హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ఉద్యోగుల పిల్లల స్థానికత(పుట్టిన ప్రాంతం)పై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే నగరంలో ఉంటున్న సీమాంధ్ర ఉద్యోగుల పిల్లల స్థానికతపై సర్వే చేయించడానికి ఏపీ ప్రభుత్వం నడుంబిగించింది. సర్వే వివరాల ఆధారంగా ఉద్యోగి పిల్లల స్థానికతపై కొంతమేర స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందును అందుకు రంగం సిద్ధం చేసింది.
ఇందుకు సంబంధించి అన్ని శాఖల హెచ్ వోడీలు, అనుబంధ విభాగాలకు ప్రభుత్వం తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఉద్యోగి పిల్లలు ఏ ప్రాంతానికి చెందిన వారు అనే వివరాలను అందజేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం స్థానికత వివరాలను కేంద్రానికి అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
సీమాంధ్ర ఉద్యోగుల పిల్లల స్థానికతపై సర్వే
Published Tue, Aug 25 2015 7:45 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement