
సారూ కాల్మొక్తాం.. సర్టిఫికెట్లివ్వండి!
రంగారెడ్డి జిల్లా: ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరిట కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఆదిలాబాద్‌కు చెందిన లింగస్వామి 2014-15లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్‌లో చేరాడు. కానీ, రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో కోర్సును వదిలేశాడు.
డైట్‌సెట్‌లో మంచి ర్యాంకు సాధించాడు. కౌన్సెలింగ్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లు కావాలని ఇంజినీరింగ్ కాలేజీని సంప్రదించగా ఫీజు చెల్లించాలని స్పష్టం చేశారు. ఇంతలో అటుగా వస్తున్న కళాశాల చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి కాళ్లపై పడి సర్టిఫికెట్లు ఇప్పించాలని లింగస్వామి, తల్లిదండ్రులు వేడుకున్నారు. చైర్మన్ జోక్యంతో కొద్దిమొత్తం చెల్లించి లింగస్వామి సర్టిఫికెట్లు పొందాడు.