ఆంధ్ర ఇంజనీర్లను తెలంగాణకు పంపుతున్న ఏపీసర్కార్
హైదరాబాద్: నీటిపారుదల శాఖలో స్థానికత అంశం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు ను రాజేస్తోంది. తెలంగాణకు సంబంధిం చిన 5, 6 జోన్ల పరిధుల్లో ఎంపికై ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ఇంజనీర్లను సొంతజోన్‌లకు వెళ్లిపోవాలని ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ యు.ఒ. నోట్( 15444/ఎస్‌ఆర్/2014)ను ఆయా ఉద్యోగులకు పంపించారు. ఏపీ స్థానికత కలిగిన ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో 5,6 జోన్లలో ఎంపికైన విషయం తెలిసిందే. ఆంధ్రా ఉద్యోగులు పలువురు తాము సొంత రాష్ట్రంలోనే పనిచేస్తామని ప్రభుత్వానికి వినతులు పెట్టుకున్నా, అక్కడి అధికారులు ఏమాత్రం కనికరించకుండా వెళ్లిపోవాలని ఒత్తిడి తెస్తున్నారు.
తెలంగాణలోని1, 2, 3, 4 జోన్లలో ఆంధ్ర ఉద్యోగులు తక్కువ సంఖ్యలో ఉండగా, 5, 6 జోన్ల కింద ఆంధ్ర ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన వారంతా వచ్చి తెలంగాణలో చేరితే, తెలంగాణ ఉద్యోగుల పదోన్నతుల అవకాశాలు దారుణంగా దెబ్బతింటాయని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏ రాష్ట్రం ఉద్యోగులు అక్కడే పనిచేయాలని మొదటినుంచీ వాదిస్తున్న తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై గట్టిగా పోరాడాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాయి.
ఇరిగేషన్ శాఖలో ‘స్థానిక’ చిచ్చు
Published Tue, Sep 30 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM
Advertisement