ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణాన్ని చేపట్టడానికి నిధులు ఎక్కడినుంచి తేవాలన్న విషయంలో టీడీపీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. పీపీపీ విధానంలో రాజధాని నగరాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీజీటీఎం ఉడాను రద్దు చేసి దాని స్థానంలో సీఆర్టీఏ అనే ఒక సంస్థను ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. తాజాగా బిల్డ్ ఏపీ అనే కార్పొరేషన్ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
దానికి మూలధనాన్ని, ఆస్తులను సృష్టించి.. వాటి ద్వారా అప్పులు తెచ్చుకోవాలని సర్కారు భావిస్తోంది. ఇందుకోసం బాండ్లు జారీ చేయడం, విరాళాలు స్వీకరించడం.. ఇలా పలు మార్గాల ద్వారా నిధులు సేకరించబోతోంది. భూములను రైతుల నుంచి తీసుకుని.. వాటిలో నిర్మాణాలు చేపట్టాలన్నది సర్కారు ఆలోచన. అయితే.. ఈ మార్గాల్లో నిధులు సేకరించినా అవి ఏ మాత్రం సరిపోకపోవడం వల్లే ఇప్పుడు పీపీపీ పద్ధతి గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అమ్మకానికి కొత్త రాజధాని ఆస్తులు?
Published Sat, Nov 1 2014 10:59 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM
Advertisement
Advertisement