కమల పూజారికి ఇల్లు సమకూర్చిన అధికారులు
జయపురం : ఒడిశా రాష్ట్ర ప్రణాళికా బోర్డు సభ్యురాలు, దేశీ వ్యవసాయ రంగంలో అద్భుత విజయాలను సాధిం చి ప్రపంచ స్థాయిలో ఎట్టకేలకు ఫలించిన కమల కల అవార్డులు, బహుమతులు పొంది రాష్ట్రానికే వన్నె తెచ్చిన కొరాపుట్ జిల్లా జయపురం సమితిలోని పాత్రోపుట్ గ్రామవాసి కమల పూజారి చిరకాల వాంఛ నెరవేరింది. నేటి వరకు ఆమె పాడుబడిన పూరి గుడిసెలో ఉంటోంది. ప్రభుత్వం ఆమెకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు నిర్మించి ఇవ్వడంతో శుక్రవారం నూతన గృహప్రవేశం చేశారు.
గతంలో ఆమెకు ప్రధాన మంత్రి గ్రామీణ అవాస్ యోజనలో ఇల్లు మంజూరు కాగా మొదటి విడత డబ్బు మంజూరు చేసిన అదికారులు తరువాత మిన్నకున్నారు. అందుచేత ఆమె తన పాడుబడిన ఇంటిలోనే ఉంటోంది. ఆమెను రాష్ట్ర ప్రణాళికా బోర్డు సభ్యురాలిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తరువాత ఈ విషయం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందింది. ముఖ్యంగా ఆమె చిరకాల వాంఛ ఒక మంచి ఇల్లు అని పత్రికలు, మీడియా ప్రధానంగా హైలైట్ చేయడంతో అధికారులు స్పందించారు.
వెనువెంటనే ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకంలో ఒక చక్కటి ఇల్లును నిర్మించారు. ఆమె నూతన గృహ ప్రవేశ ఉత్సవంలో కొçరాపుట్ జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ దేవణ ప్రధాన్, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన డైరెక్టర్ గౌరీశంకర సాహు, జయపురం సమితి బీడీఓ మనోజ్ కుమార్ నాయక్, జూనియర్ ఇంజినీర్ సరోజ్ కుమార్ మహంతి, పంచాయతీ సమితి కార్యనిర్వాహక అధికారి అంభికా పాఢి, జీఆర్‌ఈఎస్ తదితర అధికారులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment