షాపులో పనిచేసే కుర్రాడితో చనువు.. మాట వినకపోవడంతో.. | Karnataka: Husband Assassinated Wife For Extra Marital Affairs | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: షాపులో పనిచేసే కుర్రాడితో చనువు.. మాట వినకపోవడంతో..

Published Wed, Aug 25 2021 1:49 PM | Last Updated on Wed, Aug 25 2021 3:20 PM

Karnataka: Husband Assassinated Wife For Extra Marital Affairs - Sakshi

బెంగళూరు: భార్య వివాహేతర సంబంధాన్ని మానుకోకపోవడం వల్ల గొంతు కోసి హత్య చేశానని పోలీసులకు లొంగిపోయిన భర్త వాంగ్మూలమిచ్చాడు. వివరాలు.. హోసూరు ఎంజీ రోడ్డుకు చెందిన జ్యోతిష్‌ (28) బైక్‌ మెకానిక్‌ షాపు నిర్వహిస్తున్నాడు. ఇతనికి బెంగళూరు వద్ద జిగణికి చెందిన వందన(25)తో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి 6 ఏళ్ల కొడుకు ఉన్నారు. వందన 21వ తేదీన భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది.

ఇటీవల తాను కరోనాకు గురైనప్పుడు షాపులో పనిచేసే సుగిల్‌ (25) అనే యువకునికి చేరువైందని, తాను గట్టిగా ప్రశ్నించడంతో పుట్టింటికి వెళ్లి అటునుంచి సుగిల్‌తో పరారైందని భర్త చెప్పాడు. 15వ తేదీన ఇంటికి తీసుకొచ్చానని, మళ్లీ గొడవలు జరగడంతో కత్తితో గొంతుకోసి చంపినట్లు తెలిపాడు. భర్తను జైలుకు తరలించారు.   

అప్పు కట్టమన్నందుకు హత్య 
దొడ్డబళ్లాపురం: బెంగళూరు ఉత్తర తాలూకా సోలదేనహళ్లి ఎమ్‌ఎస్‌పీపీ కాలనీలో  రవికుమార్‌ (35) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. వివరాలు... హతుడు రవికుమార్‌ తన స్నేహితుడు మధుసూదన్‌కు ఏడాదిన్నర క్రితం రూ.లక్ష అప్పు ఇచ్చాడు. చెల్లించాలని అడగడంతో మధుసూదన్‌ సోమవారం రాత్రి ఎమ్‌ఎస్‌పీపీ కాలనీలో వాకింగ్‌ చేస్తున్న రవికుమార్‌ను మరో నలుగురితో కలిసి కత్తులతో పొడిచి హత్య చేశాడు. పోలీసులు  ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.  

చదవండి: అలిగి మండపం ఎక్కనన్న వధువు.. కారణం తెలిసి నవ్వుకున్న నెటిజన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement