one lakh acres
-
లక్ష ఎకరాలు ఔట్
సమగ్ర సర్వే నుంచి రియల్ ఎస్టేట్, ఇతరత్రా బదిలీ అయిన భూముల తొలగింపు ► సర్వేలో 1.24 కోట్ల ఎకరాల భూమి నమోదు ► ఈ నెల చివరికి తుది నివేదిక ► వచ్చే ఖరీఫ్ నుంచే రైతులకు పెట్టుబడి పథకం ► సీఎం భూములకూ ఎకరాకు రూ.4 వేల చొప్పున రూ.3.40 లక్షలు సాక్షి, హైదరాబాద్ : రైతు సమగ్ర సర్వేలో నమోదైన భూముల జాబితా నుంచి దాదాపు లక్ష ఎకరాలను తొలగించారు. రైతుల వద్ద పట్టాదారు పాసు పుస్తకాలున్నా ఆ భూమి రియల్ ఎస్టేట్‌కు మళ్లడం, వివిధ ప్రభుత్వ పథకాల కింద భూసేకరణలో వెళ్లిపోవడం తదితర కారణాలతో ఆ భూములను జాబితా నుంచి తొలగించినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే కొన్నిచోట్ల రైతులు స్థానికంగా లేకున్నా, కొందరు చనిపోయినా, మరికొందరు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నా వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) రెవెన్యూ రికార్డులను ముందేసుకొని ఆయా భూముల వివరాలు సమగ్ర సర్వేలో నమోదు చేశారు. ఇలా గుర్తించిన భూమిని కూడా జాబితా నుంచి తొలగించినట్లు చెబుతున్నారు. అదనపు భూమి వచ్చి చేరితే వచ్చే ఏడాది నుంచి ప్రతీ రైతుకు ఎకరానికి రూ.4 వేల చొప్పున అందించే పథకం బడ్జెట్ మరింత పెరగనుంది. రైతుల వద్దకు వెళ్లకుండా ఇలా రికార్డులు చూసి భూముల వివరాలు నమోదు చేయడంపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి లక్ష ఎకరాల వరకు భూ వివరాలను సమగ్ర సర్వే జాబితా నుంచి తొలగించినట్లు చెబుతున్నారు. ఈ నెల 28 లేదా 29 నాటికి రైతు సమగ్ర సర్వేపై స్పష్టత రానుంది. ఆ రోజు జిల్లాల నుంచి తుది నివేదిక వస్తుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. వచ్చే ఖరీఫ్‌కల్లా రైతులకు రూ.4,981 కోట్లు ప్రభుత్వం ప్రకటించినట్టుగా వచ్చే ఖరీఫ్ నుంచి పెట్టుబడి పథకం కింద రైతులందరికీ ఎకరాకు రూ.4 వేల చొప్పున అందించనున్నారు. పేద, ధనిక తేడా లేకుండా నగదు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ప్రస్తుత లెక్కల ప్రకారం వచ్చే ఖరీఫ్‌లో రూ.4,981.32 కోట్లు రైతు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. సీఎం కేసీఆర్‌కూ ఎర్రవల్లిలో 85 ఎకరాల భూమి ఉంది. ఆయన భూ వివరాలను కూడా సమగ్ర సర్వేలో నమోదు చేశారు. ప్రస్తుతం ఆ భూమిలో బొప్పాయి, వరి పంటలు సాగులో ఉన్నాయి. నిబంధనల ప్రకారం సీఎంకూ వచ్చే ఖరీఫ్‌లో రూ.3.40 లక్షలు ఆయన బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఉన్నతస్థాయి వర్గాలకు చెందిన వ్యవసాయ భూములకు కూడా పెట్టుబడి పథకం కింద సొమ్ము జమ చేస్తామన్నారు. అయితే పెట్టుబడి పథకం తమకు వద్దంటూ ఎవరైనా విజ్ఞప్తి చేస్తే అప్పుడు ఆలోచిస్తామని అంటున్నారు. ఎవరి నుంచి కూడా తమకు అలాంటి విన్నపాలు రాలేదని అధికారులు తెలిపారు. సగానికి తగ్గిన ఉద్యాన పంటలు సీఎంకు వ్యవసాయశాఖ పంపిన నివేదిక ప్రకారం 45.55 లక్షల మంది రైతుల చేతుల్లో 1,24,53,308 ఎకరాల పంట భూమి ఉన్నట్లు సమగ్ర సర్వేలో నమోదు చేశారు. అందులో 51.30 లక్షల ఎకరాలు నీటిపారుదల వనరుల కింద ఉండగా.. 69.40 లక్షల ఎకరాలు వర్షాధార భూములు. ఉద్యానశాఖ పరిధిలో ఇప్పటివరకు 8 లక్షల ఎకరాల పండ్లు, కూరగాయల తోటలున్నట్లు భావించారు. కానీ సమగ్ర సర్వేలో కేవలం 3.59 లక్షల ఎకరాలే ఉన్నట్లు తేలింది. అందులో మామిడి తోటలు 2.25 లక్షల ఎకరాలు, నిమ్మ, బత్తాయి తోటలు 67,544 ఎకరాలు, జామ తోటలు 4,766 ఎకరాలు, ఇతర పండ్లు, కూరగాయల తోటలు 61,884 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు నిర్ధారించారు. ఉద్యాన పంటలకు సరైన ప్రోత్సాహకం లేకపోవడం వల్లే రైతులు ఆయా పంటల నుంచి వైదొలుగుతున్నట్టు ఉద్యానశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
అసలు లక్ష ఎకరాలు అవసరమా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో లక్ష ఎకరాల భూమిని సేకరించడం అసలు అవసరమా అని ఏపీ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. అక్కడ సేకరించాలని తలపెడుతున్న భూములను ఎంతెంత భూమిని ఎలా ఉపయోగిస్తారో ముందుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకులు పద్మరాజు, శైలజానాథ్ డిమాండ్ చేశారు. రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోదని వాల్లు స్పష్టం చేశారు. రైతులకు బంగారం పండిస్తున్న పంట భూములను తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. -
లక్ష ఎకరాల భూసేకరణ అవసరమా?
హైదరాబాద్ : విజయవాడలో రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాల భూసేకరణ అవసరమా అని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ సంస్థలు వందల ఎకరాల్లోనే ఉన్నాయని, విజయవాడ పరిసరాల్లో ప్రభుత్వ భూముల వివరాలు వెల్లడించాలని ఆయన శనివారమిక్కడ డిమాండ్ చేశారు. వ్యవసాయ భూములను ఇతరత్రా అవసరాలకు సేకరించరాదనే ఏకాభిప్రాయం ఉందని రఘువీరా అన్నారు.రహస్య అజెండాతోనే ప్రభుత్వ పెద్దల లక్ష ఎకరాలు సేకరించాలనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో టీడీపీకి ఆర్థికంగా సహకరించిన వారికి లబ్ధి చేకూరాలనేదే ప్రభుత్వ అసలు అజెండా అని రఘువీరా విమర్శించారు. -
ఏపీ రాజధానికి లక్ష ఎకరాలు అవసరం: మంత్రులు
-
ఏపీ రాజధానికి లక్ష ఎకరాలు అవసరం: మంత్రులు
రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన మొత్తం భూమిని ఆరు నెలల్లో సేకరించి, వర్గీకరించి, తర్వాత మరో ఆరునెలల్లో నిర్మాణ ప్రక్రియ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు రాజధానిపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడు, మంత్రి పి.నారాయణ చెప్పారు. రాజధాని అంటే సచివాలయం, హైకోర్టు, ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఉంటాయని తెలిపారు. రైతులకు ఎంత షేర్ ఇస్తారని అడిగినప్పుడు మాత్రం.. నేరుగా చెప్పకుండా ఇతర వివరాలు అన్నీ ఏకరువు పెట్టారు. చండీగఢ్‌లో ఎకరాకు 1100 చదరపు గజాలు ఇచ్చారని, అందులో వెయ్యి గజాలు రెసిడెన్షియల్, 100 గజాలు కమర్షియల్ ఇచ్చారని తెలిపారు. ఇది 22-23 శాతం అవుతుందన్నారు. గాంధీనగర్‌లో అభివృద్ధి చేసినదాంట్లో 25 శాతం, నయా రాయ్‌పూర్‌లో అభివృద్ధి చేసినదాంట్లో 35 శాతం ఇచ్చామన్నా, వాస్తవానికి వారికి వెళ్లింది 29 శాతమేనన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రాంతాన్ని బట్టి, అక్కడ అభివృద్ధి చేయడానికి అయిన వ్యయాన్ని బట్టి ఎంత వాటా ఇవ్వాలన్నది నిర్ణయిస్తామన్నారు. ఆధునిక సదుపాయాలతో రాజధాని నగరాన్ని నిర్మించాలన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఇంతవరకు నాలుగు పద్ధతుల్లో భూసేకరణ జరిపారని, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరించాలని నిర్ణయించామని ఆయన అన్నారు. మొత్తం లక్ష ఎకరాల వరకు భూమిని సేకరించాలని నిర్ణయించామని, తొలిదశలో 25 వేల ఎకరాలు, రెండో దశలో మరో 25 వేల ఎకరాలు సేకరిస్తామన్నారు. గుంటూరు, తెనాలి, విజయవాడ, మంగళగిరి ప్రాంతాలు కవరయ్యేలా స్థల సేకరణ చేస్తామని ఆయన చెప్పారు. వచ్చే సమావేశానికి రెండు జిల్లాల కలెక్టర్లను రమ్మని కోరామన్నారు. రైతులకు అనుకూలంగా విన్-విన్ పద్ధతిలోనే ల్యాండ్ పూలింగ్ చేయాలని అనుకుంటున్నామని, దేశంలోకెల్లా అందమైన రాజధాని నిర్మించాలన్నది ప్రభుత్వా ఆలోచన అని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. దీన్ని రైతుల సహకారంతోనే నిర్మిస్తామన్నారు. ల్యాండ్ పూలింగ్‌లోకి వెళ్లినా, తమకు ఇప్పుడు ఉన్న ధరల కంటే ఎక్కువ రేట్లే వస్తాయని రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. ఇప్పుడు ఎకరాకు ఎంత ఆదాయం వస్తోందో, అంత చొప్పున డెవలప్మెంట్ పూర్తయ్యేవరకు ప్రభుత్వం వారికి చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఉపయోగించని భూమినే తాము వినియోగంలోకి తెస్తామని అన్నారు.