కేసీఆర్.. ఓ మెట్టు దిగిరావాలి: మంద కృష్ణ
హన్మకొండ: స్థానికత ఆధారంగానే విద్యార్థులకు స్కాలర్‌షిప్ అంశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపి సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. హన్మకొండలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు చర్చలకు ముందుకొచ్చినట్లుగానే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక మెట్టు దిగిరావాలన్నారు.
స్థానికతకు 1956 ప్రామాణికం పెట్టడం వలన 90 శాతం తెలంగాణ విద్యార్థులే నష్టపోతారని అన్నారు. ఇతర రాష్ట్రాలలో పది సంవత్సరాలకు పైగా ఉంటున్న తెలుగు విద్యార్థులకు అక్కడి ప్రభుత్వాలు అక్కడి స్థానికులతో సమానంగా అవకాశాలను కల్పిస్తున్నాయన్నారు