ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో లక్ష ఎకరాల భూమిని సేకరించడం అసలు అవసరమా అని ఏపీ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. అక్కడ సేకరించాలని తలపెడుతున్న భూములను ఎంతెంత భూమిని ఎలా ఉపయోగిస్తారో ముందుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకులు పద్మరాజు, శైలజానాథ్ డిమాండ్ చేశారు.
రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోదని వాల్లు స్పష్టం చేశారు. రైతులకు బంగారం పండిస్తున్న పంట భూములను తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.
అసలు లక్ష ఎకరాలు అవసరమా?
Published Sat, Oct 4 2014 7:05 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement