Localism
-
స్థానికత ఆధారంగా విభజన రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులను స్థానికత ఆధారంగా విభజించడాన్ని ఉమ్మడి హైకోర్టు తప్పుబట్టింది. ఇలా స్థానికత ఆధారంగా విభజిస్తూ విద్యుత్ సంస్థలు రూపొందించిన మార్గదర్శకాలు, వాటికి ఆమోదముద్ర వేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. వాటిని అమలు చేయడానికి వీల్లేదంటూ.. ఆ మార్గదర్శకాలను, ఉత్తర్వులను కొట్టివేసింది. ఇప్పటికే ఏపీకి రిలీవ్ చేసిన ఉద్యోగులను ఇతర ఉద్యోగులతో సమానంగా వివక్షకు తావు లేకుండా కొనసాగించాలని విద్యుత్ సంస్థలకు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. దీంతో 2015 నుంచి కొనసాగుతున్న విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదానికి తెరపడింది. రోజువారీగా విచారణ జరిపి.. ఏపీ స్థానికత ఆధారంగా ఉద్యోగులను విభజిస్తూ తెలంగాణ విద్యుత్ సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలు, వాటిని ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ 2015లో ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాజ్యాల్లో పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సి.వి.మోహన్‌రెడ్డి, వేదుల వెంకటరమణ, లక్ష్మీనర్సింహ తదితరులు వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. రోజువారీ పద్ధతిలో వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. తాజాగా శుక్రవారం తీర్పు వెల్లడించింది. కొత్త మార్గదర్శకాలు రూపొందించండి స్థానికత ఆధారంగా ఉద్యోగులను విభజించడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై ప్రస్తుతమున్న జాయింట్ కమిటీతోగానీ, కొత్త కమిటీలను వేసిగానీ ఉద్యోగుల విభజనకు స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని, ఉద్యోగుల విభజన ప్రక్రియను 4 నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అప్పటివరకు ఆయా ఉద్యోగులను ఇతర ఉద్యోగులతో సమానంగా ఎటువంటి వివక్షకు తావు లేకుండా కొనసాగించాలని తెలంగాణ విద్యు త్ సంస్థలకు సూచించింది. వారి సీనియారిటీని పునరుద్ధరించాలని.. విభజన పూర్తయ్యేనాటి వరకు వారి అర్హతలను బట్టి పదో న్నతులకు సైతం పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాక వారికి చెల్లించాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలను చెల్లిం చాలని స్పష్టం చేసింది. రిలీవ్ చేసిన ఉద్యోగులకు ఏపీ విద్యుత్ సంస్థలు జీతభత్యాలు చెల్లించి ఉంటే.. ఆ సొమ్మును మూడు నెలల్లోపు తిరిగి చెల్లించేయాలని సూచించింది. అయితే తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన ఉద్యోగులను పక్కనపెట్టి ఇచ్చిన పదో న్నతుల విషయంలో జోక్యానికి నిరాకరించింది. పదోన్నతులపై దాఖలైన వ్యాజ్యాలను వేరుగా విచారించాలంది. కాగా ధర్మాసనం సభ్యులైన జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌కు ఇదే చివరి తీర్పు. ఈ తీర్పు వెలువరించిన అనంతరం పదవీ విరమణ సందర్భంగా హైకోర్టు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. -
డబుల్.. అంతా లోకల్..
♦ ఇళ్ల నిర్మాణంలో స్థానికతకే ప్రాధాన్యత ఇవ్వాలి ♦ యూనిట్‌గా తీసుకుంటేనే లబ్ధిదారులకు ప్రయోజనం ♦ ప్రతి గ్రామంలో స్థలం గుర్తించి నిర్మాణాలు మొదలు పెట్టాలి ♦ జెడ్పీ స్థాయి సంఘ సమావేశాల్లో సభ్యుల సూచన ♦ ఇళ్ల నిర్మాణంలో స్థానికతకే ప్రాధాన్యం ఇవ్వాలి ♦ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటేనే లబ్ధిదారులకు ప్రయోజనం ♦ జెడ్పీ స్థాయీసంఘం సమావేశాల్లో సభ్యుల సూచన సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని విజయవంతం చేయడంలో అధికారులు క్రియాశీలంగా వ్యవహరించాలని జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పేర్కొన్నారు. ఈ పథకం కింద నిర్మించే ఇళ్లను గ్రామాల వారీగా స్థలాలు గుర్తించి ఆ గ్రామానికి చెందిన వారికే ఇవ్వాలన్నారు. దీంతో లక్ష్యం నెరవేరుతుందని, అలా కాకుండా ఊరి పొలిమేరలో.. రెండు, మూడు గ్రామాలకు ఒక చోట స్థలాన్ని గుర్తించి ఇళ్లను నిర్మిస్తే ప్రయోజనం ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. బుధవారం జిల్లా పరిషత్‌లో జరిగిన జెడ్పీ స్థాయి సంఘ సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, మహిళ, శిశు సంక్షేమ స్థాయి సంఘ సమావేశాల్లో ఆయా శాఖలకు సంబంధించి పురోగతిని సమీక్షించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి స్థలాల ఎంపిక ప్రక్రియలో జాగ్రత్త వహిస్తే సమస్యలుండవని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు కుటీర పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన కల్పించాలని, మేకిన్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చే రాయితీలను వివరించి ఆ రంగంవైపు దృష్టి మళ్లించాలని సూచించారు. నీటి వృథాను అరికట్టి ప్రతి గృహంలో ఇంకుడు గుంతను విధిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. తెలంగాణ హరితహారం కింద ఈత మొక్కలను నాటేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు సంతృప్తికరంగా లేవని చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణీలకు ప్రత్యేక పరిస్థితుల్లోనే సిజేరియన్ చేయాలని.. అవసరం లేకున్నా కోత కాన్పులు చేయొద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో పరిగి శాసనసభ్యులు టి.రామ్మోహన్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్థానికతకు న్యాయశాఖ ఆమోదం
* త్వరలో కేంద్రం ఉత్తర్వులు జారీ * 2017 జూన్ రెండో తేదీలోపు వెళ్లినవారంతా స్థానికులే సాక్షి, హైదరాబాద్: నూతన రాజధానికి తరలి వెళ్లే ఉద్యోగులతో పాటు ఇతరులు, వారి పిల్లలకు స్థానికత కల్పించేందుకు కేంద్ర న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంబంధిత ఫైలును హోంశాఖ గతంలోనే న్యాయశాఖ పరిశీలనకు పంపిన విషయం తెలిసిందే. న్యాయశాఖ ఆమోదం తెలపడంతో త్వరలోనే స్థానికత కల్పించే ఉత్తర్వులను కేంద్రం జారీ చేయనుంది. న్యాయశాఖ నుంచి సంబంధిత ఫైలు కేంద్ర హోంశాఖకు చేరిందని, ఆ ఫైలును కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తుందని ఉన్నతాధికారి తెలిపారు. రాష్ట్ర విభజన తేదీ జూన్ 2, 2014 నుంచి 2017జూన్2లోపు ఆంధ్రప్రదేశ్‌కు వలసవెళ్లే కుటుంబాలన్నిటికీ స్థానికత కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 7వ తేదీన కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం తుది ముసాయిదా తీర్మానాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన సంగతి విదితమే. -
2017 జూన్ 2లోపు ఏపీకి వచ్చిన వారికే...స్థానిక హోదా
- రాష్ట్ర మంత్రివర్గంలో కీలక నిర్ణయం సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో స్థానికత నిబంధన సడలింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2017 జూన్ రెండో తేదీలోపు ఏపీకి వచ్చిన వారికే స్థానికత వర్తిస్తుందని ప్రకటించింది. తెలంగాణలో చదువుతున్న విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులెవరైనా ఈలోపు ఇక్కడకు వచ్చి నివాస ధ్రువపత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన వారికి ఇక్కడి స్థానికత వర్తించదు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత స్థానికత నిబంధనల ప్రకారం నాలుగేళ్లపాటు ఎక్కడ ఉంటే ఆ ప్రాంతానికే స్థానికులు అవుతారు. రాష్ట్ర విభజన జరిగిన ప్రత్యేక నేపథ్యంలో ఉద్యోగులు స్థానికత విషయంలో అసంతృప్తితో ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆ నిబంధనకు ప్రభుత్వం సడలింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం 2017 జూన్ 2లోపు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారికి వెంటనే స్థానికత వర్తిస్తుంది. అయితే, ప్రస్తుత నిబంధనను మార్చాలంటే ఏపీ స్టేట్ రీ-ఆర్గనైజేషన్ ప్రకారం.. కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం అనుమతితోపాటు రాష్ట్రపతి ఆమోదం పొందాలి. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు నారాయణ, పల్లె రఘునాథ్‌రెడ్డి, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, సిద్ధా రాఘవరావు మీడియాకు వెల్లడించారు. ఏపీ కొత్త రాజధాని అమరావతికి ఈనెల 22న శంకుస్థాపన చేయాలని గతంలోనే నిర్ణయించిన ప్రభుత్వం ముహూర్తాన్ని కూడా ఖరారు చేసింది. → ఈ నెల 22న మధ్యాహ్నం 12.35-12.45 మధ్య ఉద్దంరాయునిపాలెం, తాళ్లాయపాలెం, మందడం మధ్య సీడ్ రాజధాని నిర్మించే ప్రాంతంలో శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. కృష్ణా నది నుంచి కరకట్టవైపు 50 ఎకరాలను ఇందుకు సిద్ధం చేస్తున్నారు. → 3వేల ఎకరాల్లో తొలి దశ రాజధాని నిర్మాణం ఉంటుంది. భూమిని సీఆర్డీఏ పేరిట ఉంచి సింగపూర్ సంస్థల భాగస్వామ్యంతో స్విస్ చాలెంజ్ పద్ధతిలో నిర్మిస్తారు. సచిత్తూరు జిల్లా కుప్పంలో 3కేఆర్ ప్రాజెక్టు కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న 13,035మంది రైతులకు చెందిన రూ.13.24 కోట్ల రుణాల మాఫీ. → కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి కోసం ఇచ్చిన 1,398 ఎకరాల లీజును 30 ఏళ్లకుపొడిగింపు. సవిశాఖపట్నం జిల్లా రాయవరం, రాంబిల్లి మండల్లాలో 1,965.57 ఎకరాలను నేవల్ ఆల్టర్నేట్ బేస్ ప్రాజెక్టు కోసం డిఫెన్స్ ఎస్టేట్‌కు ఎకరం రూ.5 లక్షల చొప్పున అప్పగింత. → లక్ష మంది పిల్లలకు భోజనం సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన అక్షయపాత్ర ఫౌండేషన్‌కు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో 2 ఎకరాల 20 సెంట్ల స్థలాన్ని ఎకరా రూ.54 వేల చొప్పున 30 ఏళ్లపాటు లీజుకివ్వాలని నిర్ణయం. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డీఆర్డీఓకు 2,721 ఎకరాల కేటాయింపు. → పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30 వేల కోట్లకు పెరగడంపై చర్చ. ఈ నెల 22 నుంచి ఎర్త్‌వర్క్ పనుల్ని ప్రారంభించాలి. ఈ పనులు ప్రారంభించడానికి వీలుగా రెండు గ్రామాలను ఖాళీ చేయించాలి. ఐటీ కంపెనీలకు భారీ రాయితీలు... → ఐటీ టెక్నాలజీ పార్కులో కార్యాలయం ఏర్పాటు చేసుకునే సంస్థలకు లీజు అద్దెలో 50 శాతం రీయింబర్స్మెంట్ (ఏడాదికి రూ.10 లక్షలకు లోబడి) సదుపాయం కల్పించడం. → ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కు కంపెనీలు చెల్లించే బ్యాండ్ విడ్త్ చార్జీల్లో 25 శాతం(రూ.15 లక్షల పరిమితికి లోబడి) రీయింబర్స్మెంట్. కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి మూడేళ్లపాటు ఈ అవకాశం. → కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి ఐదేళ్లపాటు నిర్ణీత కరెంటు చార్జీలు యూనిట్ ఒక్కింటికి రూ.10 చొప్పున రీయింబర్స్మెంట్. ఐటీ, ఐటీఈఎస్ యూనిట్లు కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి ఐదేళ్లపాటు విద్యుత్ సుంకాల్లో నూరు శాతం మినహాయించి పరిశ్రమలకు వర్తింపచేసే టారీఫ్. → రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీలో సబ్ రిజిస్ట్రార్‌కు చెల్లించిన స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుపై నూరుశాతం రీయింబర్స్మెంట్. → ఐటీ కార్యాలయాలకు స్థానిక మున్సిపాల్టీలకు చెల్లించే ఆస్తి పన్నులో 50 శాతం రీయింబర్స్మెంట్. ఐటీ కంపెనీల కోసం నిర్మించే భవనాలకు 50 శాతం బీమా. నిర్వహణ చార్జీల్లో 50.4 శాతం రీయింబర్స్‌మెంట్‌కు అవకాశం. ఆడియో, వీడియో సిస్టమ్స్, ప్రొజెక్షన్, సర్వర్ రూమ్, కెఫెటేరియాలతో ఉన్న కాన్ఫరెన్స్ హాలు ఏర్పాటుకు వన్ టైమ్ విలువతో రూ.10 లక్షలకు మించకుండా 50 శాతం రీయింబర్స్మెంట్. ఐటీ భవనాలు నిర్మించే మౌలిక వసతుల ప్రొవైడర్లు, డెవలపర్లు, బిల్డర్లు, లీజుదారులకు ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల్లో పది శాతం రీయింబర్స్మెంట్. → కొత్తగా ఏర్పాటు చేసే ఐటీ కంపెనీల్లో రెండేళ్లపాటు ఉద్యోగికి రూ.2 వేల చొప్పున పీఎఫ్ రీయింబర్స్మెంట్ (రెండేళ్లు ఉద్యోగంలో కొనసాగి ఉంటే) -
నాలుగేళ్లు చదివితే స్థానికులే!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపులో ‘స్థానికత’ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చింది. ఈ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వుల (371డి) ప్రకారం వ్యవహరించాలని... విద్యార్థి చేరిన కోర్సుకు పూర్వం ఏడేళ్లలో నాలుగేళ్ల పాటు ఏ ప్రాంతంలో చదివితే ఆ ప్రాంతాన్నే ఆ విద్యార్థి స్థానికతగా నిర్ధారించాలనే భావనకు వచ్చింది. ఉదాహరణకు తెలంగాణకు చెందిన విద్యార్థులు ఇక్కడ ప్రస్తుతం డిగ్రీ లేదా పీజీలో చేరడానికి ముందు కర్నూలులో లేదా విజయనగరం జిల్లాలో వరుసగా నాలుగేళ్ల పాటు చదివి ఉంటే వారిని అక్కడి స్థానికులుగానే పరిగణిస్తారు. అలాగే ఆంధ్రా ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఏడేళ్లలో వరుసగా నాలుగేళ్లపాటు తెలంగాణలో చదివితే వారిని ఇక్కడి స్థానికులుగా గుర్తిస్తారు. అయితే ఇది విద్యావకాశాల వరకే వర్తిస్తుందని, ఉద్యోగాలను పొందే విషయంలో మాత్రం వారిని స్థానికులుగా గుర్తించడానికి అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇతర నియమ, నిబంధనలు వర్తిస్తాయని చెబుతున్నారు. ఇక విభజనకు ముందు, తర్వాత ఏపీ, తెలంగాణలకు చెందిన విద్యార్థులు ఆయా ప్రాంతాల్లో చదివితే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విభజన చట్టానికి అనుగుణంగా 58:42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పలు అంశాల్లో స్పష్టత కరువు.. గత నాలుగేళ్లలో తెలంగాణ విద్యార్థులు ఏపీలోని చదువుకుని ఉంటే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ ఏవిధంగా చె ల్లించాలనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. మహబూబ్‌నగర్ జిల్లా విద్యార్థులు కర్నూలులో, ఖమ్మం జిల్లా విద్యార్థులు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో... ఇలా ఇతర జిల్లాల్లో చదువుకున్న విద్యార్థులు వేలసంఖ్యలోనే ఉన్నారు. వారికి ఫీజు చెల్లింపుపై త్వరలోనే ఆదేశాలు జారీచేయనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. గత ఏడేళ్లలో నాలుగేళ్లపాటు స్థానిక ధ్రువీకరణ పత్రాలను సమర్పిస్తేనే స్థానిక విద్యార్థులుగా ‘ఫీజు’ వర్తిస్తుందని గతంలో ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ సమస్య తలెత్తింది. ఆ 26 కులాలకు 2014-15 నాటికే! తెలంగాణ ఏర్పడ్డాక ఈ ప్రాంతంలో లేని 26 కులాలను (ఏపీలోని ఆయా జిల్లాలకు పరిమితమైన కులాలు) రాష్ట్ర బీసీ జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. తూర్పుకాపు, కాళింగ, కొప్పుల వెలమ, శెట్టిబలిజ తదితర 26 కులాలకు చెందిన విద్యార్థులకు 2014-15కు సంబంధించిన ఫీజు బకాయిలను మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 2014-15 వరకు పాత పథకాన్నే కొనసాగిస్తామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. -
సీమాంధ్ర ఉద్యోగుల పిల్లల స్థానికతపై సర్వే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ఉద్యోగుల పిల్లల స్థానికత(పుట్టిన ప్రాంతం)పై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే నగరంలో ఉంటున్న సీమాంధ్ర ఉద్యోగుల పిల్లల స్థానికతపై సర్వే చేయించడానికి ఏపీ ప్రభుత్వం నడుంబిగించింది. సర్వే వివరాల ఆధారంగా ఉద్యోగి పిల్లల స్థానికతపై కొంతమేర స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందును అందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి అన్ని శాఖల హెచ్ వోడీలు, అనుబంధ విభాగాలకు ప్రభుత్వం తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఉద్యోగి పిల్లలు ఏ ప్రాంతానికి చెందిన వారు అనే వివరాలను అందజేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం స్థానికత వివరాలను కేంద్రానికి అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. -
ఏపీ విద్యార్థులకు ‘స్థానికత’ షాక్
ఏపీ స్థానికత ఉన్నవారికే రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులన్న సర్కార్ జీవో నంబర్ 72తో గందరగోళం 371 డీ ప్రామాణికమంటూనే చిక్కుముడులు ఇంటర్ నుంచి వరుసగా ఏడేళ్ల ధ్రువపత్రాలు సమర్పించాలంటూ మెలిక హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్పులపై ఏపీ ప్రభుత్వం ఆదివారం జారీ చేసిన ఆదేశాలు (జీవో 72) ‘స్థానికత’పై విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నారుు. ఏపీ స్థానికత ఉన్న విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులను ఏపీ కాలేజీల్లో చ దువుతున్నా, తెలంగాణ కాలేజీల్లో చదువుతున్నా.. స్కాలర్‌షిప్పుల చెల్లించడంతోపాటు ఫీజు రీరుుంబర్స్‌మెంట్ అమలు చేస్తామని చె బుతూనే కొన్ని మెలికలు పెట్టడంతో దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైస్కూలు, ఇంటర్మీడియెట్ విద్యను వరుసగా ఒకే దగ్గర కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర, రాయల సీమ ప్రాంతాల్లోని వేర్వేరు సంస్థల్లో చేరి పూర్తిచేసిన విద్యార్థులు సర్కారు మెలికల కారణంగా నష్టపోనున్నారు. ఏపీ ప్రభుత్వమిచ్చిన జీఓ 72తో రెండు, మూడు దశాబ్దాలుగా తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్ర కుటుంబాల్లోని విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. 1956 నుంచి ఉన్నవారే స్థానికులంటూ ప్రవేశపెట్టిన ఫాస్ట్ పథకంపై న్యాయస్థానం చేసిన సూచనలతో పథకంలో కొన్ని మార్పులు చేర్పులకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నా, తన మౌలిక లక్ష్యమైన స్థానికతపై మాత్రం ఆ ప్రభుత్వం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ స్థిరపడిన లక్షలాది సీమాంధ్ర కుటుంబాల విద్యార్థులు ఏపీ ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకొన్నారు. ఫాస్ట్ పథకంపై వివాదం రేగినప్పుడు తెలంగాణలోని విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, వారిని తాము ఆదుకుంటామని సీఎం చంద్రబాబునాయుడు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం జారీ చేసిన జీఓ 72 వారి ఆశలపై నీళ్లు పోసింది. ఏపీ స్థానికత ఉన్న వారికి మాత్రమే ఫీజులు చెల్లిస్తామని జీఓలో స్పష్టం చేయడంతో తెలంగాణ లో స్థిరపడ్డ వారి పిల్లలకు ఫీజులు ఇచ్చేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పేసినట్లయింది. మరోపక్క స్థానికత నిర్ధారణకు ఆర్టికల్ 371 డీ ప్రకారం ముందుకు వెళ్తామని జీఓలో ప్రభుత్వం పేర్కొంది. 371 డీ ప్రకారం ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ ప్రాంతమే ఆ విద్యార్థి స్థానికతగా పరిగణించాలి. కానీ ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి అర్హతగా ఉన్న ఇంటర్మీడియెట్ నుంచి వెనుకకు వరుసగా ఏడేళ్లకు సంబంధించిన స్టడీ, బోనఫైడ్ ధ్రువపత్రాలను సమర్పించాలని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు వేలాది మంది విద్యార్థులు ఏపీలో హైస్కూలు విద్యను అభ్యసించి ఆపై ఇంటర్మీడియెట్‌కు వచ్చేసరికి హైదరాబాద్, దానిచుట్టుపక్కల కాలేజీల్లో చది వారు. అలాగే ఉపాధి నిమిత్తం గత 10, 15 ఏళ్లలో సీమాంధ్ర నుంచి లక్షలాదిగా కుటుంబాలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు తరలివ చ్చాయి. తాజా జీవోతో ఏపీలో స్థానికేతరులుగానే మిగిలిపోతున్నారు. తల్లిదండ్రులు ఏపీకి చెందినా వారు మాత్రం ఆ రాష్ట్రానికి సంబంధం లేనివారవుతున్నారు. తె లంగాణ ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు. జీఓతో వారి భవిత అగమ్యగోచరంగా మారుతోంది. కోర్సులు మధ్యలో నిలిచిపోయే ప్రమాదం... మరోవైపు ఈ ఫీజుల చెల్లింపు జీఓను కొత్తగా చేరే వారికే కాకుండా ఇప్పటికే కాలేజీల్లో చదువు కొనసాగిస్తున్నవారికి సైతం వర్తింపచేశారు. దీంతో అనేకమంది పేద విద్యార్థుల చదువులు మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఇప్పటికే చదువులు కొనసాగిస్తున్న విద్యార్థులు తాజా జీఓ ప్రకారం ఏపీకి స్థానికేతరుడిగా మారితే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోనుంది. మరోవైపు ప్రైవేటుగా పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదివిన వారికీ మరిన్ని కష్టాలు తప్పవు. స్టడీ, బోనఫైడ్ ధ్రువపత్రాలు సమర్పించేందుకు వీలుకాదు. స్థానికతకు తహసీల్దార్ల నుంచి ధ్రువపత్రాలు తీసుకోవాలి.హైదరాబాద్ చుట్టుపక్కల ఉపాధి కోసం వెళ్లిన వారి పిల్లలకు అక్కడి అధికారులు స్థానిక ధ్రువపత్రాలు ఇవ్వడం లేదు. అదే సమయంలో ఏపీలోనూ స్థానిక ధ్రువపత్రాలు వారికి అందవు. ఇలాంటి వేలాది మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లకు దూరమవ్వకతప్పదు. రానున్న కాలంలో ఉద్యోగం తదితరాల్లోనూ వీరంతా నష్టపోతారు. అన్నిటికీ ‘ఆధారే’..! సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్‌ను ముడిపెట్టరాదని ఉన్నతన్యాయస్థానం స్పష్టం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్నిటికీ ఆధార్‌ను తప్పనిసరి చేస్తోంది. గతంలో గ్యాస్ సిలిండర్ల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ను లింక్ చేసినప్పుడు ప్రతి పక్ష నేతగా చంద్రబాబునాయుడు తీవ్రంగా విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే ఆధార్ లింక్‌ను తీసివేయించేలా చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని విస్మరించారు. తాజాగా ఆధార్‌తోపాటు పాన్‌కార్డు, నాలుగు చక్రాల వాహనముంటే దాని వివరాలు దరఖాస్తుతో పాటే సమర్పించాలంటున్నారు. ధ్రువపత్రాలన్నీ స్కాలర్‌షిప్పుల దరఖాస్తుతో పాటు జత చేయాలని స్పష్టం చేయడంతో వాటికోసం విద్యార్థులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. జూన్ 2 తర్వాత ఈ సేవా కేంద్రాల ద్వారా తహసీల్దార్లనుంచి తీసుకున్న ధ్రువపత్రాలు మాత్రమే ఇవ్వాలనడంతో కొత్త విద్యార్థులే కాకుండా ఇప్పటికే చదువుతున్న వారు కూడా వీటికోసం పరుగులు పెట్టాలి. ప్రభుత్వం నిర్దేశించే గడువులోగా ఇన్ని లక్షలమందికి ఈ సేవా కేంద్రాల ద్వారా ధ్రువపత్రాలు ఏమేరకు అందుతాయో అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. ధ్రువపత్రాల కోసం చదువులు వదిలేసి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో విద్యార్థులు నష్టపోనున్నారు. -
ఇరిగేషన్ శాఖలో ‘స్థానిక’ చిచ్చు
ఆంధ్ర ఇంజనీర్లను తెలంగాణకు పంపుతున్న ఏపీసర్కార్ హైదరాబాద్: నీటిపారుదల శాఖలో స్థానికత అంశం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు ను రాజేస్తోంది. తెలంగాణకు సంబంధిం చిన 5, 6 జోన్ల పరిధుల్లో ఎంపికై ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ఇంజనీర్లను సొంతజోన్లకు వెళ్లిపోవాలని ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ యు.ఒ. నోట్( 15444/ఎస్ఆర్/2014)ను ఆయా ఉద్యోగులకు పంపించారు. ఏపీ స్థానికత కలిగిన ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో 5,6 జోన్లలో ఎంపికైన విషయం తెలిసిందే. ఆంధ్రా ఉద్యోగులు పలువురు తాము సొంత రాష్ట్రంలోనే పనిచేస్తామని ప్రభుత్వానికి వినతులు పెట్టుకున్నా, అక్కడి అధికారులు ఏమాత్రం కనికరించకుండా వెళ్లిపోవాలని ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణలోని1, 2, 3, 4 జోన్లలో ఆంధ్ర ఉద్యోగులు తక్కువ సంఖ్యలో ఉండగా, 5, 6 జోన్ల కింద ఆంధ్ర ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన వారంతా వచ్చి తెలంగాణలో చేరితే, తెలంగాణ ఉద్యోగుల పదోన్నతుల అవకాశాలు దారుణంగా దెబ్బతింటాయని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏ రాష్ట్రం ఉద్యోగులు అక్కడే పనిచేయాలని మొదటినుంచీ వాదిస్తున్న తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై గట్టిగా పోరాడాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాయి. -
స్థానికతపై మెలిక రాజ్యాంగ విరుద్ధం
జి.కిషన్‌రెడ్డి హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి 1956 సంవత్సరాన్ని కటాఫ్‌గా నిర్ధారిస్తూ స్థానికతపై మెలిక పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయలేని తెలంగాణ ప్రభుత్వం తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే స్థానికత అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. శాసనసభలోని 119 మంది ఎమ్మెల్యేలు 1956 స్థానికత సర్టిఫికేట్లు తెస్తారా.., ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత గ్రామమైన చింతమడకలో ఆనాటి రికార్డులు ఉన్నాయా.. అని ప్రశ్నించారు. భూముల్లేని ఎస్సీ, బీసీలు ఆనాటి రికార్డులను ఎలా తీసుకురాగలరన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ను ప్రాంతీయ సమస్యగా చూపొద్దని, ఫాస్ట్ పథకం వల్ల బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు నష్టపోతారని కిషన్‌రెడ్డి అన్నారు -
కేసీఆర్.. ఓ మెట్టు దిగిరావాలి: మంద కృష్ణ
హన్మకొండ: స్థానికత ఆధారంగానే విద్యార్థులకు స్కాలర్షిప్ అంశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపి సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. హన్మకొండలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు చర్చలకు ముందుకొచ్చినట్లుగానే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక మెట్టు దిగిరావాలన్నారు. స్థానికతకు 1956 ప్రామాణికం పెట్టడం వలన 90 శాతం తెలంగాణ విద్యార్థులే నష్టపోతారని అన్నారు. ఇతర రాష్ట్రాలలో పది సంవత్సరాలకు పైగా ఉంటున్న తెలుగు విద్యార్థులకు అక్కడి ప్రభుత్వాలు అక్కడి స్థానికులతో సమానంగా అవకాశాలను కల్పిస్తున్నాయన్నారు -
వెలుగులకీ విభజన?
‘మతం, వర్ణం, కులం, స్త్రీ-పురుష విభేదం, స్థలం (స్థానికత) కారణంగా ఎలాంటి వివక్షకూ దేశపౌరులను గురి చేయరాదు’ అని ఆ అధికరణం శాసించింది. అలాగే భారత పౌరుల కు దేశంలో ఏ ప్రాంతంలో అయినా స్వేచ్ఛగా సంచరించే అవకాశం, ఏ భూభాగంలో అయినా నివాసం ఏర్పరుచుకునే అవకాశం ఉందనీ 19వ అధికరణం కూడా స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ కృత్రిమ విభజన ఏ సమస్యనూ పరిష్కరించలేకపోతున్నదని తెలిసివస్తోంది. అన్ని వర్గాలు - ఉద్యోగులు, విద్యార్థులు, విద్యాసంస్థలు, నదీజలాల సమస్య, విద్యుత్ వ్యవస్థ అడుగడుగునా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి ఇప్పుడిప్పుడే వెల్లడవుతోంది. వీటిలో అతి ప్రధానమైనది - ‘స్థానికత’పేరిట విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినది. అది ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం పరీక్షల నిర్వహణకు సంబంధించినది. ‘స్థానికత’ బెడద ఉద్యోగుల పంపిణీని స్థానికత అంశం క్లిష్టతరం చేసేసింది. అతీ గతీ తెలియని స్థితిలో ఎంసెట్ కౌన్సెలింగ్ ఉంది. రెండు ప్రాంతాలలోను ఒకే సమయంలో కౌన్సెలింగ్ నిర్వహించినపుడే అడ్మిషన్ల సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కౌన్సెలింగ్‌ను అక్టోబర్ వరకు వాయిదా వేయాలని కోరుతూ ఒక ప్రాంతం కోర్టుకు వెళ్లింది. దానివల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని మరొ క ప్రాంతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కానీ ఈ సమస్య వెనుక అసలు అంశం- ముందు విద్యార్థుల, ఉద్యోగుల ‘స్థానికత’ సమస్య పరిష్కారం కావాలన్న ఒక ప్రాంతం వాదన. 1956కు ముందు వచ్చిన వారి స్థానికత ఆధారంగా విద్యార్థులకు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందిగాని, ఆ తరువాత వలస వచ్చిన వారి కుటుంబాలలోని విద్యార్థులకు ఈ సౌకర్యం ఉండదని ప్రకటించడం పెద్ద తలనొప్పిగా పరిణమించింది. అరవై ఏళ్లు కలిసి ఉన్న రాష్ర్టంలో కొత్తగా స్థానికతను కృత్రిమ పద్ధతిలో అమలులోకి తేవాలని చూడడం ప్రజాస్వామ్య వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ చర్య. ముందే చెప్పిన సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని చదువుకున్నవారు ఎవరూ కూడా అది పౌర జీవితానికి ఇస్తున్న రక్షణను, పాలకులను శాసిస్తూ అందులో పొందుపరిచిన అధికరణలను, నిబంధనలను ఉల్లంఘించలేరు. ఏ ప్రాంతానికి చెందిన పౌరులకైనా ‘సమానమైన రక్షణ’ కల్పించి, వారి హక్కులను కాపాడి తీరాలన్న రాజ్యాంగ నిబంధనలు అతిక్రమించలేనివి. సమైక్య ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత అందులోని అన్ని ప్రాంతాల(కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ) వారి ఎదుగుదలకు ‘సమానావకాశాలు’ కల్పించడం కోసమే మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ, 1973-75 మధ్య రాజ్యాంగ సవరణ ద్వారా 371 (డి)అధికరణను చేర్చారు. ఈ ప్రత్యేక ప్రతిపత్తిని ఎందుకు కల్పించవలసి వచ్చింది? స్వార్థ ప్రయోజనాల కోసం నాయకులు ప్రజల మధ్య ఐక్యతకు గండికొట్టి సమస్యలు సృష్టించకుండా ఉండడానికే. పరిస్థితులను బట్టి మూడు ప్రాంతాలలోని విభాగాల పురోభివృద్ధికి అవసరమైన మార్పులూ చేర్పులూ చేసుకోవచ్చునని కూడా ఆ ప్రత్యేక అధికరణ (371 డి) వెసులుబాటు కూడా కల్పించింది. ఈ ప్రత్యేక అధికరణ రాజ్యాంగ మౌలిక స్వభావానికి అనుకూలమైనదేగానీ, వ్యతిరేకం కాదనీ గతంలోనే సుప్రీంకోర్టు ప్రకటించవలసి వచ్చింది. ఈ అధికరణను సవాలు చేస్తూ వచ్చిన దరఖాస్తులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడుతూ గతంలోనే తీర్పు (డాక్టర్ సి. సురేఖ - యూనియన్ ఆఫ్ ఇండియా 1998/1989) చెప్పవలసి వచ్చింది. రాజ్యాంగానికి పొందుపరిచిన ప్రత్యేక ఉపోద్ఘాతం కూడా పౌరుల మధ్య వివక్ష చూపరాదని ఆదేశిస్తున్నది. ‘సమాన’పునాది లోతైనది చట్టం ముందు పౌరులంతా సమానమేననీ, రక్షణలు పొందడం వారి హక్కు అనీ రాజ్యాంగంలోని 14వ అధికరణ చాటుతోంది. విస్పష్టమైన ఈ అధికరణల వెనుక భారత స్వాతంత్య్ర సమర స్ఫూర్తీ, దీప్తీ ఉన్నాయని మరచిపోరాదు. స్వాతంత్య్ర సమరం తెచ్చిన చైతన్యం పుణ్యమా అని 1925లోనే కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లు పేరుతో ఈ సమానతా సూత్రాన్ని అమలు చేయడం బ్రిటిష్ ప్రభుత్వానికి సైతం తప్పలేదు. తరువాత కరాచీ కాంగ్రెస్ (1931) తీర్మానం స్థానికత పేరిట పౌర వివక్షను వ్యతిరేకిస్తూ సమానత్వ సూత్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లింది. 1940 నాటి కాంగ్రెస్ మరో తీర్మానం, సప్రూ నివేదిక ఈ సమానత్వ ప్రమాణానికే కట్టుబడవలసి వచ్చిం ది. స్వాతంత్య్రం తెచ్చుకున్న తరువాత నిర్మించుకున్న రాజ్యాంగ చట్టంలో15వ అధికరణ ఇదే అంశాన్ని మరింత కరాఖండిగా చెప్పింది. ‘మతం, వర్ణం, కులం, స్త్రీ-పురుష విభేదం, స్థలం (స్థానికత) కారణంగా ఎలాంటి వివక్షకూ దేశపౌరులను గురి చేయరాదు’ అని ఆ అధికరణ శాసించింది. అలాగే భారత పౌరులకు దేశంలో ఏ ప్రాంతంలో అయినా స్వేచ్ఛగా సంచరించే అవకాశం (క్లాజ్ డి), ఏ భూభాగంలో అయినా నివాసం, స్థిర నివాసం ఏర్పరుచుకునే అవకాశం ఉందనీ 19వ అధికరణం కూడా స్పష్టం చేసింది. స్వవచన వ్యాఘాతంతోనే! తెలుగుజాతి మధ్య వారు నివసిస్తున్న తెలుగునేలలో విద్య, ఉపాధి రంగాలలో తలెత్తే సమస్యల పరిష్కారం కోసమే 371 (డి), 371(ఇ) అధికరణల ద్వారా ప్రత్యేక ప్రతిపత్తిని రాజ్యాంగం కల్పించింది. దాని ప్రకారమే రూపొం ది, పరస్పర అంగీకారంతో అమలులోకి వచ్చిందే ఆరు సూత్రాల పథకం. అయితే ఈ పథకమే కాక, దీనితో పాటు జోనల్ పద్ధతి కూడా రద్దు కావాలని 18 ఏళ్ల నాడే (18-7-1996) పిలుపునిచ్చినది నేడు ఒక ప్రాంతపు అత్యున్నత పదవిలో ఉన్న నాయకుడే. అదేమిటో ఆ నాయకుడి మాటల్లోనే, ‘సమాజంలో ప్రగతిశీల భావాలు వస్తూ ఉంటే కొన్ని నష్టాలూ వస్తూంటాయి. ఏ కార్యక్రమాన్నైనా నూటికి నూరు పాళ్లు అమలు చేయడం కష్టం. సమాజంలో నైతిక పరివర్తన జరుగుతోంది. ఉద్యోగులకు సంబంధించి ఆరు సూత్రాల పథకం, జోనల్ విధానం ఈ పరివర్తనను దెబ్బతీస్తున్నాయి. అదనపు సిబ్బందిని రాష్ట్రంలో ఏ మూలనైనా ఉపయోగించుకునే వీలు ఉండాలి. కానీ, ఆ విధానం లేదు. ఇది మనకు మనం విధించుకున్న ఆటంకం, ఆరు సూత్రాల జోనల్ విధానం. దీనిని తొలగించడానికి ప్రయత్నం చేయాలి’. కానీ నాయకులు ఆ ‘ప్రయత్నం’ నుంచి జారుకుని అవకాశవాద పదవీ రాజకీయాలను ఆశ్రయించడం వల్లనే ఈ సమస్యలు జటిలమైనాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి రాజ్యాంగ సవరణ ద్వారా 371 డి ద్వారా ప్రత్యేక ప్రతిపత్తి అవసరమైంది. దాని ప్రకారం ‘ప్రభుత్వ ఉద్యోగ, విద్యా విషయాలలోను ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ప్రజలకు సమాన అవకాశాలను, సౌకర్యాలను, రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి ఉత్తర్వులూ లేదా వేర్వేరు ప్రాంతాలకు వేర్వేరుగా గానీ నిబంధనలనూ జారీ చేయవచ్చు’. ఆ మేరకే తెలుగు జాతి ఉమ్మడి ప్రయోజనాల కోసం 371 (ఇ) అధికరణతోనే కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పారు. వికృత వాదనలు చిత్రం ఏమిటంటే, సంస్థానాలు భారత యూనియన్‌లో విలీనం కావడానికి మొరాయిస్తున్న సమయంలో వాటిని దారిలో పెట్టడానికి రాజ్యాంగంలో పొందుపరిచినదే అధికరణ - 3. రాష్ట్రాల విభజనకూ, విలీనానికీ అవకాశం కల్పిస్తున్నందున ఒకప్పుడు ఆ అధికరణను గౌరవించి, తీరా రాష్ట్రాల సరిహద్దులను మార్చేందుకు అదే అధికరణ కేంద్రానికి హక్కును కల్పించింది. ఇప్పుడు దానిని వ్యతిరేకించడం అందుకే. అంతకు మించి జమ్మూ-కాశ్మీర్‌కు రాజ్యాంగం ద్వారా కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని 370 అధికరణ ఒక ప్రత్యేక విలీనపత్రం. దానిని మార్చాలంటే కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ అనుమతి కావాలి. ఇవేమీ పరిగణించకుండా తమ ప్రాంతానికి కూడా అలాంటి ప్రతిపత్తి కావాలంటూ, తమ ప్రాంతానికి కూడా భారత్ యూనియన్ నుంచి విడిపోయే హక్కు ఎందుకు ఉండరాదో చెప్పాలంటూ విచిత్ర వాదనలు కూడా తలెత్తుతున్నాయి. తెలుగేతరులంటే ప్రేమ, తెలుగు జాతి అంటే ద్వేషం అయితే ఎలా? స్థానికత తెలుగువాడికి కాదు, తెలుగేతరులకు వర్తిస్తుంది. అది కూడా రాజ్యాంగ విరుద్ధమే. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) - ఏబీకే ప్రసాద్ -
1956కటాఫ్‌పై పునరాలోచన
‘రీయింబర్స్మెంట్’పై సీఎం సమీక్ష తేల్చుకోలేకపోతున్న సర్కార్ 1974 ఆధారంగా స్థానికత నిర్ధారణ ? సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన స్థానికత అంశంపై తెలంగాణ సర్కార్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇప్పటివరకు 1956ను కటాఫ్‌గా నిర్ణయించాలని భావించిన ప్రభుత్వం తాజాగా 1974 ఆధారంగా స్థానికతను నిర్ధారించే విషయం కూడా పరిశీలిస్తోంది. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో ఈ విషయంపై సమీక్షించారు. నిన్నటివరకు 1956 ఆధారంగా స్థానికత నిర్ణయించాలని భావించిన ప్రభుత్వం ప్రస్తుతం పునరాలోచనలో పడింది. సీఎం నిర్వహించిన సమీక్షలో 1974 అంశం పరిశీలనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది ఆంధ్రప్రదేశ్ పథకమని, తెలంగాణ రాష్ట్రంలో కొత్త పథకానికి రూపకల్పన చేస్తామని చెబుతూ, తెలంగాణేతరులకు లబ్ధి చేకూరకుండా చూడడం, అదేసమయంలో తెలంగాణ విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సర్కార్ భావిస్తోంది. 1956కు ముందునుంచి ఉన్నవారెవరో నిర్ణయించడంలో ఉన్న చిక్కుల కారణంగా 1974 అంశం తెరపైకి వచ్చినట్టు సమాచారం. కాగా, ఇంజనీరింగ్ ప్రవేశాల గడువుపై సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు ఫీజురీయింబర్స్‌మెంట్, స్థానికతలపై మార్గదర్శకాలు వెల్లడవుతాయి. ప్రభుత్వం కోరినట్టు అక్టోబర్ వరకు ప్రవేశాల గడువు పెంచకపోతే ఇవి త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ఫీజు రీయింబర్స్మెంట్ అంశం కొలిక్కి?
‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక చేయూత’ పేరిట పథకానికి కొత్తరూపు రంగారెడ్డి జిల్లా : పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ అంశం కొలిక్కివస్తోంది. ‘స్థానికత’ ఆధారంగా తెలంగాణ విద్యార్థులకే ఫీజు రాయితీ ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందుకనుగుణంగా మార్గదర్శకాలపై తర్జనభర్జన పడుతోంది. తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా నిబంధనలను కఠినతరం చేస్తోంది. ‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక చేయూత’(ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ - ఫాస్ట్) పేరిట పథకాన్ని పునర్నిర్వచించాలని సర్కారు నిర్ణయించింది. ఈ పథకం కింద లబ్దిపొందాలంటే సదరు విద్యార్థి కుల, ఆదాయ, స్థానికత సర్టిఫికెట్‌తోపాటు విద్యార్థి తండ్రి, తాత స్థానికత డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. నూతనంగా కోర్సుల్లో చేరే విద్యార్థితోపాటు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులందరూ ఈ వివరాలు సమర్పించాలి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సూచనలిచ్చిన సర్కారు.. త్వరలో మార్గదర్శకాలు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. విద్యార్థులు సమర్పించిన వివరాల పరిశీలనపైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. ‘ఆర్థిక చేయూత’ అంశం పూర్తి పారదర్శకంగా అమలు చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రతి కాలేజీకి ఒక ప్రత్యేక అధికారిని నియమించి దరఖాస్తులను తనిఖీ చేయించాలని భావిస్తోంది. దీని ద్వారా తనిఖీ ప్రక్రియ సులభతరంతోపాటు వేగిరమవుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. మరోవైపు విద్యార్థుల ధ్రువపత్రాల్లో అక్రమాలు బయటపడితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. -
స్థానికత రుజువు బాధ్యత విద్యార్థులదే
* అధికారుల తాజా ప్రతిపాదన * అఫిడవిట్లు తీసుకోవాలన్న ఆలోచన * 1956 కటాఫ్ ఎడతెగని కసరత్తు సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంటు వర్తింపజేసేందుకు 1956కు ముందు నుంచి నివసించడాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని స్థిర నిశ్చయానికి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. తమ స్థానికతను నిరూపించుకునే బాధ్యతను విద్యార్థుల మీదే పెట్టనుంది. 1956కు ముందునుంచి విద్యార్థుల కుటుంబాలు తెలంగాణలో నివసిస్తున్నట్లు రుజువులు చూపడానికి ఉన్న అవకాశాలు చాలా తక్కువని, అధికారికంగా ఎలాంటి ఆధారాలు దొరకవని ముఖ్యమంత్రి కేసీఆర్దృష్టికి తెచ్చిన అధికారులు...న్యాయస్థానాల్లో ఇబ్బందులు రాకుండా విద్యార్థుల మీదే స్థానికత నిర్థారణ బాధ్యతలను పెట్టాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన మేరకు 1956కు ముందునుంచి తమ కుటుంబం ఎక్కడ నివసించిందన్న వివరాలతో విద్యార్థి స్వయంగా ప్రవేశాల సమయంలో అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. 1956కు ముందు తమ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారా, ఒకేచోట నివసించారా.. వివిధ ప్రాంతాల్లో ఉన్నారా.. ఎక్కడ ఎంతకాలమున్నారు.. తదితర వివరాలను విద్యార్థి స్వయంగా వెల్లడించాలి. తాను సమర్పించిన వివరాలు తప్పని తేలితే ఎలాంటిచర్యలను ఎదుర్కోవడానికైనా తాను సిద్ధమని విద్యార్థి పేర్కొనవలసి ఉంటుంది. ఈ విద్యాసంవత్సరానికి ఇలా కానిచ్చేసి, పూర్తిస్థాయి పరిశీలన తర్వాత విధివిధానాలను మున్ముందు రూపొందించవచ్చునని భావిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఫీజు రీయింబర్స్‌మెంటుకు సంబంధించిన సందిగ్ధతకు తెరదించాలని ప్రభుత్వం భావిస్తోంది. 1956 తర్వాత తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వారికి ఫీజులు చెల్లించేది లేదని, ఈ ప్రాతిపదిక ఆధారంగానే అధ్యయనం చేసి నివేదికలు తయారు చేయాలని కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించారు. తెలంగాణ వాసుల్లోనూ చాలామందికి 1956కు ముందునుంచి ఇక్కడే నివసిస్తున్నట్టు రుజువు చేసుకోవడం దాదాపు అసాధ్యమన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులనుంచే అవిడవిట్లు తీసుకోవాలన్న ప్రతిపాదనను సీఎం ముందుంచనున్నారు.