భారీ వృద్ధి దిశగా అడుగులు.. అప్‌స్టాక్స్‌ సీఈవో రవి కుమార్‌ | 50 percent revenue growth target Upstox CEO Ravi Kumar | Sakshi
Sakshi News home page

భారీ వృద్ధి దిశగా అడుగులు.. అప్‌స్టాక్స్‌ సీఈవో రవి కుమార్‌

Published Fri, Jun 16 2023 8:17 AM | Last Updated on Fri, Jun 16 2023 8:17 AM

50 percent revenue growth target Upstox CEO Ravi Kumar - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బ్రోకరేజి సంస్థ అప్‌స్టాక్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 శాతం ఆదాయ వృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది. 25–30 శాతం మేర లాభాల వృద్ధి ఉండగలదని అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ ఆదాయం రూ.  1,000 కోట్లు దాటగా.. బ్రేక్‌ ఈవెన్‌ సాధింంది. అప్‌స్టాక్స్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రవి కుమార్‌ గురువారమిక్కడ విలేకరుల సమావేశం సందర్భంగా ఈ విషయాలు తెలిపారు. 

ప్రస్తుతం తమకు 1.1 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారని, 2030 నాటికి ఈ సంఖ్యను పది కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్లయింట్ల సంఖ్య గత రెండేళ్లలో 13% పెరిగిందని,  వీరిలో 70% మంది యువ ఇన్వెస్టర్లేనని రవి కుమార్ చెప్పారు. డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌లో దేశ సగటుతో పోలిస్తే ఇక్కడ రెట్టింపు స్థాయిలో ట్రేడర్లు ఉన్నట్లు వివరించారు. 

అడ్వాన్స్‌డ్‌ ట్రేడర్ల కోసం రియల్‌ టైమ్‌ సమాచారంతో ట్రేడ్‌ మోడ్, ఇన్వెస్టర్ల కోసం ఇన్వెస్ట్‌ మోడ్‌ పేరిట రెండు ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. 2018 నుం ఇప్పటివరకూ 200 మిలియన డాలర్ల నిధులు సమీకరించామని చెప్పారు. అప్‌స్టాక్స్‌లో ప్రస్తుతం 600 మంది పైచిలుకు సిబ్బంది ఉండగా.. హైదరాబాద్‌లో దాదాపు 40 మంది ఉన్నారు. అవసరాన్ని బట్టి స్థానికంగా కార్యాలయం ఏర్పాటు చేసే Äñæచనలో ఉన్నట్లు కువర్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement