదేశించడంపై బోరిస్ మౌనం వహించడం ఇప్పుడు బ్రిటన్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎలా బయటికొచ్చింది ఒక ఎంపీ ఆఫీస్‌లో నిషేధిత జోన్లో సీసీ కెమెరా బిగించడం ఒక ఎత్తు అయితే.. ఆ వీడియో ఫుటేజీ బయటకు రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందన్న విషయాన్ని తేల్చే పనిలో పడ్డాయి బ్రిటన్ నిఘా వర్గాలు. ఇక ఈ వీడియో/ఫొటోలో ఉన్న హాంకాక్ మాజీ కార్యదర్శి గినా కొలాడాంగెలో మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్‌లో పని చేసిన గినా.. చాలా ఏళ్లుగా మ్యాట్ హాంకాక్తో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆధారాలున్నాయి. అంతేకాదు ఆ పరిచయాలతోనే ఆమె తన పనుల్ని చక్కబెట్టుకున్నట్లు, కుటుంబ సభ్యుల్ని ఉన్నత స్థానాల్లో నియమించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ లాక్డౌన్ ఆంక్షలను వ్యతిరేకించిన ఓ డీహెచ్ఎస్సీ ఉద్యోగి.. బ్లాక్మెయిల్ ఉద్దేశంతో ఈ పని చేసి ఉండటానే అనుమానాలు ఉన్నాయి. దీంతో ఈ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది కూడా. చదవండి: పాత ఎఫైర్‌ని పీఏగా.. ఆపై ఆఫీస్‌లోనే కసితీరా ముద్దులు -
సెక్యూరిటీ గార్డుతో వివాహేతర సంబంధం, చీరతో గొంతు బిగించి
టీ.నగర్: చీరతో గొంతు బిగించి ప్రియురాలిని హతమార్చిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై రెడ్‌హిల్స్, గాంధీనగర్‌కు చెందిన నారాయణన్ (40) కట్టడ కార్మికుడు. భార్య మోహన (36). ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన సెక్యూరిటీ గార్డు దాస్‌తో మోహనకు వివాహేతర సంబంధం ఏర్పడింది. శనివారం సాయంత్రం మోహన, దాస్ మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన దాస్ ఇంటి తలుపులు మూసి వేగంగా బయలుదేరాడు. అతను ఆక్రోశంతో వెళ్లడం చూసిన ఇరుగుపొరుగువారు అనుమానంతో చోళవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు తెరిచి లోనికి వెళ్లగా చీరతో గొంతు బిగించిన స్థితిలో మోహన హత్యకు గురైంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న దాస్ కోసం గాలిస్తున్నారు. చదవండి: ఇంటి నిర్మాణంపై వివాదం: పెళ్లి రోజే విషాదం -
పెళ్లైన మహిళతో వివాహేతర సంబంధం.. ఆపై
సాక్షి, గార్ల(మహబూబాబాద్) : వివాహేతర సంబంధం నెపంతో ఓ వ్యక్తిని పట్టపగలే హత్య చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్లలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గార్లలోని పుట్టకోట బజారుకు చెందిన గొడుగు ధనమ్మ భర్త ఎనిమిది సంవత్సరాల క్రితం చనిపోగా కుమారుడు ఉన్నాడు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం తిమ్మినేనిపాలెం గ్రామానికి చెందిన రాయల వెంకటేశ్వర్లు(55) కారేపల్లిలోని కవిత ఇంజనీరింగ్ కళాశాల బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రోజూ గార్ల నుంచి విద్యార్థులను కళాశాలకు తీసుకెళ్లి.. తిరిగి సాయంత్రం తీసుకువచ్చి గార్లలోనే బస చేసేవాడు. ఈ క్రమంలో ధనమ్మతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న ధనమ్మ తమ్ముడు చాట్ల కోటేష్, ఆమె అక్క కొడుకు గంగరబోయిన సంపత్ కలిసి పథకం ప్రకారం మధ్యాహ్నం ధనమ్మ ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో ధనమ్మతో పాటు వెంకటేశ్వర్లు ఉండడంతో కోపోద్రిక్తులైన కోటేష్, సంపత్ ఫ్యాన్ స్టాండ్ రాడ్‌తో వెంకటేశ్వర్లును చితకబాదారు. దీంతో తలకు, చాతిపై తీవ్రగాయాలై వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి చేస్తుండగా అడ్డుకోబోయిన ధనమ్మకు సైతం గాయాలయ్యాయి. అనంతరం నిందితులిద్దరూ పరారయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై బాదావత్ రవి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహబూబా బాద్ నుంచి క్లూస్ టీంను రప్పించి ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు. -
వివాహేతర సంబంధం: భార్య నగలన్నీ ఆమెకు
సాక్షి, ఖమ్మం: భార్య ఉండగానే వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ భర్త. అంతటితో ఆగకుండా భార్య బంగారు నగలన్ని సదరు మహిళకు ఇవ్వడం మొదలుపెట్టాడు. భర్త ప్రవర్తనపై అనుమానం కలిగిన భార్య అతను ఎక్కడి వెళ్లుతున్నాడే తెలుసుకునేందుకు ప్రయత్నించగా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు బయటపడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. కొత్తగూడెం పట్టణంలోని మేదర బస్తీలో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రాజుకు అదే ఏరియాకు చెందిన కృష్ణ వేణికి 13ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏడాది క్రితం గాజులరాజం బస్తీకి చెందిన మరో మహిళతో రాజు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్య బంగారు నగలను సైతం సదరు మహిళకు ఇచ్చాడు. అయితే భార్యకు మాత్రం అవసరాల నిమిత్తం డబ్బులు కావల్సి ఉండి బ్యాంక్ లో బంగారం పెట్టి డబ్బులు తీసుకోవాలని నమ్మించాడు. దీంతో భార్యకు కూడ అనుమానం రాలేదు. అయితే ఇటివలే భార్త కదలికలపై అనుమానం రావడంతో పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లుతున్నానని చెప్పిన భర్తను ఆమె అనుసరించింది. కోద్ది దూరంలో ఉన్న కాలనీకి చెందిన ఓ మహిళ ఇంట్లోకి వెళ్లడాన్ని భార్య కృష్ణవేణి గమనించింది. భార్యకు రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోవడంతో కృష్ణవేణి బంధువులు ఇద్దరిని చితకబాదారు. ఇంట్లో గోడవలు జరిగాయని, తన భార్యను విడిపెడుతున్నాని చెప్పి తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సదరు మహిళ చెప్పింది. సమాచారం అందుకున్న పోలిసులు రంగంలోకి దిగి భర్తను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను పోలిస్ స్టేషస్ తీసుకువెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: అయ్యో తల్లి.. నీకెంతటి కష్టం వచ్చింది -
వివాహేతర సంబంధం: భర్త దారుణ హత్య
సాక్షి, పంజగుట్ట: ఓ మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే చంపేసింది. సోమవారం పంజగుట్ట ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. బిహార్‌కు చెందిన లక్ష్మణ్ ఝా, ఖుష్బూ దంపతులు మక్తా, రాజ్‌నగర్‌లో నివాసముంటున్నారు. రాత్రి వేళ సెక్యూరిటీ గార్డుగా, పగలు జ్యూస్‌షాపు నడుపుతూ లక్ష్మణ్ జీవనం సాగిస్తున్నాడు. దీంతో న్యూరాలజీ సమస్య వచ్చింది. ఇతని జ్యూస్ సెంటర్ వద్ద లక్ష్మణ్ దూరపు బంధువు లాల్‌బాబు పనిచేస్తుంటాడు. లక్ష్మణ్‌కు మధ్యాహ్నం టిఫిన్ ఇచ్చేందుకు ఖుష్బుదేవి వస్తుండేది. ఈ సమయంలో వారి మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. లాక్డౌన్ అనంతరం లాల్‌బాబు మరోచోట పనిచేయడం ప్రారంభించాడు. అయినా వీరి మధ్య బంధం కొనసాగింది. దీంతో లక్ష్మణ్‌ను అడ్డుతొలగించుకోవాలని భావించారు. ఈ నెల 14న రాత్రి లక్ష్మణ్ పడుకున్నాక లాల్‌బాబు ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి లక్ష్మణ్ చేతులు కట్టేశారు. ఖుష్బుదేవి లక్ష్మణ్ ఛాతీపై కూర్చుని చున్నీ మెడకు బిగించి ఇద్దరూ కలిసి గట్టిగా నొక్కి చంపేశారు. ఉదయం లక్ష్మణ్ సోదరుడికి ఖుష్చుదేవి ఫోన్ చేసి నిద్రలోనే చనిపోయాడని చెప్పింది. మెడపై గాట్లు చూసి అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీసులు విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. -
వివాహేతర సంబంధం: మహిళ మృతి
సాక్షి, కాకుమాను: వివాహతేర సంబంధం నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఎస్.సుందర్ రాజన్ తెలిపిన వివరాల మేరకు... జిల్లాలోని యడ్లపాడు గ్రామానికి చెందిన ఉప్పరెట్ల సునీత (28) అనే మహిళకు కొంత కాలం క్రితం కానీషా అనే వ్యక్తితో వివాహమైంది. యడ్లపాడుకే చెందిన వేణుగోపాల్ అనే వ్యక్తితో సునీతకు వివాహేతర బంధం ఏర్పడింది. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో వారి బంధం కొనసాగించేందుకు వీలు లేకపోవటంతో ఇద్దరు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. కాకుమాను శివారులోకి వెళ్లి ఇద్దరూ పురుగుల మందు తాగారు. ఈ విషయాన్ని వేణుగోపాల్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికి సునీత మృతి చెందగా వేణుగోపాల్ అపస్మారకస్థితిలోకి వెళ్లినట్లు తెలిపారు. సునీతకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సునీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు మార్చురీకి తరలించారు. వేణుగోపాల్‌ను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చస్తున్నారు. తాడేపల్లిరూరల్: తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి గ్రామంలో మరదలిపై బావ దాడి చేయడంతో, మరదలు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. జరిగిన ఈ ఘటనపై తాడేపల్లి ఎస్సై శ్రీనివాసరావు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం... ఆదిశేషు అనే వ్యక్తి పెన్షన్ డబ్బులు విషయంలో పెద్దకొడుకు శివశంకర్ తనకు కావాలని అడుగుతుండగా, తండ్రి మాత్రం చిన్న కొడుక్కు ఇస్తానని చెప్పాడు. దీంతో కోపం పెంచుకున్న శివశంకర్ ఇదంతా మరదలే చేస్తుందని భావించి జొన్నా గీతాసురేఖపై అసభ్యంగా మాట్లాడుతూ దాడికి పాల్పడ్డాడు. మనస్తాపం చెందిన గీతా సురేఖ ఇంట్లో ఉన్న గ్లైసిల్ మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అది గమనించిన మామ బాధితురాలిని ఆసుపత్రికి తరలించాడు. జరిగిన ఈ ఘటనపై గీతాసురేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. -
శ్రీకాంత్‌రెడ్డి హత్య: వివాహేతర సంబంధమే కారణం
సాక్షి, హైదరాబాద్: అల్వాల్ శ్రీకాంత్‌రెడ్డి హత్య కేసును రాచకొండ పోలీసులు చేధించి పలు కీలక విషయాలను వెల్లడించారు. అతని హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు స్పష్టం చేశారు. శ్రీకాంత్‌రెడ్డిని కిడ్నాప్ చేసి జవహర్‌నగర్‌ని ఒక ఇంట్లో బంధించి వారం రోజులు చిత్ర హింసలకు గురిచేసి దారుణంగా నిందితుడు కనకరాజు హత్య చేసినట్లు తెలిపారు. ఈ దారుణ హత్య ఘటన ఐదు రోజుల క్రితం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు హస్మత్‌పేట్‌లోని శ్మాశాన వాటికలో శ్రీకాంత్‌రెడ్డిని పూడ్చి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో నిందితుడు కనకరాజు హత్యకు సంబంధించిన విషయాన్ని తన స్నేహాతులకు చేప్పడంతో పోలీసులకు తెలిసింది. దీంతో కనకరాజుతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. వివరాలు.. హస్మత్‌పేట్‌లో నివసించే కనకరాజు(45) రియల్ ఎస్టేట్ వ్యాపారితో పాటుగా రాజకీయ నాయకుడిగా కూడా చెలామణి అవుతున్నాడు. స్థానికంగా పంచాయతీలు కూడా చేస్తాడు. ఈ క్రమంలో 15 సంవత్సరాల క్రితం ఓ మహిళ కుటుంబంలో గొడవలు రావడంతో ఆమెకు విడాకులు వచ్చేలా చేశాడు. అనంతరం ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అప్పటినుంచీ ఈ అక్రమ వ్యవహారం సాగుతోంది. అల్వాల్‌లోని మచ్చబొల్లారం చంద్రానగర్‌లో ఆమె నివాసముంటోంది. ఆ ప్రాంతంలో కుత్బుల్లాపుర్‌కు చెందిన శ్రీకాంత్‌రెడ్డి(36) అనే ఆటో డ్రైవర్ నివాసం ఉంటున్నాడు. ఎదురెదురుగా ఇల్లు కావడంతో శ్రీకాంత్‌రెడ్డికి మహిళతో పరిచయమై అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. తరువాత ఈ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారు ఎక్కడున్నారో కనుక్కొని తిరిగి పిలిపించి నచ్చెప్పాడు కనకరాజు. వారు వినిపించుకోకపోవడంతో 40 రోజుల క్రితం శ్రీకాంత్‌రెడ్డిని జవహర్‌నగర్‌లోని ఓ ఇంటిలో బందించాడు. కనకరాజు అతని స్నేహితులు మరో ముగ్గురు బాధితుడిని చిత్ర హింసలకు గురి చేశారు. ఈ నెల 6న తాడును గొంతుకు బిగించి శ్రీకాంత్‌రెడ్డిని హతమార్చారు. శవాన్ని హస్మత్‌పేట్‌లోని శ్మాశాన వాటికకు తీసుకువచ్చి గుర్తుతెలియని శవంగా చెప్పి పూడ్చి వేశారు. మృతుడి సోదరుడు అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
వివాహేతర సంబంధం.. ట్రాక్టర్‌తో తొక్కించి
ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న ఆరోపణలతో అత్తింటి వారు ఓ మహిళను, ఆమె ప్రియుడిని హతమార్చారు. ట్రాక్టర్ చక్రాల కింద తొక్కించి అత్యంత పాశవికంగా హత్యచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు శుక్రవారం వెల్లడించారు. వివరాలు.. జల్నా జిల్లాకు చెందిన మరియా అనే మహిళ(32)కు చపల్‌గావ్‌కు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. పదేళ్ల క్రితమే భర్త మరణించడంతో అప్పటి నుంచి అత్తింట్లోనే ఉంటూ జీవితం గడుపుతోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వివాహితుడైన హర్బక్ భగవత్(27)తో మరియాకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న ఆమె అత్తింటి వారు ఇద్దరిని మందలించారు. ఇలాంటి పనులు మానుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయినప్పటికీ భగవత్, మరియా వైఖరిలో ఎలాంటి మార్పురాకపోగా, మార్చి 30న ఇద్దరూ కలిసి గుజరాత్‌కు పారిపోయారు. దీంతో మరియా కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 22న వారి జాడ కనుక్కొని పోలీసులు, మహారాష్ట్రకు తీసుకువచ్చారు.(చదవండి: షాకింగ్: రోడ్డుపై దారుణ హత్య.. ఆపై) ఇక అప్పటి నుంచి వీరిద్దరు తమ గ్రామంలోనే సహజీవనం మొదలుపెట్టారు. దీంతో కోపోద్రిక్తులైన మరియా మామ బాత్వెల్ సంపత్ లాల్జరే, అతడి కొడుకు వికాస్ లాల్జరే ఎలాగైనా పగ తీర్చుకోవాలని భావించారు. అక్టోబరు 28న మరియా, భగవత్ మోటార్ సైకిల్‌పై పక్క ఊరికి వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్‌ను వాళ్ల మీదకు ఎక్కించగా.. టైర్ల కింద పడి తీవ్రగాయాలపాలయ్యారు. ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపే మృతి చెందారు. ఈ ఘటనపై భగవత్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తను, మరియాను వికాస్, సంపత్ కలిసి ఉద్దేశపూర్వకంగానే హత్యచేశారని ఆరోపించింది. ఈ క్రమంలో నిందితులను అరెస్టు చేసి, హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: తమ్ముడి ప్రేమ.. అల్లుడిని హత్యచేసిన అత్త) -
కానిస్టేబుల్ రాసలీలలు
-
ప్రేమ చెరిగి.. మనసు విరిగి..
విచ్చలవిడి మనస్తత్వం.. జల్సాలకు మరిగిన స్వభావం.. డబ్బుపై మితిమీరిన వ్యామోహం.. కట్టుకున్న వాడినే బలితీసుకుంది. కన్నబిడ్డ ఉసురు తీసేసింది. ఓ వివాహిత విశృంఖల జీవితానికి అలవాటు పడింది. భర్త కళ్లుగప్పి చాటుమాటు వ్యవహారాలు నడిపింది. గుట్టు రట్టయినా పట్టించుకోలేదు. పెనిమిటి చెప్పిన మాటలు తలకెక్కించుకోలేదు. చివరకు కడుపున పుట్టిన చిన్నారి వేధింపులకు గురవుతున్నా చలించలేదు. పచ్చటికాపురంలో నిప్పులు పోసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నోడు ప్రాణాలు తీసుకునే దాకా తీసుకెళ్లింది. సాక్షి, చిత్తూరు: ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యే చాటుమాటు వ్యవహారం నడుపుతుండడం.. ఆమె కోసం వచ్చేవాళ్లు ఇంట్లో చిన్న పాప పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండడాన్ని తట్టుకోలేకపోయాడో భర్త. చెప్పుకుంటే పరువుపోతుందని కూతుర్ని ఉరేసి చంపి, ఆపై తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు నగరంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి, సీఐ యుగంధర్ వివరాలను వెల్లడించారు. చిత్తూరు ప్రశాంత్‌నగర్‌కు చెందిన గణేష్ (31) ఐదేళ్ల క్రితం చెన్నైలోని కొరియర్లో పనిచేసేవాడు. ఫేస్బుక్ ద్వారా చెన్నైలోని సుధాకర్, రాజ్యలక్ష్మి రెండో కుమార్తె దివ్య (26)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ 2014లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఏడాదికి వారికి ఓ పాప పుట్టింది. పెళ్లయిన మూడేళ్లపాటు గణేష్ చెన్నైలోని అత్తమామ ఇంట్లోనే ఉంటూ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. ఈ క్రమంలో దివ్య చెన్నైకి చెందిన ధన, ప్రిన్స్ అనే వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఓసారి డబ్బుకోసం ధన అనే వ్యక్తిని తన తల్లి ఇంటికే దొంగతనానికి పంపింది. దొంగతనం చేస్తుండగా దొరికిపోయిన ధన.. రాజ్యలక్ష్మిని గొంతునులిమి చంపబోయాడు. వెంటనే తనచేయి కోసుకున్న దివ్య.. ధనను తప్పించింది. విషయం అందరికీ తెలియడంతో భార్యను తీసుకొచ్చి చిత్తూరులో కాపురం పెట్టాడు గణేష్. కానీ ఇక్కడకు వచ్చాక బెంగళూరుకు చెందిన మరో ఇద్దరితో సంబంధం పెట్టుకుంది. దివ్యకోసం ఇంటికి వచ్చేవాళ్లు.. నాలుగన్నరేళ్ల పాప కార్తీక పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారని గణేష్ గ్రహించాడు. దీనిపై గట్టిగా నిలదీయడంతో అతనిపై వరకట్న వేధింపుల కింద కేసు పెట్టింది. విషయాన్ని దివ్య తల్లి, అక్కకు చెప్పడంతో వాళ్లు కూడా గణేష్‌కు మద్దతుగా నిలిచి కార్తీకను అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఇంతలో గురువారం సాయంత్రం తన ద్విచక్రవాహనంలో కార్తీకను తీసుకుని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఓ లాడ్జీలో గదిని అద్దెకు తీసుకున్నాడు. తన భార్యకు ఉన్న అక్రమసంబంధాలు, తనపై పెట్టిన తప్పుడు కేసు విచారణలో మనుషుల్ని పెట్టి బెదిరించడం, తన కూతురిపట్ల దివ్య కోసం వచ్చేవాళ్లు ప్రవర్తించిన తీరు మొత్తాన్ని ఓ సెల్ఫీ వీడియోగా తీసుకున్నాడు. తాను, తన కుమార్తె కార్తీక ఇద్దరూ చనిపోతున్నామని వీడియోలో పేర్కొంటూ స్నేహితులకు పంపాడు. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో వీడియోను చూసిన స్నేహితులు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ యుగంధర్ ఆధ్వర్యంలో పోలీసులు రైల్వే స్టేషన్ సమీపంలోని లాడ్జీలో గణేష్ పేరిట ఉన్న గదిని గుర్తించి రాత్రి 12.30 గంటల ప్రాంతంలో తలుపులు పగులగొట్టారు. అప్పటికే ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతున్న గణేష్ మృతదేహాన్ని గుర్తించారు. పాపకోసం వెతకగా.. బాత్రూమ్లోని కిటీకీ అద్దాలు తీసేసి.. దానికి ఓ తాడుకట్టి పాప గొంతుకు బిగించి ఉంది. మృతదేహం వేలాడుతుండడాన్ని చూసిన పోలీసులు సైతం భావోద్వేగానికి గురయ్యారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గణేష్ భార్య దివ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన భర్త సుధాకర్ సైతం నాలుగేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడని, దీనికి కూడా దివ్యే కారణమంటూ ఆమె తల్లి పోలీసులకు తెలిపారు. దివ్య విచ్చలవిడితనం, జల్సాలు, డబ్బుపై వ్యామోహమే గణేష్, కార్తీకను బలిగొందన్నారు. -
అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన భార్యను..
సాక్షి, సదాశివనగర్(ఎల్లారెడ్డి): మరో మహిళతో అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావు అని అడిగిన భార్యను ఓ భర్త కిరాతకంగా కొట్టి చంపిన సంఘటన సదాశివనగర్ మండలంలోని సాజ్యనాయక్ తండాలో శుక్రవారం తెల్లవాజామున వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తండాకు చెందిన శివరాం మొదటి భార్యను ఒప్పించి 20 ఏళ్ల క్రితం రెండో నాందేడ్ జిల్లా ఉమ్రిలోని ఉండతండాకు మేనక(40)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. మొదటి భార్య లింమ్డిబాయికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరి భార్యలు వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. అయితే రెండో భార్య మేనకకు శివరాంకు తరచు గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గురువారం రాత్రి మేనక, శివరాంను మరో మహిళతో అక్రమ సంబంధం విషయమై ప్రశ్నించింది. దీంతో ఆమెను శివరాం తీవ్రంగా కొట్టాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మేనకను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు శివరాంపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకట్, ఎస్సై నరేశ్ తెలిపారు. మృతదేహంతో నిరసన మేనకను చంపిన శివరాంను కఠినంగా శిక్షించా లని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగా రు. నాందేడ్ నుంచి మృతురాలి కుటుంబీకులు వచ్చే వరకు మృతదేహాన్ని తరలించలేదు. -
ఇద్దరిని బలిగొన్న వివాహేతర సంబంధం
యాలాల: తనను దూరం చేస్తోందని భావించిన ఓ వ్యక్తి ఓ వివాహితపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఆపై అతడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో వివాహిత, ప్రియుడు మృతిచెందారు. ఘటన వికారాబాద్ జిల్లా యాలాలలోని అగ్గనూరులో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మక్త హన్మప్ప, చంద్రమ్మ మూడో కుమార్తె మక్త అంజిలమ్మ (35)కు పదేళ్ల కిందట వెంకటయ్యతో వివాహమైంది. అయితే అంజిలమ్మ భర్తను వదిలేసి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఈ క్రమంలో చెన్‌గేస్‌పూర్‌కు చెందిన నర్సింహులు (36)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఇటీవల అంజిలమ్మ అతడిని దూరం చేస్తూ తన వద్దకు రావొద్దని చెప్పడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెను అంతమొందించాలనుకున్న అతడు గురువారం అర్ధరాత్రి పెట్రోల్ బాటిల్‌తో అంజిలమ్మ ఇంటికి వచ్చాడు. నిద్రిస్తున్న అంజిలమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. కుమార్తెను కాపాడేందుకు యత్నించిన తల్లిదం డ్రులకు∙గాయాలయ్యాయి. వారిని తాండూరు లోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నలుగురిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అంజిలమ్మ, నర్సింహులు మృతి చెందారు. నర్సింహులుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంజిలమ్మకు సంతానం లేరు. -
ఆమె-ఆయన.. మధ్యలో ఇంకో ఆయన!
భార్యా భర్తల బంధం.. నమ్మకం, విశ్వాసం అనే పునాదులపై ఆధారపడి కొనసాగుతుంది. ఆ పరస్పర నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరికీ ఉంటుంది. ఇద్దరిలో ఎవరు ఎవర్ని మోసం చేసినా.. సంసారం చెదిరిపోతుంది. ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలతో అసలు బంధాలను దూరం చేసుకుంటున్న జంటల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఫ్యామిలీ కోర్టులకు వచ్చే మెజారిటీ కేసుల వెనుక వివాహేతర సంబంధాలే కారణాలుగా ఉంటున్నాయి. అలాంటి ఓ ఘటన దిల్ సుఖ్ నగర్లో వెలుగు చూసింది. భార్య చేస్తున్న మోసాన్ని బయటపెట్టేందుకు భర్త ఆస్ట్రేలియా నుంచి వచ్చి అర్థరాత్రి సమయంలో పోలీసులతో సహా భార్య ముందు ఎంట్రీ ఇచ్చాడు. అలా ఎంట్రీ ఇచ్చిన అతనికి మరో షాకింగ్ విషయం కూడా తెలిసింది. తేదీ- నవంబర్ 22 సమయం- అర్థరాత్రి 12 గంటల తర్వాత స్థలం- దిల్ సుఖ్ నగర్‌లోని వాసవీ కాలనీ పోలీసులు ఓ అపార్ట్మెంట్లోకి దూసుకెళ్లారు ఓ ఫ్లాట్ ముందు నిలబడి తలుపులు కొట్టారు చాలాసేపు తలుపులు తెరుచుకోలేదు చివరికి ఓ మహిళ తలుపు తీసింది.. పోలీసుల్ని చూసి ఎందుకొచ్చారు అన్నట్టుగా చూసింది.. ఆ ఖాకీల వెనుక నిలబడి తననే చూస్తున్న వ్యక్తి ఎవరా అని చూసి నిర్ఘాంతపోయింది ఆ వ్యక్తి ఎవరో కాదు ఆమె భర్త భర్తను చూసి ఆ భార్య ఎందుకు షాక్ తినాలి..? ఎందుకంటే అతను హైదరాబాద్‌లో లేడు ఆస్ట్రేలియాలో ఉంటాడు అక్కడి నుంచి ఎప్పుడొచ్చాడో ఆమెకు తెలియదు.. ఇంటికి ఎందుకు రాలేదో కూడా తెలియదు నేరుగా పోలీసులతో వచ్చాక మాత్రమే ఆమెకు అతను ముందుగా ఇంటికి ఎందుకు రాలేదన్న విషయం అర్థమైంది. తన విషయం భర్తకు పూర్తిగా తెలిసిపోయిన సంగతి కూడా ఆ క్షణంలోనే గ్రహింపులోకి వచ్చింది ఆ తర్వాత ఆమె అదరలేదు. బెదరలేదు. తన గుమ్మం ముందు నిలబడ్డ పోలీసులు ఇంట్లోకి వెళ్తోంటే అలా చూస్తూ నిలబడిపోయింది. ఇక్కడ కాస్త ఫ్లాష్ బ్యాక్ కథ చెప్పుకోవాలి. పదేళ్ల క్రితం పెళ్లి.. హాయిగా కాపురం పోలీసులతోపాటు వచ్చిన వ్యక్తి పేరు సంతోష్ రెడ్డి. సంతోష్ రెడ్డికి పదేళ్ల క్రితం సూర్యాపేటకు చెందిన సమతతో పెళ్లైంది. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లే. కాపురం కొన్నేళ్లపాటు హాయిగానే సాగింది. ఇంకా చెప్పాలంటే ఆమె.. పోలీసులతోపాటు తన భర్తను చూసిన ముందు క్షణందాకా కూడా బయటి ప్రపంచం దృష్టిలో వీళ్లది అన్యోన్య దాంపత్యమే. సంతోష్ రెడ్డి-సమత దంపతులకు ఇద్దరు చూడముచ్చటైన పిల్లలున్నారు. కొన్నేళ్ల క్రితం పైచదువుల కోసం సంతోష్‌రెడ్డి ఆస్ట్రేలియా వెళ్లారు. భార్యాపిల్లలకు తోడుగా తన తల్లిని ఇంట్లోనే ఉంచి.. వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి వెళ్లారు. ఏడాదికి ఓసారి వచ్చి నెల రోజులపాటు కుటుంబంతో గడిపి తిరిగి వెళ్లేవారు. అయితే, భార్యను కూడా తనతోపాటు ఓసారి ఆస్ట్రేలియా తీసుకెళ్లాలని సంతోష్ చాలా సార్లు అనుకున్నారు. ఇదే విషయం భార్యకు పదే పదే చెప్పారు కూడా.. నువ్వూ ఆస్ట్రేలియా రావచ్చు కదా.. కొన్నాళ్ల పాటు మొత్తం తిరిగి వద్దాం అంటూ ఎన్నో సార్లు చెప్పారు. ఎందుకో ఆమె ఒప్పుకునేది కాదు. పాస్ట్ పోర్టు సమస్యలున్నాయని చెప్పి తప్పించుకునేది. అప్పుడు కూడా సంతోష్ తన భార్యకు ఇల్లు వదిలి బయటికి రావడం ఇష్టం ఉండదనీ, తనను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టంలేకనే అలా చెప్తోందనీ అనుకున్నాడు. ఈ క్రమంలోనే తరచూ అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చేవి. మీ అమ్మను ఎంతమాత్రం భరించలేనని తరచూ భార్య నుంచి కంప్లైంట్. ఏడుపులు. పెడబొబ్బలు.. ఆ గొడవలు పెరిగిపోయి.. చివరికి కోడలితో పడలేనంటూ సంతోష్ రెడ్డి తల్లి తన ఇంటికి వెళ్లిపోయింది. భార్య ఆస్ట్రేలియా రమ్మన్నా రాకపోవడం... తల్లి ఇంటి నుంచి వెళ్లిపోవడం.. సంతోష్ రెడ్డికి ఏదో జరుగుతోందన్న అనుమానం కలిగించాయి.. మొహమాటపడుతూనే తన స్నేహితులను వాకబు చేశాడు. వాళ్లకు తెలిసిన సమాచారం వాళ్లు షేర్ చేశారు. అంతే.. తన అనుమానమే నిజమయ్యింది. ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు కానీ, ఇంటికి వెళ్లలేదు పదేళ్ల పాటు నిర్మించుకున్న నమ్మకం అనే గోడ తన కళ్లముందే కూలిపోయినట్లనిపించింది సంతోష్ రెడ్డికి. రోజూ భార్య ఫోన్లో తనతో మాట్లాడుతున్న మాటలన్నీ ఎందుకో అతన్ని వెక్కిరిస్తున్నట్లే అనిపించాయి.. ఇక ఆలస్యం చేసి లాభం లేదనుకున్నాడు. ఈ నెల మొదటి వారంలో ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. కానీ ఇంటికి వెళ్లలేదు. దూరంగా ఉంటూ రోజూ తన భార్య కదలికలు గమనించేవాడు. రాత్రివేళ తన అపార్ట్మెంట్ ముందు రహస్యంగా గస్తీకాసేవాడు.. తన అనుమానాలే నిజమయ్యాయి. తన కళ్లతోనే చాలా విషయాలను చూసి నిర్ధారించుకున్నాడు. నీ భార్యను భరించలేనంటూ తన తల్లీ ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చిందో అతనికి బోధపడింది. పదే పదే ఆస్ట్రేలియా రమ్మని పిలిచినా భార్య ఎందుకు ఒప్పుకోవడం లేదో సరైన కారణం అతనికి తెలిసింది.. కానీ తాను నేరుగా వెళ్లి తనకు తెలిసిన విషయాలను ఆమె తల్లిదండ్రులకు చెప్తే వింటారన్న నమ్మకం అతనికి లేదు. ఎందుకంటే.. ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటావ్ కాబట్టి అనవసరంగా అనుమానాలు పెంచుకున్నావ్ అంటారనుకున్నాడు. అందుకే... నవంబర్ 22 అర్థరాత్రి పోలీసులకు ఫోన్ చేశాడు. తాను చూసినదీ.. తెలుసుకున్నదీ అన్నీ చెప్పాడు. పోలీసులు కూడా అతని వెంట రావడానికి ఒప్పుకున్నారు.. అంతా కలిసి వెళ్లి తన ఇంటి తలుపు కొట్టారు. అప్పటిదాకా తన భర్త ఆస్ట్రేలియాలోనే ఉన్నాడనుకున్న సమత.. పోలీసులతో కలిసి అర్థరాత్రి ఎంట్రీ ఇచ్చిన భర్తను చూసి నిర్ఘాంతపోయింది. సైలెంటుగా వాళ్లకు తన ఇంట్లోకి అనుమతిచ్చింది. అయితే.. అప్పటికే ఆ ఇంట్లో అలజడి మొదలైంది.. పోలీసులు నేరుగా బాత్రూమ్లోకి వెళ్లారు. అక్కడ నక్కి చూస్తున్న వ్యక్తిని బయటికి తీసుకొచ్చారు. ఆ వ్యక్తి సమత ప్రియుడు శివప్రసాద్. బెడ్రూమ్లోంచి మరో జంట.. షాక్ సంతోష్ రెడ్డి అనుకున్న విధంగానే పోలీసుల సమక్షంలో తన భార్య బండారాన్ని బయటపెట్టాడు. సరిగ్గా ఇక్కడే అతనికి ఇంకో కొత్త విషయం తెలిసింది. తన ఇంట్లో ఆ సమయంలో ఉన్నది భార్య.. ఆమె ప్రియుడు మాత్రమే కాదు.. మరో బెడ్రూమ్లోంచి మరో జంట బయటికొచ్చింది. వాళ్లను చూసి షాక్ తినడం సంతోష్ రెడ్డి వంతైంది. వాళ్లెవరు..? తన ఇంట్లో వాళ్లెందుకు ఉన్నట్టు..? నైటీలో ఉన్న ఆ మహిళ పేరు విశాల.. ఆమె సమత స్నేహితురాలు. ఆమెతో పాటు ఉన్న వ్యక్తి పేరు నరేష్.. సమతకు పెళ్లైనట్లే విశాలకూ పెళ్లై పిల్లలున్నారు. కానీ.. ప్రియుడితో కలిసి సమతలాగే విశాల కూడా రహస్య బంధాన్ని కొనసాగిస్తోంది. సమత భర్త పోలీసులతో రావడంవల్ల ఆమె వివాహేతర సంబంధం కూడా బయటపడింది. ఇదే ఇంట్లో నుంచే.. మహిళా కానిస్టేబుల్ విశాల భర్తకు ఫోన్ చేసి మీ భార్య తన స్నేహితురాలి ఇంట్లో ఉన్నట్లు సమాచారం ఇచ్చింది. సమత ప్రియుడు శివప్రసాద్.. ఓ డాక్టర్. అతనిదీ సూర్యాపేటే. సమత పుట్టింటికి దగ్గర్లోనే అతని ఇల్లు.. పెళ్లికి ముందు నుంచి ఉన్న పరిచయం.. పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత వివాహేతర సంబంధంగా కొనసాగుతోంది. శివప్రసాద్‌తో సంబంధం వల్లే సమత.. తనతోపాటు ఆస్ట్రేలియా వచ్చేందుకు ససేమిరా అనేదని సంతోష్ రెడ్డి అంటున్నారు. శివప్రసాద్‌తో ఇలా గడిపేందుకే తన తల్లితో తరచూ తగాదా పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేసిందంటున్నారు. అంతేకాదు.. తాను ఎప్పుడు ఫోన్ చేసినా ఆమె ఫోన్ బిజీగానే ఉండేదనీ.. తాను పిల్లలతో మాట్లాడాలని ప్రయత్నించినా.. మాట్లాడనిచ్చేది కాదంటున్నారు. కుటుంబాల్లో చిచ్చుపెడుతున్న స్మార్ట్ ఫోన్ కల్చర్ సంతోష్ రెడ్డి నుంచి ఫిర్యాదు తీసుకున్న చైతన్యపురి పోలీసులు మహిళా కానిస్టేబుళ్ల సాయంతో అర్థరాత్రి వేళ సమత ఇంటికి వెళ్లి సమతతోపాటు.. ఆ ఇంట్లో ఉన్న ఆమె ప్రియుడు శివప్రసాద్.. మరో జంట విశాల, నరేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై 408, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భార్య వివాహేతర సంబంధాన్ని భర్త బయటపెట్టే కేసులు.. భర్త రహస్య సంబంధాలను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. పెరిగిపోయిన స్మార్ట్ ఫోన్ కల్చర్ కుటుంబాల్లో చిచ్చుపెడుతోందని నిపుణులంటున్నారు. దూరంగా ఉండే ఇద్దరు వ్యక్తులు వాట్సప్‌లో తరచూ టచ్‌లో ఉండటం.. గంటలు గంటలు సోషల్ మీడియాల్లో గడపడం వివాహబంధాన్ని నిలువునా కోతకోస్తోందంటున్నారు. భార్యాభర్తల బంధం మధ్య వాళ్లిద్దరే కాకుండా పిల్లలు కూడా ఉన్నారన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు.