
‘ఓటుకు కోట్లు’పై కేసీఆర్ నోరు మెదపరెందుకు?'
గంభీరావుపేట(కరీంనగర్): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కుదిపేసిన ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంపై 40 రోజులుగా సీఎం కేఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా గంభీరావుపేటలో సోమవారం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించడంలో ఆంతర్యమేమిటని అన్నారు. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.