విద్యార్థులను సతాయించొద్దు | Fees will be released soon feez | Sakshi
Sakshi News home page

విద్యార్థులను సతాయించొద్దు

Published Mon, Sep 14 2015 2:21 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

విద్యార్థులను సతాయించొద్దు

విద్యార్థులను సతాయించొద్దు

త్వరలోనే ఫీజురీరుుంబర్స్‌మెంటు విడుదల చేస్తాం
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి

 
భీమారం : ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల విషయంలో విద్యార్థులను సతాయించొద్దని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కళాశాల యూజమాన్యాలకు సూచించారు. నగర పరిధిలోని తులసి గార్డెన్‌లో ఆదివారం ఇంటర్మీడియట్ విద్యపై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కొన్ని కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు చేస్తున్నాయని, ఇలాంటి వారు తమ పద్ధతులు మార్చుకోవాలన్నారు. 2014-2015కు సంబంధించి ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు త్వరలోనే విడుదల చేస్తామన్నారు. 2015-16కు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ సైతం జనవరి నెలాఖరు వరకు విడుదల చేస్తామన్నారు. ఇంటర్మీడియట్ బోర్డును ఆన్‌లైన్ చేస్తున్నామని, తద్వారా అవినీతికి తావుండదన్నారు. ప్రభుత్వ కళాశాల్లో విద్యార్థుల నమోదు శాతం పడిపోతోందని, అరుుతే, ప్రైవేటు కళాశాలలకు ధీటు గా ఇందులో విద్య అందిస్తామన్నారు. ప్రైవేట్ కళాశాలల అప్లియేషన్‌ను ఐదేళ్లకు పెంచే విషయంపై చర్చిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ.వరదారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, జిల్లా అధ్యక్షుడు నర్సింహారావుతోపాటు రాష్ర్టంలోని పది జిల్లాలకు చెందిన జూనియర్ కళాశాల యాజమాన్య వర్గ సభ్యులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

 దేశంలోనే నాణ్యమైన విద్య
 తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశబుూలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వరదారెడ్డి మాట్లాడుతూ, ఇంటర్మీడియట్‌బోర్డులో పైసలు లేకుండా పనిజరగడంలేదన్నారు. స్పందించిన కడియం.. ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరుగుతున్న మాట వాస్తమమేనని అంగీకరించారు. కానీ, తెలంగాణ విద్యార్థులు నిట్, ఐఐటీలో అత్యధిక సీట్లు సాధించడమే ఇక్కడ నాణ్యమైన విద్య అందుతుందనడానికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇంటర్‌బోర్డు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే నిలదీయాలని సూచించారు. ఈసందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారుు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement