ఏపీ విద్యార్థులకు ‘స్థానికత’ షాక్ | Riyimbarsment local AP holders | Sakshi
Sakshi News home page

ఏపీ విద్యార్థులకు ‘స్థానికత’ షాక్

Published Mon, Oct 20 2014 1:12 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

ఏపీ విద్యార్థులకు ‘స్థానికత’ షాక్ - Sakshi

ఏపీ విద్యార్థులకు ‘స్థానికత’ షాక్

ఏపీ స్థానికత ఉన్నవారికే రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులన్న సర్కార్  జీవో నంబర్ 72తో గందరగోళం
 
371 డీ ప్రామాణికమంటూనే చిక్కుముడులు
ఇంటర్ నుంచి వరుసగా ఏడేళ్ల ధ్రువపత్రాలు సమర్పించాలంటూ మెలిక

 
హైదరాబాద్: ఫీజు  రీయింబర్స్‌మెంట్, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్పులపై ఏపీ ప్రభుత్వం ఆదివారం జారీ చేసిన ఆదేశాలు (జీవో 72) ‘స్థానికత’పై విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నారుు. ఏపీ స్థానికత ఉన్న విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులను ఏపీ కాలేజీల్లో చ దువుతున్నా, తెలంగాణ  కాలేజీల్లో చదువుతున్నా.. స్కాలర్‌షిప్పుల చెల్లించడంతోపాటు ఫీజు రీరుుంబర్స్‌మెంట్ అమలు చేస్తామని చె బుతూనే కొన్ని మెలికలు పెట్టడంతో దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైస్కూలు, ఇంటర్మీడియెట్ విద్యను వరుసగా ఒకే దగ్గర కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర, రాయల సీమ ప్రాంతాల్లోని వేర్వేరు సంస్థల్లో చేరి పూర్తిచేసిన విద్యార్థులు సర్కారు మెలికల కారణంగా నష్టపోనున్నారు. ఏపీ ప్రభుత్వమిచ్చిన జీఓ 72తో రెండు, మూడు దశాబ్దాలుగా తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్ర కుటుంబాల్లోని విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. 1956 నుంచి ఉన్నవారే స్థానికులంటూ ప్రవేశపెట్టిన ఫాస్ట్ పథకంపై న్యాయస్థానం చేసిన సూచనలతో పథకంలో కొన్ని మార్పులు చేర్పులకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నా, తన మౌలిక లక్ష్యమైన స్థానికతపై మాత్రం ఆ ప్రభుత్వం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ స్థిరపడిన లక్షలాది సీమాంధ్ర కుటుంబాల విద్యార్థులు ఏపీ ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకొన్నారు.

ఫాస్ట్ పథకంపై వివాదం రేగినప్పుడు తెలంగాణలోని విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, వారిని తాము ఆదుకుంటామని  సీఎం చంద్రబాబునాయుడు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం జారీ చేసిన జీఓ 72 వారి ఆశలపై నీళ్లు పోసింది. ఏపీ స్థానికత ఉన్న వారికి మాత్రమే ఫీజులు చెల్లిస్తామని జీఓలో స్పష్టం చేయడంతో తెలంగాణ లో స్థిరపడ్డ వారి పిల్లలకు ఫీజులు ఇచ్చేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పేసినట్లయింది. మరోపక్క స్థానికత నిర్ధారణకు ఆర్టికల్ 371 డీ ప్రకారం ముందుకు వెళ్తామని జీఓలో ప్రభుత్వం పేర్కొంది. 371 డీ ప్రకారం ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ ప్రాంతమే ఆ విద్యార్థి స్థానికతగా పరిగణించాలి. కానీ ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి అర్హతగా ఉన్న ఇంటర్మీడియెట్ నుంచి వెనుకకు వరుసగా ఏడేళ్లకు సంబంధించిన స్టడీ, బోనఫైడ్ ధ్రువపత్రాలను సమర్పించాలని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు వేలాది మంది విద్యార్థులు ఏపీలో హైస్కూలు విద్యను అభ్యసించి ఆపై ఇంటర్మీడియెట్‌కు వచ్చేసరికి హైదరాబాద్, దానిచుట్టుపక్కల కాలేజీల్లో చది వారు. అలాగే ఉపాధి నిమిత్తం గత 10, 15 ఏళ్లలో సీమాంధ్ర నుంచి లక్షలాదిగా కుటుంబాలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు తరలివ చ్చాయి. తాజా జీవోతో ఏపీలో స్థానికేతరులుగానే మిగిలిపోతున్నారు. తల్లిదండ్రులు ఏపీకి చెందినా వారు మాత్రం ఆ రాష్ట్రానికి సంబంధం లేనివారవుతున్నారు. తె లంగాణ ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు. జీఓతో వారి భవిత అగమ్యగోచరంగా మారుతోంది.

కోర్సులు మధ్యలో నిలిచిపోయే ప్రమాదం...

మరోవైపు ఈ ఫీజుల చెల్లింపు జీఓను కొత్తగా చేరే వారికే కాకుండా ఇప్పటికే కాలేజీల్లో చదువు కొనసాగిస్తున్నవారికి సైతం వర్తింపచేశారు. దీంతో అనేకమంది పేద విద్యార్థుల చదువులు మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఇప్పటికే చదువులు కొనసాగిస్తున్న విద్యార్థులు తాజా జీఓ ప్రకారం ఏపీకి స్థానికేతరుడిగా మారితే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోనుంది. మరోవైపు ప్రైవేటుగా పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదివిన  వారికీ మరిన్ని కష్టాలు తప్పవు. స్టడీ, బోనఫైడ్ ధ్రువపత్రాలు సమర్పించేందుకు వీలుకాదు. స్థానికతకు తహసీల్దార్‌ల నుంచి ధ్రువపత్రాలు తీసుకోవాలి.హైదరాబాద్ చుట్టుపక్కల ఉపాధి కోసం వెళ్లిన వారి పిల్లలకు అక్కడి అధికారులు స్థానిక ధ్రువపత్రాలు ఇవ్వడం లేదు. అదే సమయంలో  ఏపీలోనూ  స్థానిక ధ్రువపత్రాలు వారికి అందవు. ఇలాంటి వేలాది మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లకు దూరమవ్వకతప్పదు. రానున్న కాలంలో ఉద్యోగం తదితరాల్లోనూ వీరంతా నష్టపోతారు.  
 
 అన్నిటికీ ‘ఆధారే’
..!

సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్‌ను ముడిపెట్టరాదని ఉన్నతన్యాయస్థానం స్పష్టం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్నిటికీ ఆధార్‌ను తప్పనిసరి చేస్తోంది. గతంలో గ్యాస్ సిలిండర్ల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ను లింక్ చేసినప్పుడు ప్రతి పక్ష నేతగా చంద్రబాబునాయుడు తీవ్రంగా విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే ఆధార్ లింక్‌ను తీసివేయించేలా చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని విస్మరించారు. తాజాగా ఆధార్‌తోపాటు పాన్‌కార్డు, నాలుగు చక్రాల వాహనముంటే దాని వివరాలు దరఖాస్తుతో పాటే సమర్పించాలంటున్నారు. ధ్రువపత్రాలన్నీ స్కాలర్‌షిప్పుల దరఖాస్తుతో పాటు జత  చేయాలని స్పష్టం చేయడంతో వాటికోసం విద్యార్థులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. జూన్ 2 తర్వాత ఈ సేవా కేంద్రాల ద్వారా తహసీల్దార్లనుంచి తీసుకున్న ధ్రువపత్రాలు మాత్రమే ఇవ్వాలనడంతో కొత్త విద్యార్థులే కాకుండా ఇప్పటికే చదువుతున్న వారు కూడా వీటికోసం పరుగులు పెట్టాలి. ప్రభుత్వం నిర్దేశించే గడువులోగా ఇన్ని లక్షలమందికి ఈ సేవా కేంద్రాల ద్వారా ధ్రువపత్రాలు ఏమేరకు అందుతాయో అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది.  ధ్రువపత్రాల కోసం చదువులు వదిలేసి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో విద్యార్థులు నష్టపోనున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement