పసిడి పతక పోరుకు రవి కుమార్‌ అర్హత | Wrestler Ravi Kumar in final of U-23 World Championship | Sakshi
Sakshi News home page

పసిడి పతక పోరుకు రవి కుమార్‌ అర్హత

Published Sat, Nov 17 2018 2:42 AM | Last Updated on Sat, Nov 17 2018 2:42 AM

 Wrestler Ravi Kumar in final of U-23 World Championship - Sakshi

ప్రపంచ అండర్‌–23 రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్‌ రవి కుమార్‌ ఫ్రీస్టయిల్‌ 57 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. రొమేనియాలో జరుగుతోన్న ఈ మెగా ఈవెంట్‌ సెమీఫైనల్లో రవి 10–8తో    తురొబోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై గెలుపొందాడు.

నేడు జరిగే స్వర్ణ పతక పోరులో జపాన్‌కు చెందిన తొషిహిరోతో రవి          తలపడతాడు. ఒకవేళ రవి గెలిస్తే ఈ ఈవెంట్‌ చరిత్రలో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయ రెజ్లర్‌గా గుర్తింపు పొందుతాడు. 2017లో బజరంగ్‌ పూనియా (65 కేజీలు), ఓంప్రకాశ్‌ (70 కేజీలు) రజత పతకాలు గెలిచారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement