ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కామారెడ్డి (నిజామాబాద్): వేర్వేరు సంఘటనల్లో జరిగిన ఇద్దరి మహిళల మిస్సింగ్ కేసులను ఛేదించినట్లు డీఎస్పీ సోమనాథం వెల్లడించారు. పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో బుధవారం ఆయన∙మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లి తాండాకు చెందిన అనిత గత నెల 17న అదృశ్యంకాగా మంగళవారం దేవునిపల్లిలో గల దేవివిహార్ సమీపంలోని కంది చేనులో మృతదేహం లభించింది.
అదేవిధంగా కొన్ని రోజుల కిందట అదృశ్యమైన తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన స్వరూప మృతదేహం మాచారెడ్డి మండలం వాడి గ్రామ శివారులోని చెరుకు తోటలో లభ్యమైంది. వివాహేతర సంబంధంతోపాటు డబ్బుల విషయంలో గొడవపడి హత్య చేసినట్లు తెలిపారు. అనితను హత్యచేసిన ప్రకాష్, స్వరూపను హత్య చేసిన ఆమె మరిది రాజులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
అనిత కూలి పని నిమిత్తం రోజు కామారెడ్డికి వచ్చే క్రమంలో లింగంపేట మండలం పర్మళ్ల తండాకు చెందిన ప్రకాష్‌తో పరిచయం ఏర్పడటంతో ఆయనతో కలిసి పనికి వెళ్లేది. ఈ క్రమంలోనే గత నెల 17న ఆమెను సమీపంలోని చేనులోకి బలవంతంగా తీసుకెళ్లి వాంఛ తీర్చుకున్న తర్వాత డబ్బుల విషయమై గొడవపడి ప్రకాష్ గొంతు నులిమి ఆమెను హత్య చేశాడన్నారు. తాడ్వాయికి చెందిన కుంట స్వరూప కూలి పనికోసం కామారెడ్డికి వచ్చి వెళ్లేది.
అక్టోబర్ 28న పనికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల ఒకటిన కుళ్లిపోయిన ఆమె మృతదేహాన్ని వాడి శివారు చెరుకుతోటలో వెలుగు చూసింది. ఆమె భర్త మృతి చెందడంతో మరిది అల్లురి రాజు ఆమెను లోబర్చుకొని గత నెల 28న కలుసుకున్నప్పుడు గొడవపడి హత్య చేశా డని వెల్లడించారు. ఈ కేసులను చేధించిన కామారెడ్డి రూరల్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, దేవునిపల్లి ఎస్‌ఐ రవికుమార్, మాచారెడ్డి ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డిలను ఆయన అభినందించారు.
చదవండి: భార్యతో గొడవ.. ‘కొడుకా’ అని నచ్చచెప్పేందుకు వెళ్తే..
Comments
Please login to add a commentAdd a comment