* త్వరలో కేంద్రం ఉత్తర్వులు జారీ
* 2017 జూన్ రెండో తేదీలోపు వెళ్లినవారంతా స్థానికులే
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధానికి తరలి వెళ్లే ఉద్యోగులతో పాటు ఇతరులు, వారి పిల్లలకు స్థానికత కల్పించేందుకు కేంద్ర న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంబంధిత ఫైలును హోంశాఖ గతంలోనే న్యాయశాఖ పరిశీలనకు పంపిన విషయం తెలిసిందే. న్యాయశాఖ ఆమోదం తెలపడంతో త్వరలోనే స్థానికత కల్పించే ఉత్తర్వులను కేంద్రం జారీ చేయనుంది. న్యాయశాఖ నుంచి సంబంధిత ఫైలు కేంద్ర హోంశాఖకు చేరిందని, ఆ ఫైలును కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తుందని ఉన్నతాధికారి తెలిపారు.
రాష్ట్ర విభజన తేదీ జూన్ 2, 2014 నుంచి 2017జూన్2లోపు ఆంధ్రప్రదేశ్‌కు వలసవెళ్లే కుటుంబాలన్నిటికీ స్థానికత కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 7వ తేదీన కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం తుది ముసాయిదా తీర్మానాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన సంగతి విదితమే.
స్థానికతకు న్యాయశాఖ ఆమోదం
Published Fri, Apr 8 2016 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM
Advertisement