'ఆ పత్రికపై ప్రెస్ కౌన్సిల్లో ఫిర్యాదు చేస్తా'
వరంగల్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ మోసగాళ్లేనని మాదిగ రిజర్వేషన్ పోరాట కమిటీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. శుక్రవారం వరంగల్లో విలేకర్ల సమావేశంలో మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. దళితుల పట్ల ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోను వదిలి పెట్టమని హెచ్చరించారు. ఇదే విషయంపై మార్చి 16న అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు. నమస్తే తెలంగాణ కథనాలపై ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తానని విలేకర్ల అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.