kamala
-
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి?
ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 నవంబర్‌లో జరగనున్నాయి. తదుపరి ప్రెసిడెంట్‌ను ఎన్నుకునేందుకు అమెరికన్లు సిద్ధమవుతున్నారు. అమెరికా ఎన్నికలను ప్రపంచమంతా నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నేపధ్యంలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి? వారి పదవీకాలం ఎంత? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష బరి నుంచి జో బైడెన్ తప్పుకున్న నేపధ్యంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభ్యర్థిత్వం పార్టీ ముందుకు వచ్చింది. ఆమెకు డెమొక్రాట్లలో ఎవరూ పోటీగా నిలవలేదు. దీంతో ఆమె డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. కాగా అధ్యక్ష పదవికి మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. వీరిలో మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ కుటుంబానికి చెందిన రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ కూడా ప్రధానంగా నిలిచారు. అయితే ఆయన ఆగస్టు చివరిలో తన ప్రచారాన్ని విరమించి, ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. డెమొక్రటిక్ పార్టీ అనేది ఉదారవాద రాజకీయ పార్టీ. పౌరహక్కుల పరిరక్షణ, విస్తృత సామాజిక భద్రత, వాతావరణ మార్పులు తదితర అంశాలు ఈ పార్టీ అజెండాలో ఉన్నాయి.రిపబ్లికన్ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 నవంబర్ 5 న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించినవారు 2025 జనవరి నుండి నాలుగు సంవత్సరాలు అమెరికాను పరిపాలించనున్నారు. రాష్ట్ర ప్రైమరీలు, కాకస్ అని పిలిచే ఓటింగ్ విధానం ద్వారా రెండు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను నామినేట్ చేస్తాయి. ఎన్నికలలో పార్టీకి నాయకత్వం వహించాలనుకునే అభ్యర్థులను పార్టీ సభ్యులు ఎన్నుకుంటారు. రిపబ్లికన్ పార్టీలో మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారీ ఆధిక్యంతో దీనిలో విజయం సాధించారు. విస్కాన్సిన్లోని మిల్వాకీలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన అధికారిక రిపబ్లికన్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. రిపబ్లికన్ పార్టీ అనేది కన్జర్వేటివ్ రాజకీయ పార్టీ. దీనిని జీఓపీ అంటే గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని పిలుస్తారు. స్వల్ప పన్నులు, ప్రభుత్వ పరిమాణాన్ని తగ్గించడం, తుపాకీ హక్కులు, వలసలు, అబార్షన్లపై ఆంక్షలు మొదలైన అంశాలు ఈ పార్టీ అజెండాలో ఉన్నాయి.విజేతల ఎంపిక ఇలా..అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన వారు విజేతలు కాలేరు. దీనికి బదులుగా అభ్యర్థులు మొత్తం 50 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో గెలిచేందుకు పోటీ పడాల్సి ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో జనాభా ఆధారంగా నిర్దిష్ట సంఖ్యలో ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఉంటాయి. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో కనీసం 270 లేదా అంతకుమించి సాధించినవారు విజేతలుగా నిలుస్తారు. రెండు రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థికి ఆ రాష్ట్ర ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లన్నీ లభిస్తాయి. చాలా రాష్ట్రాలు ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం ఎటు మొగ్గు చూపుతాయో తెలియని పరిస్థితి ఉంటుంది. అక్కడ ఇరు పార్టీలకు ఓట్లు వేయవచ్చు. వీటిని స్వింగ్ రాష్ట్రాలని పిలుస్తారు. అభ్యర్థులు ఈ రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టిసారిస్తారు. ఒక అభ్యర్థి ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో మెజార్టీ సాధించడంలో విఫలమై, మొత్తంగా ఎక్కువ ఓట్లు సాధించినా (2016లో హిల్లరీ క్లింటన్‌లా) ఎన్నికలలో గెలవలేరు. అంటే ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో మెజార్టీ సాధించడమే కీలకమనేది ఇక్కడ గుర్తించాలి.అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలి ప్రత్యేక అధికారాలుసాధారణంగా ఎన్నికలు జరిగిన రోజు రాత్రే విజేతను ప్రకటిస్తారు. కానీ 2020లో మొత్తం ఓట్లను లెక్కించడానికి కొన్నిరోజుల సమయం పట్టింది. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జనవరిలో వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనం మెట్లపై జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కొన్ని చట్టాలను సొంతంగా ఆమోదించే అధికారం అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలికి ప్రత్యేకంగా ఉంటుంది. ప్రపంచ వేదికపై అమెరికాకు ప్రాతినిధ్యం వహించేందుకు, విదేశాంగ విధానాన్ని అమలు చేసేందుకు ప్రెసిడెంట్‌కు గణనీయమైన స్వేచ్ఛ ఉంటుంది.ఇంకెవరు ఎన్నికవుతారు?ఓటర్లు అమెరికా అధ్యక్షనితో పాటు దేశం కోసం చట్టాలను రూపొందించే కాంగ్రెస్ కొత్త సభ్యులను కూడా తమ ఓటు ద్వారా ఎన్నుకుంటారు. కాంగ్రెస్‌లో ప్రతినిధుల సభ, సెనేట్ అనే రెండు సభలు ఉంటాయి. ప్రతినిధుల సభలో 435 మంది సభ్యులుంటారు. ప్రస్తుతం రిపబ్లికన్లు సభను నియంత్రిస్తున్నారు. ఇది వ్యయ ప్రణాళికలను నిర్వహిస్తుంది. ప్రభుత్వంలో కీలక నియామకాలపై ఓటు వేసే సెనేట్‌లో డెమొక్రాట్లు ఇన్చార్జ్గా ఉన్నారు. ఈ రెండు సభలు చట్టాలను ఆమోదిస్తాయి. రెండు సభలలో నియంత్రణ పక్షం ప్రెసిడెంట్‌తో విభేదిస్తే వైట్‌హౌస్ ప్రణాళికలను అడ్డుకోవచ్చు. అమెరికా పౌరులై ఉండి, 18 ఏళ్లు నిండిన వారు అధ్యక్ష ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు. ఇది కూడా చదవండి: యూఎస్ పౌరులను చంపిన వలసదారులకు మరణ శిక్ష: ట్రంప్ -
చదువు శక్తినిస్తుంది
‘ఈ రోజులను చూస్తుంటే మా రోజుల్లోనే అమ్మాయిలకు తగినంత స్వేచ్చ,అనుకున్నవి సాధించే ధైర్యం, సమాజాన్ని అర్ధం చేసుకునే పరిణతిని పొందారు’ అనిపిస్తుంటుంది అన్నారు రిటైర్డ్ ప్రిన్సిపల్ కమలా మీనన్. తిరుపతి పద్మావతి మహిళా కళాశాల మూడవ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహించిన కమలా మీనన్ సికింద్రాబాద్ బోయినపల్లిలో ఉంటున్నారు. భర్త డగ్లస్ ఎమ్ కాక్రన్ జ్ఞాపకాలతో పాటు, 86 ఏళ్ల జీవితంలో ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు తనను ఎలా నిలబెట్టాయో వివరించారు. ‘‘చదువు అమ్మాయిలను శక్తిమంతులను చేస్తుంది. ఈ విషయాన్ని ఆ రోజుల్లోనే మా అమ్మ గుర్తించారు..’ అంటూ గతకాలపు విషయాలను మన ముందుంచారు. చదువు వేసిన మార్గం.. ‘‘పుట్టి పెరిగింది చెన్నైలో. నాన్నగారు బ్రిటిష్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసేవారు.అమ్మానాన్నలకు ఎనిమిది మంది సంతానం. అక్కతోపాటు ఆరుగురు అన్నలు నాకు. ఆడ, మగ అనే వివక్ష ఏ మాత్రం లేదు. అందరికీ మంచి చదువులు చదువుకునే అవకాశం ఇచ్చారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి ఆనర్స్ పూర్తయ్యాక బెంగుళూరు మౌంట్ కార్మెల్ కాలేజీలో లెక్చరర్‌గా ఐదేళ్లు పని చేశాను. ఆ ఎక్స్‌పీరియెన్స్ నాకు చాలా హెల్ప్ అయ్యింది. అప్పుడు చదువుకునే అమ్మాయిల శాతం కూడా బాగానే ఉంది. ఆ తర్వాత మార్పు కోసం తిరిగి మద్రాస్‌కు వచ్చేశాను. తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాలలో పొలిటికల్ విభాగంలో టెంపరరీ జాబ్ గురించి పేపర్లో ప్రకటన చూసి, అప్లై చేసి, సెలక్ట్ అయ్యాను. ఆరు నెలల తర్వాత పర్మినెంట్ అయ్యింది. సవాళ్లను తట్టుకుని ఎదుగుతూ.. జీవితంలో సవాళ్లు, బాధలు ఎక్కడి నుంచైనా ఎదురు కావచ్చు. నన్ను విపరీతంగా బాధపెట్టే సంఘటన నుంచి కోలుకోవడానికి సమయం పట్టింది. మా అక్క ఢిల్లీలో ఉండేవారు. జబ్బు పడి అక్క, నాన్న ఇద్దరూ ఒకే రోజు చనిపోయారు. ఈ సంఘటన నన్ను బాగా కదిలించాయి. ఆ టైమ్‌లో డా.రాజేశ్వరి మూర్తి కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉండేవారు. ఆవిడ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లినప్పుడు సెలక్షన్ కమిటీ నన్ను ఇన్ఛార్జిగా ఎంపిక చేసింది. నా మైండ్ కూడా ఛేంజ్ కావాలనుకొని, 1975లో ఆ బాధ్యత తీసుకున్నాను. ఇంటర్వ్యూ ద్వారా టెంపరరీ జాబ్ వచ్చింది. తర్వాత పర్మినెంట్ అయ్యింది. ఆ తర్వాత ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌గా అవకాశం వచ్చింది. నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అదే సమయంలో విదేశాలకు వెళ్లిన మరో సీనియర్ మహిళా లెక్చరర్ తిరిగి వచ్చారు. అప్పుడు మేనేజ్మెంట్ సీనియర్ కాబట్టి ఆవిడను నా ప్లేస్‌లో రీ ప్లేస్ చేశారు. అప్పటికే నన్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది, ఆ తర్వాత మరొకరికి ఇచ్చింది. దీంతో నా పొజిషన్ కోసం కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నేను గెలిచాను. అలా యూనివర్శిటీకి 3వ మహిళా ప్రిన్సిపల్‌గా బాధ్యతలు తీసుకున్నాను. ఆ తర్వాత 1993లో రిటైర్ అయ్యేవరకు ప్రిన్సిపల్‌గా చేశాను. 1997 వరకు దేవస్థానం ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా వర్క్ చేశాను. లెక్చరర్‌గా ఎంతో మంది విద్యార్థులను చూశాను. ఎంతోమంది విద్యార్థులతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పటికీ కలిసేవారు, ఫోన్లు చేసి మాట్లాడేవారున్నారు. ఆత్మీయులుగా మారినవారు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన, మొదటి తరం అమ్మాయిలే అక్కడంతా. వారిలో భవిష్యత్తుని చక్కగా మార్చుకోవాలనే పరిణతి బాగా కనిపించేది. వారి భవిష్యత్తుకు ప్రత్యేక క్లాసులు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేర్చాం. లెక్చరర్లు ఎంతో సపోర్ట్‌గా నిలిచేవారు. నాటి ఆ విద్యార్థుల్లో నేడు ఎంతోమంది పెద్ద పెద్ద పొజిషన్లలో, దేశ విదేశాల్లో ఉన్నారు. జీవితంలో ముఖ్యమైన మలుపు 1979–80లో నాటి మద్రాస్‌లో సౌత్ ఇండియా అమెరికా రాయబార కార్యాలయానికి డగ్లస్ ఎమ్ కాక్రన్ కాన్సులేట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాలేజీ సెమినార్ సందర్భంగా మద్రాస్ నుంచి తిరుపతికి సెమినార్‌కు వచ్చారు. అక్కడ డిస్కషన్స్ అన్నీ పూర్తయి, వెళ్లిపోయారు. ఆ సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఇరాన్ పొలిటికల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. చెన్నైలోని అమెరికన్ ఎంబసీ ఎదుట నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో సేఫ్‌గా ఉండమని రాసిన నోట్ తిరిగి మమ్మల్ని కలిపింది. ఆ తర్వాత జరిగిన డిస్కషన్స్ మమ్మల్ని మంచి స్నేహితులుగా మార్చాయి. 1985లో మేం పెళ్లి చేసుకున్నాం. ఆ విధంగా శ్రీమతి డగ్లస్ ఎమ్ కాక్రన్ అయ్యాను. జీవితంలో ఒక అద్భుతమైన వ్యక్తిని కలిసాను అనిపించేది. మా అమ్మను ఆమె సొంత కొడుకుల కన్నా డగ్లస్ గొప్పగా చూసుకున్నారు. ఇన్నేళ్ల మా జీవనంలో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఇటీవల డగ్లస్ అనారోగ్యంతో భౌతికంగా దూరమయ్యారు. అయితేనేం.... ఆ జ్ఞాపకాలు ఎంతో పదిలంగా ఉన్నాయి. అవే నన్ను శక్తిమంతురాలిని చేస్తున్నాయి. విశ్రాంత జీవనంలో.. రిటైర్ అయినా కొన్ని విదేశీ కంపెనీలు, సూపర్మార్కెట్స్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించేవారు డగ్లస్. నేను రిటైర్ అయిన తర్వాత ఎక్కడ ఉండాలో ఇద్దరమూ ఆలోచించుకున్నాం. అందుకు, సికింద్రాబాద్‌లోని బోయినపల్లి మాకు అనువైనదిగా అనిపించింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. మా ఇంట్లోనే కాదు మా చుట్టుపక్కల ఇళ్లలో పనులు చేసే వారి పిల్లలకు మంచి చదువు చెప్పించాలనే ఉద్దేశ్యంతో వారిని ఒక చోట చేర్చి చదువులు చెప్పేవాళ్లం. కాలనీలోని చదువుకున్న మహిళల చేత ట్యూషన్స్ చెప్పించేవాళ్లం. వారి పిల్లలను కాన్వెంట్ స్కూల్లో చేర్పించి, మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకునేవాళ్లం. అలా, ఆ పిల్లలు కూడా ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అమ్మానాన్నల పెంపకంలోనూ, చదువులోనూ, సమాజంలో మనకు లభించే స్వేచ్ఛ దుర్వినియోగం చేసుకోకూడదు. ఆ స్వేచ్ఛను మనకు అనుకూలంగా మలచుకోవాలి. అదే మనల్ని శక్తిమంతులుగా నిలుపుతుంది అది ఏ దేశమైనా అని నేనూ కాక్రన్ అనుకునేవాళ్లం’’ అంటూ నేటి తరంలో వస్తున్న మార్పులను అన్వయించుకుంటూ తెలియజేశారు’’ కమలా మీనన్. – నిర్మలారెడ్డి -
సైకిల్‌పై అద్వానీ.. పోస్టాఫీసులో కమల.. పెళ్లి జరిగిందిలా!
బీజేపీ మాజీ అధ్యక్షుడు, అటల్ ప్రభుత్వంలో ఉప ప్రధాని సేవలందించిన లాల్ కృష్ణ అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను అందజేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నేపధ్యంలో అద్వానీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత రాజకీయాల్లో భీష్మ పితామహునిగా పేరొందిన అద్వానీ రాజకీయ జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా మార్గదర్శకునిగా నిలిచారు. కమలతో అద్వానీ వివాహం అత్యంత విచిత్ర పరిస్థితుల్లో జరిగింది. కమలా అద్వానీ పాకిస్తాన్‌లోని సింధ్‌లో జన్మించారు. ఆమె అసలు పేరు కమలా జగత్యాని. విభజన తర్వాత వారి కుటుంబం భారతదేశానికి తరలి వచ్చింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కమల చదువు పూర్తి చేసుకున్నాక, ఢిల్లీ పోస్టాఫీసులో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఇదీ చదవండి: ఎల్కే అద్వానీకి భారతరత్న.. మోదీ భావోద్వేగం అదే సమయంలో ఆమెకు లాల్ కృష్ణ అద్వానీ నుంచి వివాహ ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో లాల్ కృష్ణ అద్వానీ జర్నలిస్టుగా పనిచేసేవారు. ప్యాంటు షర్టు వేసుకుని, సైకిల్‌పై ఆఫీసుకు వెళ్లేవారు. కమల అద్వానీలకు 1965, ఫిబ్రవరి 25న వివాహం జరిగింది. అద్వానీ భార్య కమలా అద్వానీ రాజకీయాల్లో కాలుమోపనప్పటికీ, పలు కార్యక్రమాలలో అద్వానీతో పాటు కనిపించారు. ఆమె అద్వానీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు. అలాగే అద్వానీ తినే ఆహారం మొదలుకొని, అతనిని కలుసుకునే వారి జాబితా వరకు అన్నింటిపై కమలా అద్వానీ ఒక కన్నేసి ఉంచేవారు. అద్వానీ ఒక సందర్భంలో తాను దేశానికే హోంమంత్రినని, ఇంటిలో తన సతీమణి కమలనే హోంమంత్రి అంటూ చమత్కరించారు. -
వద్దన్నా నాతో బలవంతంగా డ్యాన్స్ చేయించారు
భువనేశ్వర్: ఒడిషాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కమలా పుజారి తీవ్ర అనారోగ్యంతో ఈ మధ్య ఆస్పత్రి పాలయ్యారు. ఆమె పరిస్థితి విషమించిందని, కోలుకోవడం కష్టమని వైద్యులు సైతం చేతులేత్తేశారు. అయితే 71 ఏళ్ల ఆ పెద్దావిడ అనూహ్యంగా కోలుకుని.. ఇంటికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇదిలా ఉంటే.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే ముందు.. ఐసీయూలో ఆమె డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో సదరు వీడియోపై ఆమెకు ప్రశ్నలు ఎదురుకాగా.. ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యం బాగోలేకున్నా తనతో బలవంతంగా డ్యాన్స్ చేయించారంటూ ఆమె సోషల్ వర్కర్ మమతా బెహెరాపై ఆరోపణలు గుప్పించారు. ‘డ్యాన్స్ చేయాలనే ఉద్దేశం నాకు ఎంత మాత్రం లేదు. వద్దని నేను ఆమెతో(మమతను ఉద్దేశించి) చెప్తూనే ఉన్నా. కానీ, ఆమె వినలేదు. అప్పటికే నేను అనారోగ్యంతో కుంగిపోయి ఉన్నా. ఒపిక లేదు. అయినా బలవంతంగా నాతో ఆమె డ్యాన్స్ చేయించింది’ అని కోరాపుట్‌లో తన ఆరోగ్యంపై పరామర్శించేందుకు వచ్చిన మీడియాతో కమల పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఒడిషా పజారా గిరిజన తెకు చెందిన కమలా పుజారికి వ్యవసాయ రంగంలో అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీని 2019లో అందుకున్నారు. సేంద్రీయ వ్యవసాయం, 100 రకాల పాతతరం విత్తనాల నిల్వకుగానూ ఆమె ఈ గౌరవం దక్కింది. అయితే.. కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఆమె పరిస్థితి విషమించగా.. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటున్నారు. ఇక బలవంతంగా ఆమెతో డ్యాన్స్ చేయించిన ఘటనకుగానూ.. మమతపై ఒడిషా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పజారా తెగ సంఘం నేత హరీష్ ముదులీ డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే.. ఆందోళన చేపడతాని హెచ్చరించారు. మరోవైపు ఆమె చికిత్స అందుకున్న కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఈ వ్యవహారంపై స్సందించింది. పుజారా ఐసీయూలో అడ్మిట్ కాలేదని, ఆమెకంటూ ప్రత్యేకమైన క్యాబిన్ ఒకటి కేటాయించామని, ఆ క్యాబిన్‌లోనే సదరు డ్యాన్స్ వీడియో వైరల్ అయ్యిందని ఒక ప్రకటనలో తెలిపింది. ఇక పుజారితో పాటు ఆస్పత్రిలో వెంట ఉన్న రాజీబ్ హిలాల్.. మమతా బెహెరా ఎవరో తనకు తెలియదని, అభిమానంటూ సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చి ఇదంతా చేసిందని తెలిపారు. మమతా బెహెరా మాత్రం ఆమెలో బద్ధకాన్ని పొగొట్టి.. హుషారు నింపేందుకు అలా చేయించానని చెప్తున్నారు. Video Source: OTV ఇదీ చదవండి: బస్సు ఫుట్‌బోర్డు ప్రయాణం.. చావు తప్పి.. -
అమెరికాలో కృష్ణాజిల్లా యువతి మృతి
-
అమెరికాలో కృష్ణాజిల్లా యువతి మృతి
సాక్షి, గుడ్లవల్లేరు: సెల్ఫీ సరదా మరో నిండుప్రాణాన్ని బలి తీసుకొంది. కోటి ఆశలతో సప్త సముద్రాలు దాటి వెళ్లిన యువతి నూరేళ్ళ జీవితాన్ని చిదిమేసింది. ఉన్నత చదువుల కోసం వెళ్ళిన కూతురిని జలరక్కసి మింగేయటంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అమెరికాలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి కృష్ణా జిల్లా యువతి దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె కమల (27) గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్లారు. ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం కొలంబియాలో ఉద్యోగం చేస్తున్నారు. ఒహాయోలోని మేఫీల్డ్ హైట్స్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తూ అట్లాంటా సమీపంలోని జలపాతం వద్ద ఆగారు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతి చెందారు. నాట్స్ సహకారంతో ఆమె మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చెన్నైలోని పెద్దకుమార్తె వద్దకు వెళ్లిన తల్లితండ్రులు విషయం తెలిసి తల్లడిల్లిపోతున్నారు.అందరినీ ఆప్యాయంగా పలకరించే కమల ఇక లేదన్నా విషయాన్ని కుటుంబ సభ్యులు ,గ్రామస్థులు జీర్ణించుకోలేకున్నారు. -
కమలా మేడమ్
‘వెల్కమ్ మై ఫ్రెండ్’ అంటూ మొదలయ్యే మూడు వాక్యాల బుల్లి కథ. దానికి తెలుగులో అర్థం. ఎదురుగా బొమ్మ. మరో పేజీలో ‘ద ఎలిఫెంట్ అండ్ ద డాగ్ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్’ అంటూ ఏనుగు– కుక్క కథ. ఇవన్నీ స్కూలుకెళ్లే పిల్లల కోసం అజ్వాని కమల మేడమ్ రూపొందించిన చిన్న కథల పుస్తకాల్లోని బుజ్జి బుజ్జి కథలు. ‘ఐ కెన్ రీడ్ బై మైసెల్ఫ్’ అంటూ ఆమె చిన్న పిల్లల కోసం కథల పుస్తకాలు తయారు చేశారు. ఇందుకు తగిన కారణమే ఉంది. కారణం కన్నా ఆమె స్వీకరించిన సామాజిక బాధ్యత ఉంది. ‘‘మన దగ్గర తెలుగు మీడియంలో చదివే పిల్లలకు పదేళ్లు వచ్చేవరకు ఇంగ్లిష్తో పరిచయమే ఉండడం లేదు. ఐదారు తరగతుల్లో ఇంగ్లిష్ అక్షరాలు నేర్చుకోవడం, ఆ వెంటనే పాఠాలు మొదలవుతున్నాయి. బాగా చదువుతూన్న పిల్లలు కూడా ఇంగ్లిష్ భయంతో స్కూలు ఎగ్గొడతారు. నిజానికి ఇంగ్లిష్ భాష పిల్లలను బడి దొంగలుగా మార్చే మహమ్మారి కాదు. చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్‌ను పరిచయం చేస్తే పెద్దయ్యాక ఇంగ్లిష్‌ని మించిన ఫ్రెండ్ మరొకరు ఉండరు. భూగోళంలో ఎక్కడికి వెళ్లినా మనకు తోడు ఎవరూ లేకపోయినా ఇంగ్లిష్ భాషే తోడుగా ఉండి నడిపిస్తుంది’’ అంటారు కమలా మేడమ్. మన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యలో ఇంగ్లిష్ లేకపోవడం తో ఆమె స్వయంగా కరికులమ్ రూపొందించారు. లెవెల్–1, లెవెల్–2.. ఇలా మొత్తం 120 పుస్తకాలకు రూపమిచ్చారు. తొంభయ్ ఏళ్ల వయసులో చలాకీగా స్కూళ్లకు వెళ్లి ఆ పుస్తకాలను పిల్లలకు పంచుతున్నారు, ఇంగ్లిష్ పాఠాలు చెబుతున్నారు. తెలుగింటి కోడలు కమల 1931లో చెన్నైలో జన్మించారు. విద్యావంతుల కుటుంబం. తండ్రి అజ్వాని డాక్టర్, తల్లి చంద్రావతి. కమల ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. జెట్టి దశరథరామిరెడ్డిని పెళ్లి చేసుకుని నెల్లూరును సొంతూరు చేసుకున్నారామె. ఆమెకు చదువుకోవడం, చదువు చెప్పడం ఇష్టం. ఆ ఇష్టంతోనే పెళ్లి తర్వాత ఎం.ఈ. చేశారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగం చేశారు. అదే సమయంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ అవసరాన్ని తెలియచేస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆమె సూచనతో 1962లో ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా, కాకినాడలో మహిళా పాలిటెక్నిక్ కళాశాలను స్థాపించింది. అది ఆసియా ఖండంలోనే మహిళల కోసం స్థాపించిన తొలి పాలిటెక్నిక్ విద్యాసంస్థ. ఆ కాలేజ్‌కు ప్రిన్సిపల్‌గా కమలా మేడమ్‌నే నియమించింది ప్రభుత్వం. గుంటూరు, మహిళా పాలిటెక్నిక్ కాలేజ్, నెల్లూరు కరికులం డెవలప్మెంట్ సెంటర్లో విధులు నిర్వర్తించారు. తేలిగ్గా చదవాలి ప్రభుత్వ స్కూలు పిల్లలతో కమలామేడమ్ విద్యావిధానాన్ని తేలిక పరిచిన గురువు ఆమె. సివిల్ ఇంజనీరింగ్ సిలబస్‌లో పాఠ్యాంశాలు బరువైన శాస్త్ర సాంకేతిక పదాలతో ఉండేవి. ఇంగ్లిష్ నేపథ్యం లేని విద్యార్థులకు ఏ మాత్రం కొరుకుడు పడనంత కఠినమైన పారిభాషిక పదాలుండేవి. దాంతో స్టూడెంట్స్ ఫెయిలయ్యేవాళ్లు. కొంతమంది కోర్సు సగంలో వదిలేసే వాళ్లు. ఇదంతా గమనించిన కమలామేడమ్కి సబ్జెక్టు సులభంగా అర్థం అయితే ఈ దుస్థితి రాదనిపించింది. తేలికైన ఇంగ్లిష్పదాలతో ఇంజనీరింగ్ పాఠ్యాంశాలన్నింటినీ తిరిగి రాశారామె. అలా ఇంజనీరింగ్ వాళ్ల కోసమే పదకొండు పుస్తకాలు రాశారు. ఆమె చూపించిన దారిలోనే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ప్రొఫెసర్లు కూడా కొత్త పుస్తకాలు రాసుకున్నారు. విద్యార్థుల కోసం ఆమె తీసుకున్న ఆ చొరవ ఆమెను విద్యాశాఖ టెక్నికల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ని చేసింది. కీలకమైన బాధ్యతలు నిర్వర్తించి 1989లో రిటైర్ అయ్యారు కమల. అమెరికా వెళ్లారు.. కానీ కమలామేడమ్కి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అందరూ యూఎస్‌లో సెటిలయ్యారు. రిటైర్ అయిన తర్వాత భర్తతో పాటు మేడమ్ కూడా అమెరికా వెళ్లారు. ఎనిమిది మంది మనుమలు– మనుమరాళ్లతో సంపూర్ణమైన జీవితాన్ని గడిపారు. ఐదేళ్ల కిందట భర్త పోవడంతో ఆమె ఇండియాకు తిరిగి వచ్చేశారు. మిగిలిన జీవితం సమాజానికే అని స్థిరంగా నిశ్చయించుకున్నారు. నాలుగేళ్ల నుంచి ఆమె నెల్లూరు జిల్లాలోని గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్పించడం అనే మహాయజ్ఞాన్ని తలకెత్తుకున్నారు. శేష జీవితం విద్యాసేవకే అంకితం అని స్వచ్ఛంగా నవ్వారు కమలా మేడమ్. – కొండా సుబ్రహ్మణ్యం, సాక్షి, నెల్లూరు ఫొటోలు: ఆవుల కమలాకర్ ఇంగ్లిష్ మీడియం అత్యవసరం ప్రస్తుతం అన్నిరంగాల్లో పోటీ పెరిగింది. ఉద్యోగాలు రావాలంటే ఇంగ్లీష్ రాయడం, చదవడం, మాట్లాడటం బాగా వచ్చి ఉండాలి. ఇంగ్లిష్ రాకపోవడం అనే ఒకే ఒక్క కారణంగా చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు కూడా వాళ్ల చదువుకు సంబంధం లేని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వపాఠశాలల్లో మాతృభాషతో పాటు ఇంగ్లీషులో విద్యాబోధన జరగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారు. రాబోయే తరాల భవిష్యత్తు గురించి ఆలోచించగలిగిన దార్శనికత అది. – అజ్వాని కమల, విశ్రాంత జాయింట్ డైరెక్టర్, స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు -
ఇల్లాలి ఇల్లు
పెద్దగా చదువుకోని కమలకు చిన్న ఉద్యోగం దొరికింది. కష్టపడి ఏ పనైనా చెయ్యటానికి సిద్ధపడే వారికి ఏదో ఒక ఉద్యోగం దొరకకపోదు. ఉద్యోగం దొరికిన కొన్నాళ్లకి తనకంటూ తనదైన ఒక ఇల్లు ఎంత చిన్నదైనా సరే, అద్దెకు సంపాదించాలనుకుంది. కాని ఇల్లు దొరకటం ఉద్యోగం దొరకటమంత సులభంగా లేదు. మీరెంతమంది వుంటారు? నేనొక్కతినే! మీవారు, పిల్లలూ ఈ ఊళ్లో ఉండరా? మావారుంటారు. పిల్లలు పెళ్లిళ్లయి దూరంగా ఉన్నారు.’’ మీవారు మిమ్మల్ని విడిచిపెట్టారా? లేక విడాకులిచ్చారా?’’ లేదు’’ మీవారేం చేస్తూ వుంటారు?’’ కమల చెప్పింది. అంత పెద్ద ఉద్యోగస్థుడి భార్య అయిన మీరు ఇంత చిన్న ఇంట్లో ఉండగలరా?’’ అనే అనుకుంటున్నాను’’ మీ ఇద్దరు దెబ్బలాడుకున్నారా?’’లేదు’’ మీకు స్వంత ఇల్లుందా?’’లేదు’’ మీరో అద్దె ఇంట్లోనూ, మీ ఆయనో అద్దె ఇంట్లోనూ ఉంటారా?’’కాదు. నేను అద్దె ఇంట్లోనూ, ఆయన తన స్వంత ఇంట్లోనూ ఉంటాము.’’ ఆయన స్వంత ఇల్లు మీది కాదా?’’ కాదుట’’ ఎవరన్నారు?’’ ఆఖరికి కమల వయస్సే ఉన్న ఒక అవివాహిత స్త్రీ కమల ఆఫీసులోనే పనిచేస్తున్న ఆవిడ చిన్న ఇంట్లో చిన్న భాగం విడిగా ఏర్పాటు చేసి కమలకి అద్దెకిచ్చింది, కంపెనీ కోసం. ఆ మర్నాడు కమల ఆఫీసుకు సెలవు పెట్టి బాంకుకు వెళ్లింది. బాంకులో ఆమె పేర్న తండ్రి పోతూ పోతూ వేసిన పదివేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నాయి. దానిమీద అయిదు వేలు అప్పు తీసుకుని ఇంటికి కావలసిన మంచం, పరుపు, స్టౌ, పప్పులు, ఉప్పులు కొనిపెట్టుకుంది. ఆ పైన భర్త ఇంటికి వెళ్లింది. ‘‘ఇన్నాళ్లూ మీరు నన్ను పోషించారు. నేను చాకిరీ చేసాను. రెండింటికీ చెల్లు. ఇందులో నా ఎడ్రస్ ఇస్తున్నాను. ఆ ఇల్లు అద్దెది. కాని అది ‘నా’ అద్దె ఇల్లు. మీకెప్పుడైనా రావాలనిపిస్తే రండి’’ అని చీటి వ్రాసిపెట్టి, తాళం వేసి, చెవి పక్కింట్లో ఇచ్చింది. ఊరు వెళ్తున్నారా?’’ ‘‘లేదు. నా ఇంటికి వెళ్తున్నాను.’’ కమల భర్త కమల పెట్టిన ఉత్తరం చూసుకున్నాడు. ఆ కోపంలో కమల చేసిన తెలివితక్కువ పని గురించి ఆమె తమ్ముడికి, తన సంతానానికి ఉత్తరాలు వ్రాసిపడేసాడు. ఉత్తరం అందగానే కమల తమ్ముడు కృష్ణ పరిగెత్తుకు వచ్చాడు. బావగారు చెప్పినది విన్నాడు. చిరునామా తీసుకున్నాడు. ‘‘నువ్వు చేసిన పనేం బాగాలేదక్కా. బావగారు ముక్కోపే! ముప్పై యేళ్లు సర్దుకొన్నదానివి. అయినా బావకి దూరంగా కొన్నాళ్లుందాం అని నువ్వనుకొంటే వచ్చి నా దగ్గరుండరాదా? నీ కొడుకు దగ్గరకు వెళ్లరాదా? (అయినా) అది నీ ఇల్లు కాదా? అంతింటికి యజమానురాలివి ఈ దోసెడు కొంపలో ఎందుకు ఇరికావు?’’ కమల తాపీగా జవాబు చెప్పింది. ‘‘అది నా ఇల్లు కాదు, ఒకప్పుడు నాదే అనుకున్నాను. ఆయన పెంచుకుంటున్న కుక్కదెట్లా కాదో, నాదీ అట్లానే కాదు. ఆయన కుక్కనీ ఆపేక్షగానే చూసుకొంటారు, నన్నూ ఆపేక్షగానే చూసుకొంటారు. అంతమాత్రాన మాకు ఇంటిమీద హక్కులుండవు.’’ ‘‘ఎందుకక్కా అంత నిష్ఠూరంగా మాట్లాడ్తావు! ఏదో విషయంలో నీ మనస్సుకి నొప్పి కలిగింది. ఆ నొప్పి తగ్గేవరకు వచ్చి నాతో ఉండు.’’ ‘‘అది నా ఇల్లు కాదని విడిచిపెట్టాను. నీ ఇల్లూ నాది కాదు కనుక రాను.’’ కమలకు పెళ్లయిన కొత్తలో పుట్టింటికి వెళ్లినప్పుడు, పాత అలవాటు ప్రకారం వాళ్లమ్మ పాత న్యూస్ పేపర్లు అమ్మగా వచ్చిన డబ్బును అక్కా తమ్ముడికీ సమానంగా పంచినప్పుడు కృష్ణ, ‘‘ఆడపిల్లకి పెళ్లవగానే అత్త వారింట్లో హక్కు లేర్పడ్తాయి. పుట్టింట్లో పోతాయి. ఏదో ఒక ఇంటి సంపదలోనే వాటా వస్తుంది. అవ్వాబువ్వా ఎలా వస్తాయి!’’ అన్నాడు. ‘‘రెండ్రూపాయలకెన్ని మాటలన్నావురా! రేపు నీ ఇంటికి నన్ను రావద్దంటావురా!’’ అంది కమల బాధగా. ‘‘అదేమిటక్కా! నీకీ ఇంట్లో ఎప్పుడూ స్థానముంటుంది’’ అన్నాడు నొచ్చుకుంటూ. కమలకి నిజానికి పుట్టింట్లో ఏ లోటూ జరగలేదు. కానీ కమలని బాధిస్తున్నది హక్కుగా ఏదీ రాకపోవటం. అన్నీ బహుమానాలుగానే రావటం. బహుమానాలు అవతలి వాళ్లు ఆపేక్షతో పెట్టే భిక్షలు. ‘‘అది మన ఇల్లు కాదురా! అది నీ ఇల్లు. అక్కడ నేను అతిథిని. మీ బావగారింట్లో దాసిని.’’ ‘‘బావగారు మంచివారని నువ్వూ ఒప్పుకుంటున్నావు కదా!’’‘‘అది మంచికి నువ్విచ్చే నిర్వచనం మీదుంటుంది. నేను కోరుకునే స్వేచ్ఛని బట్టీ ఉంటుంది. ఆయన ఇచ్చింది నేను తీసుకొంటున్నంత కాలం ఏ సమస్యా ఉండదు. నేను నాకింత కావాలని అడిగి ఆయన ఇవ్వకపోతే సమస్యలు మొదలవుతాయి.’’ ‘‘అన్నీ ఆయన అమరుస్తుంటే నీకు ఇంకా డబ్బెందుకు?’’ ‘‘నువ్విక్కడ రెండ్రోజులుండు. నీ జేబులోని డబ్బు నాకివ్వు. నీ అవసరాలు గమనించి నేనే నీకు అన్నీ అమరుస్తాను. ఆ స్వర్గం అనుభవిస్తే గాని అర్థం కాదు.’’ ‘‘నువ్వు లేని సమయంలో నాకు కాఫీ తాగాలనిపిస్తే?’’ ‘‘ఆయన లేని సమయంలో నాకనిపిస్తే?’’ ‘‘ఇంట్లోనే ఉంటావు కదా కలుపుకొంటావు!’’ ‘‘ఇప్పుడు నువ్వూ ఇంట్లోనే కదా ఉండబోతున్నది. కలుపుకుంటావు. ఎంత జాగ్రత్తగా కలుపుకుంటావంటే పాలవాడు పోసిన పాలు అన్ని అవసరాలకి సరిపడేలాగా జాగ్రత్తగా కలుపుకుంటావు. నేను ఆఫీసునుంచి వచ్చి ఓ కప్పు కాఫీ కోరవచ్చునన్న స్పృహతో కలుపుకొంటావు. పాలు వలకకుండా కలుపుకుంటావు. కొలిచి కలుపుకుంటావు.’’ కమల మాటలకి కృష్ణ అప్రతిభుడయ్యాడు. అక్కడ భోంచేసి, బావగారైన రామారావు దగ్గరకు వెళ్లి రాయబారం విఫలమైనదని చెప్పాడు. రామారావు వెంటనే వెళ్లలేదు. తన భార్య విడిగా ఉండటం గురించి అందరూ అడుగుతుంటే అవమానం అయిపోతోందని ఓ పదిరోజుల తరవాత వెళ్లాడు. ‘‘ఇంటికి రా!’’ అన్నాడు. ‘‘ఎవరింటికి?’’ అని అడిగింది కమల. ‘‘మనింటికి’’ అన్నాడు రామారావు. ‘‘అది మన ఇల్లు అన్న విషయం మీ నోటంట మొదటిసారి వింటున్నాను’’ ‘‘ఎప్పుడు కాదన్నాను?’’‘‘లక్షసార్లు’’ కమల ఒక్కొక్క సందర్భం చెప్పుకు వచ్చింది. కమల పుట్టింటి విషయం వచ్చినప్పుడల్లా ‘‘మీ ఇంట్లో అట్లాగేమో కాని...’’ అంటూ ఉంటాడు. కమలను వేరు చేస్తూ ‘‘మా ఇంట్లో అట్లా కాదు’’ అంటూ ఉంటాడు. ఎన్నాళ్లయినా ‘మీ’ ‘మా’లు పోయి మన అన్న మాట ఏర్పడలేదు. ఏదన్నా భేదాభిప్రాయం వ్యక్తం చేస్తే, ‘‘ఇది నా యిల్లు. నా ఇంట్లో నా మాటే నెగ్గాలి’’ అనేవాడు. ‘‘నా పుట్టింట్లో ఇది నా యిల్లంటారు. మీరేమో నా పుట్టింటి గురించి ‘మీ ఇల్లు’ అంటూ ఉంటారు. ఈ రెండింటిలో ఏది నా యిల్లు?’’ అడిగింది కమల ఓరోజు. ‘‘ఆడవాళ్లకేమిటి! అన్నీ వాళ్ల ఇళ్ళే’’ అని దాన్ని హాస్యంలోకి దింపి కొట్టిపారేసాడు. కమల ఇంట్లోంచి బయటికి వచ్చిన నెల రోజులకి తల్లిని ఒప్పించి తీసుకు వెళ్లటానికి కొడుకు నారాయణ వచ్చాడు. ‘‘అమ్మా పోనీ వచ్చి నా దగ్గర ఉండు’’ అన్నాడు. ‘‘నీ ఇంట్లో ఉంటే నా ఉద్యోగం ఏమవుతుంది! ఉద్యోగం వదులుకొని వచ్చినా నీ ఇంటి పద్ధతి నాకు పడదు. నాకోసం మీ పద్ధతులు మార్చుకోలేరు కదా’’ అంది కమల. ‘‘అమ్మా! నా ఇంట్లో నా భార్యకుగాని నాకు గాని పూర్తి స్వేచ్ఛ ఉందా?’’ అన్నాడు నారాయణ. ‘‘కావచ్చు, కాని నువ్వు నీ ఇంట్లో బానిసవు కావు’’ అంది కమల. ‘‘అమ్మా, భార్య భర్తకి బానిస. భర్త మొత్తం కుటుంబానికి బానిస. పూర్తి స్వేచ్ఛ ఎక్కడా ఉండదు. పరిమితుల్ని గుర్తించటమే స్వేచ్ఛ అంటారు’’ అన్నాడు నారాయణ. ‘‘నాకు పెద్ద విషయాలు అర్థంకావురా నారాయణా! వ్యవస్థ మారితేగానీ మారనివి కొన్ని వున్నాయి నిజమే. కాని కొన్ని వ్యక్తులు మారటం ద్వారా మారగలిగినవి ఉన్నాయి. మగవాళ్లు మాటల్లో, ప్రవర్తన్లో కొంత అహంకారాన్ని వదులుకుంటే, స్త్రీలకి ఓ మనస్సుందని గుర్తిస్తే చాలు స్త్రీల జీవితంలో మల్లెలు పూస్తాయి.’’ ‘‘ఇది నీ ఇల్లా అమ్మా?’’ నారాయణ అడిగాడు. ‘‘అవును. ఇక్కడ నా మాట చెల్లుతుంది’’ అంది కమల. -
ఓ కమల కన్నీటి కథ
కట్టుకున్న భార్యను కన్నుల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన భర్త.. మద్యానికి బానిసై, చేసిన అప్పులు తీర్చడానికి తన భార్యను గల్ఫ్‌లోని వ్యాపారికి అమ్మేశాడు. ఆ బాధితురాలికి అక్కడి అరబ్బు షేక్‌లు నరకం చూపించారు. వారి బారి నుంచి ఎలాగో తప్పించుకుని తనను గల్ఫ్‌కు రప్పించిన ఏజెంట్ దగ్గరికి వెళ్లి గోడు వెళ్లబోసుకుంటే ఆ ఏజెంటు తన భార్యతో కలిసి ఆమెపై చెయ్యి చేసుకున్నాడు. చీకటి గదిలో బంధించారు. బతికి బయటపడతానో లేదో అనే సందేహంతో రోజులు వెళ్లదీసిన ఆమెకు ఎట్టకేలకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, తెలంగాణ జాగృతి ప్రతినిధి నవీన్ చారీల చొరవతో విముక్తి లభించింది. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లికి చెందిన అంగ కమల వ్యథ ఇది. భర్త చేతిలో మోసపోయి దేశం కాని దేశంలో ఆమె పడిన కష్టాలు.. ఆమె మాటల్లోనే..! ప్రేమించి పెళ్లాడాడు నా భర్త సుదర్శన్‌ది మా ఊరే. 25 ఏళ్ల కిందట నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అతనికి భార్యా పిల్లలు ఉన్నారు. ప్రేమించానని వెంటపడటంతో కాదనలేకపోయాను. మాకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ఇంటర్ వరకు చదివి కూలి పని చేస్తున్నాడు. చిన్న కొడుకు ఇప్పుడు పదో తరగతి చదువుతున్నాడు. పెళ్లయ్యాక కొన్నేళ్ల పాటు మా కాపురం సజావుగానే సాగింది. గల్ఫ్ దేశాల్లో పని చేసే సుదర్శన్ ఆరు నెలలకు, ఏడాదికి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. తర్వాత కొన్నేళ్ల నుంచి గల్ఫ్‌కు వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడు. రోజూ తాగి వచ్చి కొట్టేవాడు. అడ్డు వచ్చిన పిల్లల్ని కూడా కొట్టేవాడు. భరించలేక మూడేళ్ల కింద నేను, పిల్లలు మా అమ్మ దగ్గరికి వెళ్లిపోయాం. తాను మారానని మళ్లీ వచ్చాడు సుదర్శన్. కూలీ పని చేస్తే ఎక్కువ సంపాదించుకోలేమని తాను మళ్లీ్ల గల్ఫ్‌కు వెళుతున్నాననీ, తనతో పాటు అక్కడకు వస్తే ఎక్కువ సంపాదించుకోవచ్చని చెప్పాడు. పాస్‌పోర్టు తెప్పించాడు. చాకిరి చేస్తూ చావు దెబ్బలు ఒమన్‌లో అరబ్బు షేక్‌ల ఇండ్లలో పని చేస్తే నెలకు రూ.20 వేల వరకు వేతనం ఉంటుందని, తను కూడా ఒమన్‌లోనే మంచి కంపెనీలో పని వెతుక్కున్నానని చెప్పాడు. మొదట నన్ను ఒమన్‌కు పంపిస్తున్నానని, కొన్ని రోజుల తరువాత తాను అక్కడకు వస్తానని, అంతవరకు తన స్నేహితుడు భాస్కర్ నాకు ఒమన్‌లో అండగా ఉంటాడని చెప్పాడు. ఒమన్‌లో ఇంటిపని వీసా తీయించి ఈ ఏడాది మే 18న నన్ను ఒంటరిగానే పంపించాడు. నా భర్త చెప్పినట్లు భాస్కర్, అతని భార్య మణిలు నా కోసం ఎయిర్‌పోర్టుకు వచ్చి నన్ను తీసుకెళ్లారు. నన్ను వాళ్ల ఇంట్లోనే ఉంచుకున్నారు. అక్కడ నాకు.. భాస్కర్‌కు చెందిన కార్లు కడిగి తుడిచే పని అప్పగించారు. తీవ్రమైన ఎండలో పని చేయడంతో నా చేతులకు బొబ్బలు వచ్చాయి. ఈ పని చేయలేనని, మరే పనైనా చెప్పమని ప్రాధేయపడ్డాను. దీంతో ఒక షేక్ ఇంటిలో పని చేయడానికి పంపించాడు. కోటలాంటి ఇంట్లో ఆకలి మంటలు ఆ షేక్ ఇల్లు చిన్న కోటలా ఉంది. ఆ ఇంట్లో చిన్న పిల్లలు, పెద్దవారు కలిసి మొత్తం పది మంది ఉండేవారు. వారందరికి సేవ చేయడంతో పాటు ఇంటి పని చేసేదాన్ని. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పగలు, రాత్రి అనే తేడా లేకుండా పని చెబుతూనే ఉండేవారు. పని చేయలేకపోతుంటే కొట్టేవారు. కనీసం నేను తిన్నానా లేదా అని కూడా ఆలోచించేవారు కాదు. అరబ్బి భాష రాకపోవడంతోనే సైగలతోనే వారికి నా బాధను తెలిపాను. అయినా కనికరం చూపేవారు కాదు. తిని పారేసిన ఖర్బూజాను తిన్నాను పని భారంతో ఆకలి బాధ అంతా ఇంతా ఉండేది కాదు. కడుపు మాడుతున్నా షేక్‌లు చెప్పిన పని చేసేదాన్ని. ఆకలి అవుతుందని సైగ చేస్తే పాచి పోయిన రొట్టె ఇచ్చేవారు. కడుపు మంటను చల్లార్చుకోవడానికి తినడానికి ఇష్టం లేక పోయినా రొట్టెను తినడానికి కష్టపడ్డాను. చివరకు వారు తిని పడేసిన ఖర్బూజ ముక్కలను చెత్త బుట్ట నుంచి తీసుకుని తిని ఆకలి బాధ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాను. అలా మొదటి షేక్ ఇంట్లో పదిహేను రోజుల పాటు పని చేశాను. ఆ షేక్ ఇంట్లో చాకిరి చేస్తూ చావు దెబ్బలు తిన్న నేను ఆఫీస్‌కు పంపించాలని అడిగితే భాస్కర్ వద్దకు పంపించారు. నన్ను ఇంటికి పంపించి వేయాలని భాస్కర్‌ను అడిగితే అతని భార్య మణితో కొట్టించాడు. మరో షేక్ ఇంటికి పని కోసం పంపించాడు. రెండో షేక్ ఇంట్లో మరింత నరకం చూసాను. అక్కడ పదిహేను రోజుల పాటు పని చేసి ఆఫీస్‌కు పంపించాలని వేడుకుంటే మళ్లీ భాస్కర్ వద్దకే పంపించారు. ఇద్దరు షేక్‌ల ఇండ్లలో పని చేస్తే నయాపైసా వేతనం ఇవ్వలేదు. కొన్నవాడు చెబితే తెలిసింది! అరబ్బు షేక్‌ల ఇండ్లలో పని చేయలేనని, తనను ఎలాగైనా ఇంటికి పంపించాలని భాస్కర్‌ను కోరితే అప్పుడు చెప్పాడు.. నా భర్త నన్ను అతనికి అమ్మేశాడని. నన్ను అమ్మడం ఏమిటని ఫ్రీ వీసా ఉందంటేనే ఒమన్‌కు వచ్చానని చెప్పినా భాస్కర్ వినలేదు. నన్ను కొనడానికి సుదర్శన్‌కు డబ్బులు ఇచ్చానని భాస్కర్ చెప్పడంతో తట్టుకోలేక పోయాను. నాపై పెట్టిన పెట్టుబడి తనకు రాలేదని చెబుతూ భాస్కర్ అతని భార్య మణి కలిసి నన్ను చిత్రహింసల పాలు చేశారు. రెండే రెండు మాటలు ఈ విషయాలన్నీ ఇంటికి చేరవేయడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. భాస్కర్ ఇంటిలో నాతో పాటు మరికొందరు ఆడవాళ్లు బందీలుగా ఉన్నారు. వారికి నా వేదన చెప్పడంతో భాస్కర్, మణిలకు తెలియకుండా ఇంటికి ఫోన్ చేసుకునే ఏర్పాటు చేశారు. నా కొడుక్కు నేను ఫోన్ చేసి ‘ఒమన్‌లో బతకడం కష్టంగా ఉంది.. ఇంటికి రప్పించండి’ అని రెండే రెండు మాటలు చెప్పాను. దీంతో మా బంధువులు భాస్కర్‌కి ఫోన్ చేసి మాట్లాడితే రూ.70 వేలు చెల్లిస్తేనే నన్ను ఇంటికి పంపిస్తానని చెప్పాడు. భాస్కర్ చెప్పిన విధంగా పాలకొల్లులో ఉన్న భాస్కర్ వ్యాపార భాగస్వామి రాజు ఖాతాలో రూ.70వేలను మా వారు జమ చేశారు. అయినప్పటికి నన్ను భాస్కర్ ఇంటికి పంపించలేదు. అంతేకాదు, నేను ఇంటికి ఫోన్ చేశానని తెలుసుకుని చీకటి గదిలో బంధించాడు. ఎంతో కష్టం మీద మరోసారి ఇంటికి ఫోన్ చేసి నా బాధను Ðð ళ్లబోసుకున్నాను. దీంతో మా కుటుంబ సభ్యులు స్థానికంగా నా కోసం ప్రయత్నాలు చేయడంతో ఈ జూలై 26న ఇంటికి చేరుకున్నాను. గుజరాత్ వరకే టిక్కెట్ బుక్ చేశాడు నాపై కక్ష పెంచుకున్న భాస్కర్ ఇంటికి పంపించడానికి ఒమన్ నుంచి హైదరాబాద్‌కు కాకుండా గుజరాత్ వరకే టిక్కెట్ కొని ఇచ్చాడు. ఈ టిక్కెట్ కోసం మా ఇంటివారు భాస్కర్‌కు రూ.12వేలు పంపించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన నేను హైదరాబాద్‌కు రావడానికి విమానం మారాల్సి ఉంటుందని అనుకున్నాను. కానీ నాకు ఇచ్చిన టిక్కెట్ గుజరాత్ వరకే ఉండటంతో అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు నన్ను బయటకు గెంటేశారు. నా అవస్థను జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన మహేష్ గుర్తించి ఎయిర్‌పోర్టు అధికారులతో మాట్లాడాడు. విమానం టిక్కెట్ ఇవ్వడంలో జరిగిన మోసాన్ని ఆయన గుర్తించి తన వద్ద ఉన్న సొమ్ముతో మరో టిక్కెట్‌ను హైదరాబాద్ వరకు కొనుగోలు చేసి ఇక్కడకు చేర్పించాడు. మహేష్ నాకు దేవుడిలా అహ్మదాబాద్‌లో కలిశాడు. అతను లేకుంటే నేను ఏమైపోయేదానినో ఊహిస్తేనే భయం వేస్తోంది. నేను రాగానే నా భర్త పరారయ్యాడు నేను ఇంటికి వస్తున్న విషయం తెలుసుకున్న నా భర్త సుదర్శన్ నేను రావడంతోనే పరార్ అయ్యాడు. ఒమన్‌లో నేను పడిన కష్టాలు అందరిని కలచివేసింది. కమ్మర్పల్లి పోలీసులకు నా భర్త మోసంపై ఫిర్యాదు చేశాం. ఇప్పుడింకా పరారీలో ఉన్నాడు. నా లాంటి కష్టం మరెవరికి రాకూడదు. నా అంత దురదృష్టవంతురాలు ఎవరు ఉండరేమో. నా పిల్లలను చూస్తానని అనుకోలేదు. నన్ను వంచించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. – ఎన్. చంద్రశేఖర్, సాక్షి, మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా) -
ఎడారి దేశంలో కుమిలిన ‘కమల’
కమ్మర్పల్లి (బాల్కొండ): ఉపాధి నిమిత్తం విదేశానికి వెళ్లి అష్టకష్టాల పాలైన ఓ మహిళా ఎంపీ చొరవతో స్వదేశానికి చేరుకుంది. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్పల్లికి చెందిన కమల, సుదర్శన్ దంపతులు. సుదర్శన్ తాగుడుకు బానిసవడం.. రోజురోజుకు కుటుంబ పోషణ భారమవడం.. ఈ క్రమంలో రూ.3 లక్షల దాకా అప్పులయ్యాయి. వీటిని తీర్చడానికి సుదర్శన్‌కు ప్రత్యామ్నాయ మార్గం కనిపించకపోవడంతో భార్యను ఉపాధి నిమిత్తం ఒమన్ దేశంలోని మస్కట్‌కు పంపించాడు. అక్కడ అరబ్‌షేక్ ఇంట్లో భాష సమస్య, 24 గంటల పనితో నరకయాతన అనుభవించింది. చేసిన పనులకు ఏదో వంకలు పెట్టి తీవ్రంగా హింసించేవారు. ఈ విషయాన్ని ఏజెంట్ రాజు, భర్త సుదర్శన్‌కు సమాచారం చేరవేసింది. పైసలు కావాలంటే బాగా కష్టపడాలని ఏజెంట్ ఉచిత సలహా ఇవ్వడంతో ఆమె షేక్ పెట్టిన కష్టాలను భరించి పని చేసింది. చివరకు వేధింపులకు తాళలేక తాను ఇక్కడ పని చేయనని కుటుంబ సభ్యులకు (భర్తకు కాదు) ఫోన్లో తెలిపింది. మస్కట్‌లో పడుతున్న కష్టాలను వివరించింది. ఇక్కడి నుంచి ఎలాగైన రప్పించాలని వేడుకుంది. కమల ఆవేదనను అర్థం చేసుకున్న సమీప బంధువులు స్పందించి అక్కడి, ఇక్కడి ఏజెంట్లతో మాట్లాడి రూ.70 వేలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. కానీ వారూ నమ్మించి మోసం చేశారు. దీంతో కమల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే.. కమల దీనస్థితిని ఆమె సమీప బంధువు వెంకటేశ్ ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లాడు. స్పందించిన కవిత అక్కడి రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడి కమలను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల క్రితం కమల స్వదేశం చేరుకుంది. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు భూమయ్య, లక్ష్మితో కలసి చౌట్పల్లిలోనే ఉంటోంది. కవితమ్మకు రుణపడి ఉంటా: కమల ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లిన తాను అక్కడి కష్టాలను తట్టుకొని మళ్లీ చౌట్పల్లి చూస్తాననుకోలేదు. అక్కడ పడిన కష్టం జన్మలో చూడలేదు. 6 గంటలే పని అని చెప్పి రోజంతా పని చేయించుకున్నారు. పని సరిగ్గా చేయకపోతే దెబ్బలు కొట్టారు. తినడానికి సరిగ్గా తిండి, తాగడానికి నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వలేదు. పని కారణంగా నీరసపడితే విశ్రాంతి తీసుకోనివ్వలేదు. ఆరోగ్యం బాగా లేకున్నా పని చేయించుకున్నారు. ఇక్కడే నా చావు రాసి పెట్టింది ఉం దనుకున్నా. అదృష్టం కొద్దీ ఎంపీ కవితమ్మ కృషితో ఇక్కడికి వచ్చాను. ఆమెకు జీవితాంతం రుణపడి ఉంటా. -
ఎట్టకేలకు ఫలించిన కమల కల
జయపురం : ఒడిశా రాష్ట్ర ప్రణాళికా బోర్డు సభ్యురాలు, దేశీ వ్యవసాయ రంగంలో అద్భుత విజయాలను సాధిం చి ప్రపంచ స్థాయిలో ఎట్టకేలకు ఫలించిన కమల కల అవార్డులు, బహుమతులు పొంది రాష్ట్రానికే వన్నె తెచ్చిన కొరాపుట్ జిల్లా జయపురం సమితిలోని పాత్రోపుట్ గ్రామవాసి కమల పూజారి చిరకాల వాంఛ నెరవేరింది. నేటి వరకు ఆమె పాడుబడిన పూరి గుడిసెలో ఉంటోంది. ప్రభుత్వం ఆమెకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు నిర్మించి ఇవ్వడంతో శుక్రవారం నూతన గృహప్రవేశం చేశారు. గతంలో ఆమెకు ప్రధాన మంత్రి గ్రామీణ అవాస్ యోజనలో ఇల్లు మంజూరు కాగా మొదటి విడత డబ్బు మంజూరు చేసిన అదికారులు తరువాత మిన్నకున్నారు. అందుచేత ఆమె తన పాడుబడిన ఇంటిలోనే ఉంటోంది. ఆమెను రాష్ట్ర ప్రణాళికా బోర్డు సభ్యురాలిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తరువాత ఈ విషయం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందింది. ముఖ్యంగా ఆమె చిరకాల వాంఛ ఒక మంచి ఇల్లు అని పత్రికలు, మీడియా ప్రధానంగా హైలైట్ చేయడంతో అధికారులు స్పందించారు. వెనువెంటనే ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకంలో ఒక చక్కటి ఇల్లును నిర్మించారు. ఆమె నూతన గృహ ప్రవేశ ఉత్సవంలో కొçరాపుట్ జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ దేవణ ప్రధాన్, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన డైరెక్టర్ గౌరీశంకర సాహు, జయపురం సమితి బీడీఓ మనోజ్ కుమార్ నాయక్, జూనియర్ ఇంజినీర్ సరోజ్ కుమార్ మహంతి, పంచాయతీ సమితి కార్యనిర్వాహక అధికారి అంభికా పాఢి, జీఆర్‌ఈఎస్ తదితర అధికారులు, గ్రామప్రజలు పాల్గొన్నారు. -
ఉండేందుకు ఇల్లు లేని మండలి సభ్యురాలు!
రసాయన ఎరువుల వల్ల వరి పంటకొచ్చే ముప్పుపై గ్రామస్తులను దశాబ్దాల క్రితమే చైతన్యం చేసిన కమలా పూజారి నేడు, గ్రామాల్లో మంచి నీటి సరఫరాకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారించారు. ఇప్పుడిక రాష్ట్ర ప్రణాళికా మండలి సభ్యురాలు కూడా అయ్యారు కాబట్టి ఆమె లక్ష్యసాధనకు ఉన్న అవాంతరాలు తొలగిపోవచ్చు. అయితే ఆమె సొంత గూటి సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది! కమలా పూజారి వయసు 67 ఏళ్లు. గిరిజన మహిళా రైతు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పత్రాపుట్ గ్రామం ఆమె స్వస్థలం. భుమియ గిరిజన తెగలో పుట్టిన కమలకు దేశీ వరి వంగడాలన్నా, సేంద్రియ వ్యవసాయమన్నా పంచప్రాణాలు. ఆమె పేరు ఇప్పుడు రాష్ట్రమంతా మారుమోగిపోతోంది. అందుకో బలమైన కారణమే ఉంది మరి. ఒడిశా రాష్ట్ర ప్రణాళికా మండలి సభ్యురాలిగా ఇటీవల కమల నియమితులయ్యారు. ఒక గిరిజన మహిళను రాష్ట్ర ప్రణాళికా బోర్డు సభ్యురాలిగా తొలిసారిగా నియమించిన ఘనత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు దక్కింది. నాడు వరికొచ్చే ముప్పుపై కమల నియామక ప్రకటన అందర్నీ ఆశ్చర్యపరచినప్పటికీ.. ఈ పదవి ఆమెకు అంత అయాచితంగా ఏమీ రాలేదు. సుసంపన్నమైన వ్యవసాయ జీవవైవిధ్యానికి.. ముఖ్యంగా అపురూపమైన దేశీ వరి వంగడాలకు ఒడిశాలోని జేపూర్ పెట్టింది పేరు. జేపూర్ బ్లాక్‌లోనే ఉంది కమల స్వగ్రామం పత్రాపుట్. వేలాది ఏళ్లుగా తమవై విరాజిల్లుతున్న వందలాది దేశీ వరి వంగడాలు అంతరించిపోతుండటం ఆమెను కలవరపరచింది. రసాయనిక వ్యవసాయం పుణ్యమా అని అందుబాటులోకి వచ్చిన కొత్త వంగడాల వల్ల దేశీ వంగడాలు కాలగర్భంలో కలసిపోతుండటం ఆమెకు సుతరామూ నచ్చలేదు. దేశీ వరి వంగడాలు అతివృష్టిని, కరువు కాటకాలను తట్టుకొని నిలబడి.. ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అంత విలువైన వంగడాల పరిరక్షణ సజావుగా సాగాలంటే సేంద్రియ వ్యవసాయం వ్యాప్తిలోకి తేవాలని కమలా పూజారి దశాబ్దాల క్రితమే గ్రహించారు. ఎమ్మెస్ స్వామినాథన్ ఫౌండేషన్ నేర్పిన మెలకువలు ఆమె తన లక్ష్యంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించేందుకు తోడ్పడ్డాయి. నేడు తాగునీటి సరఫరాపై లక్ష్య సాధనకు రైతుగా తాను పాటుపడటంతోపాటు తమ గ్రామంలో గడపగడపకు, ఆ ప్రాంతంలోని గ్రామ గ్రామానికీ వెళ్లి ఇదే విషయాన్ని కమల ప్రచారం చేశారు. అవాంతరాలు ఎదురైనా దీక్షతో కదిలింది. ఫలితంగా పత్రాపుట్, ఆ పరిసర గ్రామాల్లో రైతులు రసాయనిక ఎరువుల వాడకం పూర్తిగా నిలిపివేశారు. ఆమె కృషికి గుర్తింపుగా 2004లో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళా రైతు పురస్కారంతో సత్కరించింది. జోహన్నెస్‌బెర్గ్(దక్షిణాఫ్రికా)లో 2002లో జరిగిన అంతర్జాతీయ సమావేశాలకు కూడా ఆమెహాజరయ్యారు. ఇక ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం మహిళా హాస్టల్ భవనానికి కమల పేరు పెట్టి ఆమెపై గౌరవాన్ని చాటుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కమలను ప్రభుత్వం తాజాగా రాష్ట్ర ప్రణాళికా సంఘం తొలి మహిళా సభ్యురాలిగా నియమించడం విశేషం. దీని గురించి టీవీ ద్వారా తెలిసీ తెలియగానే కమల ఆశ్చర్యానికి లోనయ్యారు. ‘గ్రామాల్లో తాగునీటి సరఫరాపై దృష్టి సారిస్తాను’ అన్నారు. ఆమె తన ఇద్దరు కుమారులతో కలసి మట్టి గోడల పూరింటిలో నివసిస్తున్నారు. ‘నాకు ఈ పదవి కన్నా ఏదో ఒక ప్రభుత్వ పథకం కింద పక్కా ఇల్లు ఇచ్చి ఉంటే ఇంకా ఎక్కువ సంతోషించేదాన్ని’ అని కమల అన్నారని ఆమె మనుమడు విలేకరులతో చెప్పాడు! నిజానికి ఆమె 2016లో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, మంజూరు కాలేదు. ఆమె రెండో కుమారుడికి గత ఏడాది ఇల్లు మంజూరైనా, అదింకా నిర్మాణంలోనే ఉంది. – పంతంగి రాంబాబు -
అనుమానమే ఆత్మహత్య భూతమై..!
తల్లీ కొడుకుల బలవన్మరణం.. ఏడాదిన్నర క్రితం పెద్ద కొడుకు కుటుంబానికి చేతబడి చేశారని వారి అనుమానం అందుకే కమలకు అనారోగ్యమట.. కొన్నాళ్లుగా ఒంటరిగా జీవనం కుటుంబ పెద్ద మానసిక స్థితిపైనా సందేహాలు ఉద్యోగాలు మానేసి ఇంటిపట్టునే కొడుకులు అక్కయ్యపాలెం: ఏడాదిన్నర క్రితం పెద్ద కొడుకు.. ఇప్పుడు తల్లి, చిన్న కొడుకు ఆత్మహత్యకు పాల్పడటం విశాఖ నగరంలోని రామచంద్రనగర్‌లో కలకలం రేపింది. ఎవరో చేతబడి చేశారన్న అపోహతో కొన్నాళ్లుగా ఒంటరి జీవితం గడుపుతున్న ఆ కుటుంబంలో ఇప్పుడు తండ్రే ఒంటరిగా మిగిలిపోయారు. విశాఖ నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐ కె.వి.బాలకృష్ణ చెప్పిన వివరాల ప్రకారం.. నగరంలోని అక్కయ్యపాలెం రామచంద్రనగర్‌లో మాచర్ల మహేశ్వరరావు తన భార కమల(48), చిన్న కొడుకు రవికుమార్(30)తో కలిసి చాలాకాలంగా నివసిస్తున్నారు. మహేశ్వరరావు ఒక ప్రైవేటు కంపెనీలో కాంట్రాక్టరుగా పనిచేసేవారు. భార్యకు, కుటుంబానికి ఎవరో చేతబడి చేశారని అందుకే రెండేళ్లుగా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన అనుమానం. చేతబడి కారణంగానే భార్య అనారోగ్యం పాలైందని అంటున్నారు. ఈ క్రమంలో చేతబడి తీసే వారి కోసం మహేశ్వరరావు శనివారం సోంపేట వెళ్లాడు. అక్కడ నుంచి శ్రీకాకుళం, విజయనగరం వెళ్లినా.. ఎవరూ దొరక్కపోవడంతో సోమవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే గేటుకు తాళం వేసి ఉంది. ఎంత కొట్టినా ఎవరూ బయటకు రాలేదు. కొడుకు రవికుమార్‌కు సెల్‌కు ఫోన్ చేసినా స్పందన లేదు. అనుమానం వచ్చిన మహేశ్వరరావు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. సీఐ కె.వి.బాలకృష్ణ, ఎస్సై బి.బి.శంకర్‌గణేష్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. తలుపు లోపలి నుంచి గడియ పెట్టినట్లు గుర్తించి, తలుపులు విరగ్గొట్టి లోపలకి ప్రవేశించారు. లోపల హాల్లోని ఫ్యాన్ హుక్కు వేలాడుతున్న కమల, రవికుమార్ మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను దించి పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంటరి జీవితమే కారణమా? అయితే ఈ కుటుంబానికి చాలా కాలంగా బంధువులు,స్నేహితులు, చుట్టుపక్కల వారితో సంబంధాలు లేవని, ఎవరితోనూ మాట్లాడరని పోలీసుల విచారణలో తెలిసింది. తమ కుటుంబానికి చేతబడి చేశారన్న అనుమానం పెంచుకున్న మహేశ్వరరావు మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని తెలుస్తోంది. ఇతని కారణంగానే భార్య అనారోగ్యం పాలైనట్టు స్థానికులు చెబుతున్నారు. తల్లి ఆరోగ్యం బాగోకపోవడంతో చిన్న కొడుకు రవికుమార్ టీసీఎస్‌లో ఉద్యోగం మానేసి ఏడాదిగా ఇంటి వద్దే ఉంటున్నాడు. పెద్ద కొడుకు భాస్కరరావు కూడా ఇదే రీతిలో 2014లో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు కూడా కొడుకు శవాన్ని మూడు రోజులపాటు ఇంటిలో ఉంచుకొని ఎవరికీ సమచారం ఇవ్వలేదు. దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారి పిర్యాదు మేరకు పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు కూడా కమల, రవికుమార్‌లు శనివారం రాత్రే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి మరణానికి మానసిక పరిస్థితే కారణామా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు. బంధువులు, స్నేహితులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఈ కుటుంబంపై పోలీసులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. -
తల్లీ కుమారుడు ఆత్మహత్య
విశాఖ నగరంలోని రామచందర్‌రావు నగర్ లో తల్లీ కుమారుడు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగు చూసింది. మాచర్ల మహేశ్వర్‌రావు, కమల (48) దంపతులకు కనకరాజు, రవికుమార్ అనే ఇద్దరు కమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు కనకరాజు 2014లో ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుటుంబానికి ఎవరో చేతబడి చేశారని భావించిన ఈ కుటుంబం.. ఇరుగు పొరుగు వారితో సంబంధాలు కట్ చేసుకుంది. ఈ నేపథ్యంలో చేతబడి నివారణ కోసం మహేశ్వర్‌రావు శనివారం విజయనగరం వెళ్లి.. సోమవారం ఇంటికి తిరిగివచ్చారు. లోపల తలుపులు బిగించి ఉండటం, ఎంతకీ తెరవకపోయేసరికి పోలీసుల సాయంతో.. తలుపులు బలవంతంగా తెరిచారు. కమల, రవి కుమార్ (30) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించారు. వీరి పెద్ద కుమారుడు 2014లో ఇంట్లో ఆత్మహత్య చేసుకోగా మూడు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి ఎవరికీ చెప్పకుండా ఉండడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆత్మహత్య చేసుకున్న వారి మానసిక స్థితి సరిగా లేనట్టు తెలుస్తోంది. -
కడిగి ముగ్గేసింది...
ఊరి తీరు మార్చింది... కులాల గొడవలేని... మతాల మాటలేని... పార్టీల పట్టింపుల్లేని... ఊరుంటుందా? మద్యం తాగని మనిషే లేని ఊరు ఉంటుందా? సినిమా నటుల మీద అభిమానంతో సంఘాలు పెట్టని యువకులు ఉన్న ఊరు ఉంటుందా? ఉంటుంది! తమిళనాడు, తిరునల్వేలి జిల్లాలోని జమీన్‌దేవరకుళం... అలాంటి ఊరే. ఆ ఊరిని ఇంత ఆదర్శగ్రామంగా మలిచిన ఓ మహిళ పోరాట పటిమే... ఈ స్టోరీ. మదురైకి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊళ్లోకి ప్రవేశించగానే తెలిసిపోతుంది దీని ప్రత్యేకత! రోడ్డుకి రెండువైపులా ఉన్న ఎత్తయిన చెట్లు ఆ ఊరి ప్రజల పర్యావరణ పరిరక్షణ స్పృహకు ప్రతీకలుగా కనిపిస్తాయి. చక్కటి స్కూలు, పిల్లలు ఆడుకోవడానికి విశాలమైన మైదానాలు, పెద్దలు సేదతీరడానికి ఉద్యానవనాలతో ఊరంతా పచ్చగా ఉంటుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏ మూల తిరిగినా ఏదో ఒకపనిలో నిమగ్నమైన జనాలతో చురుగ్గా దర్శనమిస్తుంది. దాదాపు పదిహేనువందల జనాభా కలిగిన జమీన్‌దేవరకుళం నాలుగేళ్ల కిందట మరోలా ఉండేది. మందుకు బానిసలై.. భార్యలను హింసిస్తూ సోమరిగా తిరిగే మగవాళ్లు, కుటుంబ భారాన్ని మోస్తూ ఆడవాళ్లు, కులాల కొట్లాటలు, అంటరానితనం, పార్టీ పంచాయితీలతో మోతుబరులు... చదువుల్లేక వీధుల్లో కాలక్షేపం చేస్తూ ఆడపిల్లలను ఏడిపిస్తూ యూత్ మొత్తానికి జమీన్‌దేవరకుళం అంటేనే తగాదాలు, తెంపుల గ్రామం అన్నట్టు ఉండేది. కనీస వసతులకు కోసుల దూరంలో ఉండేది. సీన్ మారిపోయింది ఈ సీన్‌ను పూర్తిగా మార్చేసింది ఓ స్త్రీ శక్తి! పేరు కమల. వయసు.. 27 ఏళ్లు! అయితే ఈ మార్పు తేవడం ఆమెకంత ఆషామాషీ వ్యవహారమేం కాలేదు. అసలు ఊరిని మార్చడానికి ఆవిడ ఎవరు? ఆమెకున్న అర్హత ఏంటి? అన్న ప్రశ్నలు ఆమె ఆశయం కార్యరూపం దాల్చకుండా అడ్డుపడ్డాయి. ‘‘నా ఊరి క్షేమం కాంక్షించాలన్నా, ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాలన్నా ఈ గ్రామ పౌరురాలిగా బాధ్యత మాత్రమే సరిపోదేమో.. అంతకుమించిన అధికార అర్హత కావాలేమో’ అని ఓ నిశ్చయానికి వచ్చారు కమల. 2011లో జమీన్‌దేవరకుళం గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీకి నిలబడ్డారు. అయితే అగ్రకుల పెద్దలు, రాజకీయ వృద్ధులు కమలను వ్యతిరేకించారు. ‘ఒక మహిళ, అందునా రాజకీయాలు ఏమాత్రం తెలియని చిన్న పిల్ల సర్పంచ్ అయి ఊరినేం ఉద్ధరిస్తుంది?’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రచారం చేయనివ్వకుండా ఆటంకాలు సృష్టించారు. ఆ మాటలకు చేతలతోనే సమాధానం ఇవ్వాలి అనుకున్నారు కమల. తన ప్రచారానికి యువతను, స్త్రీలను లక్ష్యంగా ఎంచుకున్నారు. గల్ఫ్‌లో ఉన్న యూత్‌తో ఊరి పరిస్థితులతో విసిగి వేసారి మదురై వెళ్లిపోయి పై చదువులు చదివి, గల్ఫ్‌లో ఇంజనీర్లుగా, ఇతర రంగాల్లో ఉద్యోగులుగా స్థిరపడ్డవాళ్లను ఫోన్లో సంప్రదించారు కమల. జమీన్‌దేవరకుళం ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్న విషయాన్ని చెప్పి ఒకవేళ తాను గెలిస్తే ఊరి బాగుకోసం ఎలాంటి సహాయం చేయగలరో అడిగారు. ఊరి అభివృద్ధికి వాళ్ల దగ్గర ఏమన్నా ఆలోచనలు, ప్రణాళికలు ఉంటే పంచుకొమ్మని కోరారు. గల్ఫ్‌లో ఉన్న దేవరకుళం గ్రామస్తులు తమ ఆడబిడ్డ ఆరాటం చూసి ముచ్చటపడ్డారు. ఊరిబాగు కోసం ఆమె పడ్తున్న తపన వాళ్లలోనూ కొత్త ఉత్సాహాన్నిచ్చింది. గెలిచారు... చిత్తశుద్ధికి ఓటమి ఉండదంటారు. అన్నట్టుగానే ఆ ఎన్నికల్లో గ్రామ పంచాయితీ సర్పంచ్‌గా కమల గెలిచారు. గెలిచిన వెంటనే తన ఎజెండాలో ఉన్న మొదటి పనిగా.. ఊర్లో ఉన్న నీటి ఎద్దడిని తీర్చే ప్రయత్నంలో పడ్డారు. 60 వేల, పదివేల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న రెండు వాటర్‌ట్యాంక్‌లను కట్టించారు. తర్వాత.. పనుల మీద జమీన్దేవరకుళంకు వచ్చేవారికోసం అయిదు షవర్స్‌తో పబ్లిక్ టాయ్‌లెట్స్‌ని నిర్మించారు. దళిత వాడల్లోని ప్రతి ఇంటికీ టాయ్‌లెట్స్‌ని కట్టించి ఇచ్చారు. దళిత ఆడపిల్లలు స్కూల్లో చేరేలా ప్రోత్సహించారు. ప్రతి వారం ఊళ్లోని వాళ్లంతా దళిత వాడలో సహపంక్తి భోజనాలు చేసే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఊరి పండగలను దళితుల చేతులమీదుగా జరిపించే ఆచారాన్నీ మొదలుపెట్టారు. అయితే ఈ పనులను మొదట్లో అగ్రకులాల వాళ్లు అడ్డుకున్నారు. కమల మీద దాడులు కూడా చేశారు. అయినా కమల వెరువలేదు.. బెదరలేదు. ఈ విషయం తెలిసి గల్ఫ్‌లో ఉన్న జమీన్‌దేవరకుళం గ్రామస్తులు ఓ ఇరవైమంది ఉన్నపళంగా ఆ ఊరికి బయలుదేరారు. అందులో అగ్రకులాల వాళ్లూ ఉన్నారు. వాళ్ల పెద్దలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ‘‘మీకు మంచి చేయడం రాకపోతే చేస్తున్నవాళ్లకు అండగా ఉండండి’’ అని బతిమాలారు. వాళ్ల తీరు మారకపోతే పేగుబంధాన్ని, బంధుత్వాన్నీ తెంచుకుంటామని హెచ్చరించారు. బతిమిలాడితే కరిగిపోయారో.. హెచ్చరికకు భయపడ్డారో కానీ పెద్దాళ్ల పద్ధతి మారింది. కమలకు మద్దతునివ్వడం మొదలైంది. అంతకు మందు ఆ ఊరి స్త్రీలకు పెద్ద శాపంగా ఉన్న మందూ ఇప్పుడు బంద్. ఆ ఊళ్లోనే కాదు ఆ ఊరి స్ఫూర్తితో చుట్టుపక్కల ఊళ్లోనూ మద్యం దుకాణాలను మూసేయించారు జనాలు. విజయా బ్యాంక్ బ్రాంచినే, ఏటీఎమ్ సెంటర్‌నూ ఏర్పాటు చేయించారు. ఇప్పుడు.. జమీన్‌దేవరకుళం ఆదర్శమైన గ్రామం. ఇదంతా ఓ ఆడబిడ్డ పుణ్యం. ‘‘ఈ ప్రయాణంలో నా భర్త బాలకృష్ణన్ సహకారం ఎంతో ఉంది’’ అని చెప్తారు కమల. ఈ ఇద్దరూ కాలేజ్ డ్రాపవుట్స్. ‘‘చూస్తుండగానే నా పదవీకాలం దగ్గరకొచ్చేసింది. చేయాల్సినవి ఇంకా చాలా మిగిలాయి. ఈ యేడాదిలో వాటిలో కనీసం కొన్నయినా పూర్తిచేయాలి. ముఖ్యంగా మా ఊరి మహిళల కోసం కుటీరపరిశ్రమల ఏర్పాటుచేయాలి. వాళ్లకు చేతినిండా పని కల్పించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలి. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం అదే’’ అంటున్నారు కమల. తర్వాత ఎన్నికల్లో కూడా నిలబడ్తారా అని అడిగితే.. ‘‘లేదు.. కొత్త వాళ్లకు అవకాశం రావాలి. వాళ్ల ఆలోచనలు, ప్రతిభా ఊరికి ఉపయోగపడాలి. పదవి లేకపోయినా నా ప్రయత్నాలు ఆగవు’’ అని కమల స్థిర నిశ్చయంతో చెప్పారు. ప్రాక్టికల్‌గా చేసి చూపించారు పంచాయితీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన రెండేళ్లకే ఊరంతటిని ఒక్కటిగా చేశారు కమల. ఐకమత్యంగా ఉంటే ఆ ఊరికి ఎంత బలమో ప్రాక్టికల్‌గా చూపించారు. ఆ ఊరి పీడ అయిన అంటరాని తనాన్ని పూర్తిగా రూపుమాపడం కోసం కులాంతర వివాహాలను ప్రోత్సహించారు. ఇప్పటి వరకు ఆరు కులాంతర వివాహాలను జరిపించారు. స్త్రీలకు, యువతకు ప్రభుత్వ స్కీముల ద్వారా ఉద్యోగాలు ఇప్పించారు. ఊళ్లో పదహారు చోట్ల మైకులను పెట్టించారు. ప్రతివారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల గురించి, వాటి ఉపయోగాల గురించి, రాష్ట్ర, దేశ రాజకీయాల పరిణామాల గురించి పంచాయితీ వార్డ్మెంబర్స్ ఆ మైకుల ద్వారా ఊరంతటికీ సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. అంతేకాదు పంచాయితీ తలపెట్టదల్చిన కొత్త పనుల గురించి, వర్క్ షెడ్యూల్స్ గురించిన వివరమూ చెప్తుంటారు. అలాగే గంట గంటకు టైమ్ తెలిపేలా పంచాయితీ ప్రాంగణంలో టాకింగ్ క్లాక్నూ అమర్చారు. ఓ సామెత, మంచిమాటతో గంట గంటకు సమయాన్ని చెప్తుంటుందీ టాకింగ్ క్లాక్. వీటితో ఆగలేదు ఆమె. దేవరకుళం ఆడపిల్లలు నిర్భయంగా బయటకు వెళ్లగలిగినప్పుడే ఆ ఊరికి గౌరవం ఉన్నట్లు అని భావించారు. అందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఆడపిల్లల్ని వేధించకుండా, వీధుల్లో దొంగతనాలు జరగకుండా ప్రతి వీధికి సీసీకెమెరాలను ఏర్పాటు చేయించారు కమల. ఈ సీసీకెమెరాల ఏర్పాటు తర్వాత ఊళ్లో క్రైమ్ రేట్, ఈవ్ టీజింగ్ గణనీయంగా తగ్గిపోయిందని చెప్తారు పోలీసులు, గ్రామస్తులు కూడా. -
ఆ డబ్బుకు అన్ని లెక్కలున్నాయి: పార్థసారధి
తన భార్య వద్ద స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించి అన్ని లెక్కలు ఉన్నాయని మాజీ మంత్రి కె.పార్థసారథి వెల్లడించారు. ఆయన శుక్రవారం విజయవాడలో మాట్లాడుతూ... ఎన్నికల నిబంధనల ప్రకారం లోక్‌సభ అభ్యర్థి రూ. 70 లక్షలు వరకు ఖర్చు చేసుకోవచ్చని వివరించారు. ఎన్నికల ఖర్చు కోసం కార్పొరేట్ బ్యాంక్ అకౌంట్లో కొంత మొత్తం నగదు జమ చేయాలని, మరి కొంత మొత్తాన్ని సొంతంగా నిర్వహిస్తున్న కనస్ట్రక్షన్ కోసం చేసిన బకాయిలు చెల్లించడానికి తీసుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా పార్థసారథి సతీమణి కమల హైదరాబాద్ నుంచి నగదుతో విజయవాడకు బయలుదేరారు. వనస్థలిపురం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా కమల వద్ద ఉన్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను వ్యక్తిగత పూచికత్తుపై విడిచిపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి కె.పార్థసారథి మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. -
ఆ ఎమ్మెల్యే రూటే సెపరేటు
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు విభిన్న పంథా అనుసరించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిరస్కరణ ఓటును వినియోగించుకోగా, గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే కె. కమల ఖాలీ బ్యాలెట్ పేపర్‌ను బాక్స్‌లో వేశారు. ఓటింగ్‌కు హాజరైన కమల ఏ అభ్యర్థికీ ఓటు వేయలేదు. తిరస్కరణ ఓటు అవకాశాన్ని కూడా వినియోగించుకోలేదు. బ్యాలెట్ పేపర్‌ను యధాతథంగా బాక్స్‌లో వేశారు. మరో ఎమ్యెల్యే దగ్గుబాటి మాత్రం.. పార్టీ తరపున బరిలో ఉన్న అభ్యర్థుల విధానం తనకు నచ్చనందునే ఓటు వేయలేదని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలిపానన్నారు. విభజనలో సీమాంధ్రకు అన్యాయం జరిగిందని అందుకే తిరస్కరణ ఓటు వేసినట్లు చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తొలి ఓటును వేశారు. కాగా ఓటింగ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం దూరంగా ఉన్నాయి. ఇక కేవీపీ రామచంద్రరావు, టి. సుబ్బరామిరెడ్డి, ఎంఏ ఖాన్ (కాంగ్రెస్), గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి (టీడీపీ), కే కేశవరావు (టీఆర్ఎస్) రాజ్యసభ బరిలో ఉన్న విషయం తెలిసిందే. సాయంత్రం ఐదు గంటలకు కౌంటింగ్ జరగనుంది. పోటీ నుంచి ఆదాల వైదొలగడంతో వీరి ఎన్నిక లాంఛనం కానుంది. -
కేశవరంలో మద్యం మత్తులో వ్యక్తి దురాగతం
కేశవరం (మండపేట రూరల్), న్యూస్‌లైన్ : ప్రేమించి పెళ్లాడిన భర్తే ప్రాణాలు బలిగొన్నాడు. గర్భిణి అని కూడా చూడకుండా భార్యను అతి దారుణంగా కడతేర్చాడు. ఆమె తల్లిదండ్రుల పాలిట కాలయముడయ్యాడు. ఆదమరిచి నిద్రపోతున్న వారిపైనా దాడిచేసి హతమార్చాడు. మద్యం మత్తులో అతడు సాగించిన దారుణకాండలో అత్తమామలతోపాటు అతని భార్య హతులయ్యారు. చుట్టపుచూపుగా వచ్చిన మరో మహిళపైనా దాడిచేసి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మండపేట మండలం కేశవరంలో తీవ్ర సంచలనం కలిగించిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, మృతుల బంధువులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెదపూడి మండలం చింతపల్లిలాకులకు చెందిన బద్ద అబ్బాయి (60), కమల (45) దంపతులకు ఒక కుమారుడు రమణ, కుమార్తె ప్రేమావతి (25)లు ఉన్నారు. సుమారు మూడు సంవత్సరాల క్రితం అబ్బాయి, తన భార్య, కుమార్తెతో కలిసి కేశవరంలోని పొలాల్లో మకాం కాపలాదారునిగా పనికి కుదిరి కేశవరం మకాం వచ్చేశారు. కేశవరం ఎస్సీ కాలనీకి చెందిన అంబటి కృష్ణంరాజు అబ్బాయి కాపలా ఉంటున్న సమీపంలోని పొలంలోకి పనికి వెళ్లే క్రమంలో ప్రేమావతితో పరిచయం ఏర్పడింది. ఇరువురు ప్రేమించుకుని రెండు సంవత్సరాలు క్రితం పెళ్లి చేసుకున్నారు. స్థానికంగా ఇటుకల బట్టీలో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి ఏడాది వయస్సు కలిగిన కుమారుడు ఉండగా, ప్రస్తుతం ప్రేమావతి ఐదు నెలల గర్భిణి. మద్యానికి పూర్తిగా బానిసైన కృష్ణంరాజు తరచూ తాగివచ్చి ప్రేమావతిని శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేసేవాడు. కొద్దినెలలుగా అబ్బాయి స్థానికంగా ఉన్న రైస్‌మిల్లులో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. తన భార్యతో కలిసి మిల్లు ఆవరణలోని షెడ్డులో మకాం ఉంటున్నాడు. రోజూ భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక నెల రోజుల క్రితం ప్రేమావతి తన కుమారుడిని తీసుకుని తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. గ్రామంలోని పెద్దమనుషుల సమక్షంలో ఇటీవల తగవు పెట్టగా కాపురానికి వెళ్లేందుకు ఆమె ఇష్టపడలేదు. దీంతో రోజూ తాగివచ్చి భార్య, అత్తమామలతో గొడవ పడుతుండేవాడు. ఇదిలాఉండగా కరప మండలం కొరుపల్లి గ్రామానికి చెందిన ప్రేమావతి అన్న భార్య పందిరి నూకరత్నం కొద్దిరోజుల క్రితం చుట్టపు చూపుగా వచ్చింది. సోమవారం రాత్రి ప్రేమావతి, ఆమె కుమారుడు, నూకరత్నంలు షెడ్లో పడుకోగా, అబ్బాయి, అతని భార్య కమల మిల్లు వరండాలో పడుకున్నారు. తన భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో సోమవారం అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి వచ్చిన కృష్ణంరాజు తొలుత మంచంపై నిద్రిస్తున్న అత్త, మామలపై ఇనుపరాడ్‌తో దాడిచేశాడు. తలకు తీవ్రగాయాలవడంతో ఇరువురూ అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం షెడ్లో నిద్రిస్తున్న భార్య, ఆమె వదినపైనా దాడిచేశాడు. తలకు తీవ్రగాయమై భార్య ప్రేమావతి అక్కడిక్కడే మృతిచెందింది. అందరూ చనిపోయారని భావించి కుమారుడిని తీసుకుని తన ఇంటి వద్ద మంచంపై వదిలిపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. గాయాలపాలైన నూకరత్నం బయటకు వచ్చి సమీపంలోని వారికి విషయం చెప్పింది. స్థానికులు గ్రామంలోని పీఎంపీ వైద్యుడిని సంఘటన స్థలానికి తీసుకురాగా అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. పోలీసులకు సమాచారమందించి నూకరత్నంను 108లో రాజమండ్రి తరలించగా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అర్ధరాత్రి పూట చిన్నపిల్లవాడి ఏడుపు విన్న కృష్ణంరాజు కుటుంబ సభ్యులు లేచి, రైస్‌మిల్లు వద్దకు చేరుకొనే సరికి వీరి మూడు మృతదేహాలు కనిపించాయి. సంఘటన ఎలా జరిగిందో తనకు తెలియదని క్షతగాత్రురాలు నూకరత్నం చెబుతోంది. కళ్లు తిరిగి పడిపోయిన తనకు ఏమైందో తెలియలేదని ఆస్పత్రిలో పోలీసులకు నూకరత్నం చెప్పినట్టు తెలిసింది. వీఆర్ఓ గంటి శ్రీనివాస్, నూకరత్నం భర్త రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. రామచంద్రపురం డీఎస్పీ రవీంద్రనాధ్, మండపేట సీఐ పీవీ రమణ, రూరల్ ఎస్సై ఎన్లక్ష్మణస్వామి సంఘటన స్థలిని పరిశీలించి. స్థానికులు, బంధువుల నుంచి వివరాలు సేకరించారు. పరారీలో ఉన్న నిందితుని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలిస్తున్నారు. గర్భిణి అని కూడా చూడలేదు గర్భిణి అని కూడా చూడకుండా ఇంత దారుణానికి ఒడిగట్టాడని మృతురాలి కుటుంబీకులు భోరున విలపిస్తున్నారు. తరచూ మద్యం సేవించి వచ్చి కొడుతుండడంతో కడుపులోని బిడ్డకు ఏమైనా అవుతుందన్న భయంతోనే ప్రేమావతి కాపురానికి వెళ్లేందుకు భయపడేది. కడుపులోని బిడ్డతో సహా హతమవడం వారిని తీవ్రంగా కలిచివేసింది.