'ఓటుకు నోటు కేసులో 2 రాష్ట్రాల సీఎంలు దొంగలే'
నిజామాబాద్: 'ఓటుకు నోటు' కేసు వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ దొంగలేనని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. మంగళవారం నిజామాబాద్ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్లో సెక్షన్ 8 ను అమలు పరిచే అవసరం లేదన్నారు. కానీ ఈ సెక్షన్ 8 ను హైదరాబాద్ లో ప్రవేశపెట్టడానికి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన మండిపడ్డారు.