- కలెక్టరేట్‌ను ముట్టడించిన వామపక్ష విద్యార్థి సంఘాలు
- గంటపాటు నిరసన
సుబేదారి : పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చే యాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వామపక్ష విద్యా ర్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ను ముట్టడించారు.
ఈ సందర్భంగా సుమారు 500 మంది విద్యార్థులు బాల సముద్రంలోని ఏకశిలాపార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి గంటపాటు నిరసన వ్యక్తం చేశారు. కాగా, కలెక్టర్ కార్యాలయ గేట్లుదాటి లోనికి వెళ్లేందుకు విద్యార్థి సంఘాల నాయకులు ప్రయత్నించగా పోలీ సులు వారిని అడ్డుకున్నారు.
అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్ ఏఓ లక్ష్మీపతికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భం గా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి అశోక్‌స్టాలి న్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1050 కోట్లు, జిల్లాలో రూ.150 కోట్ల స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ లో ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారని తెలిపారు. సంక్షేమ హాస్ట ళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయని, తాడ్వాయి మండలంలోని ప్రాజెక్టునగర్ హాస్టల్‌లో పాముకాటులో ఇటీవల బాలిక మృతిచెందడమే ఇందుకు నిదర్శనమన్నా రు.
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం జారీ చేసిన జీఓ 42ను వెంటనే అమలు చేయాలని కోరారు. పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి పైండ్ల యాక య్య మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాల న్నా రు. టీవీవీ జిల్లా కార్యదర్శి ఐత అనిల్ మాట్లాడుతూ విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఏఐ ఎఫ్‌డీఎస్ జిల్లా కార్యదర్శి సందీప్ మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. టివీఎస్ జిల్లా కన్వీనర్ కూనూరు రంజిత్ మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టమైన హామీ ఇచ్చి, వృత్తివిద్యా కోర్సులకు కౌన్సెలింగ్ వెంటనే నిర్వహించాలన్నారు. కార్యక్రమం లో టీవీవీ జిల్లా అధ్యక్షుడు బైరగోని సుధాకర్, ఏఐఎస్‌ఎఫ్ అధ్యక్షుడు గిన్నారపు రోహిత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీకాంత్, బాలరాజు పాల్గొన్నారు.