విద్యార్థి మృతిపై ఆందోళన | Concern over student death | Sakshi
Sakshi News home page

విద్యార్థి మృతిపై ఆందోళన

Published Mon, Sep 7 2015 2:10 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

విద్యార్థి మృతిపై ఆందోళన - Sakshi

విద్యార్థి మృతిపై ఆందోళన

ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పగా నిర్వాహకులు ఆస్పత్రికి తీసుకెళ్లే వరకే చనిపోయాడు. కాగా, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందంటూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. తోటి విద్యార్థులతో కలిసి వారు పాఠశాల ఎదుట ఐదు గంటలపాటు బైఠాయించారు. చివరకు పోలీసులు, నాయకుల జోక్యంతో బాధిత కుటుంబానికి రూ.తొమ్మి లక్షలు చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించడంతో ఆందోళన విరమించారు.
 
- యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం : బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు
- కేశవరెడ్డి పాఠశాల ఎదుట విద్యార్థుల బైఠాయింపు సర్ది చెప్పిన పోలీసులు, నాయకులు  

చేవెళ్ల మండలం ఆలూరుకు చెందిన నవీన్‌గౌడ్ (14) పూడూరు మండలం మన్నెగూడ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం ఛాతిలో నొప్పి వస్తోందని అక్కడ ఉన్న కేర్‌టేకర్ శాంతికి తెలపడంతో మాత్ర ఇచ్చి తగ్గుతుందిలే అని తెలిపారు. కొద్దిసేపటికి అపస్మారక స్థితికి చేరుకోగా తోటి విద్యార్థులు గమనించి వెంటనే మరో కేర్‌టేకర్ సుకన్యకు తెలిపారు. పరిస్థితి విషమించడంతో రాత్రి ఎనిమిది గంటలకు పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్‌రెడ్డి తన కారులో హైదరాబాద్‌లోని మహావీర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే నవీన్‌గౌడ్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

అక్కడి నుంచి మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తర లించారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి విద్యార్థులు ఆదివారం ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాల ఎదుట బైఠాయించారు. సుమారు 2 కి.మీ.మేర ట్రాఫిక్ జామైంది. దీంతో ఎమ్మెల్యే టి.రాంమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రత్నం, మండల నాయకులు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. ఫీజుల విషయమై కేశవరెడ్డి విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని గతంలోనే పరిగి పరిసర ప్రాంత ప్రజలు ఎప్పీకి ఫిర్యాదు చేశారన్నారు. డబ్బులు ఇవ్వమని అడిగితే కేసులు పెట్టడం ఏమిటని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

తాజాగా విద్యార్ధి చనిపోతే కూడా పాఠశాల యాజమాన్యం పత్తాలేకుండా పారిపోవడం సరైంది కాదన్నారు. పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని వివిధ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. అనంతరం అక్కడికి వచ్చిన వికారాబాద్ డిప్యూటీ డీఈఓ హరీ శ్చందర్‌పై విద్యార్థులు, తల్లిదండ్రులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు, నాయకులు సర్దిచెప్పి బాధిత కుటుంబానికి రూ.తొమ్మిది లక్షలను పాఠశాల యాజమాన్యం నుంచి ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి వెనుదిరిగారు. పోస్టుమార్టం అనంత రం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
 
వెంటనే స్పందించలేదు : తల్లిదండ్రులు
పాఠశాల యాజమాన్యం వెంటనే తమ కుమారుడిని ఆస్పత్రికి తరలించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని మృతుడి తల్లిదండ్రులు ఎ.లక్ష్మి, భీమయ్య, బంధువులు ఆరోపించారు. చేతికొచ్చిన కొడుకును పొట్టన బెట్టుకున్నారని వారు కన్నీరు మున్నీరయ్యారు. ఈసంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.
 
వికారాబాద్ రూరల్ : విద్యార్థి నవీన్‌గౌడ్ మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏవీబీవీ నగర సంయుక్త కార్యదర్శి విక్రం డిమాండ్ చేశారు. ఆదివారం పూడూరు మండలం మన్నెగూడ సమీపంలోని కేశవరెడ్డి పాఠశాల ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారినివెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లకుండా యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని ఆరోపిం చారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కదిరె మధు, ప్రశాంత్, నవీణ్, శ్రీకాంత్, పుష్పలత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement