కొత్త ఏడాదికి కొన్ని బ్రోకరేజ్‌ సంస్థల స్టాక్‌ టిప్స్‌..! | stock tips | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదికి కొన్ని బ్రోకరేజ్‌ సంస్థల స్టాక్‌ టిప్స్‌..!

Published Mon, Jan 1 2018 1:58 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

stock tips - Sakshi

జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
దిగ్గజ బ్యాంకుల్లో ఒకటి. దేశీయంగా 5,422 శాఖలు, ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో 106 శాఖలతో పటిష్టమైన నెట్‌వర్క్‌ కలిగి ఉంది. మొండిబాకీల ప్రక్షాళనపై యాజమాన్యం దృష్టి పెట్టిన నేపథ్యంలో ఎన్‌పీఏలు తగ్గి, అసెట్‌ క్వాలిటీ మెరుగుపడగలదని అంచనా. ఫలితంగా లాభదాయకత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుత ధర రూ. 160
టార్గెట్‌ ధరరూ. 208
వృద్ధి 30%


కెన్‌ఫిన్‌ హోమ్స్‌
దక్షిణాది కేంద్రంగా పనిచేస్తున్న ఈ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీని (హెచ్‌ఎఫ్‌సీ) కెనరా బ్యాంక్‌ ప్రమోట్‌ చేస్తోంది.  2022 నాటికల్లా అందరికీ గృహాలు అందించే దిశగా ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ పథకాలు మొదలైనవి కెన్‌ఫిన్‌ లాంటి హెచ్‌ఎఫ్‌సీలకు సానుకూలాంశం.

ప్రస్తుత ధర రూ. 473
టార్గెట్‌ ధర రూ. 612
వృద్ధి 29%

యూపీఎల్,  ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ (ఇండిగో), ఎన్‌బీసీసీ షేర్లూ సిఫార్సు...


హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
జాగరణ్‌ ప్రకాశన్‌
దేశీయంగా దిగ్గజ మీడియా సంస్థల్లో ఒకటి.  ప్రకటనలపరంగా ప్రింట్‌ మీడియాకు ఎన్నికల సీజన్‌ బాగా కలిసొస్తుంది. 2018లో ఎనిమిది రాష్ట్రాల ఎన్నికలు జరగనుండటం అధిక ప్రకటనల ఆదాయం తెచ్చిపెట్టగలదు. శ్రోతల సంఖ్య పెరుగుతుండటంతో రేడియో వ్యాపార విభాగం వృద్ధి చెందుతుండటం కంపెనీకి సానుకూలాంశం.

ప్రస్తుత ధర రూ. 179
టార్గెట్‌ ధర రూ. 199215
వ్యవధి – ఏడాది


సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌
ప్రైవేట్‌ రంగంలో మధ్య స్థాయి బ్యాంకు ఇది. మొండిబాకీల భారంతో బ్యాంకింగ్‌ రంగం కుదేలవుతున్నప్పటికీ.. ఈ బ్యాంకు మాత్రం ఎన్‌పీఏలను గణనీయంగానే కట్టడి చేసింది. అధిక ఆదాయం ఇవ్వగలిగే రిటైల్, ఎస్‌ఎంఈ రుణ విభాగాలపై సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ ప్రధానంగా దృష్టి పెట్టింది.

ప్రస్తుత ధర రూ. 31
టార్గెట్‌ ధర రూ. 3141
వ్యవధి – ఏడాది

సిఫార్సు చేస్తున్న మరో షేర్‌... ఎన్‌సీసీ


సెంట్రమ్‌ వెల్త్‌
ఆదిత్య బిర్లా క్యాపిటల్‌
ఆదిత్య బిర్లా గ్రూప్‌లో ఆర్థిక సేవల వ్యాపార విభాగాలన్నింటికి ఇది హోల్డింగ్‌ కంపెనీగా వ్యవహరిస్తోంది. జీవిత బీమా, అసెట్‌ మేనేజ్‌మెంట్, ప్రైవేట్‌ ఈక్విటీ, ప్రాజెక్ట్‌ ఫైనాన్స్, వెల్త్‌ మేనేజ్‌మెంట్, బ్రోకింగ్‌ తదితర కార్యకలాపాలు ఉన్నాయి. సంస్థ నిర్వహణలో  ఆస్తుల విలువ  రూ. 2,81,299 కోట్లు.

ప్రస్తుత ధర రూ. 184
సిఫారసు– కొనొచ్చు


మణప్పురం ఫైనాన్స్‌
బంగారు ఆభరణాలపై రుణాలిస్తున్న పెద్ద ఎన్‌బీఎఫ్‌సీల్లో ఒకటి.  సంస్థ ఏయూఎం ప్రస్తుతం రూ. 13,723  కోట్లు. కేవలం బంగారంపై రుణాల విభాగంపైనే ఆధారపడకుండా.. వ్యూహాత్మకంగా  మైక్రోఫైనాన్స్, గృహ రుణాలు, వాణిజ్య వాహన రుణాలు మొదలైన వాటిల్లోకి కూడా విస్తరించింది.

ప్రస్తుత ధర రూ. 123
సిఫారసు– కొనొచ్చు

ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌. పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌లకూ సిఫార్సు ...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement