riyimbarsment fees
-
విద్యార్థులను సతాయించొద్దు
త్వరలోనే ఫీజురీరుుంబర్స్మెంటు విడుదల చేస్తాం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి భీమారం : ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల విషయంలో విద్యార్థులను సతాయించొద్దని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కళాశాల యూజమాన్యాలకు సూచించారు. నగర పరిధిలోని తులసి గార్డెన్లో ఆదివారం ఇంటర్మీడియట్ విద్యపై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కొన్ని కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు చేస్తున్నాయని, ఇలాంటి వారు తమ పద్ధతులు మార్చుకోవాలన్నారు. 2014-2015కు సంబంధించి ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్లు త్వరలోనే విడుదల చేస్తామన్నారు. 2015-16కు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ సైతం జనవరి నెలాఖరు వరకు విడుదల చేస్తామన్నారు. ఇంటర్మీడియట్ బోర్డును ఆన్లైన్ చేస్తున్నామని, తద్వారా అవినీతికి తావుండదన్నారు. ప్రభుత్వ కళాశాల్లో విద్యార్థుల నమోదు శాతం పడిపోతోందని, అరుుతే, ప్రైవేటు కళాశాలలకు ధీటు గా ఇందులో విద్య అందిస్తామన్నారు. ప్రైవేట్ కళాశాలల అప్లియేషన్ను ఐదేళ్లకు పెంచే విషయంపై చర్చిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ.వరదారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, జిల్లా అధ్యక్షుడు నర్సింహారావుతోపాటు రాష్ర్టంలోని పది జిల్లాలకు చెందిన జూనియర్ కళాశాల యాజమాన్య వర్గ సభ్యులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే నాణ్యమైన విద్య తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశబుూలల మేనేజ్మెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వరదారెడ్డి మాట్లాడుతూ, ఇంటర్మీడియట్బోర్డులో పైసలు లేకుండా పనిజరగడంలేదన్నారు. స్పందించిన కడియం.. ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరుగుతున్న మాట వాస్తమమేనని అంగీకరించారు. కానీ, తెలంగాణ విద్యార్థులు నిట్, ఐఐటీలో అత్యధిక సీట్లు సాధించడమే ఇక్కడ నాణ్యమైన విద్య అందుతుందనడానికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇంటర్‌బోర్డు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే నిలదీయాలని సూచించారు. ఈసందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారుు. -
సారూ కాల్మొక్తాం.. సర్టిఫికెట్లివ్వండి!
రంగారెడ్డి జిల్లా: ఫీజు రీయింబర్స్మెంట్ పేరిట కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఆదిలాబాద్‌కు చెందిన లింగస్వామి 2014-15లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్‌లో చేరాడు. కానీ, రీయింబర్స్మెంట్ రాకపోవడంతో కోర్సును వదిలేశాడు. డైట్‌సెట్‌లో మంచి ర్యాంకు సాధించాడు. కౌన్సెలింగ్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లు కావాలని ఇంజినీరింగ్ కాలేజీని సంప్రదించగా ఫీజు చెల్లించాలని స్పష్టం చేశారు. ఇంతలో అటుగా వస్తున్న కళాశాల చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి కాళ్లపై పడి సర్టిఫికెట్లు ఇప్పించాలని లింగస్వామి, తల్లిదండ్రులు వేడుకున్నారు. చైర్మన్ జోక్యంతో కొద్దిమొత్తం చెల్లించి లింగస్వామి సర్టిఫికెట్లు పొందాడు. -
రీయింబర్స్మెంట్ నిధుల స్తంభన
8 ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల నగదు జమ ఎప్పటికో 8కోర్సు పూర్తయినా సర్టిఫికెట్లు చేతికి రాక విద్యార్థుల ఇబ్బందులు మచిలీపట్నం : ప్రభుత్వం విద్యార్థులతో ఆటలాడుకుంటోంది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు విడుదల చేసినట్లే చేసి విద్యార్థుల ఖాతాల్లో జమ కాకుండా ఫ్రీజింగ్ విధించింది. దీంతో కోర్సు పూర్తయినా ఫీజు చెల్లించని కారణంగా పలువురు విద్యార్థుల చేతికి సర్టిఫికెట్లు రాని పరిస్థితి నెలకొంది. ఫీజు రీయింబర్స్మెంట్ నగదు జమ అయ్యే వరకు సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని కళాశాలల యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి.పై చదువులకు వెళ్లాల్సిన విద్యార్థులకు సర్టిఫికెట్లు లేకుంటే ఇబ్బందే. ప్రభుత్వం తీరుతో విద్యార్థుల భవిష్యత్తుపై అయోమయం నెలకొంది. ఒకపక్క ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లకు సంబంధించి తాము జాబితాలు పంపామని బీసీ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. వాటికి సంబంధించి నగదు మంజూరైనట్లు ట్రెజరీ అధికారులు పేర్కొంటున్నారు.బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి విద్యార్థుల వివరాలను సోమవారమే ఇచ్చారని, వాటిని పరిశీలించేందుకు మరికొంత సమయం పడుతుందని వారంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా వచ్చిన జాబితాల్లో విద్యార్థుల వివరాలు సక్రమంగా నమోదు కాలేదనే కారణం చూపి కొంతమంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నగదును జమ చేయని పరిస్థితి ఉంది. ఏ తరహా నగదు జమలపై ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించిందో తమకే తెలియదని చెప్పి ట్రెజరీ అధికారులు తప్పించుకుంటున్నారు. ట్రెజరీతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు జిల్లాలో ఉన్న పరిస్థితిని ప్రభుత్వానికి వివరించి సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపకపోవటం గమనార్హం. నిధులున్నా ఉపయోగం లేదు బీసీ సంక్షేమ శాఖ ద్వారా వివిధ కళాశాలల్లో చదివే 46,312 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ రూపేణా రూ.16.11 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కొంతమంది విద్యార్థుల ఖాతాల్లో సగం మొత్తం మాత్రమే నగదు జమ అయ్యింది. బీసీ విద్యార్థులకు 38,512 మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా రూ.31.93 కోట్ల నిధులు విడుదల కాగా సోమవారమే దీనికి సంబంధించిన జాబితాలను ఈ శాఖ అధికారులు ట్రెజరీకి పంపారు. 17,421 మంది ఈబీసీ విద్యార్థులకు సంబంధించి రూ.23.36 కోట్లు మంజూరు కాగా ఎంత మంది విద్యార్థులకు ఈ నిధులను అందజేశారో తెలియని పరిస్థితి నెలకొంది. గిరిజన సంక్షేమశాఖలో 4525 మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో 3323 మందికి నగదు అందజేశారు. మిగిలిన 1202 మందికి ఫీజు రీయింబర్స్మెంట్ అందని పరిస్థితి నెలకొంది. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 36,032 మంది విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ అందాల్సి ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా రూ.70.80 కోట్లు, స్కాలర్‌షిప్‌గా రూ.19.83 కోట్లు మొత్తం రూ.90.63 కోట్లు మంజూరు చేశారు. దీనిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా రూ.67.87 కోట్లు, స్కాలర్‌షిప్‌గా రూ.18.01 కోట్లు కలిపి మొత్తంగా రూ.85.88 కోట్లు ఖర్చు చేసినట్లు చూపుతున్నారు. అయినప్పటికీ చాలా మంది ఖాతాల్లో స్కాలర్షిప్ నగదు సగం మాత్రమే జమ అయినట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నగదు నేరుగా ప్రిన్సిపాల్ ఖాతాలో జమ అవ్వాల్సి ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ పూర్తికాలేదని, దీంతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిరాకరిస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నగదు వెంటనే విద్యార్థుల ఖాతాలో జమ అయ్యేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి
పదిరోజుల్లోగా స్పందించకపోతే ఉద్యమం ఉధృతం: కృష్ణయ్య హైదరాబాద్: రూ.850 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఈ పథకాన్ని సజావుగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వివిధ రాజకీయపార్టీలు, విద్యార్థి, యువజన, బీసీ సంఘాలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే రాష్ట్ర బంద్, కళాశాలల బహిష్కరణ, తదితర రూపాల్లో ఆందోళన తీవ్రతర ం చేస్తామని హెచ్చరించాయి. ఫీజు బకాయిలు చె ల్లించాలని, ఈ ఏడాది దరఖాస్తులు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరాపార్కు వద్ద బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షకు బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నేతలు మల్లు రవి, రమ్య, సీపీఐ నేత రాంనర్సింహారావు, సినీనటుడు ఆర్.నారాయణమూర్తి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క, వివిధ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఉదయం ఆర్.కృష్ణయ్యకు బీసీ హాస్టల్ విద్యార్థి వెంకటేష్ పూలమాల వేసి దీక్షను ప్రారంభించగా, సాయంత్రం పొన్నాల లక్ష్మయ్య నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆర్ .కృష్ణయ్య మాట్లాడుతూ వారం, పదిరోజుల్లో ఫీజు బకాయిలను పూర్తిగా చెల్లించకపోతే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా రావాలి: పొన్నాల రాజకీయాలకు అతీతంగా పేదల పక్షాన పోరాడేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రె డ్డి మాట్లాడుతూ ఫీజుల విషయంలో ఏ ముఖ్యమంత్రీ వ్యవహరించని విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎవరి దీక్షకైనా మద్దతిస్తాం: వైఎస్సార్సీపీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు కోసం ఎవరు దీక్ష చేసినా పార్టీలకతీతంగా తమ పార్టీ మద్దతిస్తుందని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.ఫీజు బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వైఎస్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని నీరుగార్చేందుకు గతంలో ప్రయత్నాలు జరిగినప్పుడు తమ అధ్యక్షుడు వైఎస్ జగన్‌నిరాహార దీక్షలు చేశారని గుర్తుచేశారు. -
రెన్యూవల్ కష్టాలు
ఫీజు రీయింబర్స్మెంట్ రెన్యూవల్ దరఖాస్తుకు నేడు ఆఖరు లేనిపోని నిబంధనలు, తక్కువ గడువు ఇచ్చిన ప్రభుత్వం దరఖాస్తుకు దూరమైన వేలాదిమంది విద్యార్థులు బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రెన్యూవల్ చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీ ఆఖరు కావడంతో విద్యార్థులు ఇబ్బందులుపడాల్సి వస్తోంది. కుల, ఆదాయ, స్థానికత ధ్రువీకరణ పత్రాల కోసం అవస్థలు పడుతున్నారు. రెన్యూవల్‌కు ప్రభుత్వం అక్టోబర్ 28 నుంచి నవంబర్ 10 వరకు మాత్రమే గడువు ఇచ్చింది. కుల ధ్రువీకరణ పత్రం పొందాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీ సేవా కేంద్రాల్లో కనీసం 15 రోజుల సమయం పడుతుంది. కాగా ప్రభుత్వం ఇచ్చిన సమయం కేవలం 14 రోజులు మాత్రమే. ఈ 14 రోజుల్లోనూ రెండు ఆదివారాలు, ఒక రెండో శనివారం, మొహర్రం పండుగ సెలవులు వచ్చాయి. ఇక మిగిలిన పది రోజుల్లో విద్యార్థులు ప్రభుత్వం కోరిన విధంగా అన్ని ధ్రువీకరణ పత్రాలతో ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది సందిగ్ధం. అలాగే ఫీజురీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులంతా జూన్ 2 తర్వాత మీ సేవా కేంద్రాల్లో పొందిన కుల, ఆదాయ, స్థానికత తదితర ధ్రువీకరణ పత్రాలను మాత్రమే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. విద్యార్థుల ఆధార్‌తో పాటు తల్లిదండ్రుల ఆధార్‌కార్డులనూ అప్లోడ్ చేయాలనే నిబంధనా ఉంది. దీంతో అనేక మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోలేక దూరం కానున్నారు. రీయింబర్స్మెంట్ తేదీల ప్రతిపాదనలను గత నెల 27న ప్రభుత్వం అన్ని కళాశాలలకు పంపించింది. ఈ పాస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అయితేఈ నోటీసులను సరైన సమయంలో విద్యార్థుల దృష్టికి తీసుకుపోవడంలో అనేక కళాశాలలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఆరోపణలున్నాయి. దీంతో జిల్లాలో మొత్తం 64,172 మంది రెన్యూవల్ విద్యార్థులకుగాను ఇప్పటి వరకు 12,661 మంది మాత్రమే రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కాస్త గడువు పెంచి, నిబంధనలు సడలిస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. గడువు పెంచాలి ఫీజు రీయింబర్స్మెంట్ రెన్యూవల్ చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచాలి. దరఖాస్తు చేసుకునేందుకు అనేక నిబంధనలు విధించి అతి తక్కువ సమయం ఇస్తే ఎలా. విద్యార్థులకు అన్యాయం చేసేందుకే ప్రభుత్వం ఈ విధమైన కుట్రలను పన్నుతోంది. - మహ్మద్ఫ్రీ బీటెక్, ద్వితీయ సంవత్సరం ఉన్నత విద్యను దూరం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు ఇలాంటి ప్లాన్లు చేస్తోంది. అతి తక్కువ వ్యవధిలో దరఖాస్తు చేసుకోమంటే ఎలా సాధ్యమవుతుంది. అనేక మందికి ఆధార్‌కార్డులు లేక పోయినా, ఫీజుకు ఆధార్ లింకు పెట్టడం బాధాకరం. - జీవీ నాగేంద్ర, బీటెక్ ఫైనలియర్ నిబంధనలను సడలించాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం నిబంధనలను సడలించాలి. ముఖ్యంగా ఫీజుకు ఆధార్ లింకును తొలగించాలి. అలాగే జూన్ 2 తర్వాత మీ సేవా కేంద్రాల్లో తీసుకున్న కుల, ఆదాయ, స్థానికత సర్టిఫికెట్ల విషయంలో కూడా ప్రభుత్వం పునరాలోచించాలి. - జీ శివశంకర్, బీటెక్ ఫైనలియర్ -
విద్యార్థుల పాట్లు
ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుకు 10న ఆఖరు సమయం లేకపోవడంతో మీ సేవ, రెవెన్యూ కార్యాలయాల వద్ద పడిగాపులు 80 వేల మందికి 21 వేల మంది విద్యార్థులే రెన్యువల్ ఓ వైపు కళాశాలల్లో వేలకు వేలు ఫీజులు.. మరో వైపు తీవ్ర కరువు.. ఆర్థిక ఇబ్బందుల నడుమ పేద విద్యార్థుల చదువు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో గట్టెక్కుతోంది. అయితే ప్రభుత్వ నిర్ణయం వీరి పాలిట శాపంగా మారుతోంది. రీయింబర్స్మెంట్ రెన్యువల్‌కు కేవలం 14 రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. ఈ లోపు జన్మభూమి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు అందక పడరాని పాట్లు పడుతున్నారు. తిరుపతి తుడా: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 10న చివరి తేదీ కావడంతో విద్యార్థులు కుల, ఆదాయ, నేటివిటీ సర్టిఫికెట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మీ సేవ, రెవెన్యూ కార్యాలయాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అక్టోబర్ 28 నుంచి ఈనెల 10వ తేదీ వరకు కేవలం 14 రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. కుల ధ్రువీకరణ పత్రం పొందాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీ సేవలో ఆన్లైన్లో రశీదు పొందిన తరువాత 15 రోజుల సమయం పడుతుంది. రీయింబర్స్మెంట్ తేదీల ప్రతిపాదనలను గత నెల 27న అన్ని కళాశాలలకు పంపించారు. ‘ఈ పాస్’ లాగిన్‌లో అందుబాటులో ఉంచారు. కళాశాలల యజమానులు రీయింబర్స్ మెంట్ తేదీలను నోటీస్ బోర్డులో ఉంచడంతో పాటు తరగతి గదులకు పంపాల్సిఉంది. నూటికి తొంభై శాతం కళాశాలలు ఈ నోటీసులను సరైన సమయంలో విద్యార్థుల దృష్టికి తీసుకెళ్లలేదనే ఆరోపణలు ఉన్నా యి. రీయింబర్స్మెంట్ తేదీలపై విద్యార్థులకు సమాచారం లేకపోవడంతో ఇప్పటి వరకు 80 వేల మందికి గాను, 21వేల మంది విద్యార్థులు మాత్రమే రెన్యువల్‌కు నమోదు చేసుకున్నారు. చివరి తేదీకి మూడు రోజు లు గడువు ఉన్నా శని, ఆదివారాలు సెలవు కావడం తో ఇక సోమవారం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉం టుంది. దీంతో విద్యార్థులు రెవెన్యూ కార్యాలయాల నుంచి సర్టిఫికెట్లు అందక, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోలేక కంటతడి పెడుతున్నారు. రీయింబర్స్‌మెంట్‌కు రెన్యువల్ గడువును పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల పడిగాపులు నిబంధనల ప్రకారం మీ సేవలో కుల ధ్రువీకరణకు-15 రోజులు, ఆదాయం, నేటివిటీ, ఇంటిగ్రేట్ సర్టిఫికెట్లకు-10 రోజులు సమయం పడుతుంది. రీయింబర్స్మెంట్ తేదీ ప్రకారం కేవలం 14 రోజులు గడువిచ్చారు. విద్యార్థులు తెలుసుకుని వాటికి దరఖాస్తు చేసుకునే లోపు 10 రోజులు పట్టింది. మిగిలిన నాలుగు రోజుల్లో ధ్రువీకరణ పత్రాలు పొందడానికి వీలు కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు జన్మభూమి రావడంతో రె వెన్యూ అధికారులు కార్యక్రమాలకే పరిమితమయ్యారు. తిరుపతి అర్బన్ రెవెన్యూలో ఇందుకోసం ప్రత్యేకంగా ఇద్దరిని ఏర్పాటు చేసినా ఫలితం లేకుం డా పోయింది. -
ఏపీ విద్యార్థులకు ‘స్థానికత’ షాక్
ఏపీ స్థానికత ఉన్నవారికే రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులన్న సర్కార్ జీవో నంబర్ 72తో గందరగోళం 371 డీ ప్రామాణికమంటూనే చిక్కుముడులు ఇంటర్ నుంచి వరుసగా ఏడేళ్ల ధ్రువపత్రాలు సమర్పించాలంటూ మెలిక హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్పులపై ఏపీ ప్రభుత్వం ఆదివారం జారీ చేసిన ఆదేశాలు (జీవో 72) ‘స్థానికత’పై విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నారుు. ఏపీ స్థానికత ఉన్న విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులను ఏపీ కాలేజీల్లో చ దువుతున్నా, తెలంగాణ కాలేజీల్లో చదువుతున్నా.. స్కాలర్‌షిప్పుల చెల్లించడంతోపాటు ఫీజు రీరుుంబర్స్‌మెంట్ అమలు చేస్తామని చె బుతూనే కొన్ని మెలికలు పెట్టడంతో దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైస్కూలు, ఇంటర్మీడియెట్ విద్యను వరుసగా ఒకే దగ్గర కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర, రాయల సీమ ప్రాంతాల్లోని వేర్వేరు సంస్థల్లో చేరి పూర్తిచేసిన విద్యార్థులు సర్కారు మెలికల కారణంగా నష్టపోనున్నారు. ఏపీ ప్రభుత్వమిచ్చిన జీఓ 72తో రెండు, మూడు దశాబ్దాలుగా తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్ర కుటుంబాల్లోని విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. 1956 నుంచి ఉన్నవారే స్థానికులంటూ ప్రవేశపెట్టిన ఫాస్ట్ పథకంపై న్యాయస్థానం చేసిన సూచనలతో పథకంలో కొన్ని మార్పులు చేర్పులకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నా, తన మౌలిక లక్ష్యమైన స్థానికతపై మాత్రం ఆ ప్రభుత్వం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ స్థిరపడిన లక్షలాది సీమాంధ్ర కుటుంబాల విద్యార్థులు ఏపీ ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకొన్నారు. ఫాస్ట్ పథకంపై వివాదం రేగినప్పుడు తెలంగాణలోని విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, వారిని తాము ఆదుకుంటామని సీఎం చంద్రబాబునాయుడు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం జారీ చేసిన జీఓ 72 వారి ఆశలపై నీళ్లు పోసింది. ఏపీ స్థానికత ఉన్న వారికి మాత్రమే ఫీజులు చెల్లిస్తామని జీఓలో స్పష్టం చేయడంతో తెలంగాణ లో స్థిరపడ్డ వారి పిల్లలకు ఫీజులు ఇచ్చేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పేసినట్లయింది. మరోపక్క స్థానికత నిర్ధారణకు ఆర్టికల్ 371 డీ ప్రకారం ముందుకు వెళ్తామని జీఓలో ప్రభుత్వం పేర్కొంది. 371 డీ ప్రకారం ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ ప్రాంతమే ఆ విద్యార్థి స్థానికతగా పరిగణించాలి. కానీ ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి అర్హతగా ఉన్న ఇంటర్మీడియెట్ నుంచి వెనుకకు వరుసగా ఏడేళ్లకు సంబంధించిన స్టడీ, బోనఫైడ్ ధ్రువపత్రాలను సమర్పించాలని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు వేలాది మంది విద్యార్థులు ఏపీలో హైస్కూలు విద్యను అభ్యసించి ఆపై ఇంటర్మీడియెట్‌కు వచ్చేసరికి హైదరాబాద్, దానిచుట్టుపక్కల కాలేజీల్లో చది వారు. అలాగే ఉపాధి నిమిత్తం గత 10, 15 ఏళ్లలో సీమాంధ్ర నుంచి లక్షలాదిగా కుటుంబాలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు తరలివ చ్చాయి. తాజా జీవోతో ఏపీలో స్థానికేతరులుగానే మిగిలిపోతున్నారు. తల్లిదండ్రులు ఏపీకి చెందినా వారు మాత్రం ఆ రాష్ట్రానికి సంబంధం లేనివారవుతున్నారు. తె లంగాణ ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు. జీఓతో వారి భవిత అగమ్యగోచరంగా మారుతోంది. కోర్సులు మధ్యలో నిలిచిపోయే ప్రమాదం... మరోవైపు ఈ ఫీజుల చెల్లింపు జీఓను కొత్తగా చేరే వారికే కాకుండా ఇప్పటికే కాలేజీల్లో చదువు కొనసాగిస్తున్నవారికి సైతం వర్తింపచేశారు. దీంతో అనేకమంది పేద విద్యార్థుల చదువులు మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఇప్పటికే చదువులు కొనసాగిస్తున్న విద్యార్థులు తాజా జీఓ ప్రకారం ఏపీకి స్థానికేతరుడిగా మారితే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోనుంది. మరోవైపు ప్రైవేటుగా పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదివిన వారికీ మరిన్ని కష్టాలు తప్పవు. స్టడీ, బోనఫైడ్ ధ్రువపత్రాలు సమర్పించేందుకు వీలుకాదు. స్థానికతకు తహసీల్దార్ల నుంచి ధ్రువపత్రాలు తీసుకోవాలి.హైదరాబాద్ చుట్టుపక్కల ఉపాధి కోసం వెళ్లిన వారి పిల్లలకు అక్కడి అధికారులు స్థానిక ధ్రువపత్రాలు ఇవ్వడం లేదు. అదే సమయంలో ఏపీలోనూ స్థానిక ధ్రువపత్రాలు వారికి అందవు. ఇలాంటి వేలాది మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లకు దూరమవ్వకతప్పదు. రానున్న కాలంలో ఉద్యోగం తదితరాల్లోనూ వీరంతా నష్టపోతారు. అన్నిటికీ ‘ఆధారే’..! సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్‌ను ముడిపెట్టరాదని ఉన్నతన్యాయస్థానం స్పష్టం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్నిటికీ ఆధార్‌ను తప్పనిసరి చేస్తోంది. గతంలో గ్యాస్ సిలిండర్ల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ను లింక్ చేసినప్పుడు ప్రతి పక్ష నేతగా చంద్రబాబునాయుడు తీవ్రంగా విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే ఆధార్ లింక్‌ను తీసివేయించేలా చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని విస్మరించారు. తాజాగా ఆధార్‌తోపాటు పాన్‌కార్డు, నాలుగు చక్రాల వాహనముంటే దాని వివరాలు దరఖాస్తుతో పాటే సమర్పించాలంటున్నారు. ధ్రువపత్రాలన్నీ స్కాలర్‌షిప్పుల దరఖాస్తుతో పాటు జత చేయాలని స్పష్టం చేయడంతో వాటికోసం విద్యార్థులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. జూన్ 2 తర్వాత ఈ సేవా కేంద్రాల ద్వారా తహసీల్దార్లనుంచి తీసుకున్న ధ్రువపత్రాలు మాత్రమే ఇవ్వాలనడంతో కొత్త విద్యార్థులే కాకుండా ఇప్పటికే చదువుతున్న వారు కూడా వీటికోసం పరుగులు పెట్టాలి. ప్రభుత్వం నిర్దేశించే గడువులోగా ఇన్ని లక్షలమందికి ఈ సేవా కేంద్రాల ద్వారా ధ్రువపత్రాలు ఏమేరకు అందుతాయో అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. ధ్రువపత్రాల కోసం చదువులు వదిలేసి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో విద్యార్థులు నష్టపోనున్నారు. -
ఇద్దరికీ ఫీజులు కడతాం!
కేబినెట్ భేటీలో నిర్ణయం ► తెలంగాణలో చదివే ఏపీ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వమే చెల్లించాలంటూ లేఖ రాయాలని నిర్ణయం ► తెలుగుజాతి ఔన్నత్యానికి కృషి చేసిన తెలంగాణ మహనీయుల విగ్రహాలు ఏపీలో ఏర్పాటు ► పవన, సౌర విద్యుత్తు ప్లాంట్లకు 17,000 ఎకరాలు... పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక కార్పొరేషన్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చదువుకుంటున్న ఏపీ, తెలంగాణ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను, స్కాలర్‌షిప్పులను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే.. తెలంగాణలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు, స్కాలర్షిప్లు చెల్లించాలని కోరుతూ అక్కడి ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ పూర్తయి తరగతులు కూడా ప్రారంభమైనందున స్కాలర్‌షిప్పుల చెల్లింపు అంశంపై స్పష్టతనివ్వాలని పలు వర్గాల నుంచి డిమాండ్ల గురించి కేబినెట్లో ప్రస్తావనకు వచ్చింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మా తదితర కాలేజీల్లో ఉన్నత విద్యాభ్యాసానికి చేరుతున్న అర్హులైన ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్షిప్ప్లు అందిద్దామని సీఎం చంద్రబాబు సమావేశంలో పేర్కొన్నారు. తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ప్రస్తుతమున్న నిబంధనల మేరకు మెయింట్‌నెన్స్ ఫీజు కింద స్కాలర్షిప్ప్లు అందించాలని నిర్ణయించారు. ఏపీలో చదువుతున ్న తెలంగాణ విద్యార్థులకు ఫీజులు రీయింబర్స్ చేస్తున్నందున.. అదే మాదిరిగా తెలంగాణలో చదివే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూడా ఫీజులు చెల్లించాలని అక్కడి ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. ఆర్టికల్ 371డి, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే వెళ్లాలి... 1956 సంవత్సరానికి ముందు తెలంగాణలో ఉన్న వారికే ఫీజుల చెల్లింపు అని తెలంగాణ ప్రభుత్వం ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టినా హైకోర్టు దానికి వ్యతిరేకంగా అభిప్రాయం వ్యక్తపరుస్తూ పునఃపరిశీలన చేయాలని సూచించిన అంశంపై ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. ఆర్టికల్ 371డి ప్రకారం, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నాలుగేళ్లు చదివిన విద్యార్థులను స్థానికులుగానే పరిగణించి ఫీజులు చెల్లించాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వంపైనే ఉంటుందని, ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. 371డి, రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా వారు వెళ్తే విద్యార్థులను ఆదుకొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అప్పటి పరిణామాలను అనుసరించి నిర్ణయం తీసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ వరకు వరుసగా నాలుగేళ్ల విద్యాభ్యాసం పూర్తిచేసి, ఏపీ స్థానికతతో తాజాగా తెలంగాణ కాలేజీల్లో ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో చేరే వారికి మాత్రం ఫీజులు తామే చెల్లించే అంశంపైనా మంత్రివర్గ భేటీలో చర్చించారు. తెలంగాణ స్థానికత ఉన్న ఆంధ్ర విద్యార్థులకు అక్కడి ప్రభుత్వమే ఫీజులు ఇవ్వాల్సి ఉంటుందని, అదే అంశాన్ని ఆ ప్రభుత్వానికి తెలియచేయాలని నిర్ణయించారు. అర్హులను గుర్తించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి... ఇదిలావుంటే.. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారిని గుర్తించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సమావేశంలో అధికారులకు సూచించారు. పెన్షన్లలో అర్హులను గుర్తించడానికి ఏమేరకు చర్యలు తీసుకుంటున్నామో అంతకన్నా గట్టి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అర్హులకు ఎంత మందికి ఇచ్చినా ఫర్వాలేదని, అనర్హుడు ఒక్కరికి కూడా ప్రభుత్వ సంక్షేమం వెళ్లేందుకు వీలు లేదని చంద్రబాబు స్పష్టంచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పొందేందుకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. రెండు లక్షలు, బీసీ విద్యార్థులకు రూ. లక్ష చొప్పున వార్షిక కుటుంబ ఆదాయ పరిమితిని నిర్ణయించారు. ఏపీలో తెలంగాణ మహనీయుల విగ్రహాలు హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల తొలగింపు విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేసిన ప్రకటన అంశం కూడా మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. తెలుగు వారు ఎక్కడున్నా అందరూ ఒక్కటేనని, తెలుగుజాతి ఔన్నత్యాన్ని పెంచిన మహనీయులు ఎక్కడివారైనా పరస్పరం గౌరవించుకోవలసిన అవసరముందని సీఎం, మంత్రులు అభిప్రాయపడ్డారు. ట్యాంక్‌బండ్‌పైని తెలుగువారి విగ్రహాలు తొలగించడం సబబుకాదన్నారు. తెలుగుజాతి ఔన్నత్యానికి కృషి చేసిన తెలంగాణ మహనీయుల విగ్రహాలను కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయాలన్న భావనకు వచ్చారు. ఐటీ, పవర్ తప్ప ఏ శాఖ తీరూ బాగోలేదు... రాష్ట్రంలో విద్యుత్తు, ఐటీ శాఖలు తప్ప మరే శాఖ పనితీరూ అంత సంతృప్తిక రంగా లేదని సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. 24 గంటల విద్యుత్తు పంపిణీపై సమావేశంలో ఆయన వివరిస్తూ విద్యుత్తు కొరత లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రానికి రానున్న కాలంలో ఆదాయాన్ని తెచ్చిపెట్టే రంగం ఐటీయేనని, దానిపై ఎక్కువ దృష్టి సారిస్తున్నామని వివరించారు. ఐటీ, పారిశ్రామికాభివృద్ధికి విద్యుత్తు రంగం ముఖ్యమని, ఈ రెండు శాఖలూ బాగా పనిచేస్తున్నాయని సంతృప్తి వ్యక్తంచేశారు. ఇతర శాఖల మంత్రులు, అధికారులు కూడా మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు. పవన, సౌర విద్యుత్తు ప్లాంట్లకు 17,000 ఎకరాలు... విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కందిపల్లి వద్ద ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ఎకరా ధర రూ. 6 లక్షల చొప్పున 10 ఎకరాలు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. నెల్లూరులో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవన నిర్మాణానికి ఎకరా రూ. 42 లక్షల ధరకు 6 సెంట్ల స్థలం, కడపలో కంటి ఆస్పత్రి కోసం భూమి కేటాయించాలని నిర్ణయించారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పవన, సౌర విద్యుత్తు ప్లాంట్ల కోసం 17,000 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించింది. శానిటేషన్‌కు కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టినందున రాష్ట్రంలో కూడా ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేయాలని చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. దీనికోసం ప్రత్యేకంగా శానిటేషన్ కార్పొరేషన్ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, కంపెనీలు, ఇతరత్రా మార్గాల ద్వారా ఈ కార్పొరేషన్‌కు నిధులు వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నామని చెప్పారు. -
హైదరాబాద్ విద్యార్థులపై అశనిపాతం
ఆర్టికల్ 371డి ప్రకారం రీయింబర్స్మెంట్ అంటూ ఏపీ ప్రభుత్వం మెమో ఆందోళన వ్యక్తం చేస్తున్న హైదరాబాద్‌లో స్థిరపడ్డ సీమాంధ్ర కుటుంబాలు తమ పిల్లలకెవరు ఫీజులు చెల్లిస్తారని ఆందోళన హైదరాబాద్: ఉన్నత విద్య, సాంకేతిక, వృత్తి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటుపై రాష్ట్రప్రభుత్వం ఆదివారం జారీచేసిన మెమో హైదరాబాద్ విద్యార్థుల పాలిట అశనిపాతమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో (286/ఈసీ/ఏ2/2014)పై వారు ఆందోళనకు గురవుతున్నారు. సాంకేతిక, వృత్తి విద్యా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆర్టికల్ 371 డీ ప్రకారం స్థానికులైన విద్యార్ధులకే ఫీజులు చెల్లిస్తామని ఆ మెమోలో ప్రభుత్వం పేర్కొంది. ఆ ఆర్టికల్ ప్రకారం నాలుగో తరగతి నుంచి పదో తరగతి మధ్యలో వరుసగా నాలుగేళ్లు ఏ ప్రాంతంలో చదివితే అదే వారి స్థానిక ప్రాంతం అవుతుంది. ఆ లెక్కన కేవలం ఏపీలో చదువుకున్న విద్యార్థులకు మాత్రమే ఫీజుల చెల్లింపు ఉంటుందని ఈ మెమో ద్వారా ప్రభుత్వం తేటతెల్లం చేసింది. దీంతో ఉపాధి కోసం తెలంగాణ ప్రాంతంలో.. ముఖ్యంగా హైదరాబాద్‌లో రెండు, మూడు దశాబ్దాలుగా ఉంటున్న కుటుం బాల పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. హైదరాబాద్‌లో స్థిరపడిన కుటుంబాలను ఆదుకుంటామని చెప్పుకుంటూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మెమో ద్వారా నట్టేట ముంచుతోందని, ఇప్పుడు తమ పిల్లలకెవరు ఫీజులు చెల్లిస్తారని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాత విద్యార్థుల పరిస్థితీ అయోమయమే.. కాలేజీల్లో ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులకే కా కుండా ఆపై తరగతుల్లో చదువుతున్న విద్యార్థుల్లో కూడా ప్రభుత్వ నిర్ణయం అయోమయం నింపుతోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి చేరుతున్న వారి సంఖ్య 40 వేల వరకు ఉంటుంది. వీరంతా ఏపీ స్థానికత ఉన్న వారు. తెలంగాణలో జరుగుతున్న ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలనలో ఇప్పటి వరకు దాదాపు 60 వేల మంది పాల్గొన్నారు. వీరిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విద్యార్థులు 20 వేల మంది ఉంటారని అంచనా. వీరి ఫీజుల చెల్లింపు తమ బాధ్యత కాదని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలూ చెబుతున్నాయి. ఇక ఇప్పటికే రెండు, మూడు, నాలుగు సంవత్సరాలు చదువుతున్న వి ద్యార్థులు (తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రుల పిల్లలు) దాదాపు లక్ష మంది వరకు ఉంటారని చెబుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు ఆధారంగా కాలేజీల్లో చేరి చదువులు కొనసాగిస్తున్న వీరు తక్కిన సంవత్సరాలకు ఫీజులు చెల్లించే మార్గం కానరాక ఆందోళన చెందుతున్నా రు. ఇది కేవలం ఇంజనీరింగ్ విద్యార్థుల పరిస్థితి మా త్రమే. స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంటులతో విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్న ఎంసీఏ, ఎంబీఏ, బీఫార్మసీ, పాలిటెక్నిక్, డీఫార్మసీ, డిగ్రీ కోర్సుల విద్యార్ధులూ ప్రభుత్వ మెమోతో రోడ్డున పడే పరిస్థితి దాపురిస్తోంది. -
రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయని ప్రభుత్వం
రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయని ప్రభుత్వం ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న ఆర్జీయూకేటీ ఆందోళనలో ట్రిపుల్ ఐటీ తొలి బ్యాచ్ విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఉద్యోగాలు దూరమవుతాయని ఆవేదన నూజివీడు : పేద ఇంట పుట్టినా సాంకేతిక ఉన్నత విద్యను అందిపుచ్చుకున్నామన్న ఆనందం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో ఆవిరవుతోంది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో ఆందోళన నానాటికీ రెట్టింపవుతోంది. ఆరేళ్ల కిందట ఏర్పాటుచేసిన ట్రిపుల్ ఐటీల్లో చేరిన తొలి బ్యాచ్‌కు చెందిన రెండు వేల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఈ బ్యాచ్‌కు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రూ.5కోట్లను ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. కోర్సు పూర్తయినా ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని ట్రిపుల్ ఐటీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఐదేళ్ల బకాయిలు కూడా చెల్లించాలని సూచిస్తున్నారు. దీంతో పేద కుటుంబాలకు చెందిన తాము రూ.40 వేల నుంచి రూ.80వేల వరకు చెల్లించలేమని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సర్టిఫికెట్ల ఇవ్వకపోతే క్యాంపస్ సెలక్షన్స్‌లో వచ్చిన ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. రూ.45వేల నుంచి రూ.84వేల వరకు భారం ట్రిపుల్ఐటీలలో ఆరు సంవత్సరాల కోర్సు పూర్తిచేసిన వారు వివిధ కేటగిరీల ప్రకారం ఈ ఏడాది ఫీజుతో కలిపి రూ.45వేల నుంచి రూ.84వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ4 విద్యార్థులకు ప్రభుత్వం ఏడాదికి రూ.40వేలు చొప్పున ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లిస్తోంది. ఈ మొత్తం ఇప్పటి వరకు రాలేదు. దీంతో ఒక్కో విద్యార్థి ఆ 40వేల రూపాయలు, బకాయిలు కలిపి లెక్కిస్తే బీసీ విద్యార్థులు రూ.51,800, ఎస్సీ విద్యార్థులు రూ.45వేలు, ఓసీ విద్యార్థులు రూ.84వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ రావాల్సి వారు 1,825 మంది ఉన్నారు. వారిలో ఎస్సీ వర్గానికి చెందిన 283 మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వచ్చాయి. మిగిలిన 1,542 మందికి సంబంధించిన రూ.5కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తం తాము చెల్లించలేమని విద్యార్థులు వాపోతున్నారు. ఏటా మే, జూన్ నెలల్లోనే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసేవారు. ఈసారి మాత్రం ఆగస్టు మొదటి వారం పూర్తయినా నిధులు విడుదల చేయలేదు. సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంపై విమర్శలు రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) వీసీ ఆర్వీ రాజకుమార్ తీసుకుంటున్న నిర్ణయాలు తొలి నుంచి వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. మెంటార్ల విషయంలోనూ, ఐఐటీలకు వెళ్లి ఇతర రాష్ట్రాల వారిని తీసుకొచ్చి లెక్చరర్లుగా నియమించడం, మెంటార్లను, లెక్చరర్లను వేర్వేరుగా చూడటంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా కోర్సు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పేద పిల్లలకు ఉన్నత విద్యను అందించాలనే సదాశయంతో ఏర్పడిన ఆర్జీయూకేటీ ఈ విధంగా విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడటం తగదని మండిపడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీచేసి అనంతరం నిధుల విడుదలకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.మహేష్ కోరారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి
కలెక్టరేట్‌ను ముట్టడించిన వామపక్ష విద్యార్థి సంఘాలు గంటపాటు నిరసన సుబేదారి : పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చే యాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వామపక్ష విద్యా ర్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా సుమారు 500 మంది విద్యార్థులు బాల సముద్రంలోని ఏకశిలాపార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి గంటపాటు నిరసన వ్యక్తం చేశారు. కాగా, కలెక్టర్ కార్యాలయ గేట్లుదాటి లోనికి వెళ్లేందుకు విద్యార్థి సంఘాల నాయకులు ప్రయత్నించగా పోలీ సులు వారిని అడ్డుకున్నారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్ ఏఓ లక్ష్మీపతికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భం గా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అశోక్స్టాలి న్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1050 కోట్లు, జిల్లాలో రూ.150 కోట్ల స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ లో ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారని తెలిపారు. సంక్షేమ హాస్ట ళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయని, తాడ్వాయి మండలంలోని ప్రాజెక్టునగర్ హాస్టల్లో పాముకాటులో ఇటీవల బాలిక మృతిచెందడమే ఇందుకు నిదర్శనమన్నా రు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం జారీ చేసిన జీఓ 42ను వెంటనే అమలు చేయాలని కోరారు. పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి పైండ్ల యాక య్య మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాల న్నా రు. టీవీవీ జిల్లా కార్యదర్శి ఐత అనిల్ మాట్లాడుతూ విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏఐ ఎఫ్‌డీఎస్ జిల్లా కార్యదర్శి సందీప్ మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. టివీఎస్ జిల్లా కన్వీనర్ కూనూరు రంజిత్ మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టమైన హామీ ఇచ్చి, వృత్తివిద్యా కోర్సులకు కౌన్సెలింగ్ వెంటనే నిర్వహించాలన్నారు. కార్యక్రమం లో టీవీవీ జిల్లా అధ్యక్షుడు బైరగోని సుధాకర్, ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు గిన్నారపు రోహిత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీకాంత్, బాలరాజు పాల్గొన్నారు. -
ఆన్లైన్ ద్వారా ఇక చెల్లింపులు
మూడు జిల్లాల ట్రెజరీ అధికారులకు శిక్షణ పూర్తి అవగాహనతో పనిచేయాలని ట్రెజరీస్ డెరైక్టర్ కనకవల్లి సూచన విశాఖపట్నం : రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగే అన్నిరకాల చెల్లింపులలో జాప్యాన్ని నివారిం చేందుకు త్వరలో ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు రాష్ట్ర ట్రెజరీస్ డెరైక్టర్ కె.కనకవల్లి తెలిపారు. ఆన్లైన్ చెల్లింపులపై అవగాహన కల్పించేందుకు శ్రీకాకుళం, విజయనరం, విశాఖపట్నం జిల్లాలకు చెంది న ట్రెజరీ అధికారులు, సిబ్బందికి ఆదివారం బుల్లయ్య కళాశాలలో ఏర్పాటైన శిక్షణ శిబి రంలో మాట్లాడారు. రాష్ట్రం లో 5 లక్షల మం ది వరకు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు, 3.5 లక్షల మంది పెన్షనర్లకు ఇకపై ప్రతినెలా చెల్లింపులు ఆన్లైన్ ద్వారానే జరుగుతాయన్నారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, థర్డ్ పార్టీ చెల్లింపులు కూడా ఆన్లైన్ ద్వారా నేరుగా వారివారి బ్యాంకు అకౌంట్లకు జమ అవుతాయన్నారు. ఆన్లై న్ విధానంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ట్రెజ రీస్ అదనపు సంచాలకు డు హనుమంతరావు, సంయుక్త సంచాలకుడు డాక్టర్ ఎ.శివప్రసాద్, అసిస్టెంట్ డెరైక్టర్లు ఎస్.వి.ఎన్.కల్యాణి, జి.అచ్చుతరామయ్య, విశాఖ జిల్లా ఖజానా ఉప సంచాలకులు ఎం.గీతాదేవి, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఎ.శ్రీనివాస్, కె.కేదార్, ఎస్బీఐ సీనియర్ మేనేజర్ వెంకట రావు, మూడు జిల్లాల డీడీలతో పాటు అధికారులు పాల్గొన్నారు.