వివాహేతర సంబంధం: బైకుపై ఒంటరిగా వస్తుంటే.. | Wife Assassinated Husband Over Extramarital Affair Vizianagaram | Sakshi
Sakshi News home page

Extramarital Affair: వివాహేతర సంబంధం: బైకుపై ఒంటరిగా వస్తుంటే..

Jul 13 2022 2:59 PM | Updated on Jul 13 2022 6:26 PM

Wife Assassinated Husband Over Extramarital Affair Vizianagaram - Sakshi

సాక్షి,గంట్యాడ(విజయనగరం):  ప్రియుడితో కలిసి జీవించేందుకు అడ్డు వస్తున్నాడని తాళికట్టిన భర్తనే కడతేర్చింది ఓ కిరాతకురాలు. పథకం ప్రకారం  హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.  ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని  లక్కిడాం గ్రామానికి చెందిన సింగంపల్లి రాము (43)  సోమవారం  సాయంత్రం బైక్‌పై విజయనగరం ఆస్పత్రికి వెళ్లి మంగళవారం ఉదయం వరకు ఇంటికి చేరలేదు. ఉదయం 6 గంటల సమయంలో  రాము తమ్ముడికి  మీ అన్నయ్య కొటారుబిల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు వద్ద  చనిపోయి ఉన్నాడని అటుగా వెళ్లిన వారు ఫోన్‌ చేసి చెప్పారు.

దీంతో సంఘటన స్థలానికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చేరుకున్నారు. సంఘటన స్థలంలో మృతదేహాం ఒకచోట, బైక్‌ మరోచోట పడి ఉన్నాయి. ముందు రోడ్డు ప్రమాదం జరిగి రాము చనిపోయి ఉంటాడని భావించారు. అయితే  మృతుని తలపై బలమైన గాయాలు  ఉండడంతో మృతుని సోదరుడికి   అనుమానం వచ్చి ఇది రోడ్డు ప్రమాదం కాదని, హత్య చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేయగా కోణంలో దర్యాప్తు చేపట్టారు. విజయనగరం నుంచి క్లూస్‌ టీం వచ్చి సంఘటన స్థలంలో వివరాలు సేకరించింది.   

వివాహేతర సంబంధమే కారణం   
మృతుడి రాము భార్యకు వివాహేతర సంబంధం ఉంది.  ఇదే విషయంపై వారిద్దరి మధ్య తరచూ గొడవలు  జరిగేవి. భర్తను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని భావించిన రాము భార్య తులసి, ప్రియుడితో కలిసి ప్లాన్‌ వేసింది. విజయనగరం  ఆస్పత్రికి రాము వెళ్లిన విషయాన్ని ప్రియుడికి చెప్పింది.  ఇద్దరు కలిసి కొఠారుబిల్లి గ్రామానికి వెళ్లే జంక్షన్‌ వద్ద మాటు వేశారు.  విజయనగరంలో పనిముగించుకుని వస్తున్న భర్తను ప్రియుడితో కలిసి తులసి చంపించింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఉంటాడని నమ్మించేందుకు మృతదేహం ఒకచోట, బైక్‌ మరోచోట పడేసి వెళ్లిపోయారు. పోలీసుల విచారణలో హతురాలు నేరం అంగీకరించింది.  హతుడు రాముకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

చదవండి: సేవ చేయాల్సి వస్తుందని.. గొంతునులిమి తండ్రిని హత్య చేసిన కొడుకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement