Brokerage Company
-
భారీ వృద్ధి దిశగా అడుగులు.. అప్‌స్టాక్స్ సీఈవో రవి కుమార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రోకరేజి సంస్థ అప్‌స్టాక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 శాతం ఆదాయ వృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది. 25–30 శాతం మేర లాభాల వృద్ధి ఉండగలదని అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ ఆదాయం రూ. 1,000 కోట్లు దాటగా.. బ్రేక్ ఈవెన్ సాధింంది. అప్‌స్టాక్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రవి కుమార్ గురువారమిక్కడ విలేకరుల సమావేశం సందర్భంగా ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం తమకు 1.1 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారని, 2030 నాటికి ఈ సంఖ్యను పది కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్లయింట్ల సంఖ్య గత రెండేళ్లలో 13% పెరిగిందని, వీరిలో 70% మంది యువ ఇన్వెస్టర్లేనని రవి కుమార్ చెప్పారు. డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో దేశ సగటుతో పోలిస్తే ఇక్కడ రెట్టింపు స్థాయిలో ట్రేడర్లు ఉన్నట్లు వివరించారు. అడ్వాన్స్డ్ ట్రేడర్ల కోసం రియల్ టైమ్ సమాచారంతో ట్రేడ్ మోడ్, ఇన్వెస్టర్ల కోసం ఇన్వెస్ట్ మోడ్ పేరిట రెండు ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. 2018 నుం ఇప్పటివరకూ 200 మిలియన డాలర్ల నిధులు సమీకరించామని చెప్పారు. అప్‌స్టాక్స్‌లో ప్రస్తుతం 600 మంది పైచిలుకు సిబ్బంది ఉండగా.. హైదరాబాద్‌లో దాదాపు 40 మంది ఉన్నారు. అవసరాన్ని బట్టి స్థానికంగా కార్యాలయం ఏర్పాటు చేసే Äñæచనలో ఉన్నట్లు కువర్ తెలిపారు. -
ఇన్వెస్టర్లు అలా చేస్తే నష్టపోవాల్సిందే.. బడా బ్రోకరైజ్ సంస్థ హెచ్చరిక!
భారత్ స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లో అతిపెద్ద బ్రోకరేజీ సంస్థ అయిన జెరోధా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్ కామత్ డిమ్యాట్ అకౌంట్ హోల్డర్లుతో పలు ఆసక్తికర విషయాలను ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఆయన తరచుగా ట్రేడర్స్ టిప్స్ ఇస్తుంటారన్న సంగతి తెలిసిందే. డీమ్యాట్ అకౌంట్ హోల్డర్లు తమ లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకోవద్దని కామత్ హెచ్చరించారు. సాధారణంగా ఇన్వెస్టర్లు మోసపోయే సులువైన మార్గం వారి లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకోవడమేనని వెల్లడించారు. పెన్నీ స్టాక్స్ సహాయంతో మోసగాళ్లు కృత్రిమ నష్టాలను సృష్టించవచ్చని తెలిపారు. మోసగాళ్లు ధనాన్ని తరలించడానికి ఇల్లిక్విడ్ ఆప్షన్ లేదా పెన్నీ స్టాక్లను ఉపయోగించి కృత్రిమ నష్టాలను సృష్టిస్తారన్నారు. అందుకే వీటి పట్ల కాస్త అప్రమత్తత అవసరమని చెప్పారు. సాధారణంగా తమ బ్యాంక్ ఐడీ, లాగిన్ల వివరాలు ఇతరులతో పంచుకోకుండా ఎలా వ్యవహరిస్తారో, అదే విధంగా వారి ట్రేడింగ్ ఖాతా లాగిన్ల విషయంలోనూ వ్యవహరించాల్సి ఉంటుందని సూచించారు. అఫిషియల్ బ్రోకర్ వెబ్సైట్లు, యాప్‌లు కాకుండా ఎక్కడా లాగిన్ వివరాలను నమోదు చేయకపోవడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఏ గుర్తింపులేని సలహాదారులు భారీ రాబడిని ఆఫర్ చేస్తాయని , అలాంటి మోసగాళ్లపై తమ టీమ్ గతంలో కొరడా ఝుళిపించిందని కామత్ వెల్లడించారు. మరికొన్ని సందర్భాల్లో కొందరు తెలియక వారి అకౌంట్ వివరాలను ఇతరులతో వాట్సప్, టెలిగ్రామ్‌లలో కూడా పంచుకుంటారని చెప్పారు. ఇలాంటి వాటిని చేయకపోవడమే మంచిదని సూచించారు. ఇన్వెస్టర్లున ట్రేడ్ చేసే ముందు వాటిని బాగా అర్థం చేసుకోవాలని కామత్ సూచించారు. The other way accounts get compromised is through phishing frauds. It's Important to not enter login details anywhere apart from the official broker websites and apps. From our experience having dealt with a bunch of frauds, here are the large issues we have spotted👇2/4 — Nithin Kamath (@Nithin0dha) July 11, 2022 చదవండి: Nothing Phone Price: అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన నథింగ్ ఫోన్ (1), ధర ఎంతంటే! -
చమురు, బొగ్గు ధరల భారం
ముంబై: అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు, బొగ్గు ధరలు భారత్‌కు సవాలుగా మారనున్నట్లు ఫారిన్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ గురువారంనాటి తన తాజా నివేదికలో విశ్లేషించింది. ఇప్పటికే ద్రవ్యోల్బణం, వృద్ధి సవాళ్లు పొంచిఉన్న భారత్‌కు కీలక కమోడిటీల ధరలు పెరగడం ప్రతికూలాంశమని వివరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► చమురు ధరలు వార్షికంగా 14 శాతం పెరిగి బేరల్‌కు 84 డాలర్లకు చేరాయి. ఇక బొగ్గు ధర మెట్రిక్ టన్నుకు 15 శాతం ఎగసి 200 డాలర్లకు చేరింది. ఇంధన ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుదల భయాలు నెలకొన్నాయి. దీనితో వృద్ధి మందగించే అవకాశం ఉంది. ఆయా పరిస్థితులు ద్రవ్య పరపతి విధానం కఠినతరం కావడానికి దారితీయవచ్చు. ► 10 శాతం చమురు ధర పెరిగితే ఆ ప్రభావం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంపై 0.40 శాతం మేర ఉంటుంది. చమురు ప్రధాన దిగుమతి దేశమైన భారత్‌పై ఈ బిల్లు భారంగా మారుతుంది. 10 శాతం చమురు దరల పెరుగుదల ప్రభావం కరెంట్ అకౌంట్‌పై (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిధుల మధ్య నికర వ్యత్యాసం) 0.30 శాతం (జీడీపీ విలువతో పోల్చి) ప్రభావం చూపుతుంది. ► తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత్ నుంచి ఎగుమతులు మరింత పెరగాల్సి ఉంటుంది. 78కి రూపాయి: యూబీఎస్ స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ సేవల దిగ్గజం యూబీఎస్ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల వల్ల భారత్ కరంట్ అకౌంట్ లోటు 14 బిలియన్ డాలర్లక చేరుతుందని (జీడీపీలో 0.5 శాతం) పేర్కొంది. చమురు ధర 100 డాలర్లు తాకితే, క్యాడ్ 3 శాతం వరకూ పెరుగుతుందని యూబీఎస్ అంచనా వేసింది. దీనితో రూపాయి డాలర్ మారకంలో 78కి చేరే అవకాశం ఉంటుందని అంచనావేసింది. అయితే క్యాడ్ సమస్య భారత్‌కు తాత్కాలికంగానే ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. భారత్ ఉన్న భారీ విదేశీ మారకపు నిల్వలు (600 బిలియన్ డాలర్లకుపైగా) ఈ నష్టాన్ని కట్టడి చేయడానికి దోహదపడతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదే విధంగా 2022 మార్చి నాటికి క్రూడ్ ధర బేరల్‌కు 68 బిలియన్ డాలర్లకు దిగివస్తుందన్న అంచనాలనూ వెలువరించింది. బొగ్గు కొరత వల్ల విద్యుత్ ఉత్పత్తికి, సెమికండక్టర్ చిప్స్ వల్ల ఆటో రంగానికి స్వల్ప కాలంలో తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఎదురుకానున్నాయని విశ్లేíÙంచింది. వ్యవస్థలో అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకోవడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రివర్స్ రెపో రేటును (ఆర్బీఐ వద్ద ఉంచిన తమ అదనపు నిధులకుగాను బ్యాంకులు పొందే వడ్డీరేటు– ప్రస్తుతం 3.35 శాతం) పెంచే అవకాశం ఉందని సంస్థ అంచనావేసింది. ఈ రేటును 0.15 శాతం–0.20 శాతం శ్రేణిలో పెంచే వీలుందని పేర్కొంది. వచ్చే ఏడాది డిసెంబర్, ఫిబ్రవరి ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. -
ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు బంపర్ఆఫర్ ప్రకటించిన జెరోదా..!
న్యూఢిల్లీ: ప్రముఖ ఫైనాన్షియల్ బ్రోకరేజ్ సంస్థ జెరోదా తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఉద్యోగులు ఫిట్‌గా ఉండడం కోసం సరికోత్త ఛాలెంజ్‌ను కంపెనీ విసిరింది. ఛాలెంజ్‌లో భాగంగా ఏడాది కాలంలో లక్ష్యాన్ని చేరుకున్నఉద్యోగులకు ఒక నెల జీతాన్ని బోనస్‌గా అందించనుంది. అంతేకాకుండా ఛాలెంజ్‌ను స్వీకరించిన వారిలో లక్కీ డ్రా ద్వారా ఎంపికైన ఒక ఉద్యోగికి రూ. 10 లక్షలను ఇవ్వనుంది. కోవిడ్-19 రాకతో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోంకు పరిమితమవ్వడంతో వారి జీవన విధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. లాక్డౌన్ మొదలైనప్పటినుంచి ఉద్యోగులు ఇంటికే పరిమితమవ్వడంతో శారీరక శ్రమకు దూరంగా ఉన్నారని కంపెనీ సీఈవో నితిన్ కామత్ పేర్కొన్నారు. ఉద్యోగుల జీవన విధానంలో, ఆహార విషయంలో గణనీయమైన మార్పులు వచ్చినట్లు తెలిపారు. ఫిట్‌గా ఉండేందుకు ఉద్యోగులకు ఈ ఛాలెంజ్‌ను విసిరినట్లు నితిన్ కామత్ వెల్లడించారు. కంపెనీ తీసుకొచ్చిన ఛాలెంజ్ ద్వారా ఉద్యోగుల జీవనా విధానంలో కచ్చితంగా మార్పులు వస్తాయని నితిన్ కామత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన ప్రతి ఉద్యోగికి ఒక నెల జీతం బోనస్, లక్కీ డ్రా ద్వారా ఎంపికైన ఒక ఉద్యోగికి రూ.10 లక్షలు అందిస్తామని నితిన్ ట్విటర్లో వెల్లడించారు. On our internal forum(@discourse), we asked everyone to set a 12-month get-healthy goal & update the progress every month, to create accountability. To increase participation, we said everyone who reaches the goal will get a 1-month salary as bonus & 1 lucky draw for Rs 10lks 2/3 — Nithin Kamath (@Nithin0dha) August 28, 2021 చదవండి: 90 నిమిషాల్లో ఢిల్లీ టూ ముంబై -
స్టాక్స్..రాకెట్స్!
ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం, వాణిజ్య యుద్ధ భయాలు, జీడీపీ అంచనాల తగ్గింపు, కంపెనీల ఆదాయాల డౌన్‌గ్రేడింగ్ వంటి గడ్డు పరిస్థితుల్లోనూ నిఫ్టీ గతేడాది దీపావళి (2018 నవంబర్ 7) నుంచి ఈ ఏడాది అక్టోబర్ 15 దాకా సుమారు 11% రాబడులిచ్చింది. కానీ మిడ్‌క్యాప్ సూచీ 6%, స్మాల్‌క్యాప్ సూచీ 10% మేర క్షీణించాయి. అయితే, రియల్టీ 14%, బ్యాంకెక్స్ 13%, ఆయిల్ అండ్ గ్యాస్ 13% పెరిగాయి. ఇక సంవత్ 2076లో ఆశావహ పరిస్థితులే కనిపిస్తున్నాయన్నది బ్రోకరేజీ సంస్థల మాట. ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు, కార్పొరేట్ ట్యాక్స్ రేటును 30% నుంచి 22 శాతానికి తగ్గించడం, తయారీ రంగంలో పెట్టుబడులకు ఊతమిచ్చే చర్యలు ప్రకటించడం సెంటిమెంటును మెరుగుపరుస్తాయన్నది వారి అంచనా. ఈ నేపథ్యంలో నిఫ్టీ 14,000 పాయింట్లకు , సెన్సెక్స్ 46,000 స్థాయిని అందుకోవచ్చని అంటున్నారు. ‘సంవత్ 2076’లో ఐటీ, మెటల్, ఫార్మా, ప్రభుత్వ రంగ సంస్థల షేర్లకు దూరంగా ఉండటమే మంచిదన్నది బ్రోకరేజీ సంస్థల సూచన. ప్రైవేట్ బ్యాంకులు, బీమా సంస్థలు, ఎఫ్ఎంసీజీ రంగాలు ఆకర్షణీయంగా ఉన్నాయంటున్నాయి. ఆ సిఫారసుల వివరాలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... బ్రోకరేజి సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 469 టార్గెట్ ధర రూ. 550 ఇతరత్రా సవాళ్లు, కొత్తగా బయటికొస్తున్న మొండిపద్దులకు సంబంధించి మిగతా బ్యాంకులతో పోలిస్తే ఐసీఐసీఐ బ్యాంకు పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆదాయాలను మెరుగుపర్చుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలనిస్తున్నాయి. రుణ వితరణకు సంబంధించి వార్షిక ప్రాతిపదికన 2019–21లో 17 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చు. హెచ్‌యూఎల్ ప్రస్తుత ధర రూ. 2,143 టార్గెట్ ధర రూ. 2,265 మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వేగంగా మార్పులు, చేర్పులు చేసుకోగల సామర్థ్యాలు, ప్రీమియమైజేషన్ ట్రెండు పటిష్టంగా ఉండటం, టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకోవటం వంటివి ఈ సంస్థకు సానుకూలాంశాలు. లార్జ్ క్యాప్ కన్జూ మర్ సంస్థల్లో హెచ్‌యూఎల్ ఆదాయాలు మరింత మెరుగ్గా నమోదయ్యే అవకాశాలున్నాయి. టైటాన్ ప్రస్తుత ధర రూ. 1,334 టార్గెట్ ధర రూ. 1,435 సొంతంగా అమలు చేస్తున్న వ్యూహాలు, నియంత్రణ వ్యవస్థ పరంగా సానుకూలాంశాలు టైటాన్ వృద్ధికి దోహదపడనున్నాయి. సేమ్ స్టోర్ సేల్స్ గ్రూప్ (ఎస్‌ఎస్‌ఎస్‌జీ) అమ్మకాల వృద్ధిలో జ్యుయలరీ విభాగం వాటా 60% పైగా ఉంది. నిర్వహణ మార్జిన్లు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఎస్బీఐ ప్రస్తుత ధర రూ. 282 టార్గెట్ ధర రూ. 350 నిర్వహణ పనితీరు స్థిరంగా ఉంది. ఆదాయాలు మెరుగుపడతాయి. అలాగే, ఎన్సీఎల్టీకి చేరిన మొండిపద్దుల నుంచి కూడా భారీ రికవరీలకు గణనీయమైన అవకాశాలున్నాయి. హెచ్డీఎఫ్సీ ప్రస్తుత ధర రూ. 2,103 టార్గెట్ ధర రూ. 2,600 లిక్విడిటీ పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ.. తక్కువ వ్యయాలతో నిధులు సమీకరించుకోగలగడం, మార్కెట్ షేరు పెంచుకోగలగడం దీనికి సానుకూల అంశాలు. 2019–2022 మధ్య ఏయూఎం వృద్ధి వార్షిక ప్రాతిపదికన 14 శాతం స్థాయిలో ఉండొచ్చని, నికర వడ్డీ మార్జిన్లు స్థిరంగా ఉండగలవని అంచనా. బ్రోకరేజి సంస్థ: రెలిగేర్ బ్రోకింగ్ హావెల్స్ ఇండియా ప్రస్తుత ధర రూ. 665 టార్గెట్ ధర రూ. 795 కొంగొత్త ఉత్పత్తులతో పోర్ట్‌ఫోలియోను వేగవంతంగా విస్తరిస్తోంది. ఎఫ్ఎంఈజీ రంగంలో అత్యధికంగా మార్కెట్ వాటా, పటిష్టమైన నెట్వర్క్ దీనికి లాభించే అంశాలు. పండుగ సీజన్ డిమాండ్‌తో రాబోయే రోజుల్లో పనితీరు మరింత మెరుగుపడవచ్చు. రుణభారం తక్కువగా ఉండటం, రాబడులు మెరుగ్గా ఉండటం కలిసొస్తాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ప్రస్తుత ధర రూ. 578 టార్గెట్ ధర రూ. 695 ఆటో పరిశ్రమలో మందగమ నం కారణంగా ఏడాది కాలంగా ఈ షేరు కరెక్షన్కు లోనయ్యింది. వర్షపాతం బాగుండటం, ద్రవ్య లభ్యత మెరుగ్గా ఉండటం, తక్కువ స్థాయిలో వడ్డీ రేట్లు ట్రాక్టర్ పరిశ్రమ రికవరీకి తోడ్పడగలవని అంచనా. ఫోర్డ్ ఇండియాతో జట్టు కట్టడం .. ఎంఅండ్ఎం పోర్ట్‌ఫోలియో మరింత పటిష్టపర్చుకోవడానికి, నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపర్చుకోవడానికి, భారత్ నుంచి ఎగుమతులు పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. మారికో ప్రస్తుత ధర రూ. 393 టార్గెట్ ధర రూ. 451 సమీప భవిష్యత్‌లో ఎఫ్ఎంసీజీకి సవాళ్లు ఉన్నప్పటికీ.. క్రమంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవచ్చు. సానుకూల అంచనాల కారణంగా 13–15 శాతం మేర ఆదాయ వృద్ధిని కంపెనీ ఆశిస్తోంది. కొత్త ఉత్పత్తులు, కొన్ని విభాగాల్లో అగ్రస్థానం ఉండటంతో పాటు కొబ్బరి ధరలు తగ్గుతుండటం.. కంపెనీ మార్జిన్లపరంగా సానుకూల అంశాలు. వోల్టాస్ ప్రస్తుత ధర రూ. 699 టార్గెట్ ధర రూ. 780 పెరిగే డిమాండ్‌కు తగ్గట్లుగా పెట్టుబడులు పెట్టడంతో పాటు కొత్త ఉత్పత్తులు, నెట్వర్క్ పటిష్టపర్చుకోవడం సానుకూల అంశాలు. మున్ముందు రూమ్ ఏసీలు, ఎయిర్ కూలర్లకు డిమాండ్‌తో వోల్టాస్ విక్రయాలు గణనీయంగా పెరగవచ్చు. తీవ్ర పోటీ ఉన్నా రూమ్ ఏసీల విభాగంలో వోల్టాస్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవచ్చు. బ్రోకరేజి సంస్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సుప్రీం ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 1,173 టార్గెట్ ధర రూ. 1,420 దేశీయంగా అతి పెద్ద ప్లాస్టిక్ ప్రాసెసింగ్ సంస్థల్లో ఒకటి. అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం, అన్ని ప్రాంతాల్లో తాగు నీటి వసతి కల్పించడం, మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపర్చడం వంటి ప్రభుత్వ ప్రాజెక్టులు పైపుల రంగానికి .. తద్వారా ఈ సంస్థకు సానుకూల అంశాలు. 2019–21 మధ్య కాలంలో కంపెనీ ఆదాయాలు 13 శాతం పైగా వృద్ధి చెందగలవని అంచనా. యునైటెడ్ బ్రూవరీస్ ప్రస్తుత ధర రూ. 1,337 టార్గెట్ ధర రూ. 1,620 దేశీ బీరు మార్కెట్లో 52 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. పటిష్టమైన బ్రాండ్స్, విస్తృతమైన నెట్వర్క్ దీనికి బలం. ఇతర ఉత్పత్తుల రేట్ల పెంపుతో పాటు ప్రీమియం బ్రాండ్స్ విక్రయాలు మెరుగుపడనుండటం సంస్థకు సానుకూలం. కొత్తగా క్రాఫ్ట్ బీరు, నాన్–ఆల్కహాల్ బెవరేజెస్ వ్యాపారాలు కూడా సంస్థకు ప్రయోజనకరంగా ఉండనున్నాయి. కాన్సాయ్ నెరోలాక్ ప్రస్తుత ధర రూ. 545 టార్గెట్ ధర రూ. 620 దేశీయంగా అతి పెద్ద ఇండస్ట్రియల్ పెయింట్ కంపెనీ. ఇండస్ట్రియల్ పెయింట్స్ విభాగంలో 35 శాతం, మొత్తం పెయింట్స్ మార్కెట్లో 14 శాతం వాటా ఉంది. పట్టణీకరణ, రీపెయింటింగ్కు డిమాండ్‌తో పాటు మెరుగైన వర్షపాతం, అందరికీ ఇళ్ల పథకాలు మొదలైనవి పెయింట్ పరిశ్రమకు, ఈ సంస్థకు సానుకూల అంశాలు. కార్పొరేట్ ట్యాక్స్ రేటు కోత కూడా కంపెనీకి లాభిస్తుంది. డాబర్ ఇండియా ప్రస్తుత ధర రూ. 465 టార్గెట్ ధర రూ. 550 పలు రకాల ఉత్పత్తులతో.. వివిధ విభాగాల్లోకి కంపెనీ విస్తరించింది. మూడు బ్రాండ్స్ (రియల్, వాటికా, ఆమ్లా) టర్నోవరు రూ. 1,000 కోట్ల పైగా ఉంటుండగా, రూ. 100 కోట్ల పైగా టర్నోవరుండే బ్రాండ్స్ 16 దాకా ఉన్నాయి. పతంజలి నుంచి పోటీ తగ్గి గత కొద్ది త్రైమాసికాలుగా రెండంకెల స్థాయి వృద్ధి సాధిస్తోంది. జేకే సిమెంట్ ప్రస్తుత ధర రూ. 1,117 టార్గెట్ ధర రూ. 1,260 గ్రే సిమెంట్ విభాగంలో టాప్ సంస్థల్లో ఇదొకటి. వైట్ సిమెంట్‌లో మార్కెట్ లీడరు. ఉత్తర, దక్షిణాది మార్కెట్లో కార్యకలాపాలు ఉన్నాయి. భారీ విస్తరణ ప్రణాళికల కోసం రూ.2,000 కోట్లు వెచ్చిస్తోంది. వైట్ సిమెంటు విభాగంలో అగ్రస్థానంలో ఉండటం, కార్పొరేట్ ట్యాక్స్ కోత దీనికి లాభించగలవని అంచనా. బ్రోకరేజి సంస్థ : ఏంజిల్ బ్రోకింగ్ మారుతీ సుజుకీ ప్రస్తుత ధర రూ. 7,469 టార్గెట్ ధర రూ. 8,552 ప్యాసింజర్ వాహనాల విభాగంలో 52 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కొంగొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతూ ప్రీమియం కస్టమర్లను కూడా ఆకర్షిస్తోంది. ఆటోమొబైల్ రంగం రికవర్ అయ్యే క్రమంలో ముందుగా అవకాశాలను అందిపుచ్చుకునే సత్తా ఉండటం దీనికి సానుకూలం. జీఎంఎం ఫాడ్లర్ ప్రస్తుత ధర రూ. 1,421 టార్గెట్ ధర రూ. 1,740 ఆగ్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఫార్మా తదితర రంగాల్లో రసాయనాల ప్రాసెసింగ్‌కు ఉపయోగించే గ్లాస్ లైన్డ్ (జీఎల్) స్టీల్ పరికరాల ఉత్పత్తిలో దేశీయంగా అగ్రస్థానంలో ఉంది. రాబోయే కొన్ని సంవత్సరాలకు సరిపోయేలా ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉంది. మధ్యకాలికంగా జీఎల్యేతర వ్యాపారాలను కూడా మెరుగుపర్చుకుంటోంది. లార్సన్ అండ్ టూబ్రో ప్రస్తుత ధర రూ. 1,425 టార్గెట్ ధర రూ. 1,850 ఇన్ఫ్రా, హైడ్రోకార్బన్, సర్వీసుల విభాగాలతో దేశీయంగా అతి పెద్ద ఈపీసీ కంపెనీ. వివిధ అనుబంధ సంస్థల ద్వారా ఐటీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాలలోనూ కార్యకలాపాలు సాగిస్తోంది. దేశ, విదేశాల్లో రూ.3 లక్షల కోట్ల విలువ చేసే ఆర్డర్లతో పటిష్టంగా ఉంది. ప్రభుత్వం ఇన్ఫ్రాపై దృష్టి, కార్పొరేట్ ట్యాక్స్ రేటు తగ్గింపు వంటివి సంస్థకు లాభించేవి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 1,229 టార్గెట్ ధర రూ. 1,390 డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా వ్యాపారాన్ని మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెడుతోంది. నగరాలు కానిచోట కొత్త శాఖల సంఖ్యను మరింతగా పెంచుకోవడం, పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్)లను 4 రెట్లు పెంపు, వర్చువల్ రిలేషన్షిప్ మేనేజర్ క్లయింట్స్ సంఖ్య రెట్టింపు వంటి లక్ష్యాలు నిర్దేశించుకుంది. మెరుగైన మార్జిన్లు నమోదు చేయగలుగుతోంది. బ్లూ స్టార్ ప్రస్తుత ధర రూ. 795 టార్గెట్ ధర రూ. 867 భారత్‌లో ఏసీలు తయారు చేసే పెద్ద కంపెనీల్లో ఒకటి. రూమ్ ఏసీల మార్కెట్లో ప్రతి ఏడాది తన మార్కెట్ వాటాను పెంచుకుంటూనే ఉంది. ఫలితంగా కంపెనీ మొత్తం ఆదాయంలో కూలింగ్ ప్రొడక్ట్స్ డివిజన్ వాటా పదేళ్లలో రెట్టింపైంది. ఇదే జోరు భవిష్యత్తులో కూడా కొనసాగనున్నది. రెండేళ్లలో ఆదాయం 11 శాతం చొప్పున వృద్ధి చెందగలదని అంచనా. మార్జిన్లు వచ్చే ఏడాది 7%కి పెరగవచ్చు. గోల్డ్ రన్.. రూ. 41,500కు చేరే అవకాశం అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, భౌగోళిక.. రాజకీయ ఆందోళనలు, బ్రెగ్జిట్‌పై తొలగని అనిశ్చితి... ఇవన్నీ 2019లో పసిడికి లాభించాయి. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు ప్రపంచ దేశాల వృద్ధి రేటు అంచనాలను కుదిస్తుండటంతో .. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలు మరింత పెంచుకున్నాయి. దేశీయంగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణించడం పుత్తడికి కలిసొచ్చింది. మొత్తం మీద గత దీపావళి నుంచి చూస్తే ఈక్విటీలపై 10 శాతం మేర రాబడులు రాగా.. పసిడి 21 శాతం దాకా లాభాన్నిచ్చింది. అయితే, ధరతో పాటు దిగుమతి సుంకాలూ పెరిగిపోవటం పసిడికి కొంత ప్రతికూలమే. 2019లో దిగుమతులు 12 శాతం తగ్గగా.. పండుగ సీజన్లో కూడా డిమాండ్ ఒక మోస్తరుగానే ఉంది. వాణిజ్య యుద్ధభయాలు తగ్గుముఖం పడుతున్న క్రమంలో.. వేగం తగ్గినా.. పసిడి పరుగు కొనసాగుతుందనే అంచనాలున్నాయి. ప్రధాన ఎకానమీల్లో మందగమనం మరి కొన్నాళ్లు కొనసాగే అవకాశాలు, సెంట్రల్ బ్యాంకులు ఉదార విధానాలు కొనసాగించనుండటం పసిడి ధరకు మద్దతుగా నిలవవచ్చు. ఈ నేపథ్యంలో వాణిజ్య యుద్ధ భయాలు తగ్గిపోతే పసిడి కొంత కరెక్షన్కు లోనైనా.. రూ.35,500 మద్దతును నిలబెట్టుకోగలిగితే మళ్లీ గత గరిష్ట స్థాయి రూ.39,500ను తాకవచ్చు.. ఆ పైన వచ్చే 12 నెలల్లో రూ. 41,500కి కూడా చేరవచ్చు. -
ఆ ఉద్యోగులకు ముందే దీపావళి : బంపర్ ఆఫర్
సాక్షి, బెంగళూరు : బెంగుళూరుకు చెందిన జెరోధా సెక్యూరిటీస్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన ఉద్యోగులకు రూ. 200 కోట్ల విలువైన ఎంప్లాయి స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఇసోప్) ను జెరోధా ఆఫర్ చేసింది. మొత్తం ఉద్యోగుల్లో 77 శాతం మందికి ఈ పథకం కింద ప్రయోజనం చేకూరనుంది. తద్వారా దీపావళి, దసరా పండుగ సంబరాన్ని ముందే వారి ముంగిటకు తీసుకొచ్చింది జెరోధా. ఎకనామిక్ టైమ్స్ అందించిన సమాచారం ప్రకారం మొత్తం 1100 మంది ఉద్యోగుల్లో 850మందికి ఈ షేర్లను కేటాయించామని జెరోధా సీఈవో నితిన్ కామత్ ప్రకటించారు. మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు వాటాలను ఖచ్చితంగా ఉంచుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ, మొదటి సంవత్సరం తరువాత 33 శాతం షేర్లను విక్రయించుకునే అవకాశాన్ని అందిస్తోంది. ఈ ఇసోప్ షేర్లను తిరిగి కొనుగోలు చేయడానికి కంపెనీ 30-50 కోట్ల రూపాయల నిధిని కేటాయించినట్టు చెప్పారు. తమ ఉద్యోగులు తక్కువ సంఖ్యలో ఉన్నారనీ, ఉద్యోగుల స్థూల ఆదాయాలు, సేవల ఆధారంగా వాటాల కేటాయింపు జరిగిందన్నారు. తమ ఉద్యోగుల ఆకస్మిక ద్రవ్య అవసరాలను తీర్చడానికి ఈ షేర్లపై ఏడాదికి 6-7 శాతం వడ్డీ అందిస్తామని కూడా కామత్ చెప్పారు. అలాగే తక్షణమే కాకపోయినప్పటికీ రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో పబ్లిక్ లిస్టింగ్‌కు వచ్చే అవకాశం ఉందని కామత్ వెల్లడించారు. కాగా భాగస్వామ్య సంస్థగా 2010లో ఏర్పాటైన జెరోధా బ్రోకరేజ్ సంస్థ రిటైల్, సంస్థాగత బ్రోకింగ్, కరెన్సీ, కమోడిటీ, మ్యూచువల్ ఫండ్స్, బాండ్ మార్కెట్లలో సేవలు అందిస్తుంది. తన విశిష్ష్ట సేవలు, డిస్కౌంట్లతో దేశీయ స్టాక్ బ్రోకరేజ్ సంస్థల్లో టాప్‌లో ఉన్న ఐసీఐసీ సెక్యూరిటీస్‌ను వెనక్కి నెట్టి ఈ ఏడాది ఆరంభంలో నెంబర్ 1 పొజీషన్లోకి దూసుకు వచ్చింది. దాదాపు 8.47 లక్షల ఇన్వెస్టర్లతో జెరోధా దేశంలోనే అతిపెద్ద బ్రోకరేజ్ సంస్థగా అవతరించింది. 2016 ఆర్ధిక సంవత్సరంలో జెరోధాకు 61,970 మంది కస్టమర్లు ఉండగా, 2019 ఆర్ధిక సంవత్సరం (9 నెలల కాలానికి ) ఆ సంఖ్య 84,7,016 కు చేరింది. -
బోర్డు తిప్పేసిన మరో బ్రోకరేజ్ సంస్థ
న్యూఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఎఫ్6 ఫిన్సర్వ్ తాజాగా దుకాణం కట్టేసింది. దీంతో గత రెండేళ్లలో చెల్లింపులు చెల్లించలేక డిఫాల్టయిన స్టాక్ బ్రోకర్ల సంఖ్య 11కు చేరింది. తాజాగా బోర్డు తిప్పేసిన ఎఫ్6 సంస్థ దాదాపు 100 కోట్ల రూపాయల పైచిలుకు ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించాల్సిఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సొమ్మంతా బ్రోకరేజ్ సంస్థ క్లయింట్లకు చెప్పకుండా మార్కెట్లో స్పెక్యులేషన్లకు వాడుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ క్లయింట్ల అనుమతి లేకుండా, వారికి ఎలాంటి సమాచారం లేకుండా వారి షేర్లను ఎఫ్6 సంస్థ ప్రమోటర్లు పంకజ్, సుమిత్ గోయల్‌లు విక్రయించి సొమ్ము చేసుకున్నారని తెలిసింది. ఇలా పోగు చేసిన మొత్తాన్ని వివిధ షేర్లు, పొజిషన్ల స్పెక్యులేషన్లో వాడారు. వీరి చర్యల కారణంగానే మార్చి 26– ఏప్రిల్ 2 మధ్య క్వాలిటీ ఐస్‌క్రీమ్ షేరు ఒక్కపాటున 35 శాతం వరకు పతనమైంది. ఎఫ్6 ప్రమోటర్లు తమ డైరెక్టర్లకు చెందిన షేర్లను అనుమతి లేకుండా విక్రయించారని క్వాలిటీ ఐస్‌క్రీమ్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు ఫిర్యాదు సైతం చేసింది. ఏం చేశారు? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎఫ్6 ప్రమోటర్లు ఇన్వెస్టర్లకు తెలియకుండా వారి సొమ్ములను ఆప్షన్ మార్కెట్లో, ఐపీఓ గ్రే మార్కెట్లో వెచ్చించారని తెలిసింది. ఈ సొమ్ముతో పెద్ద ఎత్తున ఆప్షన్లను రైట్ చేసినట్లు సమాచారం. అయితే ఫిబ్రవరిలో మార్కెట్లు ప్రతికూలంగా మారడంతో ఈ సొమ్మంతా ఊడ్చిపెట్టుకుపోయింది. గత ఏడాది కాలంలో ఇలా క్లయింట్ల సొమ్ము వాడుకొని బ్రోకరేజ్ సంస్థలు బోర్డు తిప్పేయడం ఎక్కువయింది. ఇలాంటి సంస్థలన్నీ కలిసి దాదాపు రూ. 300 కోట్లకు మోసం చేసి ఉంటాయని అంచనా. ఇలా డిఫాల్టయిన బ్రోకరేజ్సంస్థల్లో కొన్ని అనధికార ఎన్‌బీఎఫ్‌సీలుగా పనిచేస్తున్నాయి. క్లయింట్లకు సుమారు 12– 14 శాతం రాబడి హామీతో సొమ్ములు సమీకరించడం చేస్తున్నాయి. వీటికి కళ్లెం వేయడానికి సెబి గతేడాది కొన్ని నిబంధనలను తీసుకువచ్చినా బ్రోకరేజ్‌ల మోసాలు ఆగట్లేదు. ఏం చేయాలి? ఎఫ్6 తరహా బ్రోకరేజ్‌ల చేతిలో మోసపోయిన క్లయింట్లు తమకు రక్షణ కల్పించమని ఎక్సే్ఛంజ్లను కోరవచ్చు. ఎక్సే్ఛంజ్‌లు డిఫాల్టింగ్ బాధితులను ఆదుకోవడం కోసం ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్‌ను నిర్వహిస్తుంటాయి. ఇలాంటి మోసాలకు గురైన క్లయింట్లు దగ్గర్లోని మదుపరుల సేవా సంస్థను సంప్రదించాలని, ఒక ఆర్బిట్రేషన్ ఫారమ్ పూర్తి చేయాలని బోంబే షేర్‌హోల్డర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అశోక్ బక్లివాల్ సూచించారు. అప్పుడు బాధితుల కోసం ఎక్చేంజ్‌లు ఒక ఆర్బిట్రేటర్‌ను నియమించి తదుపరి చర్యలకు ఉపక్రమిస్తాయని, ఫిర్యాదు నిజమైతే 120 రోజుల్లో క్లయింట్‌కు దాదాపు 15 లక్షల రూపాయల వరకు పరిహారం అందుతుందని చెప్పారు. -
కొత్త ఏడాదికి కొన్ని బ్రోకరేజ్ సంస్థల స్టాక్ టిప్స్..!
జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంక్ ఆఫ్ బరోడా దిగ్గజ బ్యాంకుల్లో ఒకటి. దేశీయంగా 5,422 శాఖలు, ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో 106 శాఖలతో పటిష్టమైన నెట్వర్క్ కలిగి ఉంది. మొండిబాకీల ప్రక్షాళనపై యాజమాన్యం దృష్టి పెట్టిన నేపథ్యంలో ఎన్పీఏలు తగ్గి, అసెట్ క్వాలిటీ మెరుగుపడగలదని అంచనా. ఫలితంగా లాభదాయకత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ధర రూ. 160 టార్గెట్ ధరరూ. 208 వృద్ధి 30% కెన్‌ఫిన్ హోమ్స్ దక్షిణాది కేంద్రంగా పనిచేస్తున్న ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీని (హెచ్ఎఫ్సీ) కెనరా బ్యాంక్ ప్రమోట్ చేస్తోంది. 2022 నాటికల్లా అందరికీ గృహాలు అందించే దిశగా ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ పథకాలు మొదలైనవి కెన్‌ఫిన్ లాంటి హెచ్ఎఫ్సీలకు సానుకూలాంశం. ప్రస్తుత ధర రూ. 473 టార్గెట్ ధర రూ. 612 వృద్ధి 29% యూపీఎల్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో), ఎన్బీసీసీ షేర్లూ సిఫార్సు... హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ జాగరణ్ ప్రకాశన్ దేశీయంగా దిగ్గజ మీడియా సంస్థల్లో ఒకటి. ప్రకటనలపరంగా ప్రింట్ మీడియాకు ఎన్నికల సీజన్ బాగా కలిసొస్తుంది. 2018లో ఎనిమిది రాష్ట్రాల ఎన్నికలు జరగనుండటం అధిక ప్రకటనల ఆదాయం తెచ్చిపెట్టగలదు. శ్రోతల సంఖ్య పెరుగుతుండటంతో రేడియో వ్యాపార విభాగం వృద్ధి చెందుతుండటం కంపెనీకి సానుకూలాంశం. ప్రస్తుత ధర రూ. 179 టార్గెట్ ధర రూ. 199215 వ్యవధి – ఏడాది సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రైవేట్ రంగంలో మధ్య స్థాయి బ్యాంకు ఇది. మొండిబాకీల భారంతో బ్యాంకింగ్ రంగం కుదేలవుతున్నప్పటికీ.. ఈ బ్యాంకు మాత్రం ఎన్పీఏలను గణనీయంగానే కట్టడి చేసింది. అధిక ఆదాయం ఇవ్వగలిగే రిటైల్, ఎస్ఎంఈ రుణ విభాగాలపై సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రధానంగా దృష్టి పెట్టింది. ప్రస్తుత ధర రూ. 31 టార్గెట్ ధర రూ. 3141 వ్యవధి – ఏడాది సిఫార్సు చేస్తున్న మరో షేర్... ఎన్సీసీ సెంట్రమ్ వెల్త్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఆదిత్య బిర్లా గ్రూప్‌లో ఆర్థిక సేవల వ్యాపార విభాగాలన్నింటికి ఇది హోల్డింగ్ కంపెనీగా వ్యవహరిస్తోంది. జీవిత బీమా, అసెట్ మేనేజ్మెంట్, ప్రైవేట్ ఈక్విటీ, ప్రాజెక్ట్ ఫైనాన్స్, వెల్త్ మేనేజ్మెంట్, బ్రోకింగ్ తదితర కార్యకలాపాలు ఉన్నాయి. సంస్థ నిర్వహణలో ఆస్తుల విలువ రూ. 2,81,299 కోట్లు. ప్రస్తుత ధర రూ. 184 సిఫారసు– కొనొచ్చు మణప్పురం ఫైనాన్స్ బంగారు ఆభరణాలపై రుణాలిస్తున్న పెద్ద ఎన్బీఎఫ్సీల్లో ఒకటి. సంస్థ ఏయూఎం ప్రస్తుతం రూ. 13,723 కోట్లు. కేవలం బంగారంపై రుణాల విభాగంపైనే ఆధారపడకుండా.. వ్యూహాత్మకంగా మైక్రోఫైనాన్స్, గృహ రుణాలు, వాణిజ్య వాహన రుణాలు మొదలైన వాటిల్లోకి కూడా విస్తరించింది. ప్రస్తుత ధర రూ. 123 సిఫారసు– కొనొచ్చు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్. పర్సిస్టెంట్ సిస్టమ్స్లకూ సిఫార్సు ... -
జూలై నుంచి రిలయన్స్ జియో సేవలు
అంచనాలకన్నా ముందుగానే... క్రెడిట్ సూసీ నివేదిక న్యూఢిల్లీ: మార్కెట్ అంచనాలకు ముందుగానే రిలయన్స్ జియో 4జీ సేవలు జూలై నెల ద్వితీయార్ధం నుంచి ప్రారంభం కానున్నాయని బ్రోకరేజ్ కంపెనీ క్రెడిట్ సూసీ తన నివేదికలో పేర్కొంది. ఇది టెలికం రంగంపై చాలా ప్రభావాన్ని చూపనుందని వివరించింది. రిలయన్స్ జియో 4జీ సేవలను ప్రారంభించడానికి ముందుగానే తన 4జీ హ్యండ్సెట్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోందని తెలిపింది. దీని కోసం కంపెనీ ప్రత్యేకంగా ఒక నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. రిలయన్స్ జియో విక్రయించనున్న 4జీ హ్యండ్సెట్ల ధర 80-90 డాలర్ల మధ్యలో ఉండవచ్చని అంచనా వేసింది. ఇప్పటికే రిలయన్స్ జియో 4జీ సేవల ప్రారంభ ఏర్పాట్లు తుది దశకు చేరాయని, అలాగే చాలా సర్కిళ్లలో డిస్ట్రిబ్యూటర్ల జాబితా కూడా ఖరారైందని పేర్కొంది. రిలయన్స్ జియోకి సమంగా ఎయిర్టెల్ 4జీ సేవలు: రిలయన్స్ జియోకి ఏమాత్రం తీసిపోకుండా ఎయిర్టెల్ 4జీ సేవలు ఉన్నాయని క్రెడిట్ సూసీ పేర్కొం ది. ఎయిర్టెల్ ఇప్పటికే బెంగుళూరు, ముంబైలలో 4జీ సేవలను అందిస్తోందని, అలాగే గత సోమవారం వైజాగ్, హైదరాబాద్‌లలో కూడా 4జీ ట్రయల్ రన్‌ను నిర్వహించిందని వివరించింది. ప్రస్తుతం 4జీ సర్వీసులలో ఎయిర్టెల్ అగ్రస్థానంలో ఉందని తెలిపింది. ఎయిర్టెల్ 4జీ సర్వీసుల్లో యూట్యూబ్ వీడియోల స్ట్రీమింగ్ వేగం బాగుందని కితాబునిచ్చింది. అనుకున్న గడువులోగానే 4జీ సేవలు: ఆర్ఐఎల్ ప్రభుత్వం నిర్ణయించిన నిర్దిష్ట గడువులోనే 4జీ సేవలను ప్రారంభించడానికి తగిన చర్యలు చేపట్టామని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. స్పెక్ట్రమ్ లెసైన్స్ నిబంధనల ప్రకారం జూలై చివరి నాటికి రిలయన్స్ కంపెనీ 4జీ సేవలను ప్రారంభించాలి. -
స్టాక్స్ వ్యూ
ఇండియన్ బ్యాంక్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.210 టార్గెట్ ధర: రూ. 245 ఎందుకంటే: తమిళనాడులో అధిక శాఖలున్న దక్షిణాది ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇది. అత్యధిక ప్రభుత్వ వాటా (81 శాతం) ఉన్న పీఎస్ బ్యాంక్ కూడా ఇదే. 2010-14 కాలానికి రుణాలు 19 శాతం, డిపాజిట్లు 16 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. 2013-14 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం 1,24,359 కోట్ల రుణాలిచ్చింది. వీటిలో కార్పొరేట్ రుణాలు 52 శాతం, వ్యవసాయ రుణాలు 15 శాతం, రిటైల్, ఎస్ఎంఈ రుణాలు చెరో 13 శాతంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి10-12 శాతం రేంజ్లో ఉండొచ్చని బ్యాంక్ అంచనా వేస్తోంది. దేశీయంగా ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో కార్పొరేట్ రుణాలు తగ్గించి, రిటైల్, ఎస్ఎంఈ రుణాలు ఎక్కువగా ఇవ్వాలని బ్యాంక్ నిర్ణయించింది. దేశీయ కాసా వాటా 28 శాతంగా ఉంది. దక్షిణాదిపైననే అధికంగా దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించిన ఈ బ్యాంక్ ప్రతీ ఏటా 115 కొత్త బ్యాంక్ శాఖలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2008-09 ఆర్థిక సంవత్సరంలో రూ.1,245 కోట్లుగా ఉన్న నికర లాభం 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.1,710 కోట్లకు పెరిగింది. అధిక కేటాయింపులు, డిపాజిట్లపై చెల్లించే అధిక వడ్డీరేట్ల కారణంగా ఆ తర్వాతి రెండు ఆర్థిక సంవత్సరాల్లో నికర లాభం తగ్గింది. నిధుల సమీకరణ వ్యయం తగ్గడం, ట్రేడింగ్ గెయిన్స్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మంచి నికర లాభం ఆర్జించే అవకాశాలున్నాయి. నికర వడ్డీ మార్జిన్ 3 శాతంగా ఉంది. భవిష్యత్తు వృద్ధికి తోడ్పడే మూలధన నిధులు పుష్కలంగా ఉన్నాయి. హిందుస్తాన్ మీడియా వెంచర్స్ బ్రోకరేజ్ సంస్థ: కోటక్ సెక్యూరిటీస్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.230 టార్గెట్ ధర: రూ.358 ఎందుకంటే: హిందుస్తాన్ మీడియా వెంచర్స్(హెచ్‌ఎంవీఎల్)కు చెందిన హిందుస్తాన్ హిందీ వార్తాపత్రిక భారత్‌లోనే రెండో అతి పెద్ద పత్రిక(ఐఆర్ఎస్-2013 సర్వే). 2011-14 కాలానికి హెచ్‌ఎంవీఎల్ రీడర్షిప్, నిర్వహణ లాభాలు పోటీ పత్రిక సంస్థలతో పోల్చితే పెరిగాయి. ఈ కాలంలో సంస్థ ఇబిటా 20 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. అతి పెద్ద హిందీ ప్రకటనల మార్కెట్ అయిన ఉత్తరప్రదేశ్‌లో చెప్పుకోదగ్గ సర్క్యులేషన్‌ను సాధించింది. ఇది సంస్థ దీర్ఘకాల వృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతుంది. ఈ వార్తాపత్రిక ప్రచురిత ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల్లో(ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్) త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ కారణంగా రీడర్షిప్ మరింతగా పెరగనున్నది. ఈ అంశాల కారణంగా పరిశ్రమ అంచనాలను మించిన వృద్ధిని హెచ్‌ఎంవీఎల్ సాధిస్తుందని భావిస్తున్నాం. 2014-16 కాలానికి లాభాల్లో వృద్ధి పోటీ సంస్థల కంటే అధికంగా ఉంటుందని అంచనా. ఏడాది కాలానికి ఇబిటా 35%, నికర లాభం 18% చొప్పున వృద్ధి సాధించవచ్చు. మీడియా షేర్లలో ప్రస్తుతం ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్న షేర్ ఇదే. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో(డీసీఎఫ్) మదింపు ఆధారంగా టార్గెట్ ధరను నిర్ణయించాం. పత్రికా రంగంలో తీవ్ర పోటీ, ముడి పదార్ధాల ధరలు పెరుగుదల వంటివి ప్రతికూలాంశాలు. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, ఇతర వివరాలు వివిధ బ్రోకరేజి సంస్థల నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.