నక్కపల్లి(విశాఖపట్టణం): వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో గురువారం ఉదయం జరిగింది. వివరాలు.. రాజమండ్రికి చెందిన సోము కనకరాజు(26), ఎమ్.ఉష, ఏ. సబిత, ఎస్.రవిలు కారులో విశాఖపట్నంకు వెళ్తున్నారు.
మార్గం మధ్యలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొనడంతో కనకరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్య నిమిత్తం నక్కపల్లి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.