Kanakaraju
-
ఆదివాసీ కళకు ఆయువు పోసినవాడు!
ఆదివాసీ ‘గుస్సాడి’ నృత్యాన్ని అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేసిన కనకరాజు ‘అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం’ (అక్టోబర్ 25) నాడు తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహించి మొత్తం తెలంగాణ ఆదివాసీలకు గర్వకారణమైన ఆయన సేవలను ఒకసారి మననం చేసుకోవడం మన విధి. కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మార్ల వాయి గ్రామానికి చెందిన కనకరాజు 1941లో జన్మించారు. చిన్నతనం నుంచే ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు అంటే మక్కువ. ఆ క్రమంలోనే గుస్సాడి నృత్యకళపై అభిరుచిని పెంచుకున్నారు. పశువులను మేపడానికి అడవిలోకి పోయిన సందర్భంలో భుజం మీద కట్టెపుల్లను పెట్టుకొని టిక్కుటిక్కుమని శబ్దం చేసుకుంటూ తనే స్వతహాగా గుస్సాడి సాధన చేసేవారు. నిరక్షరాస్యుడైన కనకరాజు బతుకుదెరువు కోసం మార్లవాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో దినసరి కూలీగా పనిచేస్తూనే... ఊరూరా తిరు గుతూ గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించారు. అంత రించిపోతున్న కళను బతికించారు. ఏటా దీపావళికి వారం రోజుల ముందు నుండే గోండు ప్రాంతా లలో దండారి పండుగ మొదలవుతుంది. ఈ పండుగ వారికి చాలా పవిత్రం. గ్రామదేవతల శుభప్రద ఆశీస్సులను ఇతర గ్రామస్థులకు అందించే ధన్యజీవులు గుస్సాడీలు. వారు పొలికేక పెట్టి నాట్యం ఆపిన అనంతరమే వచ్చినవారికి ఆహ్వానాలు, పలకరింపులు మొదలవుతాయి. గుస్సాడీల చేతులలోని రోకళ్లను శంభు మహా దేవుని త్రిశూలంగా భావించి అభిషేకం చేస్తారు. గుస్సాడీలను శివుని ప్రతిరూపాలుగా భావించి వారి వస్తువులు, సంగీత పరిక రాలను (ఎత్మసూర్ పెన్) పూజిస్తారు. అందరూ కలసి గుస్సాడి నృత్యం చేస్తారు. తరువాత అతిథులకు భోజనం వడ్డిస్తారు. దండారీలో గుస్సాడీలు, పోరిక్‌లు ప్రముఖ పాత్ర వహిస్తారు. నెత్తి మీద నెమలి ఈకలు, పెద్ద టోపీ లతో ముఖానికి, ఒంటికి రంగులతో మెడ నిండా పూసల దండలు, కాళ్లకు గజ్జెలు, చేతిలో గంగారాం సోటితో గంతులు వేసుకుంటూ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ కళ అంతరించి పోకూడదనే ఉద్దేశంతో అప్పటి ఐఏఎస్ అధికారి మడావి తుకారాం ప్రత్యేక చొరవ తీసుకుని కనకరాజును ప్రోత్సహించారు. దీంతో కనకరాజు శిక్షకుడిగా మారి 150 మందికి ఐదు రకాల దరువులతో కూడిన డప్పు సహాయంతో శిక్షణ ఇచ్చారు. 1976 నుండి వరుసగా ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవా లలో ప్రదర్శనలు ఇప్పించారు.1981లో ప్రధాని ఇందిరాగాంధీ ముందు గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించారు. 2014లో ఎర్ర కోటలో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ముందు ప్రదర్శించారు. కొన్ని సినిమాలలో కూడా ఈ కళను ప్రదర్శించారు. కనకరాజు గుస్సాడి నృత్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2021లో కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘పద్మశ్రీ’ని ఇచ్చి గౌరవించింది. ఎనిమిది పదుల వయసు దాటినా, గుస్సాడిని బతికించడానికి మరో 30 మందికి శిక్షణనిచ్చారు. గుస్సాడి కళను వెలుగులోకి తెచ్చిన సామాన్యుడైన కనకరాజు ఈనాటి కళాభిమానులకు ఆదర్శప్రాయుడు. కనకరాజుకు నివాళిగా ఆయన శిష్యులు మరింతగా ఈ కళను ప్రపంచవ్యాప్తం చేస్తారని ఆశిద్దాం.– గుమ్మడి లక్ష్మినారాయణ,ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి, తెలంగాణ ‘ 94913 18409 -
గుస్సాడి గుండెచప్పుడు పద్మశ్రీ కనకరాజు
నెమలీకల టోపీ ధరించి కోలాహలంగా ఆడతారు. రేలా... రే... రేలా అంటూ గొంతు కలిపి పా డతారు. ప్రకృతి గురువు నేర్పిన పా ఠాలకు ఆనవాళ్లు వారు. మొన్నటి వరకు అడవి తల్లి ఒడిలో దాగిన కళారూపా లివన్నీ. నేడవి అడవి గోడలు దాటి నగరాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. దేశం ఎల్లలు కూడా దాటే వరకు గుస్సాడి ఆడాలంటున్నారు... పద్మశ్రీ కనకరాజు. కనకరాజు పేరులో ఇంటి పేరు కనక, ఆయన పేరు రాజు. ఇన్ని వివరాలు మాకక్కర్లేదు, గుస్సాడి నృత్యం చేస్తాడు, మా అందరి చేత అడుగు వేయిస్తాడు కాబట్టి ఆయన మాకు ‘గుస్సాడి రాజు’ అంటారు స్థానికులు. ఆయన పద్మశ్రీ అందుకున్నప్పటి నుంచి నాగరక ప్రపంచం ఆయన మీద దృష్టి కేంద్రీకరించింది. కనకరాజు అని ఇంటిపేరుతో కలిసి వ్యవహారంలోకి వచ్చారు. అయినప్పటికీ వారి గూడేలకు వెళ్లి కనకరాజు అని అడిగితే వెంటనే గుర్తుపట్టరు. గుస్సాడి కనకరాజు అంటే టక్కున చెప్పేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మర్హలి ఆయన ఊరు. ప్రస్తుతం కుమ్రుం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, అంతేకాదు, కుమ్రుం భీమ్ వారసులు కూడా. ఆదిలాబాద్‌లో విస్తరించిన గోంద్ తెగకు చెందిన వాళ్లందరూ భీమ్ వారసులుగా గర్వంగా భావిస్తారు. ఎనభై ఏళ్ల కనకరాజు... తండ్రి చెప్పిన మాట కోసం గుస్సాడి నృత్యం పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేశారు. గుస్సాడితో మమేకమైన తన జీవితానుభవాలను సాక్షితో పంచుకున్నారాయన. ఆట... పా ట... జీవితం! ‘‘మా ఆదివాసీల జీవనంలో ప్రకృతి, నృత్యం, గానం కలగలిసి పోయి ఉంటాయి. బిడ్డ పుడితే పా ట, పెళ్లి వేడుకకీ పా ట, అంతేకాదు... మనిషి పోయినా పా ట రూపంలో ఆ వ్యక్తితో మా అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాం. దండారీ ఉత్సవాలంటే మాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. మగపిల్లలకు నృత్యం, ఆడపిల్లలకు రేలా పా ట చిన్నప్పటి నుంచే నేర్పిస్తాం. గుస్సాడి నృత్యంలో అడుగులు వేయడం ఎప్పుడు మొదలైందో నాకు గుర్తు లేదు. కానీ మా నాన్న ఒక మాట చెప్పేవారు. ‘ఈ నృత్యమే మనకు దైవం. ‘ఈ నృత్యాన్ని మరువద్దు. తరతరాలుగా మోసుకొస్తున్నాం. దీన్ని కాపా డుకుంటేనే దేవుడు మనల్ని కాపా డుతాడు’ అని చెప్పేవాడు. ఆ మాట నాలో నాటుకుపోయింది. నాకు వయసొచ్చినప్పటి నుంచి నృత్యంలో తొలి ఆటగాడిగా అడుగులు వేస్తుండేవాణ్ని. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు నివసించే రెండువేల గూడేలకూ నేను తెలిసిపోయాను. గణతంత్ర వేడుక గణతంత్ర వేడుకల్లో మా ప్రాచీన వారసత్వ కళ అయిన గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించే అవకాశం నాకు 1982లో వచ్చింది. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి మా గుస్సాడి టోపీ పెట్టించి, గజ్జెలు కట్టించాం. ఆమె మాతో అడుగులు వేసింది. ఆ తర్వాత ఓసారి అబ్దుల్ కలామ్ కూడా మాతో అడుగులు వేశారు. హైదరాబాద్‌లో ఎన్ని ప్రదర్శనలిచ్చామో లెక్కేలేదు. ఢిల్లీలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో కూడా మా గుస్సాడిని ప్రదర్శించాం. మరో పది దఫాలు యువతతో చేయించాం. నాయన మాట మీద గుస్సాడి కోసం బతికినందుకే మా దేవుడు మెచ్చి గొప్ప వాళ్లకిచ్చే పద్మశ్రీని ఇప్పించాడనుకుంటున్నా. నెమలీకల టోపీ మా నృత్యం సాధన చేయడమే కాదు, టోపీ, దుస్తులు, గజ్జెలు అన్నీ ప్రత్యేకమే. వాటిని తయారు చేయడానికి చాలా నైపుణ్యం ఉండాలి. పెద్ద టోపీకి రెండు వేల పింఛాలుంటాయి. మా ఇళ్లలో వాటిని భద్రపరుచుకోవడం పెద్ద పని. మా ముత్తాతలు ధరించిన టోపీ ఇంకా నేను ధరిస్తూనే ఉన్నాను. కొత్తవాళ్ల కోసం టోపీలు తయారు చేస్తున్నాం. పెద్ద టోపీ, దుస్తులతోపా టు మొత్తం వేషానికి ఇరవై వేల రూపా యలవుతాయి. మా ఆదివాసీ వ్యక్తి తుకారామ్ సాబ్ కలెక్టర్ అయిన తరవాత ఈ నృత్యానికి ఇంకా కొన్ని చేర్పులు చేసి బాగా మంచిగా చేశారు. పద్మశ్రీ వచ్చిన తర్వాత ఐటీడీఏ ఆఫీసర్లు గుస్సాడి నృత్యం నేర్పించడానికి వందకు పైగా బడులు పెట్టారు. ఒక్కో బడిలో రెండు– మూడు వందల మంది నేర్చుకుంటున్నారు. నేను పెద్ద మాస్టర్ (చీఫ్ డాన్స్ మాస్టర్)ని. గుస్సాడి, రేలా పా ట నేర్పించడానికి 30 మందిని ప్రత్యేకంగా తయారు చేశాను. మరో రెండు వందల మందికి సంపూర్ణంగా శిక్షణనిచ్చాను. ఇంక మామూలుగా నేర్చుకుని ఆడే వాళ్లు ఎన్ని వేల మంది ఉన్నారో నేను ఎప్పుడూ లెక్క చెప్పుకోలేదు. అడవి తల్లికి అందరూ ఒక్కటే! మా ఆదివాసీల్లో మగపిల్లాడు ఎక్కువ, ఆడపిల్ల తక్కువనే ఆలోచనే ఉండదు. బిడ్డలంతా సమమే. పెళ్లిలో కట్నకానుకలు ఉండవు. ఆడబిడ్డ పుట్టిందని చింతపడడం మాకు తెలియదు. నాకు ఎనిమిది మంది కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. బతకడానికి ఆశ్రమ పా ఠశాలలో రోజు కూలీగా పని చేస్తూ కూడా అందరికీ చదువు చెప్పించాను. తొమ్మిది– పది తరగతుల వరకు అందరూ చదువుకున్నారు. రెండో కొడుకు వెంకటేశ్ మాత్రం డిగ్రీ చదివి టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు. తరతరాలుగా అడవులకే పరిమితమైపోయిన గుస్సాడి నృత్యాన్ని నేను దేశానికి తెలియ చెప్పా ను. మీరు మన ఆట, పా టలను ఇతర దేశాలకు తీసుకెళ్లాలని నా పిల్లలు, శిష్యులకు చెబుతున్నాను’’ అని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు గుస్సాడి కనకరాజు. – వాకా మంజులారెడ్డి -
భర్తను అలా దారికి తెచ్చుకుంది
కేస్ స్టడీ లక్ష్మమ్మకు కానిస్టేబుల్ కనకరాజుతో వివాహమై ఐదేళ్లయింది. ఒక్కతే అమ్మాయి కావడంతో లక్ష్మమ్మ తలిదండ్రులు కడుపుకట్టుకుని మరీ చీటీలు వేసి, ఐదులక్షల వరకు కూడబెట్టారు. దూరపు బంధువైన కనకరాజు పోలీసుగా సెలక్టయ్యాడని ఐదులక్షలు అతని చేతిలో పోసి,పెళ్లి చేశారు. ఓ రెండేళ్లు సజావుగా ఉన్నాడు కనకరాజు. కానిస్టేబుల్‌గా పోస్టింగ్ వచ్చాక భార్యను నిర్లక్షం చేయడం, కొట్టడం, కట్నం చాలలేదని హింసించడం ఎక్కువ చేశాడు. లక్ష్మమ్మను అకారణంగా ఇంటినుండి గెంటివేశాడు. లక్ష్మమ్మ విధిలేక 498 ఎ కేసు పెట్టింది. పోలీసు ఉద్యోగంలో ఉండటం వల్ల పైఅధికారులను కాకాపట్టి, కేసు బుక్ కానివ్వకుండా మేనేజ్ చేశాడు కనకరాజు. దాంతో ప్రైవేట్ కేస్ వేసింది లక్ష్మమ్మ. అధికారుల కాళ్లావేళ్లాపడి కేసు బుక్ కానివ్వలేదు. తీవ్రంగా కుంగిపోయిన లక్ష్మమ్మ, తెలిసిన వారి సలహాతో మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 ప్రకారం మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు చర్య తీసుకునే అధికారం కమిషన్‌కు ఉంది. ఎవరినైనా చట్టవ్యతిరేకంగా నిర్బంధించడం, బుద్ధిపూర్వకంగా కేసులో ఇరికించటం, బలవంతంగా బాల్యవివాహం చేయడానికి ప్రయత్నించడం, అపహరణ, మానభంగం, హత్యాయత్నం, మహిళలపై వేధింపులు జరిగినప్పుడు తగిన చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలం అవడం వంటి సందర్భాలలో మానవ హక్కుల కమిషన్ చర్యలు తీసుకోవచ్చు. లక్ష్మమ్మ కేసులో కమిషన్ స్పందించి, కేసు నమోదు చేయమని పోలీసులను ఆదేశించింది. భార్య చేసిన ఆరోపణలు రుజువైతే ఉద్యోగం ఊడడంతోపాటు శిక్ష కూడా తప్పదని గ్రహించిన కనకరత్నం భార్యను క్షమాపణ వేడుకుని, కాపురానికి తెచ్చుకున్నాడు కనకరాజు. లక్ష్మమ్మ కథ అలా సుఖాంతమైంది. -
తల్లీ కుమారుడు ఆత్మహత్య
విశాఖ నగరంలోని రామచందర్‌రావు నగర్ లో తల్లీ కుమారుడు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగు చూసింది. మాచర్ల మహేశ్వర్‌రావు, కమల (48) దంపతులకు కనకరాజు, రవికుమార్ అనే ఇద్దరు కమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు కనకరాజు 2014లో ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుటుంబానికి ఎవరో చేతబడి చేశారని భావించిన ఈ కుటుంబం.. ఇరుగు పొరుగు వారితో సంబంధాలు కట్ చేసుకుంది. ఈ నేపథ్యంలో చేతబడి నివారణ కోసం మహేశ్వర్‌రావు శనివారం విజయనగరం వెళ్లి.. సోమవారం ఇంటికి తిరిగివచ్చారు. లోపల తలుపులు బిగించి ఉండటం, ఎంతకీ తెరవకపోయేసరికి పోలీసుల సాయంతో.. తలుపులు బలవంతంగా తెరిచారు. కమల, రవి కుమార్ (30) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించారు. వీరి పెద్ద కుమారుడు 2014లో ఇంట్లో ఆత్మహత్య చేసుకోగా మూడు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి ఎవరికీ చెప్పకుండా ఉండడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆత్మహత్య చేసుకున్న వారి మానసిక స్థితి సరిగా లేనట్టు తెలుస్తోంది. -
డివైడర్‌ను ఢీ కొన్న కారు: ఒకరి మృతి
