తల్లీ కుమారుడు ఆత్మహత్య | Mother , son commits suicide | Sakshi
Sakshi News home page

తల్లీ కుమారుడు ఆత్మహత్య

Published Mon, Jan 18 2016 1:58 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

Mother , son commits suicide

విశాఖ నగరంలోని రామచందర్‌రావు నగర్ లో తల్లీ కుమారుడు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగు చూసింది.  మాచర్ల మహేశ్వర్‌రావు, కమల (48) దంపతులకు కనకరాజు, రవికుమార్ అనే ఇద్దరు కమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు కనకరాజు 2014లో ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుటుంబానికి ఎవరో చేతబడి చేశారని భావించిన ఈ కుటుంబం.. ఇరుగు పొరుగు వారితో సంబంధాలు కట్ చేసుకుంది.

ఈ నేపథ్యంలో చేతబడి నివారణ కోసం మహేశ్వర్‌రావు శనివారం విజయనగరం వెళ్లి.. సోమవారం ఇంటికి తిరిగివచ్చారు. లోపల తలుపులు బిగించి ఉండటం, ఎంతకీ తెరవకపోయేసరికి పోలీసుల సాయంతో.. తలుపులు బలవంతంగా తెరిచారు. కమల, రవి కుమార్ (30) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించారు.

వీరి పెద్ద కుమారుడు 2014లో ఇంట్లో ఆత్మహత్య చేసుకోగా మూడు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి ఎవరికీ చెప్పకుండా ఉండడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆత్మహత్య చేసుకున్న వారి మానసిక స్థితి సరిగా లేనట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement