
న్యూఢిల్లీ: దేశ రాజాధానిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆప్ ఎమ్మెల్యే అనుచరులు కొందరు తల్లికుమార్తెలపై కర్రలు, ఐరన్ రాడ్‌తో విచక్షణారహితంగా వారిపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వివరాలు..
ఈ సంఘటన నవంబర్ 19న, ఢిల్లీ, శాలిమార్ బాగ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు.. 38 ఏళ్ల మహిళ, ఆమె కుమార్తెపై ఇనుప రాడ్డు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. నిందితుల్లో మహిళలు కూడా ఉండటం గమనార్హం. ఇక తమను ఇంత దారుణంగా హింసించింది ఆప్ ఎమ్మెల్యే బందన కుమారి అనుచరులని.. అందుకే పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సదరు మహిళ వాపోయింది.
(చదవండి: Cheena Kapoor: కొత్త దారి...కెమెరా చెప్పే కథలు)
వీడియోలో ఉన్న దాని ప్రకారం మహిళ, ఆమె కుమార్తె కారు నుంచి దిగగానే.. కొందరు వ్యక్తులు వారి మీద విచక్షణారహితంగా దాడి చేశారు. వారిపై పిడిగుద్దులు కురిపించడమే కాక ఇనుప రాడ్డు, కర్రలతో చితకబాదారు. ఇంతలో మరికొందరు వ్యక్తులు కూడా అక్కడకు చేరుకుని.. మిగతావారితో కలిసి.. ఏమాత్రం జాలి, దయ లేకుండా వారిని చితకబాదారు. బాధితులు తమను కాపాడాల్సిందిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడ నుంచి పారరయ్యారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. మంగళవారం అనగా నవంబర్ 30న వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మహిళలపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆప్ ఎమ్మెల్యే బందన కుమారి మద్దతుదారులైన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు తమపై దాడి చేశారని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
(చదవండి: క్యాబ్ డ్రైవర్‌పై మహిళ వీరంగం.. నడి రోడ్డుపై చొక్కా పట్టుకొని)
"నవంబర్ 19 రాత్రి, ఆప్ ఎమ్మెల్యే బందన కుమారికి తెలిసిన వ్యక్తులు నాతో పాటు నా కుమార్తెపై దాడి చేశారు. 2019లో ఎమ్మెల్యే భర్తపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినందున ఈ దాడి జరిగింది. నేను ఎమ్మెల్యే చేసిన తప్పులను బయటపెట్టాను. వారిపై గతంలో కూడా అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి" అని ఆ మహిళ తెలిపింది.
చదవండి: ఎంపీకే టోకరా.. రూ. 25 కోట్లకు కుచ్చుటోపి
#WATCH | A group of persons beat up a woman with sticks in a residential colony in Shalimar Bagh area of Delhi on November 19
— ANI (@ANI) December 1, 2021
Based on the woman's complaint, Delhi Police has registered an FIR against unknown persons, it said.
(CCTV footage of the incident) pic.twitter.com/YmZRtD7COu
Comments
Please login to add a commentAdd a comment