నక్కపల్లి(విశాఖపట్టణం): వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో గురువారం ఉదయం జరిగింది. వివరాలు.. రాజమండ్రికి చెందిన సోము కనకరాజు(26), ఎమ్.ఉష, ఏ. సబిత, ఎస్.రవిలు కారులో విశాఖపట్నంకు వెళ్తున్నారు. మార్గం మధ్యలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొనడంతో కనకరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్య నిమిత్తం నక్కపల్లి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లింట విషాదం
తుర్కపల్లి : తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన అన్నంపట్ల నర్సయ్య, నర్సమ్మ దంపతుల పెద్దకూమారుడు అన్నంపట్ల కనకరాజు (25) పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం ఓ స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్నాడు. ఇతడికి రంగారెడ్డి జిల్లా చెర్లపల్లికి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. శనివారం మధ్యాహ్నం 12-05 నిమిషాలకు వధువు ఇంట్లో పెళ్లి జర గాల్సి ఉంది. గురువారం కనకరాజును తన ఇంట్లో పెళ్లికొ డుకుగా అలకరించారు. శుక్రవారం సాయంత్రం వరకు అత ని ఇల్లు బంధువులతో సందడిగా ఉంది. ఆ తర్వాత కాసేప టికి పెళ్లికొడుకుకు ఆకస్మికంగా తీవ్రమైన కడుపునొప్పి రా వడంతో చికిత్స నిమిత్తం హుటాహుటిన రాజపేటకు తీసు కువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో భువనగిరి ఏరి యా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 11-30 నిమిషాలకు మృతి చెందాడు. పెళ్లికని వచ్చిన బంధువులు పెళ్లి కొడుకు చావును చూడాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. పెళ్లిని కళ్లార చూద్దామనుకున్న తల్లిదండ్రులు కొడుకు శవమైండని బోరున విలపిస్తుంటే గ్రామస్తులు కంటతడిపెట్టారు. -
సూపర్‌బజార్ ఉద్యోగులూ అర్హులే
ఇల్లెందుఅర్బన్(ఖమ్మం), న్యూస్‌లైన్ : అంతర్గత అభ్యర్థులతో భర్తీ చేసే పోస్టులకు పరీక్ష రాసే అర్హత సింగరేణి సూపర్‌బజార్ ఉద్యోగులకు ఉందని సింగరేణి సూపర్‌బజార్ ఎంప్లాయీస్ కొత్తగూడెం రిజీయన్ డెప్యూటీ ప్రధాన కార్యదర్శి పి.వెంకన్న తెలిపారు. గురువారం స్థానిక సూపర్‌బజార్ ఆవరణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 1982- 83, 85, 88, 89 సంవత్సరాల్లో సింగరేణిలో క్లర్క్, డంపర్ ఆపరేటర్, వార్డుబాయ్, ఇతర పోస్టులకు సింగరేణి సూపర్‌బజార్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా వారికి యాజమాన్యం ఉద్యోగ అవకాశాలు కల్పించిం దని చెప్పారు. కంపెనీ నిబంధనల మేరకే ఈ నెల 15వ తేదీన క్లర్క్ పోస్టులకు అంతర్గత అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకునే అర్హత యాజమాన్యం కల్పించిందన్న విషయాన్ని టీబీజీకేఎస్ నాయకులు మిరియాల రాజిరెడ్డి, కనకరాజు విస్మరించారన్నారు. ఈ విషయంలో వారు చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, తక్షణమే సింగరేణి, సూపర్‌బజార్ యాజమాన్యాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంకన్న వెంట రంగారెడ్డి, అన్వర్, మంగ్యా తదితరులు పాల్గొన్నారు.