
గాయపడిన శంకర్, శ్రీనాథ్
హైదరాబాద్: ట్రాఫిక్‌లో వేగంగా ఎందుకెళుతున్నావ్ అన్నందుకు ఓ వ్యక్తి ఇద్దరిని కత్తితో పొడిచి పరారయ్యాడు. నగరంలో పట్టపగలు ఈ దారుణం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు సికింద్రాబాద్ మారేడుపల్లికి చెందిన శంకర్ (21), శ్రీనాథ్ (20) యాక్టివా (ఏపీ 29 ఏపీ6481)పై వెళుతున్నారు.
సంగీత్ చౌరస్తా దాటిన తర్వాత హీరో హోండా ప్యాషన్‌పై వచ్చిన ఓ వ్యక్తి వేగంగా వీరి వాహనాన్ని రాసుకుంటూ వెళ్లాడు. దీంతో వీరి మధ్య గొడవ జరిగింది. తరువాత వారిద్దరూ ముందుకు వెళ్లగా మళ్లీ వచ్చిన ఆ వ్యక్తి.. తన దగ్గర ఉన్న కత్తితో శంకర్ మెడపై, శ్రీనాథ్ కడుపులో పొడిచి పరారయ్యాడు. పోలీసులు బాధితులను 108 సహాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. శంకర్ కోలుకోగా ఆస్పత్రి నుంచి పంపించి వేశారు. శ్రీనాథ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment