రాజస్థాన్‌లో దారుణం..యువకుడి మృతి | Muslim man beaten by gau rakshaks in Rajasthan dies after brutal attack | Sakshi
Sakshi News home page

రాజస్థాన్‌లో దారుణం..యువకుడి మృతి

Published Wed, Apr 5 2017 11:11 AM | Last Updated on Tue, Oct 16 2018 5:58 PM

Muslim man beaten by gau rakshaks in Rajasthan dies after brutal attack

జైపూర్‌: రాజస్థాన్‌ లో  దారుణం చోటు చేసుకుంది. ఆవులను తరలిస్తున్న ముస్లిం యువకులపై  గో రక్షక దళ సభ్యులు విరుచుకుపడ్డారు.   ఈ దాడిలో అయిదుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఓయువకుడు మరణించాడు.  అల్వార్ జిల్లాలో శనివారం సాయంత్రం  ఈ సంఘటన జరిగింది.  ఈ షాకింగ్‌ వీడియె ఇపుడు నెట్‌లో చక్కర్లుకొడుతోంది.

స్థానిక పోలీస్‌అధికారి  రమేష్‌ చాంద్‌ సినీశ్వర్‌  అందించిన వివరాల ప్రకారం జాతీయ రహదారి జుగువాస్‌ వద్ద నాలుగు వాహనాలను గోరక్షక దళ్‌ సభ్యులు అటకాయించారు. దాదాపు 15మంది ముస్లిం యువకులపై  దాడిచేసి తీవ్రంగా కొట్టారు. వాహనాలను ధ్వంసం చేశారు.   వీరి దాడిలో తీవ్రంగా గాయపడిన పెహ్లూ ఖాన్‌ అనేయువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  సోమవారం చనిపోయాడు.   దీంతో నిందితులపై హత్య కేసుతో పాటు వివిధ సెక్షన్ల కింద  కేసులు నమోదుచేశారు.
వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ కార్యకర్తలుగా స్థానిక పోలీసులు గుర్తించిన పోలీసులు వీరిపై కేసులు నమోదుచేశారు.  అటు ఆవులను అక్రమంగా తరలిస్తున్న కేసులో ముస్లింయువకులపై  కూడా కేసులు నమోదుచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement